Guest house
-
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈసారి చార్ధామ్ యాత్రకు సరికొత్త రికార్డులు?
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర 2024, మే 10 నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ చార్ధామ్ యాత్రకు అనూహ్య స్పందన వస్తున్నదని యాత్రా మార్గంలోని జీఎంవీఎన్ అతిథి గృహాల బుకింగ్స్ రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు.గత ఏడాది 56 లక్షల 31 వేల మంది భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారని, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలు కానున్నదని సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మార్గాల్లోని 94 జీఎంవీఎన్ అతిథి గృహాల్లో వసతి కోసం ఆన్లైన్ మాధ్యమంలో 8 కోట్ల 58 లక్షల 39 వేల 892 మంది, ఆఫ్‌లైన్‌లో 3 కోట్ల 70 లక్షల 22 వేల 819 మంది బుకింగ్స్ చేశారన్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు.ఇప్పటివరకు యాత్రకు సంబంధించిన జరిగిన రిజిస్ట్రేషన్ల గురించి సత్పాల్ మహరాజ్ మాట్లాడుతూ, గంగోత్రి ధామ్ సందర్శనకు 2,87,358 మంది, యమునోత్రి ధామ్‌కు 2,60,597 మంది, కేదార్నాథ్ ధామ్‌కు 5,40,999 మంది, బద్రీనాథ్ ధామ్‌కు 4,53,213 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు డెహ్రాడూన్‌లోని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది ప్రతిరోజూ ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికుల కోసం టోకెన్లు, స్టాళ్ల వ్యవస్థను కూడా ప్రారంభించనున్నామని తెలిపారు. ఈసారి చార్ధామ్ యాత్రలో రవాణా శాఖ, భారత ప్రభుత్వం సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. -
ఫోన్ ట్యాపింగ్ డెన్‌గా ఆ గెస్ట్‌హౌజ్!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్‌లో సోమవారం ఉదయం సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్‌హౌజ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిందనే ప్రచారం జరిగింది. మరోవైపు.. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీనినే ప్రణీత్ రావు బృందం డెన్‌గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌజ్‌నే ప్రణీత్ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడి నుంచే సులువు అవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్ హౌజ్ నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు వెల్లడించిన సమాచారం మేరకే ఇప్పుడు పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్‌కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్ హౌజ్ మేలని ప్రణీత్ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గెస్ట్ హౌజ్‌లో ఫోన్ ట్యాపింగ్ సంబంధిత ఆధారాలన్నింటిని భుజంగరావు ముందే మాయం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో, మాపో దర్యాప్తు పిలిచి విచారణ జరపొచ్చని, నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావొచ్చనే ప్రచారం నడిచింది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్నాడు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నవీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే కేసీఆర్ మాత్రం ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. అదంతా దుష్ప్రచారం: ఎమ్మెల్సీ నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు, తన గెస్ట్ హౌజ్ ప్రస్తావన రావడంతో ఎమ్మెల్సీ నవీన్ రావు స్పందించారు. ఆ ప్రచారమంతా అవాస్తవమని చెబుతున్నారాయన. ‘‘నాకు ఫోన్ ట్యాపింగ్ తో ఏలాంటి సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నా గెస్ట్ హౌస్‌ను ఈ వ్యవహారంలోకి లాగారు. నా గెస్ట్ హౌజ్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. కుట్ర పూరితంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేస్తున్న వాళ్లపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఢిల్లీలో మీడియా కంటపడకుండా తిరుగుతున్న లోకేష్
-
గెస్ట్ హౌస్ నుంచి పారిపోయి తప్పించుకుని తిరుగుతున్న లోకేష్
-
మల్లన్నా.. ఎందుకిలా?
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్వర్యంలో దాసారం గుట్టపై హిల్ వ్యూ గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్న తీరు అనుకొన్నదొక్కటి.. ఐయ్యిందొక్కటిలా మారింది. ప్రణాళికా లోపం కారణంగా చిన్న పనిగా మొదలైన రోడ్డు నిర్మాణం ఇప్పుడు బాహుబలి ప్రాజెక్టుగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సాక్షి, సిద్దిపేట: భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం దాసారం గుట్ట పైన గెస్ట్‌హౌస్‌లను నిర్మించాలని నిర్ణయించింది. గుట్టమీద చదును చేస్తే రెండు ఎకరాల స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లుగా కొమురవెల్లికి సరికొత్త సొబగులు అద్దుతామంటూ గొప్పలు చెప్పారు. అనుకున్నదే తడవుగా అనుమతులు జారీ చేశారు. నిధులు మంజూరు చేశారు. తీరా పనులు మొదలెట్టాక, పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పనులు మొదలై ఐదేళ్లు దాటింది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చారాణా పనికి.. గెస్ట్‌హౌస్‌లను నిర్మించేందుకు ఎంపిక చేసిన దాసారం గుట్టపైకి రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఫీట్ల వెడల్పుతో 550 మీటర్ల రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందంటూ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గుర్తించారు. రెండు మూల మలుపులు ఉండే విధంగా డిజైన్ ఖరారు చేశారు. 2017లో ప్రారంభించారు. ఆరంభంలో ఈ రోడ్డు నిర్మాణం అంచనా వ్యయం కేవలం రూ.1.40 కోట్లు. కానీ ఆ నిధులతో పదిశా తం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో 2021లో అంచనాలు సవరించి రూ.3.5 కోట్లు కేటాయించా రు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పటి వరకు 4.9కోట్లు వెచ్చించినా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో రోడ్డు అందుబాటులోకి రావాలంటే మరో రూ.1.9 కోట్లు అవసరం అంచనాలు వేశారు. ఆ నిధులు ఇంకా మంజూరు కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. లక్ష్యం నెరవేరేనా? ప్రస్తుత అంచనాల ప్రకారం గుట్టపైకి రోడ్డు కోసమే రూ.9కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే రూ.9కోట్లు వెచ్చిస్తే కొమురవెల్లి దేవాలయానికి సమీపంలో తొమ్మిది ఎకరాలకు పైగా స్థలం లభించేదని స్థానికులు అంటున్నారు. పైగా గుట్టపై నిర్మించే గెస్ట్‌హౌస్‌లు సైతం వీవీఐపీల వరకే పరిమితం కానున్నాయి. కొమురవెల్లి దేవాలయానికి వాహనాల్లో వచ్చిన వారే గుట్ట పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. సాధారణంగా బస్సుల ద్వారా వచ్చే భక్తులు గుట్ట మీద ఆశ్రయం పొందలేరు. అంచనా వ్యయాని కి మూడున్నర రెట్లు ఖర్చు చేసినా ఆశించిన ఫలితం దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కమీషన్ల కోసమేనా? గుట్టపైన అందుబాటులోకి వచ్చే స్థలం కేవలం రెండు ఎకరాలు. కామన్ యూజ్ ఏరియా, పార్క్ తదితర ఏర్పాట్లకు స్థలాన్ని కేటాయిస్తే కాటేజీల నిర్మాణానికి దక్కే స్థలం కష్టంగా ఎకరాన్ని మించి ఉండదు. హిల్‌వ్యూ గెస్ట్‌హౌస్ కావడంతో విశాలంగా నిర్మాణం చేయకపోతే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. కేవలం ఎకరం స్థలం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం నిర్మాణ పనుల్లో కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారనే విమర్శలు సైతం వినవస్తున్నాయి. నిధులు రాగానే పనులు గుట్టమీద దారి కోసం మొదట రూ.1.4కోట్ల నిధులు కేటాయించారు. గుట్టమీదికి మట్టితో రోడ్ ఫాం చేస్తే ఉండదు. కనుక వాల్స్‌ను నిర్మించి రోడ్ ఫాం చేస్తున్నాం. అందుకే వ్యయం పెరిగింది. మళ్లీ నిధులు కేటాయించగానే పనులు ప్రారంభిస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
కోట్లకు పడగలెత్తిన దొంగ.. నేపాల్‌లో హోటల్, యూపీలో గెస్ట్‌హౌస్, లక్నోలో ఇల్లు..
దేశరాజధాని ఢిల్లీ పోలీసులు ఇటీవల ఒక దొంగను పట్టుకున్నారు. ఇతను పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. ఈ దొంగ తన దొంగసొమ్ముతో ఢిల్లీ మొదలుకొని నేపాల్ వరకూ పలు ఆస్తులను కూడబెట్టాడు. ఈ దొంగ.. ఢిల్లీలో ఒంటరిగా 200కు పైగా చోరీలు చేశాడు. ఇతనిని పోలీసులు వివిధ పేర్లతో తొమ్మిదిసార్లు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దొంగ తన భార్య పేరుతో సిద్ధార్థనగర్‌లో గెస్ట్‌హౌస్, తన పేరుతో నేపాల్‌లో ఒక హోటల్ కొనుగోలు చేశాడు. అలాగే లక్నో, ఢిల్లీలలోనూ సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నాడు. 2001 నుంచి 2023 వరకూ ఈ దొంగపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి. మీడియాకు తెలిసిన సమాచారం ప్రకారం మోడల్ టౌన్ పోలీసులు ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో కోటీశ్వరుడైన ఒక హోటల్ వ్యాపారిని అరెస్టు చేశారు. అతనిని మనోజ్‌చౌబేగా గుర్తించారు. అతను గడచిన 25 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతనొక్కడే 200కుపైగా చోరీలు చేశాడని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ చౌబే(45) కుటుంబం యూపీలోని సిద్దార్థనగర్‌లో ఉండేది. తరువాత వారి కుటుంబం నేపాల్‌కు తరలివెళ్లింది. మనోజ్ 1997లో ఢిల్లీ వచ్చాడు. కీర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో క్యాంటీన్ నిర్వహించాడు. క్యాంటీన్లో చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్ము పోగేశాక గ్రామానికి వెళ్లిపోతుండేవాడు. ఈ చోరీ సొమ్ముతో మనోజ్ నేపాల్‌లో హోటల్ ఏర్పాటు చేశాడు. ఈ సమయంలోనే యూపీలోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అత్తారింటిలో తాను ఢిల్లీలో పార్కింగ్ కంట్రాక్టు పనులు చేస్తుంటానని తెలిపాడు. ఇందుకోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లవలసి ఉంటుందని నమ్మబలికాడు. మనోజ్‌ను తాజగా అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా? -
చంద్రబాబు బినామీగా ఆస్తులు కూడబెట్టిన లింగమనేని రమేష్
-
కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన ప్రభుత్వం
-
చంద్రబాబుకు భారీ షాక్..
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలున్నాయి. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది. నారాయణ బంధువుల ఆస్తులు అటాచ్ ఈ గెస్ట్‌హౌస్‌తో పాటు నారాయణ బంధువుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లో డబ్బును సీఐడీ అటాచ్ చేసింది. నారాయణ కుటుంబసభ్యులు, బినామీలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తులు అటాచ్ చేసింది. నారయణ భార్య రమాదేవి, అల్లుడు పునీత్ ఆస్తులు ఇందులో ఉన్నాయి. చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడితే తప్పు ఒప్పు అవుతుందా? నోటీసులు ఆగుతాయా? ఆస్తుల విలువ పెంచుకునేందుకు.. లింగమనేని రమేష్ బినామీగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆయనకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ సైతం మార్చారు. తన ఆస్తలు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారు. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. హెరిటేజ్ సంస్థలో అప్పటికే లోకేష్ డైరెక్టర్‌గా ఉన్నాడు. రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూమలు కొనుగోలు చేశారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారు. రూ.3.66 కోట్లతో 2015 జూన్, జులై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారు. చదవండి: కాపులను దగా చేసింది చేసింది బాబు, పవన్ కాదా?: పేర్ని నాని -
గోడకూలి ఒకరు.. అది చూసి మరొకరు
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు. కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఉద్యోగి. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది. -
TS: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కాషాయ పార్టీకి చెందిన నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో మెదక్ ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, కేంద్ర మంత్రి బాల్యన్ కోసం స్థానిక బీజేపీ నేతలు గెస్ట్ హౌస్ బుక్ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. కానీ, ఆర్ అండ్ బీ అధికారులు గెస్ట్ హౌస్‌కు తాళాలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో మంత్రితో పాటు అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు అర గంట పాటు వేచి చూశారు. అనంతరం.. అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో, అధికారుల తీరుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు -
విశాఖ స్టీల్‌ప్లాంట్ హిల్‌టాప్ గెస్ట్‌హౌస్ వద్ద కార్మికుల నిరసన
-
పోలీస్ రైడ్ పేరుతో అమ్మాయిపై అత్యాచారం
లక్నో: స్నేహితుడితో కలిసి ఓ యువతి అతిథిగృహానికి రాగా ఆ భవన యజమాని కుమారుడు తనకు తెలిసిన పోలీసులను పిలిపించి పోలీస్ రైడ్ మాదిరి చేయించాడు. పోలీసులతో ఆ యువతిని బెదిరింపులకు పాల్పడి.. తన కోరిక తీరిస్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. అయితే పోలీసులే దగ్గరుండి అమ్మాయిపై అత్యాచారం జరిగేలా సహకరించడం వివాదాస్పదమవుతోంది. తీరా ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెళ్లితే పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ కేసు నమోదు చేసుకోలేదు. ఎందుకంటే వచ్చిన పోలీసులు ఆ స్టేషన్‌కు సంబంధించినవారే. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మీరట్ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అతిథిగృహానికి శనివారం (ఫిబ్రవరి 20) ఓ అమ్మాయి తనకు తెలిసిన వ్యక్తితో వచ్చింది. దీన్ని ఆ అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఆ అమ్మాయిపై కన్ను పడింది. దీంతో తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్ రైడ్ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు. ఈ మేరకు అతడికి తెలిసిన పోలీసులు అతిథిగృహానికి చేరుకుని ఆ యువతీయువకులను చూసి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. మీ తల్లిదండ్రులకు సమాచారం చెప్తామని బెదిరించడంతో ఆ యువతి కంగారుపడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీన్ని తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఇదంతా జరిగాక ఆ యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే. ఈ వార్త బయటకు రావడంతో ఆ స్టేషన్ సీఐ ప్రేమ్‌చంద్ శర్మ స్పందించారు. ‘మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరిస్తాం. విచారణ చేపడతాం’ అని సీఐ ప్రేమ్‌చంద్ శర్మ తెలిపారు. ఈ విధంగా రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. తమకు తెలిసిన వారితో కుమ్మక్కై ఓ ఆడపిల్లపై అఘాయిత్యం జరగడంతో పాటు బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. చదవండి: భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష! చదవండి: ఆ 136 మంది మరణించినట్టే.. చదవండి: ఎస్సై, ఏఎస్సైతో పాటు 6మంది అరెస్ట్ -
అతిథి గృహంపై జోక్యం తగదు
సాక్షి, అమరావతి: విశాఖలో నిర్మించ తలపెట్టిన అతిథి గృహానికి రాజధానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. అది స్వతంత్ర నిర్ణయమని, అతిథి గృహ నిర్మాణంపై గతంలో ఇచ్చిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులను ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వాలని కోరారు. అతిథి గృహం స్వరూపం, విస్తీర్ణం, గదుల సంఖ్య, ప్లాన్ తదితర విషయాల్లో జోక్యం చేసుకునే పరిధి అధికరణ 226 కింద హైకోర్టుకు లేదని నివేదించారు. ప్రభుత్వ నిర్ణయాలను సూక్ష్మస్థాయిలో ప్రశ్నించే అధికారం, హక్కు పిటిషనర్లకు లేదని స్పష్టం చేశారు. పిటిషనర్లు ప్రభుత్వానికి ప్రవర్తనా నియమావళిని నిర్దేశించజాలరన్నారు. తిరుపతి, కాకినాడల్లో నిర్మిస్తున్న అతిథి గృహాలను విశాఖతో పోల్చి చూడడానికి వీల్లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అతిథి గృహం నిర్మాణంపై దాఖలైన అనుబంధ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ అంశంపై ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రతివాదుల జాబితా నుంచి సీఎం తదితరుల తొలగింపు... పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై శాసన మండలిలో జరిగిన పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజీలను సీల్డ్ కవర్లో అందచేయాలని శాసనసభ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాల్లో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. 2 నుంచి రోజువారీ విచారణ.. దసరా సెలవుల నేపథ్యంలో రాజధాని అంశంలో దాఖలైన వ్యాజ్యాలపై నవంబర్ 2 నుంచి హైబ్రీడ్ విధానంలో రోజువారీ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. ఇరుపక్షాలకు ఏడు రోజుల సమయం మాత్రమే ఇస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు చెల్లించినందున ఆ అనుబంధ పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికే స్టేటస్ కో ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో మళ్లీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అనంతరం అన్ని వ్యాజ్యాలపై విచారణను నవంబర్ 2కి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
గెస్ట్‌హౌస్ నిర్మాణంపై హైకోర్టు విచారణ..
సాక్షి, అమరావతి: విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. పరిపాలన వికేంద్రీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. ఎక్కడైతే సీఎం ఉండి పని చేస్తారో అదే క్యాంప్ ఆఫీస్ అని ఏజీ పేర్కొన్నారు. స్టేట్ కార్పొరేషన్లు అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. మాజీ సీఎంకు హైదరాబాద్, ఆయన నివాసం ఉంటున్న గ్రామం కూడా క్యాంప్ ఆఫీస్ అని పోలీసు అధికారులు తెలిపారని, మాజీ సీఎంకు నారావారిపల్లిలో, హైదరాబాద్ పార్క్‌హయత్‌లో క్యాంప్ ఆఫీసులున్నాయని ఏజీ తెలిపారు. క్యాంప్ ఆఫీసుల ఏర్పాటుపై పూర్తిస్థాయి అఫిడవిట్‌ను శుక్రవారం వేస్తామని ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. స్టేటస్ కో ఎత్తేయాలి.. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై స్టేటస్ కో ఎత్తేయాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. బిల్లులపై జనవరిలో జరిగిన మండలి చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో సీడీలను సీల్డ్కవర్లో ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ప్రాధాన్యత క్రమంలో కేసులు విచారణ: హైకోర్టు రాజధాని అంశంపై వేసిన పలు పిటిషన్లలో దాఖలైన అనుబంధ పిటిషన్లను 12 విభాగాలుగా చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ నెల 9 నుంచి ప్రాధాన్యత క్రమంలో కేసులను విచారిస్తామని, ఈలోపు కౌంటర్లు వేయాల్సిన వారు వేయాలని ధర్మాసనం ఆదేశించింది. కొత్త చట్టాలు, నిపుణుల కమిటీ, రాజధాని తరలింపు, కార్యాలయాల తరలింపు, R5 జోన్ తదితర 12 విభాగాలుగా అనుబంధ పిటిషన్లు విభజించి.. మొదటి ప్రాధాన్యత క్రమంలో భాగంగా షిఫ్టింగ్ క్యాపిటల్, మండలిలో జరిగిన పరిణామాలు, విశాఖ గెస్ట్ హౌస్ పై ఈ నెల 9న విచారణ జరపనుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర తరపున అభిప్రాయాల్ని తీసుకోవాలని నిర్ణయించింది. అనుబంధ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. గతంలో అమరావతి కట్టకూడదని ఏమన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారా అని పలువురు పిటిషనర్లను న్యాయస్థానం ప్రశ్నించగా, తాము వేయలేదని కోర్టుకు తెలిపారు. -
స్టాలిన్ అతిథిగృహంలో సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ బస చేయనున్న ప్రైవేటు అతిథిగృహంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతుండగా, వాటిల్లో ఒకటైన ఒట్టబిడారంలో ప్రచారంకోసం ఉదయం స్టాలిన్ అక్కడికి చేరుకోవాలి. తెల్లవారుజాము 5 గంటలకు అతిథిగృహంలోకి ప్రవేశించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. స్టాలిన్ ప్రచార వాహనం, బందోబస్తుగా అనుసరించే పైలట్, బ్లాక్ కమాండోస్, అనుచరుల వాహనాలను సోదా చేశారు. అక్కడి కార్యకర్తల వాహనాలనూ తనిఖీ చేశారు. 23 తర్వాతే ఫ్రంట్‌పై స్పష్టత: స్టాలిన్ ఈనెల 23వ తేదీ ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే మూడో ఫ్రంట్‌పై స్పష్టత వస్తుందని స్టాలిన్ మీడియాతో చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు నిమిత్తం రాలేదని, తమిళనాడులో ఆలయాల సందర్శనకు వచ్చి మర్యాదపూర్వకంగా మాత్రమే తనను కలిశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని అన్నారు. -
సొబగుల సరాయి
సాక్షి, సిటీబ్యూరో :వందల ఏళ్ల చరిత్ర, సంస్కతీ సంప్రదాయాలతో అలరారుతున్న నగరం మన హైదరాబాద్. ఆధునికతను అందిపుచ్చుకుని కాలంతో పాటుపరుగులు పెడుతోంది. ఇక్కడ ఉన్న ప్రతి కట్టడానికీ ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అలాంటిదే గోల్కొండ సమీపంలోని షేక్‌పేట్ సరాయి. చాలా కాలంగా దీన్ని పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)లు తమ అధీనంలోకి తీసుకోవాలని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సరాయికి సరికొత్త సొబగులు అద్దాలని కోరుతూనే ఉన్నారు. కానీ అడుగులు పడటంలేదు. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలంటున్నారు. సరాయి అంటే అతిథి గృహం.. సరాయి కట్టడాన్ని క్రీ.శ.1550– 1580 మధ్య ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించారు. సరాయి అంటే విశ్రాంతి గృహం అని అర్థం. అప్పట్లో నగరానికి వ్యాపారం కోసం వచ్చేవారికి, పర్యాటకులకు గెస్ట్ హౌస్‌గా ఉండాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం సరాయి వృథాగా పడి ఉంది. ఆకట్టుకునే నిర్మాణ శైలి.. సరాయి నిర్మాణ శైలి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మెయిన్ గేట్‌కు రెండు వైపులా 15 చొప్పున 30 గదులను నిర్మించారు. గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఈ గదులు విశాలంగా ఉన్నాయి. సరాయికి కుడివైపు గుర్రాలు, ఒంటెల కోసం వసతి ఉండేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారానికి కుడివైపున చిన్న మసీదు ఉంది. ఇక్కడ ఒకేసారి 500 మంది వరకు ప్రార్థన చేసుకోవచ్చు. అప్పట్లో దీన్ని జామా మసీదు అని పిలిచేవారు. ప్రస్తుతం సరాయికి తాళం వేసి నిరుపయోగంగా ఉంచడంతో పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. నాలుగేళ్ల కిత్రం కొన్ని మరమ్మతులు, లోపల నాపరాళ్లను ఏర్పాటు చేశారు. ఇలా చిన్న చిన్న మరమ్మతులు చేసి మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పెచ్చులూడి కళావిహీనంగా కనిపిస్తోంది. కాలుష్యం కారణంగా కూడా ఈ నిర్మాణం దెబ్బతింటోంది. పర్యాటకులకు అందుబాటులోకి తేవాలి.. సరాయికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. లేనిపక్షంలో షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చి రూమ్స్‌ను రెంట్‌కు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందనే ప్రతిపాదనలు సైతం గతంలో వచ్చాయి. గోల్కొండతో పాటు నగర సందర్శనుకు వచ్చే పర్యాటకులు సరాయిపై ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు అనుమతి లేకపోవడంతో పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. దీనికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి తిరిగి పర్యాటకులకు అనుమతికల్పించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
గెస్ట్‌హౌస్‌లో అశ్లీల నృత్యాలు
తూర్పుగోదావరి , కాట్రేనికోన (ముమ్మిడివరం): నడవపల్లి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. టీడీపీ నాయకుడికి చెందిన గెస్ట్‌హౌస్‌లో ఇద్దరు అమ్మాయిలతో మంగళవారం రాత్రి అశ్లీల నృత్యాలు చేయించారు. అమ్మాయిలను కిరాయికి తెచ్చిన మధ్యవర్తి అశ్లీల నృత్యాల విషయంలో మద్యం సేవించి అడ్డుపడ్డాడంటూ అతడిని గాయపర్చారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్యాన్స్ నిర్వహిస్తున్న టీడీపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి నిందితుడిని స్టేషన్ నుంచి తీసుకుపోయారు. అయితే రాజకీయ వత్తిడికి తలొగ్గిన పోలీసులు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నడవపల్లిలో నిందితుని గెస్ట్‌హౌస్‌లో నిత్యం పేకాట క్లబ్ ఆడుతున్నా పోలీసులు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎస్సై శుభాకర్‌ను వివరణ కోరగా అటువంటిది ఏమీ లేదన్నారు. -
ప్రభాస్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట
సాక్షి, హైదరాబాద్ : సినీహీరో ప్రభాస్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభాస్ గెస్ట్‌హౌజ్ సీజ్ చేసిన వ్యవహారంలో స్టేటస్ కో ఉత్తర్వులను జారీచేసింది. అక్కడ యధాతథంగా పరిస్థితి కొనసాగించాలని తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం సర్వే నెంబర్ 46లో గల ప్రభాస్ గెస్ట్‌హౌజ్‌ను నాలుగు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ భూమిని జీవో నంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. (హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్) సర్వే నంబర్ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్‌హౌజ్‌ను నిర్మించారు. దీంతో ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను సీజ్ చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభాస్ పిటిషన్ వేశారు. స్పందించిన హైకోర్టు గెస్ట్‌హౌజ్ సీజ్ వ్యవహారంలో యధాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 31కి విచారణ వాయిదా వేసింది. -
ప్రభాస్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాయద్గుంలోని పాన్మక్తలో ఉన్న భూమి ప్రభుత్వ భూమేనని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. CS/7 లో భూమి ఉందా లేదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తాము కొనుగోలు చేసింది పాన్ మక్త స్థలమే అని ఆయన సమాధానమిచ్చారు. కాగా వాదనలు పూర్తైన క్రమంలో... గతంలో ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు సమ్మతం తెలిపిన కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా గురువారం డివిజన్ బెంచ్‌లో ఇరువర్గాలు మరోసారి వాదనలు వినిపించనున్నాయి. -
హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నేడు(బుధవారం) విచారణ చేపట్టనుంది. ఇటీవల రాయదుర్గం పాన్ మక్తా సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. ఇందులో 2,200 గజాల్లో ప్రబాస్ గెస్ట్‌హౌస్ నిర్మించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించారు. గతంలో ఈ భూమిని జీవో నంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. -
ప్రభాస్ గెస్ట్‌హౌస్ సీజ్
హైదరాబాద్: సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవా రం సీజ్ చేశారు. ఇటీవల రాయదుర్గం పాయే గా సర్వే నంబర్ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలి సింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. దీన్ని జీవోనంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో ఈ స్థలంలో నిర్మాణం చేసిన గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ఫ్రెండ్‌తో గెస్ట్‌హౌస్‌కు వెళ్లి.. శవమై!
న్యూఢిల్లీ : కూతురు ఐఏఎస్ అవుతుందని ఎన్నో కలలుకన్న ఆమె తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. తన కూతర్ని హత్య చేసిన వాళ్లను వదిలిపెట్టవద్దంటూ పోలీసులను వాళ్లు కోరడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఈ విషాదం ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకుంది. ఫ్లోర్ మిల్లు యాజమాని కూతురు ప్రియాంక (23). వీరి కుటుంబం కదిపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా సెక్టార్ 10లో నివాసం ఉండేది. అయితే పీజీ చదువుతున్న ప్రియాంక.. ఐఏఎస్ అవుతానని తండ్రిని కోరగా ఆమెకు కోచింగ్ ఇప్పిస్తున్నారు. చదువుకునేందుకు ఇంటికి 9కి.మీ దూరంలోని సెక్టార్ 46లో గెస్ట్ హౌస్‌లో ఉండేది. ఇంటికి వచ్చిన ప్రియాంక మరో యువకుడు రవీందర్ యాదవ్(24)తో కలిసి తిరిగి సోమవారం రాత్రి తాను ఉంటున్న గెస్ట్ హౌస్‌కు రాత్రి 8:30 గంటలకు వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియాంక స్పృహ కోల్పోయింది. రాత్రి 1 గంటల ప్రాంతంలో పోలీసులకు కాల్ వచ్చింది. ఓ యువకుడు తన స్నేహితురాలిని ఆస్పత్రిలో చేర్చాడని, ఆమెను పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులకు డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లిదండ్రులు హుటాహుటీన హాస్పిటల్‌కు చేరుకుని కూతురి మృతదేహాన్ని చూసి కన్నీంటి పర్యంతమయ్యారు. ఐఏఎస్ అవుతుందనుకున్న తన కూతురును రవీందర్ కిడ్నాప్ చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ప్రియాంక తండ్రి ప్రేమ్ చంద్ ఆరోపించారు. తప్పు లేకపోతే హాస్పిటల్లో చేర్పించి రవీందర్ ఎందుకు పరారయ్యాడని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఇంటినుంచి కూతురు ప్రియాంక వెళ్లిందని, ఆపై రాత్రి 10 గంటలకు కాల్ చేసి తన భార్యతో మాట్లాడిందని కానీ అంతలోనే ఘోరం జరిగి పోయిందన్నారు. ప్రియాంకను గత కొంతకాలం నుంచి రవీందర్ వేధిస్తున్నాడని, కూతురి వెంట పడొద్దని పలుమార్లు హెచ్చరించానని సెక్టార్ 50 పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రేమ్ చంద్ పేర్కొన్నారు. లివర్ దెబ్బతిన్న కారణంగా, రక్తస్రావమై ప్రియాంక చనిపోయి ఉండొచ్చునని గురుగ్రామ్ సివిల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర అన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులకు చెప్పారు. -
టీడీపీ ఎమ్మెల్యే అతిథి గృహం వద్ద ఉద్రిక్తత..
సాక్షి, నెల్లూరు : టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే కె. రామకృష్ణ అతిథి గృహం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ అతిథి గృహాన్ని టీడీపీ కార్పొరేటర్ రాజానాయుడు కొనుగోలు చేశారు. ఆ గృహాన్ని ఖాళీ చేయమని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే రామకృష్ణ భవనాన్ని ఖాళీ చేసేందుకు రూ. 15 లక్షల గుడ్‌విల్‌ను డిమాండ్ చేస్తున్నారని రాజానాయుడు తెలిపారు. భవనంలోకి వెళ్లడానికి కార్పొరేటర్ ప్రయత్నం చేశారు. ఆయన లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. -
ఫ్లయిట్ అటెండెంట్‌పై లైంగిక వేధింపులు!
గురుగావ్ : విమాన సహాయకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హర్యానాలోని గుర్గావ్లో చోటుచేసుకుంది. గుర్గావ్లోని విలాసవంతమైన డీఎల్ఎఫ్ ప్రాంతంలో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌లో ట్రెయినీ ఫ్లయిట్ అటెండెంట్‌పై రిసెప్షనిస్ట్ శివకుమార్ (24) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ మెయిన్‌పూరికి చెందిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రిసెప్షనిస్ట్ శివకుమార్ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గెస్ట్‌హౌస్‌లోని 22 ఏళ్ల బాధితురాలి రూమ్‌లోకి చొరబడ్డాడు. సేవలు ఎలా అందుతున్నాయని ఆమెను అడిగాడు. బాత్రూమ్లో ట్యాబ్ రావడం లేదని చెప్పడంతో చూపించమంటూ కోరాడు. ఇద్దరు బాత్రూమ్లోకి వెళ్లగా.. అతడు వెకిలిబుద్ధి చాటుకొని.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయేందుకు ప్రయత్నించగా.. గెస్ట్‌హౌస్‌లో ఉన్న ఇతర వ్యక్తులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డీఎల్ఎఫ్ ఫేజ్-2 పోలీసు స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
సెంట్రల్ జైలును గెస్ట్‌హౌస్‌లా మార్చేశారు !
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును తమిళనాడు గెస్ట్‌హౌస్‌లా మార్చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్రంలో నిజాయితీ అధికారులకు ఆత్మహత్య భాగ్యం, బదిలీ భాగ్యం కలిగిస్తున్న కీర్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ అన్నారు. ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాలను మీడియా వీడియోలు, ఫొటోల రూపంలో ప్రసారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమన్నారు. ఇలా అవినీతిని, అక్రమాలను వెలుగులోకి తెచ్చే అధికారులను బదిలీ చేయడం, వేధించడం చేస్తే రాష్ట్రంలో ఏ అధికారి విధులు సరిగ్గా నిర్వహిస్తాడని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే నెల 12,13,14 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగళూరు విచ్చేయనున్నారని, రాష్ట్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే దిశలో ఏ విధంగా పనిచేయాలో దిశానిర్దేశనం చేయనున్నారన్నారు. 150 అసెంబ్లీ సీట్లు గెలిచే విధంగా ఆపరేషన్ 150 లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు హాజరయ్యారు. -
గవర్నర్‌కు ఘన స్వాగతం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎల్ నరసింహన్‌కు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. అనంతపురం జిల్లాకు వెళుతూ మార్గమధ్యలో కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌కు వచ్చిన గవర్నర్‌కు డీఐజీ రమణకుమార్, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, కర్నూలు ఆర్డీఏ హుసేన్‌సాహెబ్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తదితరులు బొకేలు సమర్పించి స్వాగతం పలికారు. జిల్లా అధికారుల పేర్లను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీఐజీ, కలెక్టర్, జేసీలతో గెస్ట్ హౌస్‌లో కొద్ది నిముషాల పాటు సమావేశం అయ్యారు. జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపై గవర్నర్ జిల్లా యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. 3.20 గంటలకు వచ్చిన గవర్నర్ 15 నిముషాలు మాత్రమే గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. అనంతరం అనంతపురం బయలు దేరారు. -
అధినేతతో ఆత్మీయ ముచ్చట
జగన్‌ను కలిసిన పార్టీ నేతలు అతిథి గృహంలో కార్యకర్తల కోలాహలం బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు పార్టీ నాయకులు మంగళవారం ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటనను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించిన ఆయన సోమవారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్నారు. మంగళవారం ఉదయం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. నగరంలో జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ నెల 26న ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీపై చర్చించారు. జగన్‌ను కలిసేందుకు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ప్రభుత్వ అతిథి గృహం వద్ద కోలాహలం నెలకొంది. జగన్మోహన్రెడ్డిని కలిసినవారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అరుణకుమారి, బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, రొంగలి జగన్నాథం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.కాంతారావు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ సీనియర్ నాయకుడు చిన్న శ్రీను, మాజీ కార్పొరేటర్ గరికిన గౌరి, 19వ వార్డు అధ్యక్షుడు నక్కిలి త్రినా«థ్, 20వ వార్డు అధ్యక్షుడు పితాని వాసు, గోడి నాని, స్వామి, పలు వార్డుల అధ్యక్షులు ఉన్నారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 9.15 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
పుష్కరాలకు సిద్ధమవుతున్న గెస్ట్‌హౌస్
నాగర్‌కర్నూల్: ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాల కోసం నాగర్‌కర్నూల్ గెస్ట్‌హౌస్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొల్లాపూర్‌తోపాటు, నల్లమల ప్రాంతాల్లో కొన్ని పుష్కర ఘాట్లు ఉండడతో చాలా మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ప్రస్తుతం గెస్ట్‌హౌస్‌లో ఉన్న సమస్యలు తీర్చేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికోసం రూ.8.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఇప్పటికే గెస్ట్‌హౌజ్‌కు పేయింటింగ్, టాయిలెట్స్, డైనింగ్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రిషన్ పనులు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున ప్రముఖులు ఇక్కడే బస చేసే అవకాశం ఉన్నందున ప్రస్తుతం గెస్ట్‌హౌజ్‌ను సిద్ధం చేస్తున్నారు. -
రిలయన్స్ ఇండస్ట్రీ గెస్ట్ హౌస్ పై దాడి
-
రిలయన్స్ ఇండస్ట్రీ లాజిస్టిక్ గెస్ట్ హౌస్ పై దాడి
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రిలయన్స్ ఇండస్ట్రీ లాజిస్టిక్ హెచ్.గోస్వామి గెస్ట్ హౌస్ పై కొందరు గుర్తుతెలియిన దుండగులు దాడికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు గెస్ట్ హౌస్ వద్దకు వచ్చి వాచ్ మెన్ పై దాడి చేశారు. అనంతరం వాచ్ మెన్ ను కట్టేసి తలుపులు పగలగొట్టి అందులోకి చొరబడ్డారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. -
తిరుమలలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
తిరుమలలో కౌస్తుభం అతిథిగృహం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
గోవాలో రష్యా యువతిపై దారుణం
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతిని గెస్ట్ హౌస్ యజమాని అత్యాచారం చేశాడు. శుక్రవారం గెస్ట్ హౌస్‌లో అద్దెకు తీసుకున్న గదిలో ఆమె నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పెర్నెమ్ ఇన్స్పెక్టర్ సంజయ్ దాల్వి చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిని జేమ్స్ డిసౌజాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. -
చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో
- పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేపిన యువ దంపతుల ఆత్మహత్య కలిసి బతకలేమనుకున్నారో, చనిపోయి కలిసుందామనుకున్నారో.. పుణ్యక్షేత్రానికి వచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసున్నారు. చనిపోయే ముందు సెల్ఫీలు దిగి, 'మేం చనిపోతున్నాం..' అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తిరుమలలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సంపత్ కుమార్, సత్యవాణి దంపతులు తిరుమలకు వచ్చి రాంభగీచా అతిథి గృహంలో 384వ నంబర్ గదిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం గదిని శుభ్రం చేసేందుకు సిబ్బంది వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. సంపత్ కుమార్ దంపతులు శవాలుగా కనిపించారు. ఒకే ఫ్యాన్ కొక్కేనికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఆ తమిళనాడు దంపతులు చనిపోవడానికి ముందు సెల్ఫీలు దిగారు. 'మేం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం' అని చెబుతూ సెల్ఫీ వీడియోను కూడా తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించిన పోలీసులు.. గదిలో దొరికిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, బంధువులకు సమాచారం అందించారు. తిరుమలలో ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న ఆత్మహత్యా ఘటన ఇదే కావడం గమనార్హం. -
కృష్ణా పుష్కరాలకు రూ.2.12 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లలో భాగంగా అతిథిగృహాల్లో చేపట్టే పనులకు ప్రభుత్వం రూ. 2.12 కోట్లు విడుదల చేసింది. ఇందులో కృష్ణా జిల్లాకు రూ. 95 లక్షలు, గుంటూరు జిల్లాకు రూ. 75 లక్షలు, కర్నూలు జిల్లాకు రూ. 42 లక్షలు కేటాయించినట్లు రహదారులు, భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రభుత్వ అతిథి గృహంలో అధికారుల మందు పార్టీ
-
కాల్ మనీ గ్యాంగ్ ... విడిదింట్లోనే వీకెండ్స్!
విజయవాడ సిటీ : నగరానికి చేరువలోని ఓ ప్రజాప్రతినిధి అతిథి గృహాన్ని రాము ముఠా వీకెండ్స్‌కు విడిది కేంద్రంగా వినియోగించుకునేవారు. శని, ఆదివారాల్లో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొనేదని స్థానికుల సమాచారం. మద్యం, మాంసం, మగువ.. ఇలా ఇక్కడికి వచ్చే అతిథులకు ఏది కావాలంటే అది క్షణాల్లో ఏర్పాటు చేసేవారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థానాల్లోని అధికారులు వారాంతపు విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారి జాబితాలో కొందరు సినీ తారలు కూడా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. అందుకయ్యే ఖర్చంతా యలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్, ఎలక్ట్రికల్ డీఈ ఎం.సత్యానందం తదితరులు భరించేవారని చెపుతున్నారు. వీరు ఎక్కువగా తమ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారికి ఇక్కడ ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. కొందరిని విదేశాలకు కూడా వీరి ఖర్చులతోనే పంపుతుంటారు. ఖరీదైన పార్టీలే ఇక్కడ జరిగే పార్టీలన్నీ కూడా ఖరీదైనవేనని పట్టుబడిన ముఠా సభ్యుల సహచరుల సమాచారం. వారాంతంలో రెండు రోజులు జరిగే ఈ పార్టీలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారని తెలిసింది. విదేశీ మద్యం, ఖరీదైన మాంసాహార వంటకాలు తయారు చేయిస్తారని సమాచారం. కొన్ని రకాల విదేశీ పక్షులను కూడా ఇక్కడి వంటకాల్లో ఉపయోగిస్తుంటారని చెపుతున్నారు. ఇక రాత్రయితే చాలు ఖరీదైన కార్లలో పలువురు యువతులు, మహిళలు ఇక్కడికి వస్తుంటారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన నగరాలకు చెందిన మోడల్స్ కూడా ఇక్కడికి వచ్చి వెళుతుంటారని స్థానికుల సమాచారం. నెలలో మూడు నుంచి నాలుగు మార్లు జరిగే ఈ వేడుకలకు కాల్‌మనీ వ్యాపారంలో ఆర్జించిన మొత్తం నుంచే ఖర్చు చేస్తుంటారని తెలిసింది. వచ్చేది ప్రముఖులే జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడ జరిగే పార్టీల్లో పాల్గొంటారని చెపుతున్నారు. అక్కడికి వీరిని రప్పించుకొని సకల సౌకర్యాలు సమకూర్చుతుంటారు. ఆపై వీరి నగదును పెట్టుబడిగా పెట్టించుకొని కాల్‌మనీ వ్యాపారం చేస్తుంటారు. ఆ ముసుగులో సెక్స్ రాకెట్లోకి దించిన మహిళలను వీరి వద్దకు పంపుతుంటారని సమాచారం. పైరవీలకూ వేదిక ఇక్కడ జరిగే పార్టీల నడుమ పైరవీల పర్వం కూడా సాగుతుందని తెలిసింది. ఉద్యోగాలు, పోస్టింగ్‌లు, కాంటాక్టులు.. ఇలా ప్రభుత్వపరంగా జరగాల్సిన పలు వ్యవహారాలు ఇక్కడి వీకెండ్స్‌లో ఉంటాయి. రాము, శ్రీకాంత్ తదితరులు తాము చేసుకున్న ఒప్పందాలను పార్టీకి వచ్చిన ప్రముఖుల ద్వారా పూర్తి చేయిస్తారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయని చెపుతున్నారు. ఇప్పుడీ ముఠా పోలీసులకు చిక్కడంతో వీకెండ్ పార్టీల్లో పాల్గొన్న నేతలు, అధికారులు కంగుతిన్నారు. తమ పేర్లు బయటకు రాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. -
గెస్ట్ హౌస్ లో వ్యభిచారం
ఐదుజంటలు పట్టివేత కీసర: రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలోని హరిత గెస్ట్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ఐదు జంటలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..హరిత గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. వేర్వేరు గదుల్లో ఐదుగురు మహిళలతో గడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఎస్ఓటీ డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐలు స్వామి, రంగాస్వామి, ఎస్ఐ రాములు ఉన్నారు. -
సంక్షేమం వైపు చూడని విద్యార్థులు !
సంక్షేమం చిన్నబోతుంది... సౌకర్యాలు మృగ్యమౌతున్నాయి.. చదువుకొనే పిల్లలు వసతి గృహం మాటెత్తితేనే హడలిపోతున్నారు.. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చింది...కళ్ల ముందే పిల్లలుండాలని తపిస్తున్నారు...కాసిన్ని కాసులు కూడేసి కాన్వెంటు చదువులపై మొగ్గు చూపుతున్నారు.. ఫలితంగా ఒకప్పుడు కిటకిటలాడిన సంక్షేమ వసతి గృహాలు నేడు విద్యార్థులు లేక వెలవెల బోతున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సీటు కావాలంటే గతంలో ఎంతో ఉన్నత వ్యక్తులతో రికమండేషన్ చేయించాల్సి వచ్చేది. సీటు దొరికితే తమ పిల్లల చదువుకు ఢోకా లేదని తల్లిదండ్రులు భావించేవారు. నేడు రోజులు మారాయి. ఉన్న సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గ్రామీణ విద్యార్థులు సైతం నేడు ప్రభుత్వ వసతి గృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. తల్లిదండ్రులు సైతం వసతి గృహాలకు పిల్లలను పంపించేందుకు ససేమీరా అంటున్నారు. ఫలితంగా క్రమంగా సంక్షేమ వసతి గృహలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దీంతో తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. జిల్లాలో సుమారు పది వసతి గృహాల్లో తగినంత మంది విద్యార్థులు చేరకపోవడంతో వాటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు దరఖాస్తుల పరిశీలన పెద్ద ప్రహాసనంగా ఉండేది. ప్రత్యేక కవిటీ విద్యార్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టేవారు. దీంతో హాస్టళ్లలో ప్రవేశానికి పైరవీలు, సిఫార్సులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఖాళీల సంఖ్య పెరిగిపోయింది. వీటిని భర్తీ చేసేందుకు నేరుగా వార్డెన్లు, అధికారులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి హాస్టళ్లలో చేరాలని బతిమలాడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి ఇలా.. జిల్లాలో 78 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహానికి 120 మంది వంతునా 9,360 మంది ఉండాలి. అయితే వీటిలో ప్రస్తుతం 6,801 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు అధికారులే చెపుతున్నారు. సాంఘిక సంక్షేమ విబాగంలో 61 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 7.321 మంది విద్యార్థులు ఉండాల్సిండగా, వీటిలో ఈ ఏడాది 5,123 మంది ఉన్నారు. దీంతో వసతిగృహం అధికారులు ప్రతి గ్రామం వెళ్లి విద్యార్థులను వసతి గృహాల్లో చేరాల్సిందిగా అభ్యర్థించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవీ కారణాలు ! ఉపాధి హామీ పథకం పనులతో చాలామంది ఆదాయం పెరిగింది. భార్యా భర్తలు కలిపి పనికి వెళితే రోజు వేతనం సుమారు రూ. 550 సంపాదిస్తున్నారు. వారి పిల్లలను మంచి కాన్వెంటులో చదివించాలని చూస్తున్నారు. అంతే కాకుండా పాఠశాలల్లో ఒక పూట భోజనం పెట్టడంతో రెండో పూట భోజనం వారికి భారం కావడంలేదు. దీనికి తోడు చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. ఒకరిద్దరు కంటే ఎక్కువ మంది సంతానం ఉండడం లేదు. దీంతో పిల్లలను బయట ఉంచేందుకు ఇష్టపడంలేదు. వసతి గృహల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండటంతో అక్కడకు పిల్లల్ని పంపించేందుకు చాలామంది తల్లిదండ్రులు అంగీకరించడంలేదు. దీనికి తోడు పుస్తకాలు, దుస్తులు సకాలంలో పిల్లకు చేరకపోవడం, సంక్షేమాధికారులు స్థానికంగా ఉండకపోవడం, మెనూ పాటించకపోవడం వంటివి కూడా విద్యార్థులు వసతి గృహాల వైపు చూడకపోవడానికి కారణమవుతున్నాయి. -
బాసర అతిథి గృహంలో అగ్నిప్రమాదం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞానసరస్వతి దేవాలయంలోని అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అతిథి గృహంలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అమ్మవారికి సంబంధించిన పాత వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రెండు లక్షల విలువైన పాత చీరలు, వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు తెలిపారు. (బాసర) -
కబ్జాకోరల్లో బాసర ఆలయ భూములు
భైంసా : చదువుల తల్లి బాసర సరస్వతీ క్షేత్రం అమ్మవారి భూములకు రక్షణ కరువైంది. దేశంలో రెండు సరస్వతీ ఆలయాలుండగా.. ఒకటి జమ్మూకాశ్మీర్‌లో మరో టి ఇక్కడ ఉంది. దీంతో బాసర అమ్మవారికి గతంలో భక్తులు భూములను విరాళంగా అందించారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం కబ్జాకోరల్లో మగ్గుతున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై దేవాదాయ శాఖ కూడా అంతగా పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు ఆ భూములకు కన్నం వేస్తున్నారు. ఆలయ భూములు ఇవే.. బాసర సరస్వతీ ఆలయానికి 158 ఎకరాల 38 గుంటల భూమి ఉంది. బాసర శివారల్లో 93.7 ఎకరాలు ఉంది. బాసరలో 72 ఎకరా ల్లో ఆలయం, అతిథిగృహలు, ఉద్యానవనాలు ని ర్మించారు. మిగితా 21 ఎకరాల భూమి అర్చకుల అ ధీనంలో ఉంది. ఈ భూమిపై పలు కేసులు న్యాయస్థానాలు, దేవాదాయశాఖ ట్రిబ్యునల్ పరిధిలో విచారణలో ఉన్నాయి. ఏళ్లుగా భూములపై విచారణ కొనసాగడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. డివిజన్ వ్యాప్తంగా భూములు... బాసర గ్రామంతోపాటు నిర్మల్ డివిజన్లో 49.26 ఎకరాలు సరిహద్దు మహారాష్ట్రలోనూ మరో 16.5 ఎకరాల భూమి ఉంది. ధర్మాబాద్ పక్కనే ఉన్న బా లాపూర్ శివారులో ఈ భూమి ఉంది. భైంసా మం డలం గుండేగాంలో 11.28ఎకరాలు, సిరాల గ్రామం లో 6.22 ఎకరాలు, తానూరు మండలం బోల్సాలో 13.18ఎకరాలు, బెల్తరోడాలో 16.15ఎకరాల భూ మి ఉంది. రికార్డుల్లో ఉన్న ఈ భూములు గుర్తించడానికి అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేపట్టడం లేదు. గతంలో వేలంపాట ద్వారా అధికారులు ఈ భూములను స్థానిక గ్రామస్తులకు సాగు చేసుకునేం దుకు కేటాయించే వారు. భూములున్న గ్రామాల్లో ముందస్తు చాటింపులు వేయించి వేలం నిర్వహించేవారు. రానురాను ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. సంబంధిత గ్రామాల్లో కొంత మంది ఈ భూములను అనధికారికంగా సాగుచేసుకుంటున్నారు. రెవెన్యూ మంత్రి చెప్పినా.. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ సదస్సు నిమిత్తం బాసర వచ్చిన అప్పటి మంత్రి రఘువీరారెడ్డికి బాసర గ్రా మస్తులు, ఆలయ భూములపై ఫిర్యాదు చేశారు. స భా వేదికపైనే మంత్రి ఆలయ భూములపై పూర్తిస్థా యి సర్వే నిర్వహించి న్యాయస్థానాల పరిధిలోని అ న్యాక్రాంతమైన భూముల స్వాధీనానికి చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. సిబ్బంది కొరత సాకుగా చూపి ఇప్పటికీ పూర్తిస్థాయి సర్వే చేపట్టలేదు. కోట్ల రూపాయల విలువ.. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందుతున్న బాసరలో భూముల ధరలు కోట్ల రూపాయలు పలుకుతున్నా యి. చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నలుమూలలా భక్తులు తరలివస్తున్నారు. పక్కనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆలయ భూములు కూడా కోట్లాది రూపాయల విలువ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిపై కన్నేశారు. హద్దులు చెరిపేసి పక్కవారు ఆలయ భూముల్లోకి చొరబడుతున్నారు. ఆలయ భూములకు హద్దురాళ్లు, రక్షణ కంచె లేకపోవడంతో రియల్టర్లు సైతం ఈ భూమిపై కన్నేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. బడాబాబుల కన్నుపడ్డ ఈ భూములను తెలంగాణ సర్కారే కాపాడాలని భక్తు లు కోరుతున్నారు. కానుకల రూపంలో అమ్మవారికి ఇచ్చిన భూములపై ఇప్పటికైనా అధికారులు దృష్టిపెట్టి వాటిని స్వాధీనం చేసుకోవాలంటున్నారు. పకడ్బందీ సర్వే - విజయరామారావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బాసర ఆలయ భూములపై పకడ్బందీ సర్వే నిర్వహిస్తున్నాం. ఆలయ భూములు పరుల పరం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ భూములపై ట్రిబ్యునల్ పరిధిలో విచారణ కొనసాగుతోంది. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేశాం. -
శోభకు షాక్
జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి ఆధిపత్యానికి షాక్ తగులుతోందా? జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన రహస్య సమావేశమే ఆమెకు ఈ పరిస్థితి రావడానికి కారణమైందా? గూడుపుఠాణి చేసిన వారికి తన పవరేంటో చూపించాలని మంత్రి మృణాళిని భావించారా? వైస్‌చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయాలని తాను ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చిన్నబుచ్చుకుని, చేతల్లో చూపించారా? ఈ పరిణామాలన్నీ విశ్లేషిస్తే జెడ్పీ సీఈవో బదిలీ వ్యవహారమే వీటన్నిటికీ సమాధానం అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షి ప్రతినిధి,విజయనగరం: బదిలీల వ్యవహారం తెరపైకొచ్చిన దగ్గరి నుంచి జెడ్పీ సీఈఓ పోస్టు కోసం ఎవరికి వారు ప్రయత్నించినా చివరికీ ఇద్దరికే జిల్లా నేతల ఆశీస్సులందాయి. గతంలో ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన రమణమూర్తిని తీసుకొచ్చేందుకు జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పావులు కదిపారు. ఆమేరకు సిఫారసు లేఖ కూడా ఇచ్చారు. అయితే, తన కుమార్తె వివాహం అయ్యేంతవరకు ఇక్కడే ఉంచాలని కోరుతూ ప్రస్తుత సీఈఓ ఎన్.మోహనరావు అభ్యర్థించడంతో చైర్పర్సన్ మనసు మార్చుకుని మోహనరావును కొనసాగించాలని పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టిలో మౌఖికంగా పెట్టారు. అటు మంత్రి మృ ణాళిని ఆశీస్సులుండాలని ఆమె వద్దకు కూడా మోహనరావు వెళ్లి సిఫారసు లేఖను తీసుకున్నారు. కనీసం ఏడాది పాటు తననే కొనసాగిస్తారని మోహనరావు గట్టి ధీమాతో ఉన్నారు. అయితే ఊహించని విధంగా గతంలో విజయనగరం ఆర్డీవోగా పనిచేస్తూ బదిలీపై వెళ్లిన గనియా రాజకుమారిని జెడ్పీ సీఈఓగా నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అటు జెడ్పీ చైర్పర్సన్, ఇటు గంపెడాశలు పెట్టుకున్న మోహనరావుకు విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన రహస్య సమావేశంలో చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పాల్గొని అసమ్మతి స్వరం విన్పించారన్న విషయం తెలుసుకుని మంత్రి మృణాళిని ఆమెపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇంకా ఊరుకోవడం మంచిది కాదని తనదైన శైలిలో నాటి నుంచి ఆమె పావులు కదుపుతున్నట్టు పార్టీ వర్గాల్లో విన్పిస్తోంది. జెడ్పీలో తన హవా కొనసాగితే చైర్పర్సన్ దారికొస్తారని, అందుకు కీలకమైన సీఈఓ పోస్టులో అనుకూల వ్యక్తిని నియమించుకోవాలన్న ఉద్దేశానికి వచ్చారని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన గనియా రాజకుమారిని సిఫారసు చేసి యుద్ధప్రాతిపదికన పోస్టింగ్ వేయించినట్టు వాదనలు విన్పిస్తున్నాయి. దీనితో పాటు మరో వాదన కూడా విన్పిస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌కు తొలి నుంచి అసమ్మతి వాదులగా ఉన్న ఓ ముగ్గురు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. తొలి నాళ్లలో పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్ విషయంలో హల్చల్ చేసి చైర్పర్సన్ స్వాతిరాణి వర్గీయుల్ని ముచ్చెమటలు పట్టించిన ఆ ఏమ్మెల్యేలు పథకం ప్రకారం మరో ఎత్తుగడ వేశారన్న వాదనలు ఉన్నాయి.పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇందులో కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. తనకున్న భవిష్యత్ ముప్పును దృష్టిలో ఉంచుకుని చైర్పర్సన్ వర్గీయులకు చెక్‌పెట్టేందుకు గాను ైవైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని తెరముందుకు తీసుకొచ్చి,జెడ్పీలో ఆయనకొక చాంబర్ ఏర్పాటు చేసి, తద్వారా మరో పవర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పథక రచన చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి అయ్యన్నపాత్రుడి ద్వారా వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని చైర్‌పర్సన్‌కు చెప్పించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే అయ్యన్న పాత్రుడు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ఆదేశాలను జెడ్పీలో అమలు చేయలేదనే విషయాన్ని సదరు ఎమ్మెల్యేలు మంత్రి అయ్యన్న చెవిలో వేసినట్టు తెలుస్తోంది. పొరుగు జిల్లాల సీఈఓలను సదరు జెడ్పీ చైర్మన్ల సిఫారసు మేరకు కదపకపోగా, ఈ జిల్లా చైర్పర్సన్ సూచించిన వారిని కాకుండా, ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండా మంత్రి అయ్యన్న తనకు నచ్చిన వ్యక్తికి జెడ్పీ సీఈఓగా పోస్టింగ్ కల్పించి ఉండొచ్చని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ చైర్పర్సన్ స్వాతిరాణి ఆలోచనలు, అభిప్రాయాలకు భిన్నంగా సీఈఓ నియామకం జరగడంతో ఆ వర్గం తట్టుకోలేకపోతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి మంత్రి బొత్స ఆశీస్సులతో కీలక పోస్టింగ్‌లు దక్కించుకున్న రాజకుమారిని మళ్లీ జెడ్పీ సీఈఓగా నియమించారంటూ పార్టీ వర్గాలు కూడా పెదవి విరుస్తున్నాయి. -
మరమ్మతుల మాయ
సాక్షిప్రతినిధి, నల్లగొండ :లక్ష రూపాయలకుపైన ఖర్చుపెట్టి చేపట్టే ఏ పనినైనా ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండరు నిర్వహించాల్సిందే అన్నది కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కానీ, రాజకీయ ఒత్తిళ్ల ముందు ప్రభుత్వ నిబంధనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు స్పెషల్ ఆఫీసర్లపాలన సమయంలోనే జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు మరమ్మతులు జరిగాయి. రంగులు మార్చి ఎలాగైతేనేం కొత్తగా తయారు చేశారు. శానిటేషన్, తాగునీటి సౌకర్యం, ఇతరత్రా మరమ్మతు పనుల కోసం మొత్తంగా రూ.10లక్షలు వెచ్చించారు. దీనికోసం టెండర్లు నిర్వహించి పనులు చేపట్టారు. జెడ్పీ సాధారణ నిధి (జనరల్ ఫండ్) నుంచి మరో రూ.5లక్షలు ఖర్చుపెట్టి ఏసీలు, సోఫాసెట్లు, బెడ్స్ తదితరాలను కొనుగోలు చేశారు. కాగా, ఈ పనిని మాత్రం కేవలం నామినేషన్ పద్ధతిపైనే అప్పజెప్పారు. గత పాలకవ ర్గ సమయంలోనే అప్పటి జెడ్పీచైర్మన్ గెస్ట్‌హౌస్‌ను మరమ్మతు చేయించడం, కొత్త ఫర్నిచర్ కొనుగోలు తదితరాల కోసం ఖర్చు పెట్టారు. అయినా, నిర్వహ ణలోపంతో కొంత రిపేర్లకు గురైంది. దీంతో ఏకంగా రూ.15లక్షలు ఖర్చుపెట్టడం విమర్శల పాలైంది. అదీ అందులో ఏకంగా రూ.5లక్షల పనులకు ఎలాంటి టెండర్ నిర్వహించకుండా, తమవాడైన ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధిచేకూర్చేలా నామినేషన్ పద్ధతిపై ఈ పనులు అప్పజ్పెడం విశేషం. కొత్త పాలకవర్గం కొలువుదీరాక కూడా సదరు కాంట్రాక్టర్‌కు ఉపాధి కల్పించే పనిలో ఉన్నారు. జెడ్పీచైర్మన్ చాంబర్, యాంటీ రూం అన్నీ కూడా ఆధునికంగానే తయారు చేశారు. అయినా, మరోసారి రూ.5లక్షలు వెచ్చించి చాం బర్కు రిపేర్లు చేయాలని నిర్ణయించారు. అదీ ఎలాంటి టెండర్ నిర్వహించకుండా, మళ్లీ నామినేషన్ పద్ధతిపైన.. ‘ జెడ్పీ పనుల దత్తపుత్రుడిగా ’ పేరున్న కాంట్రాక్టర్‌కే ఈ పనులు కూ డా అప్పజెబుతున్నారని సమాచారం. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా తగలబడి పోయిం దని చెబుతున్న జెడ్పీ సమావేశ మందిరాన్ని ఆధునికీకరించేందుకు అధికారులు ఇప్పటికే రూ.40లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇంకా, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతీ రాలేదు. దీనిలో భాగంగానే అవసరమైన మేర జెడ్పీచైర్మ న్ చాంబర్‌కు మరమ్మతులు చేయించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇదేమీ పట్టించుకోకుండా ఏసీల్లో ఎలుకలు కని పించాయన్న సాకుతో, ఎలాంటి అంచనాలు సిద్ధం చేయకుండానే, ఎలాంటి టెండర్లు పిలవకుండానే రూ.5లక్షలతో రిపేర్ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ మొత్తంతో ఏసీలు, సీలింగ్‌కు పీఓపీ, టాయిలెట్ల మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ‘వాస్తవానికి ఈ పనులు ఇప్పుడు ప్రత్యేకంగా చేపట్టాల్సిన పనిలేదు. కేవలం రాజకీయ ఒత్తిళ్లతో, ఎవరికో లబ్ధి చేకూరేందుకే ఈ పనులు...’ అని జిల్లా పరిషత్ అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. -
ఆధ్యాత్మిక కేంద్రంలో రాసలీలలా...!
కాకినాడ : ఆధ్యాత్మికతకు ఆటపట్టయిన ఆ ప్రాంతాన్ని రాసలీలకు కేంద్రంగా మార్చేశారు. ఆలయంలో ఒక ఉద్యోగి ఈ రాసలీల బాగోతానికి కేంద్ర బిందువు అయ్యాడు. స్థానికుల ద్వారా ఈ విషయం జిల్లా కేంద్రానికి చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండల ముఖద్వారమైన మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ అతిథి గృహాన్ని ఒక ఉద్యోగి రాసలీలకు వేదికగా చేసుకున్నాడనే అంశం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల విడిది కోసం ఆలయంలో నాలుగు గదులతో కూడిన అతిథిగృహం ఒకటి ఉంది. వీటిలో ఒక ఏసీ గది కూడా ఉంది. మూడు రోజుల క్రితం స్వామి రాత్రి 11 గంటల సమయంలో ఆ మండలానికి చెందిన ఒక యువతి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరొక యువతిని అతిథిగృహానికి తీసుకువచ్చింది. ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఏసీ గదిలో ఒక యువతితో రాసలీలు సాగించిన విషయం గుప్పుమంది. ఆలయ మాజీ ప్రతినిధి ఆ తరువాత రోజు ఉదయం ఆలయానికి వచ్చి ఆరా తీసినట్టు సమాచారం. ఈ విషయాన్ని చివరకు ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకు వెళ్లారు. యువతుల భవిష్యత్తు దృష్ట్యా ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా విడిచిపెట్టేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీనికి బాధ్యుడైన ఉద్యోగిని మాత్రం బదిలీపై మరో ప్రాంతానికి పంపించేయాలని ఆ ప్రజాప్రతినిధి ఆదేశించారని తెలియవచ్చింది. ఆలయ సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటంతోనే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడిందని భక్తులు మండిపడుతున్నారు. -
అధికారిక భవనం లేక.. అతిథిలా..!
►క్యాంపు కార్యాలయం ఖాళీ లేక కలెక్టర్‌కు ఇబ్బందులు ►నెల రోజులుగా గెస్ట్‌హౌస్‌లోనే బస ►అధికారిక నివాసం ఖాళీ చేయని అహ్మద్‌బాబు ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం.. అబ్బో ఎన్ని హంగులు.. మరెన్ని సౌకర్యాలో.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడడంలేదు. దానికీ కారణం లేకపోలేదు.. మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు ఆ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడమే..! కొత్త కలెక్టర్ ఎం.జగన్మోహన్ బసచేస్తున్న అతిథిగృహం వద్ద కనీస సౌకర్యాలు లేక ఆయన్ను కలిసేందుకు వస్తున్న ప్రజలు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. అసలే వర్షాకాలం.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అంతటి వర్షంలోనూ తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారూ వర్షంలోనే వేచి చూడాల్సి వస్తోంది. ఈ బాధ ప్రజలకే కాకుండా అధికారులకూ తప్పడం లేదు. వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు అతిథిగృహం ఆవరణలోనే పడిగాపులు కాయాల్సి వస్తోం ది. ఇక్కడ మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు జూన్ 26న బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని జలమండలి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన స్థానంలో జగన్మోహన్ జూన్ 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే.. బదిలీ అయిన కలెక్టర్ అహ్మద్‌బాబు క్యాంపు కార్యాలయా న్ని ఖాళీ చేయలేదు. దీంతో కొత్త కలెక్టర్ టీటీడీసీ (సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం) అతిథిగృహంలో బస చేయాల్సి వస్తోంది. ఇందులో కనీసం పది మంది కూడా నిలబడేందుకు స్థలం కూడా లేదు. వేచి చూడడానికి వెయిటింగ్ హాల్ కూడా లేదు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా శాఖల సమీక్ష సమావేశాలు కలెక్టర్ అధికారిక నివాసంలో నిర్వహిస్తున్న సమయంలో అధికారులు గంటల కొద్దీ బయటే ఉండాల్సి వస్తోంది. అందుబాటులో మంచినీటి సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వ అధికారిక బంగ్లా (క్యాంప్ కార్యాలయం)లో పాత కలెక్టర్ అహ్మద్‌బాబు ఇంటి సామగ్రి ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుండటంతో ప్రస్తుత కలెక్టర్ అతిథిగృహంలోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో పోలీసుల హడావిడి
-
నేడు స్పీకర్ సిరికొండ రాక
జిల్లాలో తొలి పర్యటన ఘనస్వాగతానికి ‘గులాబీ’ల ఏర్పాట్లు చెంచుకాలనీని సందర్శించనున్న మధుసూదనాచారి వరంగల్ : తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్‌గా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి బుధవారం జిల్లాకు రానున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. నూతన రాష్ట్రానికి తొలి స్పీకర్‌గా ఆయనకు అవకాశం రావడాన్ని జిల్లాకు గర్వకారణంగా భావిస్తున్నారు. పార్టీలకతీతంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. పర్యటన షెడ్యూల్ ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లోని తన నివా సం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. 9 గంటలకు జిల్లా ప్రవేశద్వారం పెంబర్తి వద్ద ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. 10.15 గంట లకు మడికొండకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం కలెక్టర్ బంగ్లా సమీపంలోని కీర్తి స్థూపం, అమరవీరుల స్థూపం, కాళోజీ, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. జయశంకర్‌సార్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అక్కడి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆత్మకూరు... అక్కడి నుంచి శాయంపేటకు చేరుకుం టారు. అమరవీరుల స్థూపాలకు నివాళులర్పించి, అమరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1.15 గంట లకు తన స్వగ్రామం నర్సక్కపల్లికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పరకాలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం చెంచుకాలనీని సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు తన సొంత నియోజకవర్గమైన భూపాలపల్లికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రి 10.15 గంటలకు హన్మకొండలోని అర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. -
ఉద్యోగుల పంపకాలపై ఉన్నతాధికారుల భేటీ
-
టీడీపీ నేత గెస్ట్‌హౌస్‌కు నిప్పెట్టిన 'తమ్ముళ్లు'
విశాఖపట్నం జిల్లా టీడీపీలో వరుసగా రెండవరోజు కూడా అసమ్మతి సెగ ఎగసిపడింది. అరకు ఎమ్మెల్యే టికెట్ స్థానికేతరుడికు ఎట్లా ఇస్తారంటూ స్థానిక టీడీపీ కార్యకర్తుల బుధవారం చెలరేగిపోయారు. అందులోభాగంగా టీడీపీ టికెట్ కేటాయించిన ఎమ్మెల్యే అభ్యర్థి కుంభా రవిబాబు గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. గెస్ట్ హౌస్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం గెస్ట్ హౌస్ పై ప్రెట్రోల్ పోసి నిప్పు అంటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జిల్లా నేతకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని స్థానిక టీడీపీ కార్యకర్తులు టీడీపీ నేతలను హెచ్చరించారు. అయితే విజయనగరం జిల్లా ఎస్.కోట నుంచి గతంలో ఎమ్మెల్యేగా కుంభా రవి విజయం సాధించారు. ఆయనకు ఈ సారి అరకు ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించారు. దాంతో పార్టీకి ఎన్నో ఏళ్లుగా స్థానికంగా సేవలు చేస్తున్నా తమను కాదని బయట వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తారా అంటూ తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. అలాగే ఇటీవలే టీడీపీలో చేరిన భీమీలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌పై మంగళవారం నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీహెచ్ అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. -
నా గెస్ట్‌హౌస్‌కు రండి
నా గెస్ట్‌హౌస్‌ను సందర్శించండి అంటూ ఆసిన్ ఆహ్వానిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన మలయాళ నటి అసిన్. హిందీ గజిని చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై శీతకన్నేశారనే చెప్పాలి. కాగా ఈ బ్యూటి తాజాగా కేరళలో ఒక బ్రహ్మాండమైన గెస్ట్‌హౌస్‌ను కొన్నారు. విశ్రాం తి సమయాలను ఆ గెస్ట్ హౌస్‌లో గడిపేస్తున్న అసిన్ ఇప్పుడు బాలీవుడ్ హీరోలను తన గెస్ట్ హౌస్‌ను సందర్శించండంటూ ఆహ్వానిస్తున్నార ట. కేరళలోని కొట్టాయం సమీపంలోని కొండ ప్రాంతంలో సెలయేర్ల మధ్య బహు సుందరంగా ఉండే ఆ గెస్ట్ హౌస్‌కు అసిన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితురాళ్లు ఎక్కువగా వస్తున్నారట. అంతేకాదు అక్కడ ఇతర గెస్ట్‌లు కూడా నివసించడానికి ఏర్పా ట్లు చేశారట. సుందరమైన చిత్రలేఖనంతోపాటు, స్వచ్ఛమెన గాలి, ప్రకృతి అందాలతో కూడిన తమ గెస్ట్‌హౌస్‌ను సందర్శించాలని బాలీవుడ్ హీరోలను ఆహ్వానిస్తున్నారట. ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి ఈ గెస్ట్‌హౌస్‌కు వచ్చి ఆతిథ్యం స్వీకరించారట. ఆసిన్, అజ య్దేవగన్ జంటగా నటించిన బోల్ బచ్చాన్, షారూఖ్, దీపికా పడుకునేతో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాలను రోహిత్ శెట్టి తెరకెక్కించిన విషయం తెలిసిందే! -
కాంగ్రెస్ ఆశావహుల సందడి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే ఆశావహులుతో నల్లగొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సం దడి నెలకొంది. ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ రఫీఖ్ అహ్మద్ ఎదుట ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. నల్లగొండ పార్లమెంట్, నల్లగొండ, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలోని బ్లాక్, మండల స్థాయి నాయకుల నుంచి అహ్మద్ అభిప్రాయాలు సేకరించారు. ఏఐసీసీ తరఫున జిల్లా ఇన్చార్జిగా వచ్చిన కుమార్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు తూడి దెవేందర్రెడ్డితో కలిసి వినతిపత్రాలను తీసుకున్నారు. టికెట్లు ఆశిస్తున్న వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా స్థానాల నుంచి టికెట్లు ఆశి స్తున్న నాయకులు పెద్ద ఎత్తున తమ అనుచరులతో తరలివచ్చి పరిశీలకునికి దరఖాస్తు చేసుకున్నారు. నల్లగొండ పార్లమెంట్‌తో పాటు అ సెంబ్లీ స్థానాన్ని బీసీలకు గానీ, ఎస్సీలకు గానీ కేటాయించాలని మైనార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ హఫీజ్‌ఖాన్, సయ్యద్ అఫాన్ అలీ, బషీరుద్దీన్, మేకల వెంకన్న తమకే అవకాశం కల్పించాలని వినతిపత్రాలు అందజేశారు. అదే విధంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే అవకాశం కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి వినతిపత్రం అందించారు. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో అవకాశం కల్పించాలని ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరగా, తనకే అవకాశం కల్పించాలని పీసీసీ కార్యదర్శి సుంకరి మల్లేష్‌గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌కు పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు పెరిక వెంకటేశ్వర్లు, బాషపాక హరికృష్ణ, మునాస వెంకన్న వినతిపత్రం అందించారు. దేవరకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గ స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు జగన్‌లాల్ నాయక్, గతంలో పీఆర్పీ అభ్యర్థి వడ్త్యా రమేశ్ వినతిపత్రం అందజేశారు. అంతకుముందు కొందరు నాయకుల కొద్దిసేపు నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. కోమటిరెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలి సాక్షి, న ల్లగొండ : రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నియమించాలని ఏఐసీసీ పరిశీలకుడు రఫీఖ్ అహ్మద్‌ను మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుమ్మల మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు వారిచ్చిన వినతిపత్రంలో పేర్కొరు. తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని, తన మంత్రి పదవిని త్యాగం చేశారని వివరించారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. మైనార్టీ నాయకుల ఆగ్రహం అభిప్రాయ సేకరణ కోసం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ రఫీఖ్ ఆహ్మద్ ఎదుట ఆ పార్టీ మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 30ఏళ్లుగా నల్లగొండ అసెంబ్లీ స్థానంలో మైనార్టీలకు, బీసీలకు అవకాశం కల్పించకుండా కేవలం ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారని మైనార్టీ నాయకులు హఫీజ్‌ఖాన్, ముంతాజ్ అలీ, రఫీయొద్దీన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రావడం లేదని ఫిర్యాదు చేశారు. ‘‘మీ అభిప్రాయాలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లడమే తనపని. బీఫారాలు ఇచ్చేవాన్ని కాదు. మీకు సరైన న్యాయం జరిగేలా చూస్తా.’’ అని రఫీఖ్ అహ్మద్ వారికి హామీ ఇవ్వడంతో శాంతించారు.