
నా గెస్ట్‌హౌస్‌కు రండి
నా గెస్ట్‌హౌస్‌ను సందర్శించండి అంటూ ఆసిన్ ఆహ్వానిస్తున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన మలయాళ నటి అసిన్. హిందీ గజిని చిత్రంతో బాలీవుడ్‌లో పాగా వేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై శీతకన్నేశారనే చెప్పాలి. కాగా ఈ బ్యూటి తాజాగా కేరళలో ఒక బ్రహ్మాండమైన గెస్ట్‌హౌస్‌ను కొన్నారు. విశ్రాం తి సమయాలను ఆ గెస్ట్ హౌస్‌లో గడిపేస్తున్న అసిన్ ఇప్పుడు బాలీవుడ్ హీరోలను తన గెస్ట్ హౌస్‌ను సందర్శించండంటూ ఆహ్వానిస్తున్నార ట.
కేరళలోని కొట్టాయం సమీపంలోని కొండ ప్రాంతంలో సెలయేర్ల మధ్య బహు సుందరంగా ఉండే ఆ గెస్ట్ హౌస్‌కు అసిన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితురాళ్లు ఎక్కువగా వస్తున్నారట. అంతేకాదు అక్కడ ఇతర గెస్ట్‌లు కూడా నివసించడానికి ఏర్పా ట్లు చేశారట. సుందరమైన చిత్రలేఖనంతోపాటు, స్వచ్ఛమెన గాలి, ప్రకృతి అందాలతో కూడిన తమ గెస్ట్‌హౌస్‌ను సందర్శించాలని బాలీవుడ్ హీరోలను ఆహ్వానిస్తున్నారట. ఇటీవల దర్శకుడు రోహిత్ శెట్టి ఈ గెస్ట్‌హౌస్‌కు వచ్చి ఆతిథ్యం స్వీకరించారట. ఆసిన్, అజ య్‌దేవగన్ జంటగా నటించిన బోల్ బచ్చాన్, షారూఖ్, దీపికా పడుకునేతో చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రాలను రోహిత్ శెట్టి తెరకెక్కించిన విషయం తెలిసిందే!