గవర్నర్‌కు ఘన స్వాగతం
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వచ్చిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎల్ నరసింహన్‌కు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. అనంతపురం జిల్లాకు వెళుతూ మార్గమధ్యలో కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌కు వచ్చిన గవర్నర్‌కు డీఐజీ రమణకుమార్, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, కర్నూలు ఆర్‌డీఏ హుసేన్‌సాహెబ్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి తదితరులు బొకేలు సమర్పించి స్వాగతం పలికారు. జిల్లా అధికారుల పేర్లను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీఐజీ, కలెక్టర్, జేసీలతో గెస్ట్ హౌస్‌లో కొద్ది నిముషాల పాటు సమావేశం అయ్యారు. జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపై గవర్నర్ జిల్లా యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. 3.20 గంటలకు వచ్చిన గవర్నర్ 15 నిముషాలు మాత్రమే గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. అనంతరం అనంతపురం బయలు దేరారు.