పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు | A 15-Year-Old Girl Kidnapped, Raped And Sold | Sakshi
Sakshi News home page

పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు

Published Sat, Feb 4 2017 5:24 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు - Sakshi

పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు

న్యూఢిల్లీ: చత్తీస్గఢ్‌కు చెందిన ఓ బాలిక (15) పొరపాటుగా మరో రైలు ఎక్కడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఓ దుండగుడు ఓ మహిళ సాయంతో ఈ అమ్మాయిపై లైంగికదాడి చేసి, 70 వేల రూపాయలకు మరో వ్యక్తి అమ్మేశాడు. ఢిల్లీ పోలీసులు ఈ అమ్మాయిని రక్షించి విముక్తి కల్పించారు.

గత అక్టోబర్‌లో బాధిత బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. కాగా పొరపాటుగా మరో రైలు ఎక్కడంతో ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆ అమ్మాయి అర్మాన్‌ అనే అతణ్ని కలసి తన పరిస్థితిని వివరించింది. సాయం చేస్తానని మాయమాటలు చెప్పి, అర్మాన్‌ ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య హసీనా సాయంతో ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరూ కలసి బాధితురాలిని పప్పు యాదవ్‌ అనే వ్యక్తిని అమ్మేశారు. ఆ తర్వాత పప్పు యాదవ్‌​ ఆ అ‍మ్మాయిని రెండు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు.

అతని బారినుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలి హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌ చేరింది. అక్కడ హసీనా ఈ అమ్మాయిని గుర్తించి మత్తుమందు కలిపిన డ్రింక్‌ ఇచ్చింది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక, మహ్మద్‌ అఫ్రాజ్‌ అనే వ్యక్తికి అప్పగించింది. అఫ్రాజ్‌ ఈ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తించిన ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాధితురాలిని రక్షించి, సన్‌లైట్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదు చేశారు. అఫ్రాజ్‌, పప్పు యాదవ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement