nude dance
-
అశ్లీల నృత్యాలు అడ్డుకోబోయినందుకు..
విశాఖపట్నం,తుమ్మపాల(అనకాపల్లి): సంక్రాంతి సంబరాలు గతితప్పాయి. సంప్రదాయాల పేరిట గ్రామాల్లో చేపడుతున్న తీర్థాలు శ్రుతిమించుతున్నాయి. సంక్రాంతి పండుగ నాటి నుంచి పక్షం రోజులపాటు గ్రామాల్లో తీర్థాలు నిర్వహించడం ఆనవాయితీ. వీటిల్లో ఆధునిక పోకడలు వెర్రితలలు వేయడంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇదే తరహా పరిస్థితి అనకాపల్లి మండలం మామిడిపాలెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రాములువారి తీర్థంలో అశ్లీల నృత్యాలను అడ్డుకోబోయిన పోలీసులపై గ్రామస్తులు తిరుగుబాటుకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు(టెక్కలి శ్రీను) తన అనుచరులతో వచ్చిన ఐదుగురు పోలీసులతో తొలుత తోపులాటకు దిగారు. అనంతరం అది కొట్లాటగా మారింది. రూరల్ ఎస్ఐ ఆదినారాయణ రెడ్డి కాలువలో పడిపోవడం, హెడ్కాన్సస్టేబుల్పై టీడీపీ నాయకుడు చేయిచేసుకున్న ఘటనలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. అశ్లీలనృత్యాలు ప్రదర్శిస్తున్న మహిళలు మండలంలోని మామిడిపాలెంలో గురువారం రాత్రిరాములవారి తీర్థం నిర్వహించారు. రానున్న సార్వత్రిక, స్థానిక ఎన్నికల దృష్ట్యా లబ్ధిపొందేందుకు సర్పంచ్ బావ అయిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు(టెక్కలి శ్రీను) సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలతో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నారంటూ ఒకరు వాట్సాప్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాత్రి 10 గంటల సమయంలో ఎస్ఐ ఆదినారాయణరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లలో కలిసి గ్రామానికి వచ్చారు. స్టేజి వద్దకు వెళ్లారు. ఎలాంటి అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేయలేదని నిర్వాహకులతో పాటు స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నృత్యాలు చేసిన మహిళలు సమీపంలో ఉన్నారన్న సమాచారంతో అటువైపు వెళుతున్న పోలీసులకు టీడీపీ నాయకుడు అడ్డుకున్నారు. పోలీసు జీపును స్థానికులు చుట్టుముట్టారు. దీనికి కారణం నువ్వేనంటూ టీడీపీ నేతను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ఎస్ఐ ఆదినారాయణరెడ్డి ప్రయత్నించారు. తామేమి తప్పు చేశామని స్థానికులు ప్రశ్నిస్తున్న సమయంలో సెల్ఫోన్లో వచ్చిన దృశ్యాలను హెడ్‌కానిస్టేబుల్ చూపిస్తుండగా టీడీపీ నేత దానిని లాక్కున్నారు. దీంతో పోలీసులకు చిర్రేత్తుకొచ్చింది. మురుగుకాలువలో ఉన్న ఎస్ఐ టోపీ కానీ వారు ఐదుగురే కావడంతో గుంపుగా ఉన్న జనం పోలీసులపై తిరగబడ్డారు. ఎస్ఐ ఆదినారాయణరెడ్డి సమీపంలోని మురుగుకాలువలోకి నెట్టివేయబడ్డారు. ఎస్ఐ టోపీ కూడా కాలువలోనే పడిపోయింది.జీపును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ను కొట్టినట్లు సెల్ఫోన్లో దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసు అధికారులు చెబుతున్నారు. జీపును గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన పోలీసులు తమకు అవకాశమున్న మార్గం ద్వారా స్టేషన్‌కు చేరుకున్నారు. ఇది జిల్లాస్థాయిలో సంచలనమైంది. కాగా సాంస్కృతిక ప్రదర్శనకు అనుమతి తీసుకున్నామని స్థానికులు చెబుతుండగా, అనుమతి లేకుండానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని సీఐ రామచంద్రరావు విలేకరులకు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై సీఐ రామచంద్రరావు నేతృత్వంలో శుక్రవారం మామిడిపాలెంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణ మేరకు టీడీపీ నాయకునితో పాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఎంపీపీ భర్త కొణతాల శ్రీను దగ్గరుండి టీడీపీ నాయకుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈక్రమంలో శ్రీనివాసరావును పోలీసులు విచారించిన నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కొట్టడం వల్లే శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడంటూ బంధువులు అనకాపల్లి ఆస్పత్రి వద్ద నినాదాలు చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గెస్ట్‌హౌస్‌లో అశ్లీల నృత్యాలు
తూర్పుగోదావరి , కాట్రేనికోన (ముమ్మిడివరం): నడవపల్లి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. టీడీపీ నాయకుడికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు అమ్మాయిలతో మంగళవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయించారు. అమ్మాయిలను కిరాయికి తెచ్చిన మధ్యవర్తి అశ్లీల నృత్యాల విషయంలో మద్యం సేవించి అడ్డుపడ్డాడంటూ అతడిని గాయపర్చారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్యాన్స్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి నిందితుడిని స్టేషన్ నుంచి తీసుకుపోయారు. అయితే రాజకీయ వత్తిడికి తలొగ్గిన పోలీసులు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నడవపల్లిలో నిందితుని గెస్ట్‌హౌస్‌లో నిత్యం పేకాట క్లబ్ ఆడుతున్నా పోలీసులు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎస్సై శుభాకర్‌ను వివరణ కోరగా అటువంటిది ఏమీ లేదన్నారు. -
అశ్లీల నృత్యాలు అడ్డుకున్న విలేకరిపై దాడి
పశ్చిమగోదావరి ,చింతలపూడి: చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ముక్కంపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అశ్లీల నృత్యాలు వద్దని వారించిన అదే గ్రామానికి చెందిన మానేపల్లి రవి (ఓ పత్రికా విలేకరి), అతని బంధువు రమేష్‌పై కొందరు యువకులు శనివారం రాత్రి దాడి చేశారు. దాడిలో బలమైన గాయాలైన రవి, రమేష్‌ను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు తీసుకువెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా గ్రామంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేశారు. గ్రామంలోని కొందరు వద్దని వారించినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అశ్లీల నృత్యాలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్తున్న మానేపల్లి రవిపై దాడి చేసి కొట్టారు. సీఐ పి.రాజేష్ ఆదివారం ముక్కంపాడు గ్రామం చేరుకుని సంఘటనపై విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ చెప్పారు. -
రేవ్‌పార్టీలో బడాబాబుల పిల్లలు : నగ్నంగా డ్యాన్సులు!
హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన రేవ్‌పార్టీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో బడాబాబుల కుమారులు ఉన్నట్లు, యువతులు నగ్నంగా డ్యాన్సులు చేసినట్లు, వారిలో మైనర్ బాలికలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడాబాబుల కుమారులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగర కల్చర్ మారుతోంది. ఇప్పటికే పబ్ కల్చర్ యూత్‌కు మత్తెక్కిస్తుండగా తాజాగా రేవ్ పార్టీల కల్చర్ మరింత కిక్కెక్కిస్తోంది. నగర శివారు ప్రాంతాలు ఇలాంటి పార్టీలకు వేదికలవుతున్నాయి. అడపా దడపా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ రేవ్ పార్టీల జోరు ఆగడం లేదు. పైగా మైనర్లను కూడా రంగంలోకి దింపి విందు చేసుకుంటున్నారు. తాజాగా రాజేంద్రనగర్ సమీపంలో వెలుగుచూసిన రేవ్‌పార్టీలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వెల్లడవడం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ సమీపంలోని బాబుల్‌రెడ్డి నగర్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఆరుగురు యువతులతో పాటు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి రేవ్‌పార్టీలో ఆడించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆ యువతుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. వారితో నగ్నంగా డ్యాన్సులు కూడా చేయించారని తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకోగా, మంగళవారం వరకు విషయాన్ని బయటపెట్టలేదు. అయితే ఆ రాత్రే వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. యువతులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పరీక్ష చేయించినట్లు సమాచారం. అంతేగాక ఈ రేవ్‌పార్టీలో బడాబాబుల కుమారులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిని తప్పించేందుకే ఖాకీలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని సమాచారం. **