సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లలో భాగంగా అతిథిగృహాల్లో చేపట్టే పనులకు ప్రభుత్వం రూ. 2.12 కోట్లు విడుదల చేసింది. ఇందులో కృష్ణా జిల్లాకు రూ. 95 లక్షలు, గుంటూరు జిల్లాకు రూ. 75 లక్షలు, కర్నూలు జిల్లాకు రూ. 42 లక్షలు కేటాయించినట్లు రహదారులు, భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.