సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నేడు(బుధవారం) విచారణ చేపట్టనుంది.
ఇటీవల రాయదుర్గం పాన్ మక్తా సర్వే నంబర్ 46లోని 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. ఇందులో 2,200 గజాల్లో ప్రబాస్ గెస్ట్‌హౌస్ నిర్మించడంతో దాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ గెస్ట్ హౌస్ వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించారు. గతంలో ఈ భూమిని జీవో నంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment