పుష్కరాలకు సిద్ధమవుతున్న గెస్ట్‌హౌస్‌ | guest house ready for pushkaras | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు సిద్ధమవుతున్న గెస్ట్‌హౌస్‌

Published Sun, Jul 31 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

guest house ready for pushkaras

నాగర్‌కర్నూల్‌: ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణాపుష్కరాల కోసం నాగర్‌కర్నూల్‌ గెస్ట్‌హౌస్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొల్లాపూర్‌తోపాటు, నల్లమల ప్రాంతాల్లో కొన్ని పుష్కర ఘాట్లు ఉండడతో చాలా మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. దీనికోసం ప్రస్తుతం గెస్ట్‌హౌస్‌లో ఉన్న సమస్యలు తీర్చేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికోసం రూ.8.50లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఇప్పటికే గెస్ట్‌హౌజ్‌కు పేయింటింగ్, టాయిలెట్స్, డైనింగ్‌కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రిషన్‌ పనులు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్నందున ప్రముఖులు ఇక్కడే బస చేసే అవకాశం ఉన్నందున ప్రస్తుతం గెస్ట్‌హౌజ్‌ను సిద్ధం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement