
చికిత్స పొందుతున్న రమేష్ దాడిలో గాయపడ్డ మానేపల్లి రవి (విలేకరి)
పశ్చిమగోదావరి ,చింతలపూడి: చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ముక్కంపాడు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అశ్లీల నృత్యాలు వద్దని వారించిన అదే గ్రామానికి చెందిన మానేపల్లి రవి (ఓ పత్రికా విలేకరి), అతని బంధువు రమేష్‌పై కొందరు యువకులు శనివారం రాత్రి దాడి చేశారు. దాడిలో బలమైన గాయాలైన రవి, రమేష్‌ను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు తీసుకువెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి జాతర సందర్భంగా గ్రామంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేశారు. గ్రామంలోని కొందరు వద్దని వారించినా వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అశ్లీల నృత్యాలను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్తున్న మానేపల్లి రవిపై దాడి చేసి కొట్టారు. సీఐ పి.రాజేష్ ఆదివారం ముక్కంపాడు గ్రామం చేరుకుని సంఘటనపై విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment