- ఈవో, ఛైర్మన్లు ప్రత్యేక పూజలు
- భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి
రత్నగిరిపై ఆయుష్ హోమం ప్రారంభం
Published Sat, Dec 10 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
అన్నవరం(తొండంగి) :
కంచికామకోటి పిఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనల మేరకు రత్నగిరిపై తలపెట్టిన ఆయుష్ హోమం కార్యక్రమం శనివారం రత్నగిరిపై ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానంపై ప్రధానాలయం సమీపంలోని దర్బారు మండపంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక ఆశీనులను చేసి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణతో ఆయుష్ హోమం కార్యక్రమాన్ని రుత్వికులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.నాగేశ్వరరావు, ట్రస్టుబోర్డు ఛైర్మ¯ŒS ఐ.వి.రోహిత్ ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయుష్ హోమం పూజల్లో పాల్గొన్నారు.
ఘనంగా గోపూజ మహోత్సవం...
రత్నగిరి కొండపై శనివారం దేవాదాయ ధర్మాదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు రాజగోపురం సమీపాన ఉన్న శ్రీగోకులం వద్ద ఈ కార్యక్రమాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.నాగేశ్వరరావు, ఛైర్మ¯ŒS ఐ.వి.రోహిత్‌లు ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి మార్గశిర మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి అధిక సంఖ్యలో వివాహాలు జరగడంతో రత్నగిరిపై శనివారం నూతన దంపతులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నూతన జంటలు సత్యదేవుని వ్రతం ఆచరించారు.
Advertisement