minor girls
-
ఇద్దరు చిన్నారులు, వివాహితపై అత్యాచారయత్నం
పూసపాటిరేగ/బేతంచర్ల/సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై, వివాహితపై మానవ మృగాలు అత్యాచారానికి యతి్నంచాయి. ఈ ఘటనలు విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీశ్ (19) గ్రామ పాఠశాల వెనుకభాగంలో సోమవారం పశువులను మేపుతున్నాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు బాలికలను పిలిచి మంచినీళ్లు తీసుకురావాలని కోరాడు.వారిద్దరు సమీపంలోని నిందితుడి ఇంటికెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చారు. వారిలో ఓ చిన్నారి (5)ని ఉండమని లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడిన అతడు, చిన్నారిని ఇంట్లో అప్పగించాడు. విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పడంతో గ్రామపెద్దల సహాయంతో పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నంద్యాల జిల్లాలో.. నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లెకు చెందిన ఏడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తండ్రి లేడు. తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 7న బాలిక స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన దండగాల్ల ఎల్లయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివాహితపై టీడీపీ నేత అత్యాచారయత్నం కర్నూలు జిల్లా, గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ గోపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. అనంతరం భర్తతో కలిసి ఆమె గూడూరు ఎస్ఐ తిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలు.. కాగా టీడీపీ నేత గోపాల్ గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. వారంతా నిందితుడు గోపాల్‌కు భయపడి కేసులు పెట్టేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. గోపాల్ టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ మునిస్వామికి స్వయాన మేనల్లుడు. -
ఆ మహిళల కోసం అలర్ట్ వ్యవస్థ: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు. ‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
కీచక కానిస్టేబుల్ మైనర్ అమ్మాయిలను బెదిరించి లైంగికంగా
-
కర్ణాటక మఠాధిపతి లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మఠాధిపతి శివమూర్తి మూరుగ లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు తిరిగింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో బాధిత బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించగా వారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తేలింది. టీనేజ్ బాలికలకు చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఇందులో బాలికలపై అత్యాచారం జరిగినట్లు కనిపించలేదని.. వారి జననాంగాల్లో ఎలాంటి గాయాలు గుర్తించలేదని వెల్లడైంది. కాగా 2019 నుంచి 2022 వరకు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుగ శరణారావు స్వామిజీ తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆయన ఆశ్రమంలో చదువుకుంటున్న ఇద్దరు బాలికలు ఆరోపించిన విషయం తెలిసిందే. బాలికల ఫిర్యాదు మేరకు మైసూరు పోలీసు స్టేషన్లో ఆగష్టు 26న శివమూర్తిపై పోక్సో కేసు నమోదైంది. తరువాత కేసును చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ స్టేసన్‌కు బదిలీ చేశారు. రాష్ట్రంలో మఠాధిపతికి వ్యతిరేకంగా తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చిత్రదుర్గ జిల్లా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన రెండు రోజులకు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చిత్రదుర్గలోని ఆశ్రమంలో తమపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడించిన మైనర్ బాలికల స్టేట్మెంట్కు విరుద్ధంగా మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. తాజాగా ఆ నివేదికను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు(ఎఫ్ఎస్ఎల్) పంపించారు. అయితే ఫైనల్ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ నివేదికపై ఆధారపడి ఉండనున్నట్లు వైద్య పరీక్షల నివేదికలో పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో మరో నలుగురు బాలికలు శివమూర్తిపై ఇవే ఆరోపణలు చేశారు. కానీ వారి వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. చదవండి: : డాక్టర్ నిర్వాకం..ప్రసవ వేదనతో వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి.. -
Hyderabad: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్‌పుర... తాజాగా కాలాపత్తర్
సాక్షి, హైదరాబాద్: మొన్న జూబ్లీహిల్స్.. నిన్న మొఘల్‌పుర... తాజాగా కాలాపత్తర్... కామాంధుల చేతుల్లో ముగ్గురు బాలికలు నలిగిపోయారు. లైంగిక దాడుల నుంచి మైనర్లకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పోక్సో యాక్ట్–2012 అమలులో ఉన్నా ఘోరాలు ఆగట్లేదు. ఏదైనా కొత్త చట్టం తీసుకురావడంలో నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి అనేది పైకి కనిపించే అంశమైతే... అంతర్గతంగా ఉండే దీని ప్రధాన ఉద్దేశం ఆ తరహా నేరాలు పునరావృతం కాకుండా చూడటమే. కేంద్ర ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పోక్సో యాక్ట్ ఈ కోణంలో ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వట్లేదనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం అవగాహన లోపమని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో వల.. బాలికలపై జరుగుతున్న ఘోరాల్లో అనేకం ప్రేమ పేరుతో వలలో పడేసుకుని చేసేవే ఉంటున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్న మైనర్లు ఈ వలలో పడుతున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావంతో విపరీత పోకడలు అనుసరించి భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. ఓ బాలికను ఆమె అనుమతితో పెళ్లి చేసుకున్నా, సన్నిహితంగా గడిపినా కూడా అది నేరమే అవుతుంది. అభ్యంతరకంగా కామెంట్స్ చేయడమూ పోక్సో చట్ట ప్రకారం తీవ్రమైన అంశమే. ఇలాంటి చట్టాన్ని చేసిన యంత్రాంగాలు అక్కడి తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకొన్నాయి. అవగాహనలో విఫలం.. కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తిమంతమైందని చెప్పుకున్న పోక్సో చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చినప్పటికీ చిన్నారులు, బాలికలపై అఘాయిత్యాలు తరచూ జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘పోక్సో’పై అందరికీ అవగాహన కల్పించడంలో విఫలం ఒక కారణమైతే... మిగిలిన కీలకాంశాలను పట్టించుకోక మరో కారణం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభమని నిపుణులు చెబుతున్నారు. ఇవి మారాలంటే సమస్యని లోతుగా అధ్యయనం చేయాలి. ఇలాంటివి పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. వాటిని సాధ్యమైనంత వరకు కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. చదవండి: లవ్ ఫెయిల్యూర్.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు.. అఘాయిత్యాలకు కారణాలు అనేకం... చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రధానంగా అనేక కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం, మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు, సినిమా, సోషల్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీలం, మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు, చదువుకునే వయసులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోనుకావడం ప్రధానమైనవని వివరిస్తున్నారు. ఇళ్లల్లో పిల్లలపై పెద్దలు శ్రద్ధ పెట్టాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలకు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తరవాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణుడు ప్రతాప్‌కుమార్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతు న్న దారుణాల్లో సగం కూడా పోలీసు వరకు రావడం, రికార్డుల్లోకి ఎక్కడం జరగట్లేదు. దీనికి పరువు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో కారణాలు ఉంటున్నాయి. బాధితుల మౌనంతో వస్తున్న ఈ ఉదాసీనత ముష్కరులు మరింతగా రెచ్చిపోవడానికి ఊతం ఇచ్చినట్లేనని గుర్తుంచుకోవాలి. -
నటి ముంతాజ్‌పై గృహ హింస ఆరోపణలు
తమిళసినిమా: నటి ముంతాజ్ గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె అన్నా నగర్లో నివసిస్తున్నారు. కాగా ఈమె ఇంట్లో ఆరేళ్లుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మైనర్ బాలికలు పని చేస్తున్నారు. మంగళవారం అనూహ్యంగా బాలికల్లో ఒకరు అన్నానగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తాము సొంత ఊరుకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు, అయితే ఇంటి యజమానురాలు అనుమతి ఇవ్వటం లేదని, హింసిస్తున్నారని చెప్పింది. అన్నానగర్ పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు ముంతాజ్ ఇంటిలో మరో బాలికను చెన్నైలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. బుధవారం బాలల సంరక్షణ కేంద్రం అధికారి శాలిని ఆ ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు. చదవండి: Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం! -
కీచక టీచర్.. పాఠాలు పక్కన పెట్టి ఒంటరిగా ఉండే విద్యార్థినులతో..
సాక్షి,నర్సింహులపేట(ములుగు): మంచి విద్యాబుద్ధులు చెప్పి విజ్ఞానవంతులుగా చేయాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వక్రమార్గంగా మాట్లాడం చేసేవాడు. సహించలేని విద్యార్థునులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, విద్యార్థినుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తొర్రూర్ మండలం కొండాపూర్‌కు చెందిన మహేందర్ అనే ఉపాధ్యాయుడు దాట్ల హైస్కూల్లో సాంఘిక శాస్త్రం బోధిస్తున్నాడు. పీఈటీగా కూడా విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తుంటాడు. గ్రామంలోనే ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సదరు ఉపాధ్యాయుడు కొన్ని రోజులుగా పదవ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఎవరూ లేని సమయంలో వారిని వేధింపులకు గురిచేయడం, వక్రమార్గంలో మాట్లాడడం చేస్తున్నాడు. అతని ప్రవర్తనతో విసుగుచెందిన కొందరు విద్యార్థినులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆగ్రహంతో బుధవారం అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ జరిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు మహేందర్‌పై పోక్సో, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మురళీధర్ రాజు తెలిపారు. చదవండి: ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.. తీరా గర్భిణి అయ్యాక.. -
ఎవరిదీ పాపం..? ఏడాదిలో 15 మంది.. ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకుని..
సాక్షి, వరంగల్: ‘పరకాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక హైదరాబాద్‌లో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. అక్కడ పరిచయమైన ఓ వ్యక్తి ఆమెను మాటలతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ విషయం ఆరు నెలలయ్యాక బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. అబార్షన్ చేయిద్దామంటే వీలు లేకపోవడంతో తొమ్మిది నెలలు చూసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల ప్రసవం చేయించారు. ఆ తర్వాత పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు’. ‘నెక్కొండ మండలంలోని ఓ తండాకు చెందిన 24 ఏళ్ల వివాహిత తొలి సంతానంలో బిడ్డకు జన్మనిచ్చింది. భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. అతడు కూడా ఆమెను నమ్మించి గర్భం చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపను చూడనని, తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆమె వదిలించుకుంది’. ఇలా ఓ బాలిక, ఓ మహిళ తప్పుదారి పట్టడంతో వారికి పుట్టిన బిడ్డలు పేగుబంధానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని బాలిక, భర్త చనిపోయినా రెండో బిడ్డకు ఎలా జన్మనిచ్చిందని మరొకావిడ కన్న బిడ్డలను దూరం చేసుకున్నారు. వారికి జన్మించిన పసికూనలిద్దరూ ఇప్పుడు వరంగల్ జిల్లాలోని హనుమకొండ శిశు విహార్‌లో పెరుగుతున్నారు. ఆ పసిబిడ్డలిద్దరూ ఏ పాపం చేయకున్నా పేగుబంధానికి దూరం కావడం కన్నీళ్లు పెట్టిస్తోంది. వీరిద్దరే కాదు.. ఇలా వివాహం చేసుకోకుండా ఎనిమిది మందికి జన్మించిన పిల్లలు, వివాహేతర సంబంధం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం, మూడో కాన్పులోనూ ఆడపిల్ల తదితర కారణాలతో జన్మించిన మరో ఏడుగురు.. ఇలా మొత్తం 15 మంది పసికూనలు కన్నవారి ఆప్యాయతానురాగాలు లేక శిశు విహార్ పాలయ్యారు. చదవండి: (జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం.. ఫైళ్లు దగ్ధం) తప్పే శాపమాయె.. ఇటు పోలీసులు, అటు షీటీం బృందాలు ఎంత అవగాహన కలిగిస్తున్నా.. తెలిసీ తెలియని వయసులో అమ్మాయిలు దారి తప్పుతున్నారు. కుటుంబ పోషణకు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, ఇతర పనులకు వెళ్తుండటంతో వీరిపై పర్యవేక్షణ కరువవడం.. పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయం కూడా వీరికి తెలియకపోవడంతో ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇటు మగ, అటు ఆడపిల్లలు ఎవరి దారుల్లో వారు వెళ్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్లకు లొంగదీసుకుని లైంగిక దాడులకు పాల్పడుతుండటంతో చివరకు తల్లులవుతున్న ఘటనలు చూస్తున్నాం. తొలినాళ్లలో తెలిస్తే తల్లిదండ్రులు అబార్షన్ చేయించి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కాస్త ఆలస్యంగా తెలిస్తే డెలివరీ చేయించి ఆ ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్తున్నారు. ఈ విషయం వైద్య సిబ్బంది ద్వారా జిల్లా బాలల సంరక్షణ విభాగాధికారులకు తెలియడంతో వారు బాలల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పసికూనలకు శిశు విహార్‌కు తరలిస్తున్నారు. ఇలా శిశు విహార్‌లో ఉన్న పిల్లలను చట్టప్రకారంగా ముందుకొచ్చే దంపతులకు దత్తత ఇస్తున్నారు. ‘అసలు తల్లిదండ్రులెవరో తెలియకుండానే వారి జీవితం ముందుకెళ్తోంది. ప్రేమ పేరుతో శారీరక సంబంధాల వరకు వెళ్లొద్దు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు. మీరు వేసే తప్పటడుగులు పిల్లలకు శాపంగా మారొద్దు. ఇప్పటికైనా సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిని గమనించాలి’ అని ఓ ప్రభుత్వ విభాగాధికారి అంటున్నారు. -
బాలికల బాల్యానికి భద్రతేది?.. సర్వేలో విస్తుపోయే నిజాలు
సాక్షి, బెంగళూరు: ప్రశాంత కన్నడనాట నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మైనర్ బాలికలపై అత్యాచారాలు, బాల్య వివాహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2018–2021 మధ్య రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలదీ అదే బాట. ఇటీవల జరిగిన బెళగావి అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వం దీనిని అంగీకరించింది. ఈ ఏడాది 25 శాతం అధికం ► 2018లో మైనర్లపై మొత్తం 1,410 అత్యాచార ఘటనలు జరిగినట్లు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 25 శాతం పెరిగి 1,761 కి చేరింది. అసలు లెక్కల్లోకి రాని కేసుల సంఖ్య ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ► బాల్య వివాహాలు అయితే 200 శాతం పెరిగాయి. 2018లో కేవలం 74 బాల్య వివాహాలు నమోదు అయితే ఆ సంఖ్య ఈ ఏడాది 223కు పెరిగింది. ► కరోనా లాక్డౌన్లో స్కూళ్లు లేకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతలను తీర్చుకోవాలని చాలా మంది గ్రామీణ తల్లిదండ్రులు ప్రయత్నించడం దీనికి కారణం. దౌర్జన్యాలదీ అదే తీరు ► మరోవైపు మైనర్లపై అత్యాచారమే కాకుండా ఇతరత్రా దాడులు కూడా జరిగాయి. బాలలపై దౌర్జన్యాలు 8 శాతం పెరిగాయి. ► మహిళలపై జరిగే అత్యాచారాలు 4 శాతం పెరిగాయి. 2018లో మహిళలపై అత్యాచారానికి సంబంధించి 486 కేసులు నమోదు కాగా, 2021లో ఆ సంఖ్య 507కి పెరిగింది. ► ఇక బాలల సంరక్షణ చట్టం (జువైనల్ జస్టిస్ యాక్ట్) కింద నమోదయ్యే కేసులు కూడా కొంచెం పెరిగాయి. ఈ చట్టం కింద 2018లో 50 కేసులు నమోదయితే 2021లో ఆ సంఖ్య 67కి చేరింది. -
ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డ మైనర్ బాలురు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలం సుజాతనగర్లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలపై, ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 3వ తరగతి, 5వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై అదే గ్రామానికి చెందిన 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. సాయంత్రం సమయంలో బాలికలతో ఆడుకుందాం అని చెప్పి ఒక ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. చదవండి: (టిక్‌టాక్ భార్గవ్‌కు మళ్లీ రిమాండ్) అదే సమయంలో పక్కన ఉన్న వేరొకరు చూసి అరవడంతో బాలురు ఇద్దరు బయటకు పారిపోయారు. బాలికల తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో బాలురుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బాలురుపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. దారుణానికి పాల్పడ్డ బాలురుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి దారుణం) -
తల్లిని కొట్టి.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం
చండీగఢ్: దేశంలో మహిళల రక్షణకు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా వారిపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు కామాంధులు పేట్రేగిపోతున్నారు. దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా హరియాణా రాష్ట్రం సోనిపట్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిని బెదిరించి.. ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారితో పురుగుల మందు తాగించడంతో వారిద్దరూ మృతిచెందారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. వారి వయసు 14, 16 ఏళ్లు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే వీరి పక్క ఇంట్లోనే కొందరు వలస కార్మికులు నివసిస్తున్నారు. వీరి కన్ను పక్కనే ఉన్న ఆ అక్కాచెల్లెళ్లపై పడింది. ఈ క్రమంలో ఆ నలుగురు ఆగస్టు 5, 6 తేదీన అర్ధరాత్రి వారి ఇంట్లోకి చొరబడి.. ఆమె తల్లిపై దాడి చేశారు. ఆమె అచేతనావస్థలో ఉండగా ఆమె ఎదుటే కూతుళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తరువాత వారితో పురుగుల మందు తాగించారు. అనంతరం ఆ ఇద్దరు బాలికలు అపస్మారక స్ధితికి చేరుకున్నారు. బాలికల పరిస్థితి విషమించడంతో.. పాము కరిచినట్లు పోలీసులకు చెప్పాలని తల్లిని నలుగురు నిందితులు బెదిరించారు. తల్లి సరేనని అంగీకరించడంతో కుమార్తెలను ఢిల్లీలోని ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే మార్గమధ్యంలోనే ఓ బాలిక చనిపోయింది. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ప్రాణభయంతో ఆస్పత్రిలో వైద్యులకు గానీ, పోలీసులకు అసలు విషయం చెప్పలేదు. వారికి పాము కాటేసిందనే చెప్పింది. అధికారులు పోస్టుమార్టం నిర్వహించగా బాలికల మీద లైంగిక దాడి జరిగిన విషయం బయటపడింది. అంతేకాదు వారిమీద విషప్రయోగం జరిగిందని కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె తల్లిని గట్టిగా అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. -
ఆత్మపరిశీలన అవసరం ఎవరిది?
మాట పొదుపుగా వాడాలి! చేత అదుపులో ఉండాలి!! అధికారంలో ఉన్నవాళ్ళకు అన్ని రకాలుగా వర్తించే మహావాక్యాలివి. గద్దె మీద ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిందే! లేదంటే తర్వాతి పర్యవసానాలకు వారు తమను తాము తప్ప, వేరెవరినీ నిందించలేరు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఆ సంగతి ఇప్పుడు తెలిసొచ్చి ఉండాలి. వారం క్రితం జూలై ఆఖరు ఆదివారం రాత్రి గోవాలోని ఓ బీచ్‌లో పోలీసులమంటూ ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు దుండగులు చేసిన సామూహిక అత్యాచారం సంచలనం రేపింది. ఆ సామూహిక అత్యాచార ఘటనపై అనాలోచితంగా చేసిన ‘ఆత్మపరిశీలన’ వ్యాఖ్యలు సీఎంకు తలబొప్పి కట్టించాయి. హోమ్‌శాఖ పగ్గాలు కూడా తన చేతిలోనే ఉన్న ముఖ్య మంత్రి ‘పట్టుమని 14 ఏళ్ళ కన్నకూతుళ్ళు అంత రాత్రివేళ బీచ్‌లో ఎందుకున్నారో వాళ్ళ తల్లి తండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అంటూ అసెంబ్లీ సాక్షిగా నోరుజారారు. పనిలో పనిగా, ‘పిల్లలు తమ మాట వినరని, బాధ్యతంతా ప్రభుత్వం మీద, పోలీసుల మీద పెట్టకూడదు’ అని హితవు పలికారు. తీవ్రవిమర్శల పాలయ్యారు. గోవా సీఎం వ్యాఖ్యల దెబ్బతో ఇలాంటి సమయాల్లో పాలకుల బాధ్యత ఏమిటన్నది చర్చనీ యాంశమైంది. ఇది ఓటు రాజకీయాల్లో నష్టం తెస్తుందని గ్రహించగానే, సీఎం సర్దుబాటు మొదలు పెట్టారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆయన నష్టనివారణలో ఉండగానే, సహచర సాంస్కృతిక మంత్రి ‘ప్రతి ఆడపిల్ల వెనుకా భద్రతకు ఓ పోలీసును పెట్టడం ఎంతవరకు సాధ్యం’ అంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నించడం విచిత్రం. అలా మరిన్ని విమర్శలకు తావిచ్చారు. తప్పొప్పుల తరాజు ఎలా ఉన్నా, ముందుగా బాధితులకు అండగా నిలవాలి. ఆ పని చేయకుండా బాధితులనే తప్పుబట్టే సామాజిక, రాజకీయ దురలవాటుకు గోవా ఉదంతం మరో ఉదాహరణ. గమనిస్తే, గోవాలో వారం రోజుల వ్యవధిలో మూడు అత్యాచారాల సంఘటనలు జరిగాయి. ఒక ఘటనలో బీచ్‌లో మైనర్ బాలికల రేప్. మరో ఘటనలో ఉద్యోగమిస్తారని ఈశాన్యం నుంచి నమ్మి వచ్చిన పాతికేళ్ళ యువతిని ఇంట్లో బంధించి, రోజుల తరబడి అత్యాచారం. వేరొక ఘట నలో... 19 ఏళ్ళ ఆడపిల్లపై ట్రక్ డ్రైవర్ల అమానుషం. 2019తో పోలిస్తే 2020లో గోవాలో నేరాల రేటు 17 శాతం పెరిగిందనేది నిష్ఠురసత్యం. అలాంటి ఘటనల్ని అరికట్టి, ఆడవాళ్ళకు భద్రత, భరోసా కల్పించాల్సింది పాలకులేగా! కానీ దీన్ని ‘పురుషుల హింస’గా కాక ‘స్త్రీల భద్రత’ అంశంగా చిత్రిస్తూ, గోవా పెద్దలు మొద్దుబారిన మనసుతో వ్యాఖ్యలు చేయడమే విస్మయం కలిగిస్తోంది. పిల్లల పెంపకం, బాగోగుల విషయంలో తల్లితండ్రులదే ప్రథమ బాధ్యత అనేది ఎవరూ కాదనరు. కానీ ఆ వాదనను అడ్డం పెట్టి, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావాలనీ, చీకటి పడితే బయటకు రాకూడదనీ పాతకాలపు పితృస్వామ్య భావజాలంతో ప్రభుత్వాలు ప్రవర్తిస్తేనే అసలు చిక్కు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు పిల్లల పెంపకం పాఠాలు చెబుతుంటే ఏమనాలి? పౌరుల భద్రతకు బాధ్యత వహించాల్సిన పాలకులే... పొద్దుపోయాక బయటకొస్తే తమ పూచీ లేదన్నట్టు మాట్లాడితే ఇంకెవరికి చెప్పుకోవాలి? పర్యాటకానికి మారుపేరైన గోవా, అక్కడి బీచ్‌లు వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఆనవా యితీగా మారింది. అంతర్జాతీయ పర్యాటకులు కూడా పెద్దయెత్తున వచ్చే ఆ సముద్రతీరాలలో నిర్ణీత సమయం దాటాక ఎవరినీ అనుమతించకపోవడం ప్రభుత్వాలు తలుచుకుంటే అసాధ్యం కాదు. అలాగే, పెరిగిన సాంకేతికత, ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో బీచ్‌ల వెంట గస్తీ కూడా కష్టమేమీ కాదు. డ్రోన్ పరిజ్ఞానంలో ఎంతో పురోగతి సాధించిన ఇజ్రాయెల్, అమెరికా, చైనా లాగా మనమూ శాంతి భద్రతల పరిరక్షణకూ, పోలీసు పహారాకూ డ్రోన్ల వినియోగాన్ని విస్తరించవచ్చు. నేరాలను అరికట్టవచ్చు. ప్రాణాలను కాపాడవచ్చు. ఇలా చేయదగినవి చేతిలో ఎన్నో ఉండగా, ‘లైంగిక హింస అనివార్యం... తప్పు మాది కాదు మీదే’ అన్నట్టు పాలకులు మాట్లాడడమే అసలు తప్పు. గోవా జనాభాలో నూటికి 35 మంది పర్యాటక రంగంపైనే ఆధారపడ్డారు. ఆ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 16.43 శాతం ఆదాయం (దాదాపు 200 కోట్ల డాలర్లు) పర్యాటకానిదే. కరోనా వల్ల వేల కోట్ల నష్టం, సగం మందికి పైగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో గోవా మళ్ళీ పుంజుకోవాలంటే సర్కారు చేయాల్సింది ఎంతో ఉంది. కానీ, తాజా ఉదంతాలతో ఆ రాష్ట్రం సురక్షితం కాదనే భావన పర్యాటకులకు కలిగితే ఆ తప్పు ఎవరిది? ఆ మాటకొస్తే అత్యాచారాల్లోనే కాదు... ఇంకా అనేక విషయాలలో గోవా సర్కారు అలక్ష్యం, అశ్రద్ధ దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రెండున్నర నెలల క్రితం మే 16న విరుచుకుపడ్డ టౌక్టే తుపానులో గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో పాటు గోవా తీవ్రంగా నష్టపోయింది. కానీ, ఇప్పటి వరకు సరైన లెక్కలు చెప్పి, కేంద్ర ఇస్తానన్న సాయం అందుకోవడం కూడా గోవా సర్కారుకు కష్టంగా ఉన్నట్టుంది. సాయం కోరడంపై సర్కారు సరైన దృష్టి పెట్టనే లేదు. పైపెచ్చు, తుపాను నష్టం రూ. 146 కోట్ల దాకా ఉందని సీఎం అంటుంటే, రూ. 9 కోట్లని అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం పేర్కొనడం మరీ ఆశ్చర్యకరం. మరి, రాష్ట్రంలో అత్యాచారాల మొదలు ఇలాంటి ఎన్నో అంశాలలో తక్షణం ఆత్మపరిశీలన అవసరమైంది ఎవరికి? అందరికీ అర్థమవుతున్న ఆ జవాబును గోవా సీఎంకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? -
నలుగురు బాలికల దారుణ హత్య : తల్లిపై కేసు
చండిగఢ్: హరియాణాలో అమానుషం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిందో తల్లి. పోలీసుల సమాచారం ప్రకారం నలుగురు మైనర్ బాలికలను గొంతుకోసి మరీ దారుణంగా హతమార్చింది. వీరి వయసు ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అనంతరం ఆమెకూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నుహ్ జిల్లాలోని పిప్రోలి గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. బాధిత బాలికల తండ్రి ఫిర్యాదు ఆధారంగా తల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇంత దారుణానికి ఆమె ఎందుకు పాల్పడిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పోలీసు అధికారి సమర్జీత్ చెప్పారు. -
పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం..
లక్నో : అభంశుభం తెలియని చిన్నారులపై ఓ ప్రభుత్వ ఉద్యోగి పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. పదేళ్లుగా 50 మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ జూనియర్ ఇంజనీర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అనంతరం సీబీఐ అధికారులు వివరాలను వెల్లడించారు. వారి చెప్పిన విషయాల ప్రకారం.. రామ్‌భవన్ అనే వ్యక్తి జూనియర్ ఇంజనీర్‌గా ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. పైకి బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూ కన్నుపడిన బాలికపై కామవాంఛను తీర్చుకునేవాడు. పదేళ్లుగా దాదాపు 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం చేశాడు. వీరిలో చాలామంది మైనర్ బాలికలే కావడం గమనార్హం. చిత్రకూట్, హామీర్పూర్, బండా ప్రాంతాల్లోని పేద మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఘనకార్యానంతా ఫోటోలు, వీడియోల్లో బంధించేవాడు. ఆయా వీడియోలను ఇతరులకు సైతం పంపిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా బాధిత బాలికలకు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం ఇచ్చి లోబర్చుకునేవాడని పోలీసుల ద్వారా తెలిసింది. అయితే గతంలోనే ఇతనిపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడం యూపీ పోలీసు శాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతని నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున సాక్ష్యాలను సేకరించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున సీడీలు, వీడియోలు, మొబైల్ ఫోన్స్‌తో పాటు కొంతమంది బాలికల ఫోటోలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మైనర్ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన రామ్ భవన్‌కు కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ ఘటన యూపీ వ్యాప్తంగానే కాకుండా దేశంలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. -
అన్నదమ్ముల మోసం.. బాలికలకు గర్భం
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రేమ పేరుతో ఇద్దరన్నదమ్ములు, ఇద్దరు మైనర్ బాలికలను మోసగించి, ఆనక ముఖం చాటేశారంటూ.. కుల పెద్దలు వారికి వివాహం చేయాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా అన్నదమ్ముల్లో తమ్ముడికి ఆదివారం అర్ధరాత్రి సమయంలో వివాహం చేశారు. మరుసటిరోజు సోమవారం ఉదయం అన్నయ్యకు వివాహం జరిపే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. మండలంలోని తిరుమలంపాలెం ఎస్సీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికుల కథనం ప్రకారం. కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు(ఒకరి వయస్సు 16, మరొకరి వయస్సు 17) తమను ఇద్దరన్నదమ్ములు మోసగించి, గర్భవతులను చేశారంటూ కుల పెద్దలను ఆశ్రయించారు. దీనిపై ఆదివారం రాత్రి కాలనీలోని రామాలయం వద్ద పంచాయితీ నిర్వహించారు. అనంతరం బాలికలకు, అన్నదమ్ములతో వివాహం జరపాలని తేల్చారు. దీంతో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అన్నదమ్ముల్లో మైనరైన(17 ఏళ్ల వయస్సు గల) తమ్ముడికి, 7 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపించారు. మరుసటి రోజు ఉదయం మేజరైన అన్నయ్యకు, 8 నెలల గర్భవతి అయిన బాలికతో వివాహం జరిపే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు అందడంతో.. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, కాలనీలోని రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకున్నారు. అక్కడున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే తమను మోసగించి, గర్భవతులను చేసింది ముమ్మాటికీ ఈ ఇద్దరు అన్నదమ్ములేనని బాలికలు అంటుంటే, తమకు ఏమాత్రం సంబంధం లేదని, కావాలని కుల పెద్దలు, బాలికల తరపువారు తమను ఇందులో ఇరికిస్తున్నారని అన్నదమ్ములు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. అయితే ఈ అన్నదమ్ములకు చెందిన తోటలోకే బాధిత బాలికలు పొలం పనులకు వెళ్తుంటారని స్థానికులు చెప్పారు. రాజీకి యత్నాలు.. పోలీస్టేషన్‌కు చేరిన ఇరు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు రాజీకి యత్నించారు. గ్రామంలో మరోమారు తాము చర్చించుకుని వస్తామని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటన గ్రామంలో తీవ్ర అలజడిని సృష్టించింది. బాలికలకు నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
గిరిజన బాలికలపై ఆఘాయిత్యాలు
బుందేల్‌ఖండ్ : పేదరికమే ఆ బాలికలకు శాపంగా మారింది. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వారిని గనుల్లో పనిచేసేలా చేసింది. లైంగిక దోపిడికి గురయ్యేలా చేసింది. ఈ పరిస్థితి వారితల్లిదండ్రులకు కూడా తెలుసు కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రకూట్‌లో సాగుతోంది ఈ దురాగతం. గిరిజన బాలికల పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కొందరు ధనవంతులు ఇష్టారాజ్యంగా లైంగిక దోపిడికి పాల్పడుతున్న దీనగాథ ఇది. చిత్రకూట్ ప్రాంతంలో ఆడపిల్లలు చదువుకోవడమే చాలా అరుదు. ఒకవేళ స్కూల్‌కి వెళ్లినా 7వ తరగతే మహా ఎక్కువ. కుటుంబ పోషణ కోసం ఆ చిన్నారులు ఆ అక్రమ గనుల్లో పనిచేయాల్సిందే.. కానీ అక్కడ కూడా వారి శ్రమకు తగ్గ డబ్బులు ఇవ్వరు శ్రమదోపిడీ చేస్తారు. అంతేనా.. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని లైంగికంగా దోచుకుంటారు. పొట్టకూటి కోసం ఏమీ చేయలేక బాలికలు వారి శరీరాలను 200-300 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి. భారతీయ శిక్షాస్మృతిలోని చట్టాలు, నిబంధనలేవీ చిత్రకూట్ ప్రాంతం దాకా దరిచేరవు. అక్కడి మైనర్ బాలికలు లైంగికంగా దోపిడీకి గురవుతున్నా ప్రభుత్వాలకు పట్టదు. ‘నా పేరు రింకు (పేరు మార్చాం). కాంట్రాక్టర్లు మాతో చాలా పని చేయించుకుంటారు. కానీ ముందు చెప్పినంత డబ్బులివ్వరు. మమ్మల్ని శారీరకంగా వాడుకుంటారు. ఒకవేళ తిరగబడితే చంపేస్తామని బెదిరిస్తారు. రోజుకి 200-300 రూపాయలు ఇస్తామని పనికి కుదుర్చుకొని కేవలం 150 రూపాయలే ఇస్తారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలంటే వాళ్లకి సహకరించాల్సిందే. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేక దానికి ఒప్పుకుంటాం. కొన్నిసార్లు అయితే ఒకరి కంటే ఎక్కువ మంది మాపై అత్యాచారానికి పాల్పడతారు’ అంటూ మీడియాతో గోడు వెళ్లబోసుకుంది. ‘లాక్డౌన్ కారణంగా మా బతుకులు చాలా దయనీయంగా మారాయి. అనారోగ్యం కారణంగా మా ఆయన మంచాన పడ్డాడు. దీంతో నా బిడ్డ సౌమ్య (పేరు మార్చాం)ను 7వ తరగతి మధ్యలోనే చదువు మాన్పించా. పనికి పోతుండేది. కానీ లాక్డౌన్ వల్ల పరిస్థితులు తలకిందులయ్యాయి. పని లేకపోవడంతో ఆ కాంట్రాక్టర్లు దీన్నే ఆసరాగా చేసుకొని నా బిడ్డ లాంటి ఎంతోమంది బాలికలను లైంగికంగా హింసిస్తున్నారు. వాళ్లపై తిరగబడే శక్తి మాకు లేదు ఎందుకంటే మా బతుకులు అలాంటివ’ని రింకు తల్లి వాపోయింది. చిత్రకూట్‌లో జరుగుతున్న ఈ అఘాయిత్యాలపై ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనంపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. చట్ట పరంగా వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ శేష్ మణిపాండే హామీ ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేయడానికి ఓ బృందాన్ని నియమించారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చేస్తామని అంతేకాకుండా గ్రామ వార్డు సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో జరిగే ఇలాంటి దుశ్చర్యలపై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని చిత్రకూట్ ఎఎస్పీ ఆర్ఎస్ పాండే కోరారు. -
పోకిరీని రఫ్పాడించిన చంచల్
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులతో అట్టుడికిపోతోంది. అయితే ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రం బాలికలను వేధిస్తున్న ప్రబుద్ధిడికి తగిన శాస్తి చేసిన వైనం ఆకట్టుకుంటోంది. కాన్పూర్, బీతూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక బాలికలు పాఠశాలకు వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన మహిళా కానిస్టేబుల్ ఆ పోకిరీని పట్టుకుని రఫ్పాడించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమే బీతూర్ పోలీస్ స్టేషన్‌లోని యాంటీ రోమియో స్క్వాడ్ మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా. రోమియోల భరతం పట్టే పనిలో ఉన్న చంచల్ అతగాడి కాలర్ పట్టుకుని మరోసారి ఇలాంటి వేధింపులకు గురి చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు. అంతేకాదు బూటు తీసి ఒకటి కాదు రెండు కాదు 22 సార్లు వాయించి పడేసారు. అనంతరం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. #WATCH A woman constable thrashes a man for allegedly harassing girls on their way to school in Bithur area of Kanpur. (10.12.19) pic.twitter.com/avQpgk73Va — ANI UP (@ANINewsUP) December 11, 2019 -
ఆ పిల్లల్ని కలిసేందుకు అనుమతించొద్దు
సాక్షి, హైదరాబాద్ : వ్యభిచార కూపం నుంచి విముక్తి లభించి సంరక్షణ గృహాల్లో ఉన్న బాలికలను పెంపుడు తల్లులు కలుసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. యాదాద్రిలోని వ్యభిచార గృహాలపై దాడుల సందర్భంగా దొరికిన పిల్లలను రక్షిత గృహాల్లో ఉంచారు. ఆ బాలికలను కలిసేందుకు అనుమతించేలా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పిపోయిన, కిడ్నాపైన పిల్లలను బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి దించుతున్నారని పేర్కొంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది. ఆ బాలికలను ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో ఉంచింది. తమ పెంపుడు పిల్లలను కలుసుకునేందుకు వెళితే పోలీసులు అనుమతించడం లేదని, పిల్లలను కలుసుకునేందుకు అనుమతించాలని పలువురు పెంపుడు తల్లుల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కొందరిపై క్రిమినల్ కేసులున్నాయి. వారు కలిస్తే పిల్లలపై ప్రభావం ఉంటుంది. పిల్లల్ని కలుసుకునేందుకు రాచకొండ కమిషనర్ ఎవ్వరినీ అనుమతించరాదు’అని ఉత్తర్వులు జారీ చేసింది. -
బాల్య వివాహాలు ఆగట్లేవ్..!
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల్యవివాహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అధికారులు ఎంత ప్రచారం చేసినా బాల్య వివాహాలు మాత్రం తగ్గట్లేదు. 15 ఏళ్లు నిండకుండానే చిన్నారులు వివాహ బంధంతో మెట్టినింట కాలుపెట్టి కుటుంబ భారాన్ని భుజాన వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటివరకు రాష్ట్ర్ర వ్యాప్తంగా 3,342 బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. బాల్య వివాహాలకు ఆర్థిక అసమానతలే కారణమని భావించినా.. చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ స్కూల్లో చదివే 14 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు 42 ఏళ్ల వ్యక్తి డబ్బు ఆశ చూపించి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించిన అమ్మాయికి 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించడంతో సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. తెలంగాణలో పెరిగాయి.. గతేడాది జాతీయ నేర సమగ్ర సర్వే (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం తెలంగాణలో 18 శాతం బాల్య వివాహాలు పెరిగాయి. రాష్ట్రంలో 19 ఏళ్లలోపు తల్లులైన వారు 38 శాతం ఉన్నారు. ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకి కూడా 21 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల్లోనూ బాల్య వివాహాలు జరుగుతుండ టం బాధాకరం. దేశవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో 85 శాతం పేదరికం వల్లే జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. శారీరక సమస్యలు.. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అమ్మాయిలకు ప్రసవం సమయంలోఇబ్బందులు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తుండటంతో భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంచాల్సిన ఐసీడీఎస్ అధికారులకే దీనిపై అవగాహన లేకపోవడం కూడా మైనర్ వివాహాలకు కారణం అవుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు బలోపేతం చేసి మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడితే పరిస్థితులు కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. బాల్యవివాహాలు అరికట్టేందుకు 2012లో ప్రభుత్వం 1098 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ చేయగానే చైల్డ్ కనెక్టింగ్ సెంటర్ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. సీసీసీ నుంచి జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కు కాల్ ఫార్వర్డ్ అవడంతో అధికారులు రంగంలోకి దిగి సమస్య పరిష్కరిస్తారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు పేదరికాన్ని ఆసరా చేసుకుని, అందంగా ఉందని, పిల్లల కోసం, ఇతరత్రా కారణాలతో మైనర్ బాలికలను రెండో పెళ్లి చేసుకుంటున్న ఘటనలు తరచుగా కన్పిస్తున్నాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం అమలు సరిగా జరగకపోవడం, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. ృ అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు -
మత్తులో ముంచి మైనర్ బాలికలపై లైంగిక దాడి
ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. చంద్రాపూర్ జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు మైనర్ గిరిజన బాలికలపై స్కూల్ సిబ్బంది లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిపిన హాస్టల్ సూపరింటెండెంట్ చబన్ పచారే, డిప్యూటీ సూపరింటెండెంట్ నరేంద్ర విరుట్కర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన మహిళా సిబ్బంది అయిన హాస్టల్ వార్డెన్ కల్పనా ఠాక్రే, అసిస్టెంట్ లతా కనాకెలను కూడా అదుపులోకి తీసుకున్నారు. రజురా తెహిసిల్ పరిధిలో ఉన్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందినది కాగా, దీన్ని ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికలు తరచూ అనారోగ్యానికి గురికావడంతో ఈనెల 6న చంద్రాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో వీరికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి జరిపినట్టు వెల్లడైంది. మరో మైనర్ బాలిక కూడా అధికారులపై ఫిర్యాదు చేయడంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో సహా ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ దారుణం వెలుగు చూసిన అనంతరం పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపును రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
చిన్నారుల జీవితాలను చిదిమేశారు
సమాజంలో వేళ్లూనుకుపోయి ఉన్న కుళ్లూ, కుతంత్రాల గురించిఏమాత్రం తెలియని ఇద్దరు మైనర్ బాలికలు ఓ మహిళ స్వార్థానికిబలై పలుమార్లు అత్యాచారానికిగురయ్యారు. ఆ తరువాత కొందరు బ్రోకర్ల చేతులు మారుతూ వ్యభిచార కూపంలో చిక్కుకున్నారు. అంగట్లో సరుకులా అంచలంచెలుగాఅమ్మకానికి గురవుతూ పూర్తిస్థాయి వ్యభిచారులుగా మారిపోయారు. పలువురు మహిళలు సహా మొత్తం 23 మంది కలిసి ఆ ఇద్దరు బాలికల జీవితాలను చిదిమేశారు. నిందితుల పాపం పండడంతో మతబోధకునికి 30 ఏళ్ల జైలు, మరో ఇద్దరికి చెరీ నాలుగు యావజ్జీవాలు, ఒకరికి మూడు యావజ్జీవాలు, ఆరుగురికి తలా రెండు యావజ్జీవాలు ఇంకా మరికొంత మందికి జైలు శిక్ష విధిస్తూ కడలూరు కోర్టుసోమవారం తీర్పు చెప్పింది. సాక్షి ప్రతినిది, చెన్నై : కడలూరు జిల్లా తిట్టకుడి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8,9 తరగతులు చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు 2014 జూలై 11వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై అందుకున్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కడలూరులోని సతీష్‌కుమార్ (28) అనే వ్యభిచార బ్రోకర్ వద్ద చిక్కుకున్నట్లు బయటపడింది. దీంతో ఇద్దరు బాలికలను పోలీసులు రక్షించి ప్రభుత్వ బాలికల శరణాలయానికి అప్పగించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలికలు తమ పాఠశాలకు సమీపంలోని చిల్లరదుకాణానికి వెళ్లి చిరుతిళ్లు కొనుక్కోవడం అలవాటు. ఇలా ఒకసారి వెళ్లినపుడు దుకాణ యజమాని ధనలక్ష్మి.. ఆనందరాజ్ అనే స్నేహితునితో అత్యంత సన్నిహితంగా ఉండడం బాలిక చూసింది. ఈ విషయం బయట ఎక్కడ చెబుతుందోనని కంగారుపడిన ధనలక్ష్మి ఆ బాలికను ఆనందరాజ్ వద్దకు బెదిరించి పంపించింది. అతడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాలను గోప్యంగా ఉంచకుంటే నీ గురించి తల్లిదండ్రులకు, పాఠశాలలో చెబుతాను అని లొంగదీసుకుంది. అంతేగాక మరో బాలికను తీసుకురావాలని బెదిరించింది. ధనలక్ష్మి మాటలకు భయపడిన బాలిక తన క్లాస్‌మేట్‌ను తీసుకొచ్చింది. ఇద్దరు బాలికలను తన భర్త సెంథిల్‌కుమార్, స్నేహితుడు ఆనందరాజ్ల వద్దకు పంపింది. అంతేగాక తిట్టకుడిలోని అరుల్దాస్ (60) అనే మతబోధకుడు సైతం ఇద్దరు మైనర్ బాలికల జీవితాలతో ఆటలాడుకున్నాడు. ఈ వ్యహారాలను పసిగట్టిన లక్ష్మీ అనే మరో మహిళ బాలికలను బెదిరించి వ్యభిచారంలోకి దింపింది. కొన్ని రోజుల తరువాత విరుదాచలంలో వ్యభిచార గృహం నడుపుతున్న కళా అనే మహిళకు ఇద్దరు బాలికలను రూ.5వేలకు అమ్మివేసింది. కళ ఆ ఇద్దరు బాలికలను అదే ఊరికి చెందిన జమీనా అనే మహిళకు రూ.25వేలకు అమ్మి సొమ్ము చేసుకుంది. వడలూరుకు చెందిన సతీష్‌కుమార్ జమీనా నుంచి రూ.25వేలకు వారిని కొనుక్కున్నాడు. సదరు సతీష్‌కుమార్ ఇద్దరు బాలికలను పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం తదితర అనేక ప్రాంతాలకు తిప్పుతూ వ్యభిచారం చేయించాడు. ఇద్దరు మైనర్ బాలికల చేత వ్యభిచారం చేయించిన, అత్యాచారానికి పాల్పడిన నేరంపై మతబోధకుడు అరుళ్దాస్, లక్ష్మి, కళ, జమీనా, సతీష్‌కుమార్‌లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 2016 జూలై 4వ తేదీనఈ కేసు విచారణ సీబీసీఐడీ చేతుల్లోకి వెళ్లింది. బాలికలను అనేక ప్రాంతాలకు తిప్పి వ్యభిచారం చేయించిన వివిధ జిల్లాలకు చెందిన మరో 23 మంది బ్రోకర్ల పేర్లు సీబీఐ విచారణలో బయటడ్డాయి. నిందితుల్లో ఆరుగురు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా నిందితుల్లో మహాలక్ష్మి అనే మహిళ మినహా 16 మందిపై నేరం నిరూపితం కావడంతో కడలూరు కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. చారిత్రాత్మకమైన కఠిన శిక్షలు మత బోధకుడు అరుళ్‌దాస్‌కు 30 ఏళ్ల జైలు, రూ.5లక్షల జరిమానా, ఆనందరాజ్, బాలసుబ్రమణియన్లకు చెరీ నాలుగు యావజ్జీవాలు, సెల్వరాజ్ అనే వ్యక్తికి మూడు యావజ్జీవాలు, ఆరుగురికి తలా రెండు యావజ్జీవాలుగా శిక్ష పడింది. అలాగే కళ (48), ధనలక్ష్మి (43), ఫాతిమా (35), శ్రీధర్ (23), మోహన్‌రాజ్, మదివానన్ తదితర ఆరుగురికి రెండు యావజ్జీవ శిక్షలు విధించింది. అంతేగాక, కళ, ధనలక్ష్మి, ఫాతిమా, శ్రీధర్...ఈ నలుగురు మరో 42 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన వారికి సైతం కోర్టు తగిన శిక్ష వేసింది. ఇద్దరు బాధిత బాలికలకు చెరీ రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. -
బాలికల మిస్సింగ్ : అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని సంస్కార్ ఆశ్రమ్ వసతి గృహం నుంచి తొమ్మిది మంది మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటనలో ఇద్దరు మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఈ ఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు వేసినట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల అదృశ్యంపై దర్యాప్తును తక్షణమే ఢిల్లీ పోలీస్ నేర విభాగానికి తక్షణమే బదలాయించాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఢిల్లీలో మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో మహిళా శిశుసంక్షేమ శాఖ విఫలమైందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారుల తీరుతో శాఖపైనే సందేహాలు వెల్లడయ్యే పరిస్థితి ఎదురైందని అన్నారు. -
సిగ్గుచేటు; నితీష్ సర్కార్‌పై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో బిహార్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగితే ఆ కేసులను కేవలం పోక్సో చట్టం కింద మాత్రమే నమోదు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించింది. మత్తు మందు ఇచ్చి మరీ అత్యాచారం జరిపిన హేయమైన ఘటనపై భారత శిక్షా స్మృతి ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ నితీష్ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. మంగళవారం ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘ఈ కేసుల్లో బిహార్ ప్రభుత్వం కేవలం ప్రాథమిక విచారణ చేపడితే సరిపోదు. సెక్షన్ 377 కింద కేసు నమోదు చేయనట్లయితే విచారణ ముందుకు ఎలా సాగుతుంది. పిల్లలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపితే మీరేమో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అమానుషం. ఆ పిల్లలకు మనం న్యాయం చేయలేమా. అంటే ఈ దేశంలో పిల్లల్ని పౌరులుగా పరిగణించడం లేదా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన బిహార్ ప్రభుత్వ లాయర్ మాట్లాడుతూ.. షెల్టర్ హోం అకృత్యాలపై నమోదు చేసిన కేసులను సవరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
ప్రతి ఆరు నిమిషాలకు ఓ లైంగిక దాడి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు భద్రత కరవైందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్సీఆర్బీ సమాచారం ప్రకారం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఓ బాలికపై లైంగిక దాడి జరుగుతోందని, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్ధానంలో ఉండగా, యూపీ రెండో స్ధానంలో ఉందని, అసలు ఈ దేశంలో ఏం జరుగుతోందని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల కేసును విచారిస్తూ బిహార్ ప్రభుత్వం ఈ తరహా షెల్టర్ హోంలను ఎలా అనుమతిస్తోందని మండిపడింది. 2004 నుంచి వసతి గృహం నడుపుతున్న ఎన్జీఓకు బిహార్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని, అసలు అక్కడ ఏం జరుగుతున్నదే దానిపై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకపోవడాన్ని కోర్టు ఆక్షేపించింది. అక్కడి వ్యవహారాలపై విచారణ జరిపించాలనే ఆలోచన ఎందుకు కలగలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేసులో నిందితులను శిక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని కోర్టు బిహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. షెల్టర్ హోంలో తనిఖీలను మొక్కుబడిగా చేపట్టారని, చిత్తశుద్ధితో వ్యవహరించలేదని దుయ్యబట్టింది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఆగస్ట్ 2న బిహార్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
యూపీలోనూ చిన్నారులపై అకృత్యాలు..
లక్నో : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఘటన అనంతరం యూపీలోనూ ఈ తరహా ఘోరం వెలుగుచూసింది. డియోరియా జిల్లాలో మహిళలు, బాలికల సంరక్షణ గృహంలో అకృత్యాలు చోటుచేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. వసతి గృహంపై దాడి చేసి 24 మంది బాలికలను కాపాడామని, షెల్టర్ హోం నిర్వాహకులైన కాంచన్ లతా, గిరిజా త్రిపాఠి, మోహన్ త్రిపాఠిలను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రోహన్ పీ కనాయ్ తెలిపారు. వసతి గృహం రికార్డులను పరిశీలించగా 18 మంది బాలికలు కనిపించడం లేదని వెలుగు చూసిందన్నారు. వారి ఆచూకీ గురించి నిందితులను తాము ప్రశ్నిస్తున్నామన్నారు. కాపాడిన బాలికలపై వైద్య పరీక్షలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం సీరియస్ డియోరియా షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లా మేజిస్ర్టేట్ సుజిత్ కుమార్, ప్రొబేషన్ అధికారి ప్రభాత్ కుమార్‌లను సస్పెండ్ చేసినట్టు సీఎం ప్రకటించారు. వేధింపులిలా.. వసతి గృహం నుంచి తప్పించుకుని వచ్చిన పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షెల్టర్ హోంలో అకృత్యాలు వెలుగుచూశాయి. ప్రతిరోజూ సాయంత్రం షెల్టర్ హోంకు తెలుపు, నలుపు, ఎరుపు రంగు కార్లు వస్తాయని, అక్కడి బాలికలను తీసుకుని వెళతాయని బాలిక వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఉదయాన్నే బాలికలు ఏడస్తూ వసతి గృహానికి చేరుకునేవారని అక్కడి దారుణాన్ని బాలిక కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఈ హోం నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు. వసతి గృహంలో అక్రమాలు జరుగుతున్నాయని సీబీఐ గుర్తించడంతో జూన్ 2017న షెల్టర్ హోం గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసిందని డియోరియా ఎస్పీ చెప్పారు. అయితే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందంటూ హోంను మేనేజర్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు చూపించమని కోరగా మేనేజర్ నిరాకరించారని చెప్పారు. షెల్టర్ హోం నుంచి బాలికలను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా మేనేజర్ సహకరించలేదన్నారు. -
మంచి పనులు కనిపించవా..?
ముజఫర్‌పూర్ : ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై జరిగిన అకృత్యాల నేపథ్యంలో బిహార్ సీఎం రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఒకేఒక్క ప్రతికూల ఉదంతంపైనే దృష్టిసారిస్తున్నారని విపక్షాలు, మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన దారుణ ఘటనపై నిందితులను ఏఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవడంలో రాజీపడబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపైనా దృష్టిసారించండని హితవు పలికారు. ఒక దురదృష్టకర ఘటననే పదేపదే ప్రస్తావించడం తగదన్నారు. మరోవైపు ముజఫర్‌పూర్ ఘటనకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారనే కారణంతో ఆరుగురు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
షెల్టర్ షేమ్‌పై స్పందించిన నితీష్ కుమార్
సాక్షి, పట్నా : ముజఫర్‌పూర్ షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన క్రమంలో ఈ దారుణ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిగ్గుపడుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని నితీష్ వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని, పట్నా హైకోర్టు విచారణను పర్యవేక్షించాలని తాను కోరుకుంటున్నానన్నారు. ముజఫర్‌పూర్ ఘటనపై సుప్రీం కోర్టు బిహార్ ప్రభుత్వానికి నోటీసులు పంపడం, ఈ ఉదంతంపై పార్లమెంట్, బిహార్ అసెంబ్లీల్లో తీవ్ర దుమారం రేగిన క్రమంలో నితీష్ ఈ దారుణ ఘటనపై నోరుమెదపడం గమనార్హం. ముజఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు లైంగిక దాడులు జరిపారని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సామాజిక ఆడిట్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. వసతి గృహంలోని 34 మంది మైనర్ బాలికల్లో 29 మందిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి. ఆరోపణల నేపథ్యంలో బాలికల వసతి గృహాన్ని బిహార్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. కాగా షెల్టర్ హోం నిర్వాహకుడు బ్రజేష్ ఠాకూర్ సహా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పసిమొగ్గలపై పైశాచికం
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సైన్సెస్(టిస్) చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ముజఫర్‌పూర్‌కు చెందిన బ్రజేష్ ఠాకూర్‌కు చెందిన సంకల్ప్ ఏవం సమితి అనే ఎన్జీవోకు 2013, అక్టోబర్ 21న ఈ అనాధాశ్రమ నిర్వహణకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో నవంబర్ 1న ఇది పనిచేయడం ప్రారంభించింది. గతేడాది బిహార్ అంతటా ఉన్న 115 ప్రభుత్వ అనాధాశ్రమాల(షెల్టర్ హోమ్స్) స్థితిగతులపై టిస్ తనిఖీలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను 2018, ఏప్రిల్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో బ్రజేష్ ఠాకూర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడినట్లు తేలడంతో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ దివేశ్ కుమార్ అతడిపై మే 31న ముజఫర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఆశ్రమంలో 44 మంది బాలికలు ఉన్నారు. రహస్య మెట్ల దారులు.. అబార్షన్ గది పోలీసులు అనాధాశ్రమంలో తనిఖీలు చేపట్టడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నుంచి నిర్వాహకుడు బ్రజేష్ ఇంటికి నేరుగా మూడు మెట్ల మార్గాలు ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు వచ్చే దుండగులు ఎవ్వరికీ కన్పించకుండా రహస్యంగా వచ్చేందుకు ఈ ఏర్పాటు చేసుంటారని అనుమానిస్తున్నారు. అలాగే ఇక్కడి బేస్మెంట్లో మత్తుమందుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండుగులు గర్భం దాల్చిన నలుగురు బాలికలకు ఇక్కడే అబార్షన్ చేశారని పోలీస్ ఉన్నతాధాకారి ఒకరు తెలిపారు. వణికిస్తున్న బాధితుల వాంగ్మూలాలు మైనర్ బాలికలు కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బ్రజేష్, అతని స్నేహితులు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి తమపై లైంగికదాడికి పాల్పడేవారని ఓ బాలిక(10) తెలిపింది. ఎదురు తిరిగిన అమ్మాయిల్ని తీవ్రంగా కొట్టి, అన్నం పెట్టకుండా, సిగరెట్లతో కాల్చేవారంది. ప్రతీరోజు తమపై ఈ దారుణం కొనసాగేదని, ఇది తట్టుకోలేని మరో బాలిక గాజు ముక్కతో మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిం దని పేర్కొంది. తమను రోజూ నగ్నంగా పడుకోమని ఒత్తిడి చేసేవారనీ, ఒప్పుకోకుంటే తీవ్రంగా కొట్టేవారని ముందు వాపోయింది. ఈ నీచుల దాడిలో ఓ అమ్మాయి చనిపోతే.. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా రిక్షాలో తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చారని చెప్పింది. మరోవైపు 34 మంది బాలికలపై లైంగికదాడి జరిగిందని పరీక్షలు నిర్వహించిన పట్నా వైద్య కళాశాల డాక్టర్లు ధ్రువీకరించారు. -
బాలికలను మత్తులో ముంచి..
పట్నా : బిహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ జిల్లాలోని షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆదివారం విచారణను చేపట్టింది. ముజ్ఫర్పూర్లోని బాలికా గృహంలో చిన్నారులపై మానసిక, శారీరక, లైంగిక వేధింపులపై వసతి గృహం అధికారులు, ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహించే చిల్డ్రన్ హోం అధికారులు, సిబ్బంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. ముంబయికి చెందిన ఓ సంస్థ షెల్టర్ హోంలో చేపట్టిన సోషల్ ఆడిట్ ఆధారంగా బిహార్ సాంఘిక సంక్షేమ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. షెల్టర్ హోంలో బాలికలు తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. దీంతో బాలిక గృహంను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారులు అక్కడి బాలికలను పట్నా, మధుబని షెల్టర్ హోంకు తరలించారు. మత్తులో ముంచి.. షెల్టర్ హోంలో మైనర్ బాలికలపై అధికారులు, సిబ్బంది సాగించిన అకృత్యాలు వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు మత్తు మందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడేవారని, ఓ బాలిక నిద్ర లేచి చూసే వరకూ వంటిపై దుస్తులు నేలపై పడిఉన్నాయని విలపించారు. కొందరు చిన్నారులు లైంగిక వేధింపులను తప్పించుకునేందుకు తమ కాళ్లు, చేతులపై బ్లేడ్లతో కోసుకున్నామని గుర్తుచేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్టర్ హోం సిబ్బంది, హోంను నిర్వహించే బ్రజేష్ ఠాకూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పసిమొగ్గలపై రాక్షసత్వమా..?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడుల పట్ల బాలీవుడ్ నటి దియా మీర్జా ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలపై తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిని మతం, ప్రాంతాలకు అతీతంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడే నిందితుల పట్ల ఎవరూ సానుభూతి చూపరాదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్థుడి మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా తీర్పులు ఉండాలని ఆకాంక్షించారు. ముంబైలో సేవ్ ద చిల్ర్డన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దియా మీర్జా వీధి బాలలకు విద్యాబోధనలో చొరవ చూపుతున్నారు, ఈ పిల్లలకు గుర్తింపు ధ్రువీకరణ కోసం వీరికి ఆధార్ కార్డులు ఇప్పించేందుకు తమ బృందం కృషి చేస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. -
నీలిచిత్రాలు చూపిస్తే కఠిన చర్యలు
శ్రీకాకుళం రూరల్ : బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించినా, వారికి నీలిచిత్రాలు చూపించి లోబరుచుకోవడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో నీలిచిత్రాల సంఘటన, బాధ్యులపై తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. ఆయా స్టేషన్లలో ఉన్న ఆస్తి నేరాలపై వచ్చిన కేసుల పురోగతి వేగవంతం చేయాలన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద జన సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గుట్కాలు, ఖైనీల రవాణాపై నిఘా పెట్టాలని, బెల్డ్షాపులపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం న్యాయసలహాదారులు నాగమల్లేశ్వరరావు, కె.తిరుమలరావులు అత్యాచార కేసులు ఎలా చేధించాలో సలహాలు అందజేశారు. సమావేశంలో డీఎస్పీలు ఎం.కృష్ణమూర్తి నాయుడు, వి.భీమారావు, బి.ప్రసాదరావు, జి.స్వరూపారాణి, సీహెచ్ పెంటారావు, కె.వేణుగోపాలనాయుడు, వి.సుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పసిమొగ్గలపై మృగాళ్ల పంజా
సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి రూరల్ : దాచేపల్లి మృగాళ్లు... జిల్లాలోనూ ఉన్నారు. అభం శుభం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన... కల్లూరులో శనివారం రాత్రి జరిగిన అత్యాచార యత్నాలే ఇందుకు నిదర్శనం. గతంలోనూ జిల్లాలో పలుచోట్ల చోటు చేసుకున్న ఘటనలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారి ని కఠినంగా శిక్షించటంతో పాటు... భవిష్యత్‌లో దాచేపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుం డా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిపరిధిలోని చెర్లోపల్లెకు చెందిన సుబ్బయ్యనాయుడు (58) అదే గ్రామానికి చెందిన ఐదు, ఏడేళ్ల బాలికలను కొంత కాలంగా వికృత చేష్టలతో వేధిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్లి వస్తున్న చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి పిలిచి వికృత చేష్టలు చేయబోయాడు. భయపడిన చిన్నారులు అక్కడి నుంచి పారిపోయి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. కూలి పనుల నిమిత్తం నెల్లూరుకు వెళ్లి ఉన్న ఆమె భర్త ఆదివారం రావడంతో విషయం చెప్పారు. పిల్లలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఇది తెలుసుకున్న కలెక్టర్ ప్రద్యుమ్న చెర్లోపల్లెకు వెళ్లారు. బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. కల్లూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అల్తాఫ్ (24) అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలిక బంధువు నివాసంలోని మేడపై నిద్రిస్తుండగా బాలిక నోట్లో గుడ్డకుక్కి ఎత్తుకెళ్లాడు. బాలికను బెదిరిస్తుండగా బంధువులు నిద్రలేవడంతో అతను పారిపోయాడు. ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్తాఫ్‌ను అరెస్టు చేశారు. ఎందరో మృగాళ్లు.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిన్నారులపై కొందరు మృగాళ్లు అత్యాచారయత్నానికి పాల్పడగా మరికొందరిని లైంగికంగా వేధించిన సంఘటనలు ఉన్నాయి. సోమలలో రామచంద్ర య్య (60) అనే వ్యక్తి తన ఇంటిపక్కనున్న మూడేళ్ల పాపపై అత్యాచారం చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చి చిన్నారిని బలాత్కారం చేశాడు. 2016లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అలాగే మదనపల్లెలో శివయ్య(58) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో గత ఏడాది నాలుగేళ్ల చిన్నారిపై మరో బాలుడు అఘాయత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు మైనర్ కావడంతో చితకబాది కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు తెలిసింది. వెలుగు చూసినవి కొన్నే అయితే... వెలుగుచూడనివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు చెబితే పరువు పోతుందని పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులపై ఇంటిపక్కనున్నవారు, బంధువులు, పాఠశాల టీచర్ల నడవడికపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
వ్యభిచార రాకెట్ గుట్టురట్టు
సాక్షి, పట్నా : బిహార్‌లోని కతిహార్‌లో పోలీసులు ఓ భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. దాడుల్లో ముగ్గురు మైనర్ బాలికలు సహా 32 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కతిమార్‌లోని గులాబ్ బాగ్ ప్రాంతంలో గుట్టుచప్పుటు కాకుండా నడిపిస్తున్న చీకటి దందాను పూర్నియా పోలీసులు రట్టు చేశారు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమచారం అందడంతో పోలీసులు బృందంగా ఏర్పడి మెరుపు దాడులు చేపట్టారు. కాగా వ్యభిచార దందాలో ప్రముఖుల పాత్ర ఉన్నట్టు తెలిసింది. వ్యాపారులు సైతం తరచూ ఇక్కడికి వస్తుంటారని స్ధానికులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. వీరిని త్వరలోనే కోర్టు ముందు హాజరు పరిచి తదుపరి చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. -
ఆగని అకృత్యాలు.. వసివాడుతున్న పసిమొగ్గలు
లక్నో/రాయ్‌పూర్ : కథువా, ఉన్నావో సంఘటనలతో ఓవైపు దేశమంతా అట్టుడికిపోతుంటే మరోవైపు బాలలపై జరిగే లైంగిక నేరాలు మాత్రం తగ్గటంలేదు. తాజాగా ఇలాంటివే మరో రెండు సంఘటనలు వెలుగుచూశాయి. ఈ రెండు ఘటనలు రెండు వేర్వేరు రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గడ్‌లో ఓ వివాహానికి హజరైన పదకొండేళ్ల బాలికపై అదే వేడుకకు వచ్చిన ఓ పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కబీర్ధామ్ జిల్లాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తమ్ సాహూ(25) అనే వ్యక్తి పెళ్లి కుమారుడు తరుపు బంధువు. సాహూ ఇదే వివాహానికి వచ్చిన ఓ పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి ఊరవతలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తలపై బండతో మోదీ చంపేశాడు. కాసేపటి తరువాత వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. గురువారం ఉదయం బాలిక మృతదేహం ఒక కాలువ దగ్గర కనిపించింది. బాలిక చివరిసారిగా సాహూతో కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని విచారించగా తానే బాలికపై అత్యాచారం చేసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడిపై అత్యాచార, హత్యా నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి లాల్ ఉమెద్ సింగ్ తెలిపారు. ఇటువంటి సంఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు వివరాల ప్రకారం బాధిత బాలిక ఎటాలో ఓ పెళ్లికి హజరవ్వడానికి వచ్చింది. అదే వేడుకకు వంటలు చేయడానికి వచ్చిన పింటూ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పింటూపై కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. -
దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి
-
తెనాలిలో దారుణం.. ఇద్దరి మైనర్లపై..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తెనాలి పాండురంగపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరి మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాలివి.. నరసింహా ఆ ప్రాంతంలో ఓ పానీపూరీ బండి నిర్వహిస్తున్నాడు. అతను మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. ఆ తల్లిదండ్రులు నరసింహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మహారాష్ట్రలో మరో దారుణం
సాక్షి, ముంబయి : దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలపై ఆందోళన వెల్లువెత్తిన క్రమంలో మహారాష్ట్రలో మరో దారుణం చోటుచేసుకుంది. కర్జాత్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్లో ఇద్దరు మూగ, చెవిటి విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. వీరిపై లైంగిక వేధింపులు జరిగాయని వైద్య పరీక్షల అనంతరం వెల్లడైంది. దీంతో స్కూల్లోని ఇతర విద్యార్థినులపైనా ఇలాంటి వేధింపులు జరిగాయా అనే కోణంలో మరికొందరు విద్యార్థినులకూ వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధిత విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాఠశాల పర్యవేక్షకులు రాం శంకర్ బెంబ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు మార్చ్ 30న కేసు నమోదైనట్టు సమాచారం. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏడుగురు బాలికల స్టేట్మెంట్ను నమోదు చేసి మరికొందరితో విచారణ నిర్వహిస్తున్నారు. తమపై స్కూల్ కేర్‌టేకరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలంతా విచారణ సందర్భంగా చెప్పారని పోలీసులు తెలిపారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో పాఠశాలకు మూతపడింది. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణతో సామాజిక న్యాయ శాఖ నిధులతో నిర్వహిస్తున్న పాఠశాల గుర్తింపు కోల్పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మూడు ముళ్ల... 'గండం'
సరస్వతీ పుత్రికలు క్రమశిక్షణలో సుశిక్షిత సైనికులు ఏ పరీక్షల ఫలితాలు వచ్చినా బాలికలే టాప్ కిశోరమణులంటూ ప్రశంసలెలా ఉన్నా... మరోవైపు జీవిత విషమ పరీక్షలు ఎదుర్కొంటున్నారు... పదో తరగతి పరీక్షలు వస్తున్నాయంటే పుస్తకాలతో కుస్తీ పట్టాలి... కానీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడైదుల వయసు దాటకుండానే మూడు ముళ్ల బంధంలో బందీలైపోతున్నారు... రాయవరం (మండపేట): విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినులు వార్షిక పరీక్షల కంటే కూడా తమ తల్లిదండ్రులు ఎక్కడ బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతారోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన బాల్య వివాహాలను పరిశీలిస్తే ఎక్కువగా 9,10, ఇంటర్ విద్యార్థినులే బాల్య వివాహాలకు బందీలవుతున్న విషయాన్ని చైల్డ్‌లైన్ అధికారులు అంగీకరిస్తున్నారు. గత నాలుగేళ్లలో 189 బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఏటా అధికారికంగా 90కి పైగా బాల్య వివాహాలు.. జిల్లాలో చాలా మంది తల్లిదండ్రులు 10వ తరగతి పూర్తికాగానే బాలికలకు పెళ్లిళ్లు చేయడానికే మొగ్గుచూపుతున్నారు. ఆడపిల్లలు చదివితే వారి చదువుకు తగ్గ వరుడు లభించరనేది ఒకటైతే, దీనికితోడు అమ్మాయిలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవాలంటే రక్షణ ఉండదన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. దీనికితోడు ఆర్థిక, సామాజిక పరిస్థితులు, నమ్మకాలు బాలికలకు శాపంగా మారుతున్నాయి. జిల్లాలో 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు కూడా పెళ్లిళ్లు చేసిన సందర్భాలు గతంలో వెలుగు చూశాయి. కారణమేదైనా ఏటా పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగి పోతున్నాయి. జిల్లాలో ఏటా 50కి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు 400కి పైగా బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2017లో 64 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. పది, ఇంటర్ విద్యార్థినుల్లో ఆందోళన.. పది, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ కొందరు విద్యార్థినుల్లో భయం ప్రారంభమవుతోంది. పరీక్షలు ముగియగానే పెళ్లి చేసేస్తారేమోనన్న భయంతో పరీక్షల కసరత్తు వైపు దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో తొమ్మిదో తరగతి 34,032, పదో తరగతి 31,493, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 49,955 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏటా సుమారు 50కి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తిస్తుండగా అధికారులకు తెలియకుండా అదనంగా వందల సంఖ్యలో చాపకింద నీరులా వివాహాలు సాగిపోతున్నాయి. బాల్య వివాహాల్లో ఎక్కువగా 10, ఇంటర్ ఉత్తీర్ణత చెందిన వారే ఉండడం విచారకరం. కిశోర బాలికలతో అవగాహన.. శిక్షణ పొందిన కిశోర బాలికలతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థినులకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మైదాన ప్రాంతంలో ఉన్న 59 హాస్టళ్లలోని 574 మంది శిక్షణ పొందిన కిశోర బాలికలు 14,980 మంది బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించే ప్ర యత్నం చేస్తున్నారు. బాల్య వివాహాలకు తల్లిదండ్రులు బలవంతంగా ప్రయత్నిస్తే ఎవరి సహాయం తీసుకోవా లనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 30న ఏజెన్సీలో అవగాహన కల్పించేందుకు 155 మంది కిశోర బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆరోగ్య సమస్యలు అధికం.. వయస్సు రాకముందే బాలికలకు వివాహం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పుట్టబోయే బిడ్డలపై కూడా ఈ ప్రభావం పడనుంది. తల్లిదండ్రులు బాలికలను బాగా చదివించి 18 సంవత్సరాలు నిండిన తరవాతే పెళ్లి చేయాలి. – డాక్టర్ డి.సంధ్యాదేవి, పీహెచ్సీ, మాచవరం, రాయవరం మండలం. అన్ని రకాల సమస్యలకూ మూలం.. బాల్య వివాహాలు చేయడం అన్ని రకాల సమస్యలకూ మూలం. కుటుంబం, సంసారంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నిత్యం కలహాలు, సమస్యలకు దారితీస్తుంది. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి అడ్డుకుంటున్నాం. – వై.సుశీల కుమారి, పీవో, ఐసీడీఎస్, రాజానగరం తల్లిదండ్రుల్లో మార్పు అవసరం.. బాలికలకు చదువు పూర్తయిన అనంతరం తల్లిదండ్రులు వివాహాలు జరిపించాలి. కిశోరి పథకం కింద బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన 729 మంది యువతులకు 15 అంశాలపై శిక్షణ ఇచ్చాం. వీరు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహాలు జరిగితే 1098కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. – సీహెచ్ వెంకట్రావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి, కాకినాడ. -
హర్యానాలో ఇద్దరు దళిత బాలికల రేప్, హత్య
చండీగఢ్: హర్యానాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దళిత బాలికలు అత్యాచారానికి, దారుణహత్యకు గురయ్యారు. కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ బాలిక(15) పదో తరగతి చదువుకుంటోంది. గత మంగళవారం ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదు. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం శరీర భాగాలను ఛిద్రం చేసి కాల్వలో పడేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పానిపట్ జిల్లాకు చెందిన ఓ బాలిక(11) శుక్రవారం సాయంత్రం చెత్తను పారేసేందుకు బయటకు వెళ్లగా కొందరు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఉరివేసి చంపారు. ఈ ఘటనలో మృతురాలి పొరుగింట్లో ఉండే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
60 ఏళ్ల వృద్ధుడు మైనర్ బాలికల లైంగిక దాడి
-
దేశ రాజధానిలో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు తన ఇంటిపక్కనే ఆడుకుంటున్న ఐదు, తొమ్మిది సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులను స్వీట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి వారిపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ వారికి 5 రూపాయలు ఇచ్చాడని ఢిల్లీ డీసీపీ మిలింద్ మహదేవ్ తెలిపారు. బాలికలు రోదిస్తూ జరిగిన దారుణాన్ని తల్లితండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు డీసీపీ చెప్పారు. -
లేటు వయసులో వికృత చేష్టలు..
థానే: గత ఆరు నెలలుగా మైనర్లను లైంగికంగా వేధిస్తున్న ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని భీవండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీవండిలోని ఖాజా మొహల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం మహమ్మద్ ఖాలిక్ మోమిన్(60) స్థానికంగా నేత పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు పనిచేసే పవర్లూమ్ వద్ద కొందరు బాలికలు కూడా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా వారిని మహమ్మద్ అస్లాం తన వికృత చేష్టలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధిత బాలికలు గత ఆరు నెలల నుంచి బాధను భరిస్తూ వస్తున్నారు. అయితే, ఆ వృద్ధుడి చేష్టలతో సహనం కోల్పోయిన ఓ బాలిక ఇటీవల తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు బుధవారం భీవండి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు మహమ్మద్ అస్లాంపై పోస్కోతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితులు ఎంతమంది అనేది స్పష్టం కాలేదని, దర్యాప్తు జరిపి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. -
మైనర్లపై అఘాయిత్యం.. కీచక టీచర్ అరెస్ట్
ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ చేసిన నిర్వాకం తెలిస్తే అందరూ షాక్ తింటారు. విద్యాబుద్ధులు నెర్పించాల్సిన ఉపాధ్యాయుడు మైనర్ బాలికలపై అత్యాచారాలు చేస్తూ వచ్చాడు. చివరికి ఆ చిన్నారులు జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో ఆ కీచక టీచర్ కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.ఆర్ పాండే కథనం ప్రకారం.. తులసీరామ్ (40) ఓ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు బేసిస్ లో గ్రేడ్-3 టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్లో చదువుకునే ముగ్గురు విద్యార్థినులపై తరచుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తొమ్మిది సంవత్సరాల వయసున్న ఇద్దరు చిన్నారులపై, పదకొండేళ్ల మరో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. ఎవరికైనా చెప్పారంటే మీ అంతుచూస్తా అని బెదిరించేవాడు. గత నెల 29న ఓ చిన్నారి టీచర్ వేధింపులను తన తల్లితండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అదేరోజు ముగ్గురు బాధిత చిన్నారుల పేరెంట్స్ హెడ్ మాస్టర్ కు తులసీరామ్ పై ఫిర్యాదుచేశారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చిన్నారుల పేరెంట్స్ న్యాయం చేయాలని కోరుతూ సుల్తాన్ గంజ్ పోలీసులను ఆశ్రయించి, కీచక టీచర్ పై ఫిర్యాదు చేశారు. పలుమార్లు తమపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఐపీసీ 376(2) సెక్షన్ కింద, చిన్నారులపై లైంగిక దాడుల చట్టం కింద పలు సెక్షన్లలో ఆ కీచక టీచర్ పై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. డీఈవో ఎస్.పీ త్రిపాఠి మాట్లాడుతూ.. టీచర్ తులసీరామ్ వేదింపులకు పాల్పడినట్లు రుజువైతే అతడిని జాబ్ నుంచి తొలగిస్తామన్నారు. పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయని హెడ్ మాస్టర్ పై కూడా డీఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు. -
మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ పిలిచి..
థానే: మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ ఇద్దరు చిన్నారులను ఇంట్లోకి పిలిచిన ఓ వ్యక్తి వారిపై లైగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. వేగిల్ ఎస్టేట్ ఏరియాలోని బందువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి, చుట్టుపక్కల ఇళ్లలో ఉండే ఆరేళ్ల, తొమ్మిదేళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఆదివారం స్థానిక పోలీసులు వెల్లడించారు. బాలికలతో పరిచయం పెంచుకున్న సదరు వ్యక్తి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవాలంటూ ఇంట్లోకి పిలిచి వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. లైంగిక దాడి విషయాన్ని బాలికలు వారి తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు బాలికలు వేరువేరు ఫ్యామిలీలకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై సెక్షన్ 376, బాలలపై హక్కుల చట్టాల కింద కేసునమోదు చేసినట్లు వెల్లడించారు. -
ఇద్దరు నిందితులు దొరికారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇద్దరు పసిపాపలపై జరిగిన పాశవిక లైంగిక దాడికి సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం రాత్రి వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ నేరానికి పాల్పడిన వారిద్దరు కూడా జువెనైల్స్ కావడం పోలీసులను, ఇతర వర్గాలను విస్తుపోయేలా చేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలను ఆదివారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. గత శుక్రవారం ఆడుకుందాం రమ్మని రెండున్నరేళ్ల బాలికపై, కిడ్నాప్ చేసి ఐదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించి రాజకీయ వేడిని పుట్టించింది. తొలిఘటన పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార కాలనీలో చోటుచేసుకుంది. ఆడుకుందాం రమ్మని రెండున్నారేళ్ల బాలికను తీసుకెళ్లి లైంగికదాడి చేసి వదిలేసి వెళ్లిపోయారు. ఇక రెండో ఘటన తూర్పు డిల్లీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు కూలిపనులకు పోయింది చూసి వారి ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడుతుండగా పాప కేకలు వేయడం చుట్టుపక్కల వారు వచ్చి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు మిగతావారి కోసం గాలించి అరెస్టు చేయగా వారు జువెనైల్స్ అని తేలింది. -
చిన్నారులపై గ్యాంగ్ రేప్.. పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: ఇద్దరు చిన్నారులపై సామూహిక లైంగిక దాడి ఘటనలతో దేశ రాజధాని నిద్ర లేచింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులపై సామూహిక అత్యాచారాలు జరిగాయి. తీవ్ర గాయాలతో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో ఉండటం పలువురిని ఆవేదనకు గురిచేసింది. మొదటి ఉదంతం పశ్చిమఢిల్లీలో చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపను అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాపపై అమానుషంగా అత్యాచారం చేశారని వైద్యులు తెలిపారు. చిన్నారికి శస్త్రచికిత్స చేశామని, పాప పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మరో దారుణం తూర్పు ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగింది. ఐదేళ్ల పాపపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పాపను, పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో నిందితుడి ఇంటినుంచి ఏడుస్తూ వస్తుండగా పొరుగువారు గుర్తించి సోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ ఈ ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులను పరామర్శించేందకు సంజయ్ గాంధీ ఆసుపత్రికి వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు. -
బాలికలను గదిలో నిర్బంధించి అత్యాచారం
-
పదేళ్ల బాలికలపై అత్యాచారానికి తెగబడ్డ ఐఏఎస్ ఆఫీసర్
పుణె: పుణేలో ఒక ఉన్నతాధికారి అన్నెంపున్నం ఎరుగని అమాయక బాలికలను లైంగికంగా వేధించి, అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర వ్యవసాయరంగ బోధన మరియు పరిశోధనా సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పదవి వెలగబెడుతున్న 58 ఏళ్ల ఎం.హెచ్. సావంత్ (ఐఏఎస్)ను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం స్థానిక శివాజీ నగర్లో ఉండే సావంత్ ..ఒక పథకం ప్రకారమే హింగనకుంద్లో ఉండే తన మామగారింటికి తరచూ వెళ్లేవాడు. అక్కడికి సమీపంలోని స్కూలునుంచి హౌసింగ్ సొసైటీ పార్క్‌కు ఆటుకోడానికొచ్చే బాలికలే అతని టార్గెట్. పదేళ్ళలోపు అమాయకపు బాలికలను చాకెట్లు, డబ్బులుతో మభ్యపెట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు. కంప్యూటర్లో అశ్లీల చిత్రాలు చూపించి.. అఘాయిత్యానికి పాల్పడేవాడని సింగద్ పోలీస్ స్టేషన్ ఎస్సై బల్వంత్ కషీద్ తెలిపారు. అయితే ఈ దారుణాన్ని తమ స్కూల్ కౌన్సిలర్ ద్వారా తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి స్థానిక కార్పొరేటర్, అతని భార్య సహకారాన్నికూడా తీసుకుంది స్కూలు యాజమాన్యం. గురువారం సావంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించి, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్యపరీక్షల అనంతరం నిందితుడిని కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
రేవ్‌పార్టీలో బడాబాబుల పిల్లలు : నగ్నంగా డ్యాన్సులు!
హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన రేవ్‌పార్టీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో బడాబాబుల కుమారులు ఉన్నట్లు, యువతులు నగ్నంగా డ్యాన్సులు చేసినట్లు, వారిలో మైనర్ బాలికలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడాబాబుల కుమారులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగర కల్చర్ మారుతోంది. ఇప్పటికే పబ్ కల్చర్ యూత్‌కు మత్తెక్కిస్తుండగా తాజాగా రేవ్ పార్టీల కల్చర్ మరింత కిక్కెక్కిస్తోంది. నగర శివారు ప్రాంతాలు ఇలాంటి పార్టీలకు వేదికలవుతున్నాయి. అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ రేవ్ పార్టీల జోరు ఆగడం లేదు. పైగా మైనర్లను కూడా రంగంలోకి దింపి విందు చేసుకుంటున్నారు. తాజాగా రాజేంద్రనగర్ సమీపంలో వెలుగుచూసిన రేవ్‌పార్టీలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వెల్లడవడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ సమీపంలోని బాబుల్‌రెడ్డి నగర్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఆరుగురు యువతులతో పాటు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి రేవ్‌పార్టీలో ఆడించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆ యువతుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. వారితో నగ్నంగా డ్యాన్సులు కూడా చేయించారని తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకోగా, మంగళవారం వరకు విషయాన్ని బయటపెట్టలేదు. అయితే ఆ రాత్రే వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. యువతులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పరీక్ష చేయించినట్లు సమాచారం. అంతేగాక ఈ రేవ్‌పార్టీలో బడాబాబుల కుమారులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని తప్పించేందుకే ఖాకీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని సమాచారం. ** -
ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం
చెన్నై: కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిగిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. పొల్లాచ్చిలోని లూథరన్ చర్చి ఆవరణలో ఉన్న హాస్టల్ లోకి ప్రవేశించిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఇద్దరు బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడగట్టారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆ యువకులు వారు ఉంటున్న హాస్టల్లోకి ప్రవేశించి తలుపు తట్టారు. దీంతో ఓ విద్యార్థిని తలుపు తీయగా, దాహం వేస్తోందంటూ ఓ యువకుడు చెప్పడంతో ఆ బాలిక వారికి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. ఈక్రమంలోనే అక్కడకు ప్రవేశించిన మరో యువకుడు నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థినులను తమ భుజాన వేసుకుని ఓ పాడుబడ్డ భవనంలో తీసుకువెళ్లారు. అనంతరం వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. హాస్టల్ వద్ద జరిపిన విచారణలో చర్చ్‌కు సంబంధించిన ఆ హాస్టల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, అక్కడ విద్యార్థినుల భద్రతకు కనీసం వార్డెన్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ ఘటనను ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. సాయంత్రం మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఘటన వివరాలను సేకరించారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొంటూ, మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియూ ప్రకటించారు. -
ఓ అన్న ఆవేదన....
-
అత్యాచారానికి యత్నించిన వృద్ధుడు