చిరంజీవి 150వ సినిమా విజయం సాధించాలని.. | Ram Charan wife Upasana Worshiped in Ratnagiri | Sakshi
Sakshi News home page

చిరంజీవి 150వ సినిమా విజయం సాధించాలని..

Published Sun, May 1 2016 12:49 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

చిరంజీవి 150వ సినిమా విజయం సాధించాలని..

చిరంజీవి 150వ సినిమా విజయం సాధించాలని..

సత్యదేవునికి కోడలు ఉపాసన పూజలు
 అన్నవరం : ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదల మూవీస్ పతాకంపై ప్రారంభమైన మెగాస్టార్ 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ ఘన విజయం సాధించాలని కోరుతూ చిరంజీవి కోడలు, ఆ సినిమా నిర్మాత, హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన శనివారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. కొద్దిమంది అభిమానులతో ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంవద్ద ఆమెకు పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవునికి ఉపాసన ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అనివేటి మండపంలో పండితులు ఆమెకు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆమె విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట దేవస్థానం ఉద్యోగి గంటా విష్ణు, చిరంజీవి అభిమాని కత్తిపూడి బాబీ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement