Meerut district
-
మూడ నమ్మకంతో తనను తానే బలిచ్చుకున్న యువతి
లక్నో: సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో కలకలం రేపింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మీరట్ జిల్లా ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం ఎంతో ఇష్టంగా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించేది. భక్తి పారవశ్యంతో కాళీమాత ఆలయానికి ప్రతి రోజూ వెళ్లేది. అయితే ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మవారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు. ప్రతి రోజూ పూజారి కూడా సాయంత్రం వచ్చి అమ్మవారికి పూజ చేసి వెళ్లిపోయేవాడు. అయితే ఆ యువతి చాలాసేపు పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది. తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. అయితే రోజూలానే ఆ రోజు సాయంత్రం ఆలయ పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. దీనితో ఆ పూజారి షాక్‌కు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువతి మూఢ విశ్వాసాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలోని కొందరు ఆ యువతి మూఢ నమ్మకాల కారణంగానే తనను తాను బలిచ్చుకుందని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల వల్లే ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని వుండొచ్చని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పోలీస్ రైడ్ పేరుతో అమ్మాయిపై అత్యాచారం
లక్నో: స్నేహితుడితో కలిసి ఓ యువతి అతిథిగృహానికి రాగా ఆ భవన యజమాని కుమారుడు తనకు తెలిసిన పోలీసులను పిలిపించి పోలీస్ రైడ్ మాదిరి చేయించాడు. పోలీసులతో ఆ యువతిని బెదిరింపులకు పాల్పడి.. తన కోరిక తీరిస్తే ఎలాంటి కేసులు లేకుండా చేస్తానని చెప్పి అత్యాచారం చేశాడు. అయితే పోలీసులే దగ్గరుండి అమ్మాయిపై అత్యాచారం జరిగేలా సహకరించడం వివాదాస్పదమవుతోంది. తీరా ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడానికి వెళ్లితే పోలీస్‌స్టేషన్‌లో ఎవరూ కేసు నమోదు చేసుకోలేదు. ఎందుకంటే వచ్చిన పోలీసులు ఆ స్టేషన్‌కు సంబంధించినవారే. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మీరట్ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అతిథిగృహానికి శనివారం (ఫిబ్రవరి 20) ఓ అమ్మాయి తనకు తెలిసిన వ్యక్తితో వచ్చింది. దీన్ని ఆ అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఆ అమ్మాయిపై కన్ను పడింది. దీంతో తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్ రైడ్ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు. ఈ మేరకు అతడికి తెలిసిన పోలీసులు అతిథిగృహానికి చేరుకుని ఆ యువతీయువకులను చూసి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. మీ తల్లిదండ్రులకు సమాచారం చెప్తామని బెదిరించడంతో ఆ యువతి కంగారుపడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీన్ని తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు. ఇదంతా జరిగాక ఆ యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే. ఈ వార్త బయటకు రావడంతో ఆ స్టేషన్ సీఐ ప్రేమ్‌చంద్ శర్మ స్పందించారు. ‘మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదు. ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరిస్తాం. విచారణ చేపడతాం’ అని సీఐ ప్రేమ్‌చంద్ శర్మ తెలిపారు. ఈ విధంగా రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. తమకు తెలిసిన వారితో కుమ్మక్కై ఓ ఆడపిల్లపై అఘాయిత్యం జరగడంతో పాటు బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది. చదవండి: భార్య పాతివ్రత్య నిరూపణకు అగ్ని పరీక్ష! చదవండి: ఆ 136 మంది మరణించినట్టే.. చదవండి: ఎస్సై, ఏఎస్సైతో పాటు 6మంది అరెస్ట్ -
అప్పు కట్టలేక 2 లక్షలకు కూతురి అమ్మకం
లక్నో: చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి తన కూతురిని రూ.2 లెక్షలకు విక్రయించాడు. ఆమెను కొన్న వ్యక్తి వేధింపులకు గురి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించిన భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి తీవ్రంగా వేధించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం పర్తాపూర్‌లోని శతాబ్దినగర్‌లో నివసిస్తున్నారు. ట్రక్ డైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు వివిధ అవసరాల కోసం చేశాడు. అయితే అవి తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారంతా అతడిని బాకీ తీర్చాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పు తీర్చలేక తన కూతురిని ఓ వ్యక్తికి అప్పగించాడు. అయితే ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఆ యువతిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అతడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు తన తండ్రి తనను విక్రయించాడని తెలిపింది. అతడిపై తల్లీకూతురు ఇద్దరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించగా తనను ఇస్త్రీ పెట్టెతో కాల్చాడని అతడి భార్య, నిందితురాలి తల్లి పోలీసులకు వివరించింది. ‘తల్లీకూతురు ఇద్దరూ ఫిర్యాదు చేశారు.. దీనిపై దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం’ అని మీరట్ ఎస్పీ రామ్రాజ్ మీడియాతో చెప్పారు. ట్రక్ డ్రైవర్‌పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. తిహార్, దస్నా జైలులో పలుసార్లు శిక్ష అనుభవించాడు. చదవండి: దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత -
యూపీలో గ్యాంగ్‌రేప్, దోపిడీ
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖార్కాదా పట్టణంలో మంగళవారం ముగ్గురు దుండగులు 35 ఏళ్ల మహిళను తుపాకితో బెదిరించి, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ముగ్గురు పిల్లలున్న బాధితురాలు బ్యాంకుకు వెళ్తుండగా దుండగులు ఆమెను బెదిరించి, దగ్గర్లోని అడవికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు, మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. మరోవైపు ఢిల్లీలో పనిచేస్తున్న 33 ఏళ్ల నర్సు పై నలుగురు వ్యక్తులు పంజాబ్‌లోని మా న్సా జిల్లాలో సోమవారం అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నిర్బంధించి, ఆమె వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు.