న్యూఢిల్లీ : కూతురు ఐఏఎస్ అవుతుందని ఎన్నో కలలుకన్న ఆమె తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. తన కూతర్ని హత్య చేసిన వాళ్లను వదిలిపెట్టవద్దంటూ పోలీసులను వాళ్లు కోరడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఈ విషాదం ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఫ్లోర్ మిల్లు యాజమాని కూతురు ప్రియాంక (23). వీరి కుటుంబం కదిపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా సెక్టార్ 10లో నివాసం ఉండేది. అయితే పీజీ చదువుతున్న ప్రియాంక.. ఐఏఎస్ అవుతానని తండ్రిని కోరగా ఆమెకు కోచింగ్ ఇప్పిస్తున్నారు. చదువుకునేందుకు ఇంటికి 9కి.మీ దూరంలోని సెక్టార్ 46లో గెస్ట్ హౌస్‌లో ఉండేది. ఇంటికి వచ్చిన ప్రియాంక మరో యువకుడు రవీందర్ యాదవ్(24)తో కలిసి తిరిగి సోమవారం రాత్రి తాను ఉంటున్న గెస్ట్ హౌస్‌కు రాత్రి 8:30 గంటలకు వెళ్లింది.
ఏం జరిగిందో తెలియదు కానీ ప్రియాంక స్పృహ కోల్పోయింది. రాత్రి 1 గంటల ప్రాంతంలో పోలీసులకు కాల్ వచ్చింది. ఓ యువకుడు తన స్నేహితురాలిని ఆస్పత్రిలో చేర్చాడని, ఆమెను పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులకు డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లిదండ్రులు హుటాహుటీన హాస్పిటల్‌కు చేరుకుని కూతురి మృతదేహాన్ని చూసి కన్నీంటి పర్యంతమయ్యారు. ఐఏఎస్ అవుతుందనుకున్న తన కూతురును రవీందర్ కిడ్నాప్ చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని ప్రియాంక తండ్రి ప్రేమ్ చంద్ ఆరోపించారు. తప్పు లేకపోతే హాస్పిటల్‌లో చేర్పించి రవీందర్ ఎందుకు పరారయ్యాడని ప్రశ్నించారు.
సోమవారం సాయంత్రం 6 గంటలకు ఇంటినుంచి కూతురు ప్రియాంక వెళ్లిందని, ఆపై రాత్రి 10 గంటలకు కాల్ చేసి తన భార్యతో మాట్లాడిందని కానీ అంతలోనే ఘోరం జరిగి పోయిందన్నారు. ప్రియాంకను గత కొంతకాలం నుంచి రవీందర్ వేధిస్తున్నాడని, కూతురి వెంట పడొద్దని పలుమార్లు హెచ్చరించానని సెక్టార్ 50 పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రేమ్ చంద్ పేర్కొన్నారు. లివర్ దెబ్బతిన్న కారణంగా, రక్తస్రావమై ప్రియాంక చనిపోయి ఉండొచ్చునని గురుగ్రామ్ సివిల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర అన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment