27 నుంచి విశాఖలో మహానాడు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంపిక చేశామన్నారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు.