కూల్‌.. కూల్‌గా.. | ratnagiri | Sakshi
Sakshi News home page

కూల్‌.. కూల్‌గా..

Published Tue, Mar 14 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

కూల్‌.. కూల్‌గా..

కూల్‌.. కూల్‌గా..

  • రత్నగిరి భక్తులకు ఎండ నుంచి రక్షణ
  • ఆలయప్రాంగణం, వ్రతమండపాలవద్ద కూల్‌ పెయింట్‌
  •  
    అన్నవరం:
    సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎండలో కాళ్లు కాలుతుండగా పరుగంటి నడక కష్టాలు తొలగాయి. వారికి ఎండ నుంచి  రక్షణకు దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఎండదెబ్బతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం ‘సాక్షి’ లో‘ ‘వేడి’ంపులు’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం విదితమే. దానికి స్పందించిన ఈఓ కె. నాగేశ్వరరావు  ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, పార్కింగ్‌ స్థలం వద్ద కూల్‌ పెయింట్‌ వేయించారు. దేవస్థానం డీఈఈ రామకృష్ణ  ఈ పనులను పర్యవేక్షించారు. ఆలయప్రాంగణం, రథంపాత్, ఇతర ప్రదేశాలలో వారం రోజుల్లో షామియానాలు వేయిస్తామని ఈఓ కె. నాగేశ్వరరావు ‘సాక్షి’కి  తెలిపారు. ఇప్పటి వరకూ వేసవిలో చలువపందిర్లు వేస్తున్నారని, వాటిని వేసవి అనంతరం తొలగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అలా కాకుండా శాశ్వతప్రాతిపదికన ఇనుపగొట్టాలు పాతి అవసరమైనప్పుడు ఆ గొట్టాల ఆ«ధారంగా షామియానాలు వేసుకొని, అవసరం తీరాక ఆ గొట్టాలను తీసి భద్రపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement