తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు(ఆదివారం) కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు మొత్తం మూడు అంశాలపై తీర్మానాలు చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా వేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ పోలీసు.. బీజేపీ మీటింగ్ ఎజెండా బుక్‌ను ఫొటోతీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వం మా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తోంది. ఇంటెలిజెన్స్ పోలీసుల పేరుతో సమావేశంలో పత్రాలను ఫొటో తీశారు. మా తీర్మానాల కాపీలను ఫొటో తీశారు. బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణ పోలీసు అధికారి ఎందుకు వచ్చారో చెప్పాలి. ఇంటెలిజెన్స్ పేరుతో బీజేపీ తీర్మానాల కాపీలను ఫొటో తీశారు. ఫొటో తీసిన పోలీసు అధికారిని కమిషనర్‌కు అప్పగించాము’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: బీజేపీ సభ: అప్పటి వరకు మెట్రో సేవలు బంద్
Comments
Please login to add a commentAdd a comment