
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ప్రకాశ్ నడ్డాను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నెల 16, 17న ఢిల్లీలో జరుగనున్నాయి.
ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై అగ్రనేతలు సమీక్ష నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. ఒక రోడ్డుమ్యాప్ సైతం సిద్ధం చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: BJP: విజయమే లక్ష్యంగా బరిలోకి..
Comments
Please login to add a commentAdd a comment