
సాక్షి, నెల్లూరు : టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే కె. రామకృష్ణ అతిథి గృహం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ అతిథి గృహాన్ని టీడీపీ కార్పొరేటర్ రాజానాయుడు కొనుగోలు చేశారు. ఆ గృహాన్ని ఖాళీ చేయమని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే రామకృష్ణ భవనాన్ని ఖాళీ చేసేందుకు రూ. 15 లక్షల గుడ్‌విల్‌ను డిమాండ్ చేస్తున్నారని రాజానాయుడు తెలిపారు. భవనంలోకి వెళ్లడానికి కార్పొరేటర్ ప్రయత్నం చేశారు. ఆయన లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.