
తూర్పుగోదావరి , కాట్రేనికోన (ముమ్మిడివరం): నడవపల్లి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. టీడీపీ నాయకుడికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు అమ్మాయిలతో మంగళవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయించారు. అమ్మాయిలను కిరాయికి తెచ్చిన మధ్యవర్తి అశ్లీల నృత్యాల విషయంలో మద్యం సేవించి అడ్డుపడ్డాడంటూ అతడిని గాయపర్చారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్యాన్స్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి నిందితుడిని స్టేషన్ నుంచి తీసుకుపోయారు. అయితే రాజకీయ వత్తిడికి తలొగ్గిన పోలీసులు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నడవపల్లిలో నిందితుని గెస్ట్‌హౌస్‌లో నిత్యం పేకాట క్లబ్ ఆడుతున్నా పోలీసులు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎస్సై శుభాకర్‌ను వివరణ కోరగా అటువంటిది ఏమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment