సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది.
చదవండి: దోశ తెప్పించుకుని తిన్న మోదీ
‘‘గత ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తీవ్రమైన అవినీతి జరిగింది. టీఆర్‌ఎస్ సర్కార్‌లో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ప్రధాని పట్ల తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం వెలకట్టలేనివి. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘోరంగా ఓడిపోయింది. తెలంగాణలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి ఆధ్వానంగా ఉంది. 70 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాళేశ్వరం పేరుతో ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగింది. రాష్ట్రంలో పాఠశాల విద్య దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ టీచర్ల నియామకాలు పూర్తిగా ఆపేశారు.’’ అని బీజేపీ డిక్లరేషన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment