సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖలోని అంశాలు చాలా బాధాకరమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని విమర్శించారు. బీజేపీతో కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పొత్తు పెట్టుకున్నామని, ఇంతలా కక్ష సాధిస్తారని అనుకోలేదని ఆయన వాపోయారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడంవల్ల చాలా సీట్లు నష్టపోయామన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చి.. ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కేంద్రంతో పోరాడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment