రేవ్పార్టీలో బడాబాబుల పిల్లలు : నగ్నంగా డ్యాన్సులు! | Big shots sons in Rave Party | Sakshi
Sakshi News home page

రేవ్పార్టీలో బడాబాబుల పిల్లలు : నగ్నంగా డ్యాన్సులు!

Published Wed, Oct 8 2014 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

గతంలో హైదరాబాద్ లో రేవ్ పార్టీలో దొరికిన యువతులు

గతంలో హైదరాబాద్ లో రేవ్ పార్టీలో దొరికిన యువతులు

హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన రేవ్‌పార్టీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో బడాబాబుల కుమారులు ఉన్నట్లు, యువతులు నగ్నంగా డ్యాన్సులు చేసినట్లు, వారిలో  మైనర్ బాలికలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడాబాబుల కుమారులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగర కల్చర్ మారుతోంది. ఇప్పటికే పబ్ కల్చర్ యూత్‌కు మత్తెక్కిస్తుండగా తాజాగా రేవ్ పార్టీల కల్చర్ మరింత కిక్కెక్కిస్తోంది. నగర శివారు ప్రాంతాలు ఇలాంటి పార్టీలకు వేదికలవుతున్నాయి.

అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ రేవ్ పార్టీల జోరు ఆగడం లేదు. పైగా మైనర్లను కూడా రంగంలోకి దింపి విందు చేసుకుంటున్నారు. తాజాగా రాజేంద్రనగర్ సమీపంలో వెలుగుచూసిన రేవ్‌పార్టీలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వెల్లడవడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ సమీపంలోని బాబుల్‌రెడ్డి నగర్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఆరుగురు యువతులతో పాటు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి రేవ్‌పార్టీలో ఆడించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆ యువతుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. వారితో నగ్నంగా డ్యాన్సులు కూడా చేయించారని తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకోగా, మంగళవారం వరకు విషయాన్ని బయటపెట్టలేదు. అయితే ఆ రాత్రే వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. యువతులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పరీక్ష చేయించినట్లు సమాచారం. అంతేగాక ఈ రేవ్‌పార్టీలో బడాబాబుల కుమారులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని తప్పించేందుకే ఖాకీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని సమాచారం.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement