BJP National Executive meet
-
‘టికెట్ ఇచ్చే ముందు ఎన్ని డబ్బులు ఉన్నాయని అడుగుతున్నారు’
ఢిల్లీ: ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని బీజేపీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ముందు ఎన్ని డబ్బులున్నాయనిఅ అడుగుతున్నారని, ఈ పరిస్థితి మారాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈరోజు(మంగళవారం) దేశంలో రాజకీయ పరిస్థితులపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడారు ఈటల. ‘ప్రజలని నమ్ముకొని నాయకులు ఎన్నికలకి వెళ్తున్నారు. కానీ తెలంగాణ లో మాత్రం పైసలు తో ఎన్నికలు నడుస్తున్నాయి. ఆత్మాభిమానానికి చిహ్నం అయిన ఓటుకు కేసీఆర్ వెలకడుతున్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు.టికెట్ ఇచ్చే ముందే ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పరిస్థితిని మారాలి. కేంద్రం అయినా రాష్ట్రం అయినా (ప్రజా ధనం) ప్రజల పైసలు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రులు "నేను" ఖర్చు పెట్టిన అంటున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో ‘ నేనే’అని చెప్పుకొనే పరిస్థితి మారాలి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వాలు పధకాలు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో "దళిత బంధు", "గొల్ల, కురుమలకి గొర్లు ఇస్తామని చెప్తున్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. కేసీఆర్ ఓటర్లను మభ్యపెడుతున్నారు. అలా చేయకుండా నియంత్రణ చేయాలి. చివరికి ఓటర్లని డబ్బుల కోసం రోడ్డుఎక్కే పరిస్థితికి తీసుకువచ్చారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని అనే స్థితికి తెచ్చారు.ఇది మారకపోతే ప్రమాదకర పరిస్థితి వస్తుంది. ఎన్నికల్లో పైసల సంస్కృతి పోవాలి. కేంద్రం కొన్ని పనులు చేస్తుంది. రాష్ట్రం కొన్ని పనులు చేస్తుంది. ఎవరు చేసినా పరస్పరం గౌరవం ఇచ్చుకోవాలి. ప్రజల కోసం పనిచేయాలి’ అని అన్నారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు
-
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు. 2024 జూన్ వరకు నడ్డా పదవీకాలం పొడిగిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగీవ్ర తీర్మానం చేశారు. ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా జేపీ నడ్డాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగింపే సరైనదిగా భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నిలక సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘నడ్డా అధ్యక్షతనే 2024 ఎన్నికల్లో పోటీ అమిత్ షా. నడ్డా అధ్యక్షతన మంచి విజయాలు సాధించాం. తెలంగాణ, బెంగాల్లో పార్టీ బలోపేతం చేశాం. తెలంగాణు బంగారు తెలంగాణాగా మార్చేది బీజేపీనే’ అని పేర్కొన్నారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు?
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ప్రకాశ్ నడ్డాను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నెల 16, 17న ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై అగ్రనేతలు సమీక్ష నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. ఒక రోడ్డుమ్యాప్ సైతం సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: BJP: విజయమే లక్ష్యంగా బరిలోకి.. -
క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాదు.. మనది కేడర్ బేస్డ్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: ‘మనది క్యాస్ట్, క్యాష్ బేస్డ్ కాకుండా కేడర్ బేస్డ్ పార్టీ. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడమే ముఖ్యం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉంటే ఎలాంటి స వాళ్లు అయినా ఎదుర్కోవచ్చు. అడుగడుగునా టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు ఎండగట్టాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం సాధించి ఐకమత్యంతో ఒక్కటిగా ముందుకెళ్లాలి’అని బీజేపీ రాష్ట్ర నాయకుల ప్రశిక్షణ్ శిబిరంలో జాతీయ నేతలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, శివప్రకాశ్ దిశానిర్దేశం చేశారు. రెండోరోజు శిక్షణలో భాగంగా సోమవారం ప్రధానంగా సంస్థాగత అంశాలు, పార్టీ చరిత్ర, ఆరెస్సెస్‌తో సంబంధాలు, మోదీ హయాంలో వివిధ రంగాల విజయాలు, విదేశాంగ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం తదితర అంశాలపై తరగతులు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్, అనుకూల భావజాల సంస్థలతో పార్టీకున్న సంబంధాలు, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడం, కొత్తగా చేరిన పార్టీ నేతలకు పార్టీ సిద్ధాంతాలు, విధానాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నేతలు కలిసికట్టుగా పోరాడితే కలిగే ప్రయోజనాలు, రాష్ట్రంలో అధికారం సాధించాలంటే కార్యక్షేత్రంలో పనివిధానంపై జాతీయనేతలు పలు సూచనలు చేశారు. ప్రభారీ బాధ్యతల నుంచి తప్పించండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పోలింగ్ బూత్ కమిటీలను నియమించే బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ(ప్రభారీ)లదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ప్రతి బూత్‌లో 22 మందితో కమిటీ వేయాలని, లేనియెడల ఆ బాధ్యతల నుంచి తప్పిస్తామన్నారు. అసెంబ్లీ ఇన్చార్జీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని పలువురు నేతలు మరోసారి తరుణ్ చుగ్, బండి సంజయ్‌లకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌చార్జీలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆ బాధ్యతలపట్ల కొందరు విముఖత వ్యకం చేస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ భేటీ మూడ్రోజుల శిక్షణ తరగతుల్లో భాగంగా తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం తదితర 14 అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. చివరిరోజున ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు. రెండోరోజు దేశనిర్మాణంలో బీజేపీ పాత్ర, మోదీ ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్ ఫలితాలపై నేతలు చర్చించారు. బలహీనవర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక, సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై చర్చ చేపట్టారు. రెండోరోజు శిక్షణ తరగతులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే! -
అవినీతి డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని, ఉన్నట్టుండి ఓ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఒక్కసారిగా రూ.40 వేల కోట్ల నుంచి రూ.లక్షా 30 వేల కోట్లకు పెంచేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యే సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఫార్మ్‌హౌస్ పాలన ఇంకెంత కాలం? ‘రాష్ట్రంలో ఇంకా ఎంత కాలం ఫార్మ్‌హౌస్ నుంచి ప్రభుత్వం నడుస్తుంది? ఇంకెంత కాలం రైతులు పరేషాన్‌తో ఉంటారు? ఎంత కాలం మహిళలకు, పిల్లలకు భద్రత ఉండదు?’అని గోయల్‌ప్రశ్నించారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం తెలంగాణలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు అధికంగా జరిగాయని చెప్పారు. వీటిని నియంత్రించాల్సిన అవసరముందని, యూపీ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలో ఇక్కడ సైతం శాంతిభద్రతలు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ సర్కారే ఏకైక ప్రత్యామ్నాయం ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మార్పు కోసం ప్రజల్లో ఉన్న కాంక్ష పల్లెపల్లెనా కనిపిస్తోందని గోయల్ పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ పాలనను సహించడానికి ప్రజలు ఏ మాత్రం సిద్ధంగా లేరన్నారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో జరిగిన అవినీతి, రైతులకు అవమానాలు, ఉద్యోగాల కల్పన లేక ఏర్పడిన పరిస్థితులకు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ సర్కారు మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇక్కడ సైతం ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేజారిపోతోందని కేసీఆర్, కేటీఆర్ దుఖంతో, భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. ఈటల రాజేందర్‌ను ఓడించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు గెలిపించారని, ఇది ట్రైలర్ మాత్రమేనని పీయూష్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని 50 వరకు సీట్లలో ప్రజలు గెలిపించారని, 4 సీట్లు ఒక్కసారిగా 50కి పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని కేసీఆర్, కేటీఆర్ పెద్ద, పెద్ద మాటలు అంటున్నారని, కానీ ద్రౌపది ముర్ము భారీ విజయం సాధిస్తారని గోయల్ చెప్పారు. -
పటేల్ కృషి వల్లే.. దేశంలోకి తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఏకీకృత భారతావని (ఏక్‌భారత్)కి శ్రీకారం చుట్టారు. పటేల్ కృషి వల్లే నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ) భారత్‌లో విలీనమైంది. ప్రజలకు పటేల్ ఇచ్చిన బహుమతే భాగ్యనగరం. ఇప్పుడు ఉన్నతమైన, గొప్ప భారత్ (శ్రేష్ట్ భారత్)ను నిర్మించడం బీజేపీ ముందున్న చరిత్రాత్మక బాధ్యత. ఈ లక్ష్య సాధన కోసం పార్టీ కార్యకర్తలంతా సంయమనం, సమతౌల్యం, సమన్వయం వంటి లక్షణాలతో ముందుకు సాగాలి’అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణతోపాటు కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులు చేస్తున్న కృషిని అభినందించారు. 2019 నుంచి తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, పార్టీ యంత్రాంగం కృషి ప్రతి విజయంలో కనిపించిందన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలని పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని ప్రసంగ వివరాలను ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. తృప్తి నుంచి సంతుష్టి దిశగా.. ‘ఆకర్షణ రాజకీయాలతో ప్రజలను కేవలం తృప్తిపరిచే స్థాయి నుంచి వారిని పూర్తిగా సంతుష్టులను చేసే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లడమే బీజేపీ లక్ష్యం కావాలి. ఇది అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి (సబ్ కా వికాస్)కి దోహదపడుతుంది. సమాజంలోని ప్రజలందరి ప్రేమానురాగాలు పొందేందుకు కార్యకర్తలు ‘స్నేహయాత్ర’చేపట్టాలి. రాజకీయ, పాలనా వ్యవహారాల్లో ప్రజానుకూల, సుపరిపాలన (పీ2–జీ2) విధానాలు అవలంబించాలి’అని మోదీ బీజేపీ శ్రేణులకు సూచించారు. వారి నుంచి పాఠం నేర్చుకోవాలి.. ‘సుదీర్ఘకాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ దారిలో ఉన్నాయి. ఉనికి కోసం పోరాడుతున్నాయి. వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. ఆయా పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. అలాంటి పార్టీలను చూసి కార్యకర్తలు అవహేళన చేయొద్దు. ఆ పార్టీల వైఫల్యాల నుంచి పాఠం నేర్చుకోవాలి. నిరంతరం ప్రజలతో మమేకం కావాలి’అని మోదీ పిలుపునిచ్చారు. అదే మా సిద్ధాంతం... ‘దేశంలోని మంచి అంతా భారతీయులందరికీ చెందుతుందనే సిద్ధాంతాన్ని బీజేపీ నమ్ముతుంది. అందుకే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఆయనకు నివాళిగా అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అలాగే మాజీ ప్రధానులకు నివాళిగా ఒక మ్యూజియం నెలకొల్పాం. పార్టీలకు అతీతంగా ఈ పనులన్నీ చేశాం. ప్రజాస్వామ్య పాలనపై మాకున్న చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైంది’అని మోదీ వివరించారు. ‘ద్రౌపది ముర్ము’కు ఓటులో పొరపాట్లు వద్దు... ‘కేంద్రం, బీజేపీపాలిత రాష్ట్రాలు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాయి. అందుకే మహిళలు అన్ని ఎన్నికల్లో పార్టీకి అండగా నిలుస్తున్నారు. మహిళా సంక్షేమం విషయంలో ఈ విధానాన్ని ఇకపైనా కొనసాగించాలి. ఆదివాసీ మహిళ, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంతో సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత పదవిని అధిష్టించే స్థాయికి ఎదిగారు. ఆమెకు ఓటు వేసే క్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాంటి పొరబాట్లకు తావివొద్దు. ఓటు వేసే క్రమంలో చేసే చిన్న పొరబాటు కూడా ఓటు అనర్హతకు దారితీస్తుంది’అని మోదీ హెచ్చరించారు. -
కుటుంబ పాలనలో తెలంగాణకు ద్రోహం
సాక్షి, హైదరాబాద్: ‘‘కోటి ఆకాంక్షల సాధన కోసం త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనతో భ్రష్టు పట్టింది. స్వరాష్ట్రంలో కలలు సాకారమవుతాయనుకున్న తెలంగాణ ప్రజలు ఎనిమిదేళ్లుగా ద్రోహానికి గురవుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంతో ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందింది. కొత్త రాష్ట్రం లో ఏర్పాటైన ప్రభుత్వం ఒక రాజ వంశాన్ని శాశ్వతంగా నిలబెట్టేందుకే పనిచేసినట్టు కనిపిస్తోంది..’’అని బీజేపీ కార్యవర్గ భేటీ మండిపడింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ ప్రాంగణంలో రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గం తెలంగాణలో పరిస్థితులు, జరుగుతున్న ఘటనలపై ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. దానిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చదివి వినిపించారు. ప్రకటనలోని ప్రధానాంశాలు ఇవీ.. కలగానే ఆ మూడు నినాదాలు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో తెలంగాణ ఉద్యమం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా ఇప్పటికీ ఈ మూడు అంశాలు కలగానే మిగిలిపోయా యి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం వ్యయాన్ని మూడింతలు పెంచింది. ఆ పెంపు ఎవరికి లబ్ధి చేకూర్చిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కాలయాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అత్యంత వెనుకబడిన దక్షిణ తెలంగాణలోని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నెట్టెంపాడు, డిండి తదితర ప్రాజెక్టులు అధోగతి పాలయ్యాయి. తెలంగాణ ఏర్పాటైనప్పుడు రూ.369 కోట్ల రెవెన్యూ మిగులుతో ధనిక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు రూ.16,500 కోట్ల రెవెన్యూ లోటుతో దాదాపు రూ.3.20 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉంది. నియామకాల విషయంలో నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఇంటికో ఉద్యోగం అన్న టీఆర్ఎస్.. అడపాదడపా ప్రకటనల తో నిరుద్యోగులను నిరాశలో ముంచేసింది. అడుగడుగునా అధికార దుర్వినియోగం తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ముఖ్యమంత్రి తనయుడు మొదలు కుటుంబ సభ్యులంతా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట్ర పాలనంతా కుటుంబం చుట్టూ కేంద్రీకృతం కావడంతో భారీగా అవినీతి జరిగింది. చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ భాష అభ్యంతరకరంగా, అసహ్యంగా ఉం దని ప్రజలే చెబుతున్నారు. సీఎం, ఆయన మంత్రివర్గ సహచరుల నిరుత్సాహం చూ స్తుంటే రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు, వారి అధికార భాగస్వాములు, వారి తోబుట్టువులు దారుణమైన నేరాలకుపాల్పడ్డారు. ప్రతిపక్షాలపై తప్పు డు కేసులు పెట్టేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఎమ్మెల్యే పిల్లలు కీచకులుగా మారారు. సరైన నిఘా లేకపోవడంతో మాదకద్రవ్యాల సంస్కృతి విచ్చలవిడిగా పెరిగింది. లైంగిక నేరాలు, బాలల రక్షణ చట్టం కింద తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. నిరంకుశ ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం చూపిస్తోంది. నేడు తెలంగాణలో మనం చూస్తున్న పరిస్థితులు 1946 నాటి అనుభవాలను గుర్తు చేస్తున్నాయి. కేంద్రం ఊతమిచ్చినా.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందించింది. భారీగా నిధులు ఇచ్చింది. కానీ రాష్ట్రంలో వాటి వినియోగం అవినీతిమయమైంది. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 2015లో మోదీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించి రూ.6,400కోట్లు ఇచ్చింది. తెలంగాణలో గతంలో మొత్తంగా 2,511 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులు ఉంటే.. ఇప్పుడు 4,996 కిలోమీటర్లకు పెరిగాయి. రీజనల్ రింగ్ రోడ్డును రూ.8,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది. తెలంగాణలో 2014–21లో 321 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టులను ప్రారంభించింది. రూ.9 వేల కోట్ల విలువైన బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేసింది. ప్రధాన మంత్రి స్వానిధి కింద వీధి వ్యాపారులకు రూ.433.34 కోట్ల ఆర్థిక సాయం అందించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31.43 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 11.11 లక్షల మంది మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. ఎనిమిదేళ్లలో తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.1,613.64 కోట్లు విడుదల చేసింది. కేంద్రం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ ఖాతాలో వేసుకుంటోంది. పథకాల పేరిట సంక్షేమానికి కొర్రీలు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొస్తున్నట్టు చెబుతూ.. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలకు మంగళం పాడుతోంది. రైతుబంధును అమలు చేస్తున్నట్టు గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. బీసీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత సంక్షేమాన్ని గాల్లో దీపంలా మార్చింది. నిధుల కేటాయింపులోనూ తీవ్ర పక్షపాత వైఖరిని ప్రదర్శించి పలు వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది. కోవిడ్–19 తర్వాతైనా ఆరోగ్య రంగం పట్ల ప్రభుత్వ వైఖరిలో సమగ్ర మార్పు వస్తుందనుకున్నా ఏమాత్రం పురోగతి లేదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో 70శాతం ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. -
Hyderabad: పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప సభ(ఫోటోలు)
-
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక డిక్లరేషన్.. అసలు అందులో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది. చదవండి: దోశ తెప్పించుకుని తిన్న మోదీ ‘‘గత ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తీవ్రమైన అవినీతి జరిగింది. టీఆర్ఎస్ సర్కార్‌లో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ప్రధాని పట్ల తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనివి. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఆధ్వానంగా ఉంది. 70 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాళేశ్వరం పేరుతో ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగింది. రాష్ట్రంలో పాఠశాల విద్య దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ టీచర్ల నియామకాలు పూర్తిగా ఆపేశారు.’’ అని బీజేపీ డిక్లరేషన్‌లో పేర్కొంది. -
తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తాం: ప్రధాని మోదీ
BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం తట్టి అభినందించారు. బీజేపీ శ్రేణులతో పరేడ్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తి తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది. బలహీన వర్గాల కోసం బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోంది. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశాం. కరోనా సమయంలో తెలంగాణకు ఎంతో చేశాం 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశాం. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ నమ్మకం పెరుగుతోంది. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాం. గత ఆరేళ్లో లక్ష కోట్ల విలువచేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు అండగా నిలిచేందుకు మద్దతు ధర పెంచాం. రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించాం. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే మరింత అభివృద్ధి సాధిస్తుంది అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయం: జేపీ నడ్డా ►తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయమని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిపోయింది. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ సర్కార్‌కు కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. పేదలను ఆదుకున్న దేవుడు మోదీ: బండి సంజయ్ ►ప్రధానిపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పేదలకు ఉచితంగా అన్నం పెట్టినందుకు తిడుతున్నారా?. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు తిడుతున్నారా?. ఉక్రెయిన్ యుద్ధాని ఆపి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కాపాడినందుకు తిట్టాలా?. అంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడిపోయినా మోదీని ఘనంగా స్వాగతిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయ సంకల్ప సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ప్రసంగిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రసంగం ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ►ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్‌కు ప్రధాని చేరుకోనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. ►ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. గెలిచేది మేమే.. అమిత్ షా ►ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. తర్వాత ఎన్నికలు వచ్చినా గెలిచేది మేమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలం ఏంటో చూపించాం: సీఎం యోగి ఆదిత్యనాథ్ ►గడిచిన రెండు రోజులుగా మేమంతా భాగ్యనగర్‌లో ఉన్నామని.. భవిష్యత్ గురించి మేము ఎన్నో ఆలోచనలు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఉత్సాహం తమకు స్ఫూర్తినిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటో చూపించామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బీజేపీ ముందు టీఆర్ఎస్ ఒక బుడ్డ పార్టీ ►బీజేపీ ముందు టీఆర్ఎస్ ఒక బుడ్డ పార్టీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ, ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని ప్రధాని చెప్పారన్నారు. -
బండి సంజయ్‌కు కృతజ్ఞతలు: వంటమనిషి యాదమ్మ
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధానికి వంటలు చేసే అవకాశం లభించడం జీవితంలో మరపురాని ఘట్టమని, ఇది తనకు దక్కిన అదృష్టమని వంటమనిషి యాదమ్మ తెలిపింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానితోపాటు మరో 500మందికి తెలంగాణ వంటకాలను రుచిచూపించబోతున్నట్లు వివరించింది. ఆదివారం గంగవాయిలి కూర, మామిడి కాయ పప్పు, తోటకూర ఫ్రై, ముద్దపప్పు, పచ్చి పులుసు, మసాల వంకాయ, గోంగూర చట్నీ, సొరకాయ చట్నీ, టమాట చట్నీ, టమాట రసం, సాంబారు, జొన్న రొట్టె, అరిసెలు, బూరెలు, సకినాలు, సర్వ పిండి, పులిహోర, పుదీనారైస్, వైట్ రైస్, బగారా తదితర వంటకాలు చేస్తానని శనివారం ‘సాక్షి’తో వెల్లడించింది. కాగా, వంటలు చేసేందుకు యాదమ్మతో పాటు పదిమంది వస్తారని కోరగా ఆరుగురికే అవకాశం ఇచ్చారు. న్యాక్‌గేట్ వద్ద యాదమ్మ, మరో ఐదుగురు పాస్ కోసం రెండు గంటల ఎదురుచూపు అనంతరం ఎంట్రీ పాస్‌ను అందుకున్నారు. ప్రధాని మోదీకి వంట చేసే అవకాశం కల్పించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Narendra Modi: దోశ తెప్పించుకుని తిన్న మోదీ) -
Narendra Modi: దోశ తెప్పించుకుని తిన్న మోదీ
సాక్షి, హైదరాబాద్: కార్యవర్గ భేటీ సందర్భంగా అందరికీ శాఖాహార భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వంటకాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారని.. తెలంగాణ వంటకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారని భేటీ ఫుడ్ కమిటీ చైర్మన్ చాడ సురేశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ వంటకాలను వడ్డించనున్నట్టు తెలిపామని వివరించారు. దీనితో మోదీ దోశ తెప్పించుకుని తిన్నారని వెల్లడించారు. చదవండి: ('తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా') -
ప్రధాని మోదీ ప్రసంగంతో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
Live Updates: పటేల్ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉంది: ప్రధాని మోదీ ►రెండు రోజులు పాటు సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. తెలంగాణ అంశంతో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసింది. పటేల్ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉందని ప్రధాని అన్నారు. 119 నియోజకవర్గాలకు వెళ్లిన జాతీయ ప్రతినిధులను మోదీ అభినందించారు. యూపీ ఉప ఎన్నికల విజయం స్ఫూర్తితో పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాలకు బీజేపీ చేరువ కావాలన్నారు. హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు. 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలి: అమిత్‌షా దేశంలో అన్ని వర్గాలకు బీజేపీ చేరువ కావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంతో పాటు రాష్ట్రాల్లో 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. ఇందుకోసం కార్యాచరణ తయారు చేయాలని అమిత్ షా సూచించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు.. ►తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది. డ్రైవింగ్ సీట్లో కేసీఆర్.. స్టీరింగ్ ఎంఐఎం చేతిలో.. ►టీఆర్ఎస్ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీకి పోటీగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాధనాన్ని ఫ్లైక్సీలకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ డ్రైవింగ్ సీట్లో ఉన్నా స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: బండి సంజయ్ ►తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విలువనిచ్చి బీజేపీ మద్దతిచ్చిందని బండి సంజయ్ అన్నారు. ఆశలు, ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారన్నారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర: పీయూష్ గోయల్ ►టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజలు కష్టాలు పెరుగుతున్నాయి. తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రధానాంశాలుగా పీయూష్ పేర్కొన్నారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల ప్రసంగాన్ని అభినందించిన ప్రధాని మోదీ ►జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ఆయన ప్రసంగించారు. 15 నిమిషాలు ఈటల ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం అంశాలను ఈటల ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించే పార్టీగా బీజేపీని నమ్ముతున్నారన్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని ఈటల అన్నారు. ఈటల ప్రసంగాన్ని ప్రధాని మోదీ, జేపీ నడ్డా అభినందించారు. బీజేపీ విజయ సంకల్ప సభ.. ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు అనంతరం సాయంత్రం.. ప్రధాని మోదీ హెచ్ఐసీసీ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. రాత్రికి ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. కాంగ్రెస్‌పై మండిపడ్డ హిమంత ►గుజరాత్ అల్లర్లపై మోదీపై తీవ్రమైన దుష్ప్రచారం చేశారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ధ్వజమెత్తారు. రాహుల్‌పై అవినీతి ఆరోపణలు వస్తే కాంగ్రెస్ ఎదురుదాడి దిగుతుందని, రామజన్మభూమిలో ఆలయం నిర్మాణాన్నికాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. సర్జికల్ స్ట్రైక్‌పైనా కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసిందని హిమంత మండిపడ్డారు. గతంలో కులం, మతం ఆధారంగా ఎన్నికలు జరిగేవి, ఇప్పుడు అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయని హిమంత అన్నారు. రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం.. ►సాక్షి, హైదరాబాద్: రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. కేంద్రమంత్రి హోంమంత్రి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కర్ణాటక, అసోం సీఎంలు తీర్మానాన్ని బలపరిచారు. గుజరాత్ అల్లర్లలో మోదీకి సుప్రీం కోర్టు క్లీన్చిట్ విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. తీర్మానాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని తీర్మానం చేశారు. -
Sakshi Cartoon: ఇవన్నీ తిని మీటింగ్‌కు అందుకోగలమా!
ఇవన్నీ తిని మీటింగ్‌కు అందుకోగలమా! -
బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు(ఆదివారం) కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు మొత్తం మూడు అంశాలపై తీర్మానాలు చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా వేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ పోలీసు.. బీజేపీ మీటింగ్ ఎజెండా బుక్‌ను ఫొటోతీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం మా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తోంది. ఇంటెలిజెన్స్ పోలీసుల పేరుతో సమావేశంలో పత్రాలను ఫొటో తీశారు. మా తీర్మానాల కాపీలను ఫొటో తీశారు. బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణ పోలీసు అధికారి ఎందుకు వచ్చారో చెప్పాలి. ఇంటెలిజెన్స్ పేరుతో బీజేపీ తీర్మానాల కాపీలను ఫొటో తీశారు. ఫొటో తీసిన పోలీసు అధికారిని కమిషనర్‌కు అప్పగించాము’’ అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సభ: అప్పటి వరకు మెట్రో సేవలు బంద్ -
బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పరేడ్ నిర్వహించనున్న విజయసంకల్పసభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. కాగా, ప్రధాని మోదీ.. హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సభ అనంతరం ప్రధాని మోదీ.. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్ రోడ్డును మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష్టన్ వైపు వెళ్లే వాహనాలు.. లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఉప్పల్, తార్నాక, చిలకలగూడ మీదుగా స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ మీదుగా బేగంపేట-పంజాగుట్ట రహదారిలో వాహనదారులు రావొద్దని పోలీసులు సూచించారు. సభ నేపథ్యంలో కార్లు, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాంతాలను కేటాయించారు. - జింఖానా గ్రౌండ్స్‌లో విఐపి పార్కింగ్. - పరేడ్ గ్రౌండ్స్ సభాస్థలి సమీపంలో వివిఐపి పార్కింగ్. - శామీర్‌పేట్, కరీంనగర్, సిద్దిపేట్ వారికి దోబిఘాట్‌లో పార్కింగ్. - నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సుచిత్ర, బాలనగర్ మీదుగా వచ్చేవారికి పోలోగ్రౌండ్స్‌లో పార్కింగ్. - వరంగల్, నల్గొండ, ఉప్పల్ నుండి వచ్చే వారికి రైల్ నిలయంలో పార్కింగ్. -మహాబూబ్ నగర్, రంగారెడ్డి, ట్యంక్ బండ్ వైపు నుండి వచ్చేవారికి నక్లెస్ రోడ్డులో పార్కింగ్. -
ముందుగా రండి.. రైలెక్కండి!
సాక్షి, హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. పలు రహదారులు నిర్బంధం, మళ్లింపుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ముందుగా చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కి.మీ. పరిధిలో అన్ని రహదారులు, జంక్షన్లు రద్దీగా ఉంటాయని, తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫారమ్ నంబర్ 1 వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు చిలకలగూడ వైపు నుంచి ప్లాట్‌ఫాం 10 నుంచి స్టేషన్‌కు చేరుకోవాలని తెలిపారు. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు పంజాగుట్ట, వీవీ విగ్రహం, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. తిరిగి ఇదే మార్గం గుండా పంజగుట్టకు చేరుకోవాలి. ఉప్పల్, తార్నాక, ఆలుగడ్డబావి, చిల్కలగూడ క్రాస్ రోడ్ నుంచి స్టేషన్‌కు చేరుకోవాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట, పంజాగుట్ట వరకు రద్దీగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా మార్గాలను వినియోగించకూడదు. (చదవండి: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే) -
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన (ఫొటోలు)
-
తొలిరోజు ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం
Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తొలి రోజు ముగిసింది. ఈ భేటీలో ఆర్థిక, రాజకీయ తీర్మానాలు జరిగాయి. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు(ఆదివారం) బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాజ్‌నాథ్ సింగ్ ►బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. పార్టీ ఆర్థిక తీర్మానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. పార్టీ ఖర్చులు, ఆస్తులు విరాళాలపై చర్చించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలపై నేతలు చర్చించారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం ►హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, అమిత్‌షా, నడ్డా, జాతీయ నేతలు హాజరయ్యారు. రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరపనున్నారు. రేపు(ఆదివారం) కూడా హైదరాబాద్‌లోనే ప్రధాని మోదీ ఉండనున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రేపు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ►హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, జాతీయ నేతలు హాజరయ్యారు. ►ప్రధానికి స్వాగతం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికానన్నారు. సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ జాతీయ నేతలు హైదరాబాద్ అభివృద్ధి చూడాలని తలసాని అన్నారు. ►హెచ్ఐసీసీకి ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెచ్ఐసీసీకి మోదీ బయలుదేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రాత్రికి నోవాటెల్‌లో ప్రధాని బస చేయనున్నారు. -
హైదరాబాద్‌కు యశ్వంత్‌సిన్హా.. ర్యాలీలో సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు ఇవాళ నగరం వేదిక అయ్యింది. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం నగరంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రచారంలో పాల్గొనడం విశేషం. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు జరిగే ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు గత ఆరునెలలో మూడు సార్లు వచ్చారు. ఏ సందర్భంలోనూ ప్రొటోకాల్ ప్రకారం.. సీఎం కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం పలకలేదు. ఈ తరుణంలో.. యశ్వంత్ సిన్హాకు మద్ధతు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆయన వెంట వందల మంది కార్యకర్తలతో కలిసి నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొంటుడడం, ప్రచారసభలో ప్రసంగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లకు దీటుగా నగరం మొత్తం టీఆర్ఎస్ సైతం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. దీనిపై రగడ నడుస్తోండగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం టీఆర్ఎస్పై మండిపడ్డారు. Hyderabad | CM's son cannot become CM. BJP is getting stronger, they (TRS) are scared that their chair will go. They're misusing public money to advertise against us. KCR is indulging in digressed politics in Telangana: Union Minister, G Kishan Reddy pic.twitter.com/7zZjCDaNTl — ANI (@ANI) July 2, 2022 -
TS: కేంద్ర మంత్రికి చేదు అనుభవం.. బీజేపీ నేతలు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు కాషాయ పార్టీకి చెందిన నేతలు నగరానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో మెదక్ ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే, కేంద్ర మంత్రి బాల్యన్ కోసం స్థానిక బీజేపీ నేతలు గెస్ట్ హౌస్ బుక్ చేశారు. ఈ క్రమంలో శనివారం మంత్రితో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. కానీ, ఆర్ అండ్ బీ అధికారులు గెస్ట్ హౌస్‌కు తాళాలు వేసి ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో మంత్రితో పాటు అక్కడికి వచ్చిన బీజేపీ నేతలు అర గంట పాటు వేచి చూశారు. అనంతరం.. అధికారులను సంప్రదిస్తే ఎవరు ఫోన్‌కి స్పందించలేదు. మెదక్ ఆర్డీవో, తహసీల్దార్లను సంప్రదించగా వారి నుంచి కూడా స్పందన రాలేదు. దీంతో, అధికారుల తీరుపై ఆగ్రహించిన బీజేపీ నేతలు తాళం పగల కొట్టి లోపలికి వెళ్లారు. కేంద్ర మంత్రి వస్తే కనీస గౌరవం లేకుండా తాళం వేసి అధికారులు అందుబాటులో లేకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: సీఎం యోగి.. భాగ్యలక్ష్మి టెంపుల్ పర్యటనలో మార్పు -
వాట్సాప్ యూనివర్సిటీకి వెల్కమ్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నగరం ఘనంగా ముస్తాబైంది. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షల నడుమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు విమర్శలపర్వంతో.. రాజకీయంగానూ తెలంగాణలో హీట్ పెరిగిపోయింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీపై వరుసబెట్టి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ సమావేశాలను ఎద్దేవా చేస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘‘అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్ యూనివర్సిటీకి(బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ..) స్వాగతం. అబద్దాల హామీకోరులందరూ.. మా దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌ని ఆస్వాదించడం మర్చిపోవద్దు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రాంతాలను సందర్శించి.. మీ మీ రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు కనీసం ప్రయత్నించండి అంటూ ఇక్కడి సందర్శన ప్రాంతాల ఫొటోలను ట్వీట్ చేశారు కేటీఆర్. Welcome the WhatsApp University for its executive council meeting to the beautiful city of Hyderabad To all the Jhumla Jeevis; Don’t forget to enjoy our Dum Biryani & Irani Chai ☕️ #TelanganaThePowerhouse 👇 please visit, take notes & try to implement in your states pic.twitter.com/Ub0JRXSIUA — KTR (@KTRTRS) July 1, 2022 ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార సాధనే ధ్యేయంగా ఎగ్జిక్యూటివ్ సమావేశాలను హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది బీజేపీ. అందుకే బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులను నగరానికి రప్పించి ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు.. బహిరంగ సభ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించే అవకాశాలు ఉన్నాయి. -
దారిపొడవునా ఘనస్వాగతం
సాక్షి, రంగారెడ్డి/శంషాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా వివిధ శాఖల మంత్రులు, పార్టీ ప్రతినిధులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు రోజంతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం ఐదున్నరకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. భారీ కాన్వాయ్‌తో ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ వరకు రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, మహిళలు కోలాటం, డప్పువాద్యాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకగా, ప్రత్యేక వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సుమారు 40 నిమిషాలు ర్యాలీ సాగింది. ఆపై నడ్డా నోవాటెల్‌కు వెళ్లిపోయారు. నడ్డా వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల, పార్టీ జాతీయ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహ్వేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ అందెల శ్రీరాములు, తూళ్ల వీరేందర్‌గౌడ్ సహా పలువురు నేతలు ఉన్నారు.