MLA Ramakrishna
-
టీడీపీ ఎమ్మెల్యే అతిథి గృహం వద్ద ఉద్రిక్తత..
సాక్షి, నెల్లూరు : టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే కె. రామకృష్ణ అతిథి గృహం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ అతిథి గృహాన్ని టీడీపీ కార్పొరేటర్ రాజానాయుడు కొనుగోలు చేశారు. ఆ గృహాన్ని ఖాళీ చేయమని ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే రామకృష్ణ భవనాన్ని ఖాళీ చేసేందుకు రూ. 15 లక్షల గుడ్‌విల్‌ను డిమాండ్ చేస్తున్నారని రాజానాయుడు తెలిపారు. భవనంలోకి వెళ్లడానికి కార్పొరేటర్ ప్రయత్నం చేశారు. ఆయన లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. -
నరికేస్తా..
- చైర్ పర్సన్సమక్షంలోనే సొంత పార్టీ కౌన్సిలర్లపై కురుగొండ్ల చిందులు - రాజీనామా యోచనలో చైర్పర్సన్, పలువురు కౌన్సిలర్లు - ఎమ్మెల్యే వ్యవహార తీరుపై బీదకు ఫిర్యాదు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తన మాట తీరు, వ్యవహార తీరుతో తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం మరో వివాదంలో ఇరుక్కున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద సమక్షంలోనే కౌన్సిలర్లను ‘‘నరికేస్తా నా కొ...రా ఏ మనుకున్నారు’’ అని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం వెంకటగిరి టీడీపీలో కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే తీరుతో తీవ్ర ఆందోళనకు గురైన చైర్‌పర్సన్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు పదవులు, పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారదతో పాటు సుమారు 15 మంది కౌన్సిలర్లు కొంత కాలంగా ఎమ్మెల్యే రామకృష్ణ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మున్సిపాలిటీలో ప్రతి పనిలో తల దూర్చడం, తాను చెప్పినట్లే చేయాలని అధికారులను బెదిరిస్తుండటంతో చైర్ పర్సన్ ఇప్పటికే రెండు, మూడు సార్లు ఈ వ్యవహారం గురించి మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. ఎప్పటికప్పుడు వారు ఆమెను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే రామకృష్ణ మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనుల సమీక్ష కోసం కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. కమీషన్ల గోల మున్సిపాలిటీలో తమ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు తమకు కావాల్సిన వారికి దక్కడం లేదనీ, పనులకు సంబంధించి తమకు 6 శాతం కమీషన్ ఇస్తూ 14 శాతం ఇతరులకు సమర్పించుకుంటుండటం పట్ల కౌన్సిలర్లు కోపంతో ఉన్నారు. అయితే ఈ వ్యవహారమంతా ఎమ్మెల్యే రామకృష్ణకు తెలిసే జరుగుతుండటంతో ఇదేమని ప్రశ్నించే ధైర్యం చేయలేక పోతున్నారు. ఇదే విషయం గురించి వారం రోజుల కిందట 22వ వార్డు కౌన్సిలర్ విశ్వనాథం కమిషనర్ మధ్య మున్సిపల్ కార్యాలయంలోనే మాటల యుద్ధం జరిగింది. తమ వార్డుల్లో జరిగే పనులకు ఇతరులకెందుకు కమీషన్లు ఇవ్వాలని కౌన్సిలర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక దశలో ఇద్దరూ ఒరేయ్ పోరా అనుకునేంత వరకు పోయారు. కమిషనర్ ఈ విషయం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో తనకు వ్యతిరేకంగా స్థానిక నేతలు గళం విప్పడం జీర్ణించుకోలేని రామకృష్ణ సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అభివృద్ధి పనుల విషయం గురించి చర్చించడం కోసం శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. టెండర్లు, పనుల విషయం గురించి చర్చ వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఒక్కసారిగా చెలరేగి పోయారు. ఎదురుగా ఉన్నది సొంత పార్టీ కౌన్సిలర్లే అనే విషయం కూడా మరచి పోయి ‘‘నా కొడకల్లారా ఏ మనుకుంటున్నారు. నరికేస్తా.’’ అని గతంలో తాను చేసిన కొన్ని విషయాల గురించి చెప్పి కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో తొలుత భయపడ్డ కొందరు కౌన్సిలర్లు ఆ తర్వాత తేరుకుని తమకు జరిగిన అవమానం గురించి ఆవేదనకు లోనయ్యారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే మద్దతుదారుడైన ఒక కౌన్సిలర్ తన వార్డులో బోరు వేయించుకోవడానికి లెటర్ ఇస్తే చైర్ పర్సన్ సంతకం చేయలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే చైర్ పర్సన్‌ను ఉద్దేశించి ‘‘నా వర్గీయుడికి సంతకం చేయవా? సంతకం పెట్టాల్సిందే’’ అని ఆగ్రహంగా హెచ్చరికలు జారీ చేశారు. కౌన్సిలర్ల సాక్షిగా తనకు జరిగిన అవమానానికి చైర్ పర్సన్ చిన్నబుచ్చుకున్నారు. తన మద్దతుదారులైన కౌన్సిలర్లతో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. వీరంతా నెల్లూరుకు బయల్దేరే సమయంలో కావేరి పాకం రమేష్ తమ రాజీనామా విషయం గురించి రాజా కుటుంబీకుడు సాయికృష్ణ యాచేంద్ర సలహా తీసుకోవడానికి వెళ్లారు. ఆయన సూచన మేరకు కౌన్సిలర్లు వెంకటగిరిలోనే ఆగిపోయి చైర్ పర్సన్ ఆమె భర్త దొంతు బాలకృష్ణ నెల్లూరు వెళ్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్రను కలసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు. తాను పార్టీకి పదవికి రాజీనామా చేస్తాననీ, కురుగొండ్లతో తాము పడలేకున్నామని చైర్ పర్సన్‌తో పాటు ఆమె భర్త కూడా బీద రవిచంద్రకు విన్నవించారు. వారం రోజుల్లో ఈ సంగతి తేలుస్తాననీ, పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని రవిచంద్ర వారిని బుజ్జగించి పంపారు. అయితే తాజా సంఘటన వెంకటగిరి టీడీపీలో ముసలం పుట్టించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. -
నేనింతే!
కురుగొండ్ల మరో వివాదం ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే కండలేరు గేట్లు ఎత్తివేత అధికారుల అత్యవసర సమావేశం నీటి విడుదల నిలిపివేత ఈ ఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే తీరుపై అధికారుల ఆందోళన మంత్రి నారాయణ జోక్యంతో సోమవారం సాయంత్రం నీటి విడుదల సాక్షి ప్రతినిధి - నెల్లూరు: తరచూ వివాదాల్లో ఉండే వెంకటగిరి శాసనసభ్యుడు కురుగొండ్ల రామకృష్ణ తన సహజ ధోరణి కారణంగా ఆదివారం మరో వివాదానికి తెర లేపారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు లేకుండానే కండలేరు జలాశయం నుంచి సారుుగంగ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు సీరియస్ అయ్యారు. రిజర్వాయర్ ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటకగిరి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లోని తెలుగుగంగ కాలువల కింద రైతులు సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వర్షాలు వస్తాయనే ఆశతో ఇంతకాలం ఎదురు చూసిన రైతులు తమ పంటల ప్రాణాలు కాపాడు కోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. కండలేరు జలాశయంలోని నీరు తాగునీటి అవసరాలకే సరిపోని పరిస్థితులు ఉన్నందు వల్ల సాగుకు ఇవ్వలేమని జిల్లా ప్రజాప్రతినిధులతో ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. రైతులు పంటలు వేయకుండా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతులు మాత్రం తాము సాగు చేసిన పంటలను బతికించుకోవడానికి కండలేరు జలాశయం నుంచి నీటిని ఇవ్వాల్సిందేననే డిమాండ్ మరింత పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి రైతుల పక్షాన ఆందోళనకు దిగారు. 10వ తేదీలోగా సాగునీరు విడుదల చేయక పోతే 11వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఆగమేఘాలపై రంగంలోకి. రైతుల ఆందోళనలను సీరియస్‌గా తీసుకోని ఎమ్మెల్యే రామకృష్ణ, ఈఈ మీద చర్యలకు ఆదేశం ఎమ్మెల్యే నేరుగా వెళ్లి డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినా ఎందుకు తెలుసుకోలేక పోయారనే కారణంపై కండలేరు జలాశయం ఈఈ సురేష్ బాబు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదలశాఖ ఎస్ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే అత్యుత్సాహం తమ తలకు తెచ్చిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆమరణ దీక్ష ప్రకటనతో ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. బొమ్మిరెడ్డి ఆమరణ దీక్షకు దిగితే రైతులు రోడ్డెక్కుతారని, రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయంతో ఆదివారం నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడి కండలేరు నుంచి నీటి విడుదలకు సరేననిపించారు. మంత్రుల మౌఖిక అంగీకారంతో రామకృష్ణ నేరుగా కండలేరు డ్యాం వద్దకు వెళ్లి సంబంధిత అధికారులెవరూ లేకుండానే గేట్లకు సంబంధించిన స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఎమ్మెల్యే నీరు విడుదల చేయడంపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో నీటి విడుదలను ఆపివేశారు. రామకృష్ణ చర్యలపై మంత్రి అసహనం కండలేరు నుంచి పంట సాగుకు నీటిని విడుదల చేరుుస్తానని తాను చెప్పడంతోనే ఎమ్మెల్యే రామకృష్ణ నేరుగా డ్యాం దగ్గరకు వెళ్లి గేట్లు ఎత్తేయడం పట్ల మంత్రి నారాయణ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సోమవారం ఆయన కలెక్టర్ ముత్యాలరాజు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి పంట సాగుకు నీరు విడుదల చేయడానికి అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశంతో ఇరిగేషన్ అధికారులు సోమవారం సాయంత్రం మరోసారి నీటిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణరుుంచారు. ఈ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగానే చేరుుంచారు. -
పార్టీ విధివిధానాల మేరకు వ్యవహరిస్తాం
వెంకటగిరి ఎమ్యెల్యేపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో రైల్వే పనులు చేయాలంటే తనకు కప్పం కట్టాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థను బెదిరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణపై పార్టీ విధానాల మేరకు వ్యవహరిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలి పారు. ఎమ్మెల్యే రెండు రోజుల్లో పార్టీ వివరణ ఇస్తారని చెప్పారు. తాము పనులు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కళా వెంకట్రావు పై విధంగా స్పందించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
శారదకు నారాయణ బుజ్జగింపు
► పత్రికలకెక్కొద్దని ఒత్తిడి ► సమస్య పరిష్కారం కాకపోతే ► సీఎంను కలవాల్సిందేనని చైర్పర్సన్ నిర్ణయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకు మున్సిపల్ చైర్పర్సన్ శారదకు మధ్య అంతర్గత విభేదాలపై మంత్రి నారాయణ స్పందించారు. నెల్లూరులో మాదిరిగా ఇద్దరూ పత్రికలకెక్కకుండా కట్టడి చేయగలిగారు. సమస్యను తాను పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్‌పర్సన్‌ను బుజ్జగించారు. మున్సిపాలిటీలో సర్వం తానై వ్యహరించాలనీ, చైర్పర్సన్ జాన్తానై అనేలా ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై చైర్పర్సన్ కొంత కాలంగా రగిలిపోతున్నారు. చైర్పర్సన్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే కోపంతో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ కమిటీల ఏర్పాటు విషయంలో తన ఇంట్లోనే తన సమక్షంలోనే ఆమెను మరో కౌన్సిలర్‌తో తిట్టించారు. ఈ సంఘటనతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. ఎమ్మెల్యే వ్యవహారం సీఎం దగ్గరే తేల్చుకోవాలని చైర్‌పర్సన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారమంతా ఆదివారం సాక్షిలో ‘ఇక తేల్చుకోవాల్సిందే’ శీర్షికన ప్రచురితమైంది. అసలే నెల్లూరు వివాదంతో సతమతమవుతున్న మంత్రి నారాయణ ఇది పెద్ద సమస్యగా మారకుండా కట్టడి చేయడానికి రంగంలోకి దిగా రు. విదేశీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణ, చైర్పర్సన్ శారదతో మాట్లాడారు. ఇబ్బం దులు ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామనీ, ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించాలని చైర్‌పర్సన్‌కు సూ చించారు. అయిష్టంగానే ఆమె విలేకరుల సమావేశం పెట్టి ఎమ్మెల్యేతో తనకు గొడవలు లేవని చెప్పారు. మరో 15 రోజుల్లో మంత్రి ఈ సమస్యను పరిష్కరించక పోతే తాము మాత్రం సీఎంను కలవాల్సిందేనని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
నెల్లూరులో టీడీపీ వర్సెస్ బీజేపీ
► సై అంటే సై ► వెంకటగిరి ఎమ్మెల్యేపై నేదురుమల్లి ఫైర్ ► ‘గిరి’లో రాజుకుంటున్న విభేదాలు వెంకటగిరి: వెంకటగిరిలో తెలుగుదేశం, కమళదళం నేతలు సై అంటే సై అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీల మధ్య స్నేహబంధం ఎలా ఉన్నా ‘గిరి’లో మాత్రం మిత్రవిభేదం కనిపిస్తోంది. శనివారం ‘గిరి’లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పనపై నిర్వహించిన సదస్సు ఇరుపార్టీల మధ్యన చెదిరిన సయోధ్యకు నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేనేత కార్మికులు, చేనేత జౌళి శాఖ అధికారులను పిలిపించి బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరుకావద్దని హెచ్చరించినట్లు స్థానికంగా గుసగుసలు వినిపించాయి. ఇందుకు తగ్గట్టుగానే శనివారం జరిగిన సదస్సుకు చేనేత కార్మికుల పలుచగా హాజరయ్యారు, చేనేత, జౌళీశాఖ జిల్లా అధికారులు డుమ్మాకొట్టారు. దీంతో బీజేపీ నాయకులు తెలుగుతమ్ముళ్లపై విమర్శలకు దిగారు. పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి విమర్శనాస్త్రాలు సంధిం చగా, మృదుస్వభావి అయిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి సైతం ఒకింత ఘాటుగా స్పందిం చారు. మిత్రపక్షమవడంతో సంయమనం పాటిస్తున్నామని, పోరాట పటిమ లేక కాదు.. అవసరమైతే రోడ్లపైకి ఈడ్చగలమని అన్నారు. వరద బాధిత చేనేతలకు జన్మభూమి కమిటీలు నిర్ధారిస్తేనే పరిహారం మంజూ రు చేస్తారా.. వృద్ధులు ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇస్తారాని విరుచుకుపడ్డారు. 50 శాతం ఓట్లతో గెలిచి నా నియోజకవర్గంలో 100 శాతం ప్రజలకు సేవ చేయాలన్నారు. మీ వారికి న్యాయం చేసుకో, ఇతరులకు అన్యాయం చేస్తే సహించబోమన్నా రు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి స్థూపాన్ని కూల్చివేయించిన విషయాన్ని టీడీపీ జిల్లా ,రాష్ట్ర అధ్యక్షులు బీద రవిచంద్ర, కళా వెంకట్రావ్, సీఎం చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళుతానన్నా రు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలబోమని నేదురుమల్లి స్పష్టం చేయడంతో, ప్రజలకు మేలు చేసే పనులను అడ్డుకోవడం ఏమిటని పలువురు ఎమ్మెల్యే తీరుపై సభలో గుసగుసలాడుకున్నారు. -
రాజధాని భూములు 99 ఏళ్లపాటు సింగపూర్‌కు!
గుంటూరు: ఏపీ రాజధాని భూములను ప్రభుత్వం సింగపూర్ కు దోచిపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ అన్నారు. సింగపూర్ కు 99 ఏళ్లు భూములు కట్టబెట్టేందుకు కుట్ర జరిగిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మళ్లీ భూములు సేకరించడం దారుణం అని అన్నారు. సింగపూర్ శాటిలైట్లను ఇస్రో నుంచి పంపిస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం సింగపూర్ చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.