
అధినేతతో ఆత్మీయ ముచ్చట
జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
అతిథి గృహంలో కార్యకర్తల కోలాహలం
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు పార్టీ నాయకులు మంగళవారం ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటనను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించిన ఆయన సోమవారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్నారు. మంగళవారం ఉదయం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. నగరంలో జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ నెల 26న ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీపై చర్చించారు.
జగన్‌ను కలిసేందుకు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ప్రభుత్వ అతిథి గృహం వద్ద కోలాహలం నెలకొంది. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినవారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాలనాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అరుణకుమారి, బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, రొంగలి జగన్నాథం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.కాంతారావు, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ సీనియర్ నాయకుడు చిన్న శ్రీను, మాజీ కార్పొరేటర్ గరికిన గౌరి, 19వ వార్డు అధ్యక్షుడు నక్కిలి త్రినా«థ్, 20వ వార్డు అధ్యక్షుడు పితాని వాసు, గోడి నాని, స్వామి, పలు వార్డుల అధ్యక్షులు ఉన్నారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 9.15 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.