పార్టీ విధివిధానాల మేరకు వ్యవహరిస్తాం
వెంకటగిరి ఎమ్యెల్యేపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో రైల్వే పనులు చేయాలంటే తనకు కప్పం కట్టాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థను బెదిరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణపై పార్టీ విధానాల మేరకు వ్యవహరిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలి పారు. ఎమ్మెల్యే రెండు రోజుల్లో పార్టీ వివరణ ఇస్తారని చెప్పారు.
తాము పనులు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కళా వెంకట్రావు పై విధంగా స్పందించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.