సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కబ్జా రాయుళ్లు తమ భూముల్ని కాజేస్తున్నారంటూ పలువురు బాధితుల ఫిర్యాదతో ఈటల రాజేందర్ మంగళవారం ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పేదల భూముల్ని కబ్జా చేస్తున్నారంటూ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
పోచారం మున్సిపాల్టీ పరిధిలోని కొర్రేముల 1985లో 149 ఎకరాల భూమిని 2076 మందికి విక్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులు లోన్ తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వ్యవసాయ భూమిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. డీపీవో అండదండతో మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చారు.
ధరణి లొసుగులతో ఆప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్ 9 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కి కట్టబెట్టే ప్రయత్నం చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాయి గుండాలతో కుక్కలను పెట్టీ ఇక్కడ స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. బాధితులు నా దగ్గరకు వచ్చారు. సీపీకి ఫోన్ చేశాను, కలెక్టర్‌కు చెప్పాను.
రాత్రి పూట ఎంపీ వస్తే ఏం పీకు** అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానికులను బెదరించాడు. నలభై లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంటే కూల్చారని ఒక అబ్బాయి ఏడుస్తూ ఫోన్ చేశారు. దీంతో నేను బాధితుడి ఇంటికి వెళ్లా. నేను వెళ్లే సమయంలో గుండాలు తాగుతూ ఇక్కడే కూర్చున్నారు. ప్రజల మనిషిగా వాడ్ని కొట్టిన.న్యాయం కాపాడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అధర్మానికి అండగా అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేయాలి. కాంగ్రెస్ నాయకుల అండతోనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment