
ఢిల్లీ: ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని బీజేపీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ముందు ఎన్ని డబ్బులున్నాయనిఅ అడుగుతున్నారని, ఈ పరిస్థితి మారాలన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈరోజు(మంగళవారం) దేశంలో రాజకీయ పరిస్థితులపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడారు ఈటల.
‘ప్రజలని నమ్ముకొని నాయకులు ఎన్నికలకి వెళ్తున్నారు. కానీ తెలంగాణ లో మాత్రం పైసలు తో ఎన్నికలు నడుస్తున్నాయి. ఆత్మాభిమానానికి చిహ్నం అయిన ఓటుకు కేసీఆర్ వెలకడుతున్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలి అంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారు.టికెట్ ఇచ్చే ముందే ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పరిస్థితిని మారాలి. కేంద్రం అయినా రాష్ట్రం అయినా (ప్రజా ధనం) ప్రజల పైసలు ఖర్చు చేస్తారు. ముఖ్యమంత్రులు "నేను" ఖర్చు పెట్టిన అంటున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు.
ప్రజాస్వామ్యంలో ‘ నేనే’అని చెప్పుకొనే పరిస్థితి మారాలి. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వాలు పధకాలు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో "దళిత బంధు", "గొల్ల, కురుమలకి గొర్లు ఇస్తామని చెప్తున్నారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు. కేసీఆర్ ఓటర్లను మభ్యపెడుతున్నారు. అలా చేయకుండా నియంత్రణ చేయాలి. చివరికి ఓటర్లని డబ్బుల కోసం రోడ్డుఎక్కే పరిస్థితికి తీసుకువచ్చారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని అనే స్థితికి తెచ్చారు.ఇది మారకపోతే ప్రమాదకర పరిస్థితి వస్తుంది. ఎన్నికల్లో పైసల సంస్కృతి పోవాలి. కేంద్రం కొన్ని పనులు చేస్తుంది. రాష్ట్రం కొన్ని పనులు చేస్తుంది. ఎవరు చేసినా పరస్పరం గౌరవం ఇచ్చుకోవాలి. ప్రజల కోసం పనిచేయాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment