Girl Sold
-
అప్పు కట్టలేక 2 లక్షలకు కూతురి అమ్మకం
లక్నో: చేసిన అప్పులు తీర్చలేక ఓ తండ్రి తన కూతురిని రూ.2 లెక్షలకు విక్రయించాడు. ఆమెను కొన్న వ్యక్తి వేధింపులకు గురి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించిన భార్యపై ఇస్త్రీ పెట్టెతో కాల్చి తీవ్రంగా వేధించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘజియాబాద్ జిల్లాకు చెందిన కుటుంబం పర్తాపూర్‌లోని శతాబ్దినగర్‌లో నివసిస్తున్నారు. ట్రక్ డైవర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి రూ.2 లక్షలు వివిధ అవసరాల కోసం చేశాడు. అయితే అవి తీర్చలేకపోతున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వారంతా అతడిని బాకీ తీర్చాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో ఆయన అప్పు తీర్చలేక తన కూతురిని ఓ వ్యక్తికి అప్పగించాడు. అయితే ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి ఆ యువతిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అతడి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు తన తండ్రి తనను విక్రయించాడని తెలిపింది. అతడిపై తల్లీకూతురు ఇద్దరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కూతురిని విక్రయించడంతో ప్రశ్నించగా తనను ఇస్త్రీ పెట్టెతో కాల్చాడని అతడి భార్య, నిందితురాలి తల్లి పోలీసులకు వివరించింది. ‘తల్లీకూతురు ఇద్దరూ ఫిర్యాదు చేశారు.. దీనిపై దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం’ అని మీరట్ ఎస్పీ రామ్రాజ్ మీడియాతో చెప్పారు. ట్రక్ డ్రైవర్‌పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి. తిహార్, దస్నా జైలులో పలుసార్లు శిక్ష అనుభవించాడు. చదవండి: దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత -
పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బాలిక (15) పొరపాటుగా మరో రైలు ఎక్కడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఓ దుండగుడు ఓ మహిళ సాయంతో ఈ అమ్మాయిపై లైంగికదాడి చేసి, 70 వేల రూపాయలకు మరో వ్యక్తి అమ్మేశాడు. ఢిల్లీ పోలీసులు ఈ అమ్మాయిని రక్షించి విముక్తి కల్పించారు. గత అక్టోబర్‌లో బాధిత బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. కాగా పొరపాటుగా మరో రైలు ఎక్కడంతో ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయి అర్మాన్ అనే అతణ్ని కలసి తన పరిస్థితిని వివరించింది. సాయం చేస్తానని మాయమాటలు చెప్పి, అర్మాన్ ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య హసీనా సాయంతో ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరూ కలసి బాధితురాలిని పప్పు యాదవ్ అనే వ్యక్తిని అమ్మేశారు. ఆ తర్వాత పప్పు యాదవ్ ఆ అమ్మాయిని రెండు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు. అతని బారినుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరింది. అక్కడ హసీనా ఈ అమ్మాయిని గుర్తించి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక, మహ్మద్ అఫ్రాజ్ అనే వ్యక్తికి అప్పగించింది. అఫ్రాజ్ ఈ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తించిన ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాధితురాలిని రక్షించి, సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదు చేశారు. అఫ్రాజ్, పప్పు యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.