పోలీస్‌ రైడ్‌ పేరుతో అమ్మాయిపై అత్యాచారం | With The Police Help Guest House Owner Son Molesting A Girl in Meerut | Sakshi
Sakshi News home page

పోలీస్‌ రైడ్‌ పేరుతో అమ్మాయిపై అత్యాచారం

Published Tue, Feb 23 2021 7:49 PM | Last Updated on Tue, Feb 23 2021 8:16 PM

With The Police Help Guest House Owner Son Raped in Meerut - Sakshi

లక్నో: స్నేహితుడితో కలిసి ఓ యువతి అతిథిగృహానికి రాగా ఆ భవన యజమాని కుమారుడు తనకు తెలిసిన పోలీసులను పిలిపించి పోలీస్‌ రైడ్‌ మాదిరి చేయించాడు. పోలీసులతో ఆ యువతిని బెదిరింపులకు పాల్పడి.. తన కోరిక తీరిస్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. అయితే పోలీసులే దగ్గరుండి అమ్మాయిపై అత్యాచారం జరిగేలా సహకరించడం వివాదాస్పదమవుతోంది. తీరా ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెళ్లితే పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ కేసు నమోదు చేసుకోలేదు. ఎందుకంటే వచ్చిన పోలీసులు ఆ స్టేషన్‌కు సంబంధించినవారే. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది.

మీరట్‌ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న అతిథిగృహానికి శనివారం (ఫిబ్రవరి 20) ఓ అమ్మాయి తనకు తెలిసిన వ్యక్తితో వచ్చింది. దీన్ని ఆ అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఆ అమ్మాయిపై కన్ను పడింది. దీంతో తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్‌ రైడ్‌ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్‌ వేశాడు. ఈ మేరకు అతడికి తెలిసిన పోలీసులు అతిథిగృహానికి చేరుకుని ఆ యువతీయువకులను చూసి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. మీ తల్లిదండ్రులకు సమాచారం చెప్తామని బెదిరించడంతో ఆ యువతి కంగారుపడింది. 

దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీన్ని తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఇదంతా జరిగాక ఆ యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే. ఈ వార్త బయటకు రావడంతో ఆ స్టేషన్‌ సీఐ ప్రేమ్‌చంద్‌ శర్మ స్పందించారు.

‘మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరిస్తాం. విచారణ చేపడతాం’ అని సీఐ ప్రేమ్‌చంద్‌ శర్మ తెలిపారు. ఈ విధంగా రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి. తమకు తెలిసిన వారితో కుమ్మక్కై ఓ ఆడపిల్లపై అఘాయిత్యం జరగడంతో పాటు బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్‌ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది.

చదవండి: భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష!
చదవండి: ఆ 136 మంది మరణించినట్టే..
చదవండి: ఎస్సై, ఏఎస్సైతో పాటు 6మంది అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement