Union Minister Sanjeev Balyan Had Bitter Experience - Sakshi
Sakshi News home page

TS: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్‌

Published Sat, Jul 2 2022 11:34 AM | Last Updated on Sun, Jul 3 2022 12:07 PM

Union Minister Sanjeev Balyan Had Bitter Experience - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కాషాయ పార్టీకి చెందిన నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో మెదక్‌ ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అయితే, కేంద్ర మంత్రి బాల్యన్‌ కోసం స్థానిక బీజేపీ నేతలు గెస్ట్‌ హౌస్‌ బుక్‌ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. కానీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు గెస్ట్‌ హౌస్‌కు తాళాలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో మంత్రి‌తో పాటు అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు అర గంట పాటు వేచి చూశారు. 

అనంతరం.. అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో, అధికారుల తీరుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్‌ పర్యటనలో మార్పు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement