అప్పు కట్టలేక 2 లక్షలకు కూతురి అమ్మకం | Failed to pay his debts father sold her Daughter | Sakshi
Sakshi News home page

అప్పు కట్టలేక 2 లక్షలకు కూతురి అమ్మకం

Published Fri, Feb 19 2021 3:46 PM | Last Updated on Fri, Feb 19 2021 4:10 PM

Failed to pay his debts father sold her Daughter - Sakshi

లక్నో: చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి తన కూతురిని రూ.2 లెక్షలకు విక్రయించాడు. ఆమెను కొన్న వ్యక్తి వేధింపులకు గురి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించిన భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి తీవ్రంగా వేధించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

ఘజియాబాద్‌ జిల్లాకు చెందిన కుటుంబం పర్తాపూర్‌లోని శతాబ్దినగర్‌లో నివసిస్తున్నారు. ట్రక్‌ డైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు వివిధ అవసరాల కోసం చేశాడు. అయితే అవి తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారంతా అతడిని బాకీ తీర్చాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పు తీర్చలేక తన కూతురిని ఓ వ్యక్తికి అప్పగించాడు. అయితే ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఆ యువతిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అతడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు తన తండ్రి తనను విక్రయించాడని తెలిపింది. అతడిపై తల్లీకూతురు ఇద్దరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించగా తనను ఇస్త్రీ పెట్టెతో కాల్చాడని అతడి భార్య, నిందితురాలి తల్లి పోలీసులకు వివరించింది. ‘తల్లీకూతురు ఇద్దరూ ఫిర్యాదు చేశారు.. దీనిపై దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం’ అని మీరట్‌ ఎస్పీ రామ్‌రాజ్‌ మీడియాతో చెప్పారు. ట్రక్‌ డ్రైవర్‌పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. తిహార్‌, దస్నా జైలులో పలుసార్లు శిక్ష అనుభవించాడు. 

చదవండి: దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement