ముంబై: మహారాష్ట్రలోని ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్ తీవ్ర దుమారం రేపుతోంది. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అక్షయ్‌ను.. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై అతని తల్లి స్పందించారు. అక్షయ్‌ని చంపడానికి పోలీసులు చెప్పిన కారణాలను తోసిపుచ్చారామె. ఈ కేసులో పెద్ద కుట్రలో భాగంగా తన కుమారుడుని పోలీసులు హత్య చేసినట్లు ఆరోపించారు.
‘‘నా బిడ్డ అక్షయ్ షిండే హత్య పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర. పోలీసులే నా బిడ్డను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారించాలి. విచారణ జరిపి దోషులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చే వరకు నా కుమారుడి మృతదేహాన్ని తీసుకోవడానికి మేము అంగీకరించము’ అని అన్నారామె.
#BadlapurSchoolSexualAssaultCase: Accused Shot Dead In Police Custody, Mother Alleges Conspiracy#DNAVideos
For more videos, click here https://t.co/6ddeGFqM3o pic.twitter.com/2urBcFH6cY— DNA (@dna) September 24, 2024
క్రెడిట్స్: DNA (@dna)
ఈ ఎన్‌కౌంటర్ ఘటన మహారాష్ట్రలో రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నమే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయించటమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. ‘‘పోలీసులు అక్షయ్ షిండేను తీసుకువెళ్లే సమయంలో అతని చేతులు కట్టేయలేదా? అనికి తుపాకీని ఎలా లభించింది. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు?. ఈ కేసులో స్కూల్ మేనేజ్‌మెంట్‌పై ఎటువంటి చర్యలు లేవు. కానీ అరెస్టు చేసిన నిందితుడిని మాత్రం ఆత్మ రక్షణ పేరుతో అనుమానాస్పద ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. మాకు బద్లాపూర్ పోలీసులపై నమ్మకం లేదు. ఈ ఘటపై జ్యుడిషియల్ విచారణకు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని తీసుకువెళ్తున్న సమయంలో హోం శాఖ చూపిన నిర్లక్ష్యం సందేహాస్పదంగా ఉంది. ప్రభుత్వం బలహీనంగా మారినట్లు కనిపిస్తోంది’ అని ఎన్సీపి(ఎస్పీ) చెందిన ఓ నేత రాష్ట్ర హోం శాఖపై విమర్శలు గుప్పించారు.
అయితే.. ప్రతిక్షాల ఆరోపణలపై సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం విజయవంతం చేసింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రతిపక్షంలో ఉన్న మూడు పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయని అన్నారు.
చదవండి: పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment