మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి మహారాష్ట్ర రత్నగిరిలో ఉన్న చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతని కుటుంబ సభ్యులకు సంబంధిచిన నాలుగు ప్రాపర్టీలు, వ్యవసాయ భూమి ముంబాకే గ్రామంలో ఉన్నాయి. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్ ఇబ్రహీం ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు.
ఇక గడిచిన 9 ఏళ్ల దావూద్, అతని కుటుంబానికి సంబంధిచిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్( రూ.4.53 కోట్లు), ఆరు ఫ్లాట్లు(రూ. 3.53 కోట్లు), గెస్ట్ హౌజ్(రూ. 3.52 కోట్లు) అమ్ముడుపోయాయి. 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్.. 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే దావూద్ ముంబై పేలుళ్ల అనంతరం భారత్ విడిచివెళ్లిన విషయం తెలిసిందే.
ముంబై పెలుళ్లలో 257 మంది మృతి చెందారు. ఇటీవల దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అసత్యాలని రెండు నిఘా వర్గాలు తేల్చాయి.
Comments
Please login to add a commentAdd a comment