
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు. 2024 జూన్ వరకు నడ్డా పదవీకాలం పొడిగిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఏకగీవ్ర తీర్మానం చేశారు.
ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా జేపీ నడ్డాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగింపే సరైనదిగా భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నిలక సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘నడ్డా అధ్యక్షతనే 2024 ఎన్నికల్లో పోటీ అమిత్ షా. నడ్డా అధ్యక్షతన మంచి విజయాలు సాధించాం. తెలంగాణ, బెంగాల్‌లో పార్టీ బలోపేతం చేశాం. తెలంగాణు బంగారు తెలంగాణాగా మార్చేది బీజేపీనే’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment