girl kidnap
-
రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు!
సాక్షి, నంద్యాల/పగిడ్యాల/నందికొట్కూరు : అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల చిన్నారి అదృశ్యమై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియక పోవడం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత బాలురు చెబుతుండటంతో బాలిక కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు నిద్ర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో పోలీసుల విచారణ నత్త నడకను తలపిస్తోంది. దీంతో తమ బిడ్డ ఆచూకీ తెలియజేయండని బాలిక తల్లిదండ్రులు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ఎల్లాలకు చెందిన తొమ్మిదేళ్ల బాలికపై అదే మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. బాలిక ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు రాత్రి చిన్నారి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోమవారం రాత్రి పోలీసులు మేల్కొన్నారు. మంగళవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కొత్త ముచ్చుమర్రి పార్క్‌లో పనిచేసే సిబ్బందిని విచారించారు. ముగ్గురు మైనర్ బాలురపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని చోట్లా వెతికినా ఫలితం శూన్యం నిందితులు ఇచ్చిన సమాచారంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన సుమారు 30 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను కృష్ణా నది నుంచి ముచ్చుమర్రి పంప్‌హౌజ్ వరకు ఉన్న లింక్ చానల్లో పడేశామని చెప్పడంతో పోలీసు సిబ్బంది కాలువను జల్లెడ పట్టారు. స్పీడ్ బోట్లతో కాలువ మొత్తం గాలించారు. గజ ఈత గాళ్ల సాయం తీసుకున్నారు. వలలు వేసి వెతికినా బాలిక ఆచూకీ దొరకలేదు. దీంతో అనుమానం వచ్చి నిందితులను మరోసారి విచారించగా లింక్ చానల్లో కాదు.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌లో పడేశామని చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలోనూ గాలింపు చేపట్టారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ తెలియలేదు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరూ నేరం తాను చేయలేదని వాడే చేశాడంటూ ఒకరిపై ఒకరు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి తనకేమీ తెలియదని, బాలికను వారిద్దరే చంపేశారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు ఆచితూచి విచారిస్తున్నారు. నీటి కుక్కలు తినేశాయా? చిన్నారిని ఆదివారం రాత్రే గొంతు నులిమి విద్యార్థులు హత్య చేసినట్లు సమాచారం. వీరికి పెద్దలు ఎవరైనా సహకారం అందించారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ లింక్ చానల్లో పడేసినట్లయితే మూడు రోజులకే మృతదేహం నీటిపై తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న నీటి కుక్కలు శవాన్ని పీక్కుతినేశాయా అనే అనుమానం పోలీసులను వేధిస్తోంది. శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ (బాలికను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు.. ఎక్కడ రేప్ చేశారు.. ఎలా గొంతు నులిమి చంపేశారు.. అన్న వివరాలను నిందితుల నుంచి స్పాట్‌కు తీసుకెళ్లి రాబట్టడం) చేసినట్లు తెలిసింది. అయినా బాలిక ఆచూకీ తెలుసుకోలేక పోవడంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఐజీ విజయరావు ఘటనా స్థలికి ఇలా వచి్చ.. అలా వెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మైనర్ బాలిక ఫ్లెక్సీతో బంధువులంతా రోడ్డెక్కి ‘వుయ్ వాంట్ జస్టిస్’ అని నినదించారు. కొత్త ముచ్చుమర్రి నుంచి పాత ముచ్చుమర్రి క్రాస్ రోడ్డుకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి స్టేషన్‌ను ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. ఆరు రోజులైనా తమ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఐజీ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం బాధ కలిగిస్తోందన్నారు. ఎస్ఐ జయశేఖర్ మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సంయమనం పాటించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకీయా బేగం పరామర్శించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులుబాలికను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు బ్రాహ్మణకొట్కూరు వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. ఎట్టకేలకు బాధిత చిన్నారి తండ్రినే అక్కడికి పిలిపించారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బీహార్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ప్రతిపక్ష పార్టీల నాయకులను బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పంపిస్తున్నారన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లతో ఇలా చేస్తున్నారని ప్రశి్నంచారు. తన సొంత గ్రామంలో బాలిక హత్య జరిగితే, ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. ముచ్చుమర్రికి తాను వెళితే నిజాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నాయకులు భయపడుతున్నారా అని నిలదీశారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, చంద్రమౌళి, రవియాదవ్, తులసిరెడ్డి, రమే‹Ùనాయుడు, ఉపేంద్రారెడ్డి, శివనాగిరెడ్డి, ఓంకార్‌రెడ్డి, శ్రీకాంత్, నాగభూషణంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉదయగిరిలో బాలిక కిడ్నాప్ !
ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉదయగిరి పట్టణంలో సోమవారం ఓ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అడవిలో చెట్టుకు కట్టేశారు. ఆ బాలికను గొర్రెల కాపరులు రక్షించి ఇంటికి చేర్చారు. ఉదయగిరి దిలావర్‌భాయి వీధికి చెందిన రషీద్, నస్రీన్లకు సమ్రీన్, మసీరా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్థానిక నాగులబావి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మసీరా ఐదో తరగతి, సమ్రీన్, ఏడో తరగతి చదువుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి పాఠశాల నుంచి భోజనం కోసం ఇంటికి వచ్చారు. అనంతరం సమ్రీన్ ముందు వెళ్లగా, మసీరా ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మసీరాను కిడ్నాప్ చేశారు. పట్టణ శివారులోని బండగానిపల్లి వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొదల్లో ఓ చెట్టుకు బాలికను కట్టేసి వెళ్లిపోయారు. అటవీ ప్రాంతంలో ఉన్న గొర్రెలకాపరులు బాలికను గుర్తించి కట్లు విప్పి వివరాలు తెలుసుకుని ఇంటికి చేర్చారు. అప్పటికే పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సమ్రీన్.. చెల్లిని ఎందుకు స్కూలుకు పంపలేదని తల్లిని అడిగింది. దీంతో మసీరా పాఠశాలకు వెళ్లకపోవడం, ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. అదే సమయంలో బాలిక అటవీ ప్రాంతం వైపు నుంచి ఇంటికి రావడంతో కిడ్నాప్ ఉదంతం బయటపడింది. ఈ నేపథ్యంలో బాలిక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకున్న ఎస్ఐ జి.అంకమ్మ... నాగులబావి వీధిలోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమపేరుతో బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు
జూపాడుబంగ్లా(కర్నూలు జిల్లా): ప్రేమ పేరుతో ఓ యువకుడు విద్యార్థినిని కిడ్నాప్ చేశాడు. మండలంలోని తంగెడంచ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తంగెడంచ గ్రామానికి చెందిన కుర్వమల్లయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మూడో కుమార్తె వాణి జూపాడుబంగ్లా మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. చదవండి: కుక్కపిల్లపై మోజుతో ఆ యువకుడు ఏం చేశాడంటే.. చివరికి.. అదే గ్రామానికి చెందిన మాబాషా కుమారుడు షేక్ ఫరూక్ గౌండపనిచేస్తుంటాడు. ఈ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధించేవాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పటంతో వారు ఆ యువకుడిని మందలించారు. అయితే శనివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన వాణిని..ఫరూక్ బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని పారిపోయాడు. గ్రామస్తులు గమనించి బాలిక తల్లిదండ్రులకు తెలియజేయటంతో వారు వెంటనే జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ మారుతీశంకర్ కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆడుకుంటున్న చిన్నారిని.. నాన్నను చూపిస్తామని తీసుకెళ్లి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో బాలిక కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను.. గుర్తుతెలియని వ్యక్తులు మీ నాన్నను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత పాపను బైక్‌మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు. స్థానికురాలు ఒకరు బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌మీద తీసుకెళ్లినట్లు గమనించింది. ఆ తర్వాత వెంటనే.. చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!! -
నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శుక్రవారం మూడేళ్ల బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఒకటవ టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరెల్ తన బిడ్డ అస్కియా హనీ(3)తో షాపింగ్ నిమిత్తం సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌కు వచ్చింది. షాపింగ్ చేస్తుండగా చిన్నారి షాపింగ్ మాల్లో ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత బాలిక కనిపించలేదు. ఫిర్యాదు మేరకు ఒకటో టౌన్ పోలీసులు షాపింగ్‌మాల్‌లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. చిన్నారిని ఇద్దరు బురుకలు ధరించిన మహిళలు బయటకు ఎత్తుకెళుతున్నట్లు కనిపించింది. పోలీసులు రోడ్డు వెంబడి, బస్టాండ్ , రైల్వేస్టేషన్ వైపు ఉన్న సీసీపుటేజీలను పరిశీలిస్తున్నారు. -
సీసీటీవీ దృశ్యాలు: బాలిక కిడ్నాప్‌నకు యత్నం, తల్లి వెంటపడటంతో
సాక్షి, జవహర్‌నగర్: ఇటీవల దమ్మాయిగూడలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం రాచకొండ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి రాచకొండ సీపీ ఐదు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు దాదాపు 600 మంది పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి దమ్మాయిగూడ ప్రగతినగర్‌తో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆయా కాలనీల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ల నేతృత్వంలో విస్తృతంగా విచారణ చేపట్టారు. మరో బాలిక కిడ్నాప్‌నకు యత్నం.. వందలాది మంది పోలీసులు శుక్రవారం గాలిస్తున్న క్రమంలో ప్రగతినగర్‌లో ఎరుపు రంగు టీషర్టు.. నల్లరంగు మాస్క్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేశాడు. అక్కడే ఆడుకుంటున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమవ్వడంతో అనుమానిత వ్యక్తిని నిలదీసింది. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో ఆమె దుండగుడిని వెంబడించింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కీసర పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
బాలిక కిడ్నాప్?
హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ నుంచి కిడ్నాప్‌కు గురైన ఓ బాలికను హసన్‌పర్తి పోలీసులు సోమవారం కాపాడినట్లు తెలిసింది. భీమదేవరపల్లికి చెందిన ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు రోజుల క్రితం ఎల్కతుర్తిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్నేహతురాలిని కలవడానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా హసన్ పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో తిప్పాడు. రాత్రి కావడంతో ఆ బాలికను హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో ఉంటున్న తన సోదరి వద్దకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఉదయం ఆ బాలిక తనను కిడ్నాప్ చేశారని డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు బాధితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడి ఫోన్ ఆధారంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగరంగా గుర్తించి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. -
చినతల్లే చిదిమేసింది..!!
కిలకిలమని నవ్వుతూ నట్టింట పరుగులు తీసే ఆ చిన్నారి లేలేత పాదాలకున్న మువ్వల పట్టీలు ఘల్లుమంటూ సవ్వడి చేస్తే.. ఆ తండ్రి మది ఆనందంతో మురిసిపోయేది. తన జీవితంలో కొండంత సంతోషాన్ని పంచుతున్న ఆ కుమార్తెను తనకు బహుమతిగా ఇచ్చిన భార్య కన్నుమూస్తే.. ఆ పసిబిడ్డ ఆలనాపాలనా చూడడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో అతడు రెండో వివాహం చేసుకున్నాడు. తన బిడ్డకు తల్లి లేని లోటును సవతితల్లి తీరుస్తుందని నమ్మాడు. తనకో కుమారుడు కలిగిన తరువాత.. ఆమెలో అనుమాన బీజాలు నాటుకున్నాయి. మొదటి భార్యకు పుట్టిన కుమార్తెను ప్రాణాధికంగా ప్రేమిస్తున్న తన భర్త.. తన కుమారుడికి అన్యాయం చేస్తాడేమోనని సందేహించింది. ఆ అనుమానమే పెనుభూతమవడంతో.. చివరికి తన సవతి కుమార్తెను కడతేర్చింది. కాకినాడ జగన్నాథపురం పాఠశాల వద్ద గత శుక్రవారం ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ ఐసానిని అపహరించి.. గొంతుకు తువ్వాలు బిగించి, తానే హతమార్చినట్టు ఆమె సవతి తల్లి శాంతికుమారి పోలీసుల విచారణలో వెల్లడించింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో పడేసినట్టు చెప్పింది. దీప్తిశ్రీ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పగడాలపేటలో నాన్నమ్మ ఇంటి వద్ద విషాదంలో బంధువులు ఏడేళ్ల బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌తో కలవరపడిన కాకినాడవాసులు ఆ బాలిక హత్యకు గురైందని తెలియడంతో ఆదివారం తల్లడిల్లిపోయారు. సొంత కుమారుడి కంటే మొదటి భార్య కుమార్తెనే భర్త ప్రేమగా చూస్తున్నాడన్న కక్షతో.. రెండో భార్య.. చిన్నారిని కర్కశంగా హత్య చేసి ఉప్పుటేరులో పారేసింది. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన ఆమె.. ఆధారాలు దొరికిపోవడంతో.. పోలీసుల ఇంటరాగేషన్‌లో.. దీప్తిశ్రీని హత్య చేసినట్టు ఒప్పుకుంది. సవతి తల్లి దురాగతం పగడాలపేట వాసులను ఆవేదనకు గురిచేసింది. బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలిస్తుంటే.. ఆమె నాన్నమ్మ, బంధువులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. సాక్షి, కాకినాడ క్రైం: అపహరణనకు గురైన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని (7)ని ఆమె సవతి తల్లి హత్య చేసి ఉప్పుటేరు కాలువలో మూటకట్టి పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. జగన్నాథపురం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న నేతాజీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోన్న చిన్నారిని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్.. నగరంలో కలకలం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే. ఆ బాలిక తండ్రి సూరాడ సత్యశ్యామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి అదృశ్యమైన వెంటనే పోలీసులు ఆమె సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకున్నారు. ముందు తనకు ఏమీ తెలియదని పోలీసుల వద్ద బుకాయించింది. చిన్నారి చదువుతున్న పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థులకు ఆమెను పోలీసులు చూపించారు. దీప్తిశ్రీని ఆమె తీసుకెళ్లిందని, మమ్మీతో వెళుతున్నట్టు స్నేహితులకు చెప్పి వెళ్లిందని విద్యార్థులు పోలీసులకు తెలిపారు. దీప్తిశ్రీని తీసుకు వెళుతున్న పినతల్లి సీసీ కెమెరాల్లో చిన్నారిని సవతి తల్లే తీసుకువెళ్లినట్టు రికార్డు అయిందని, అయితే ముఖానికి ముసుగు వేసుకోవడం వల్ల పోలీసులు వెంటనే నిర్ధారించ లేకపోయారు. పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేయడం, పాఠశాల విద్యార్థులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో.. పాఠశాల నుంచి దీప్తిశ్రీని తీసుకువెళ్లి తానే హత్య చేశానని సవతి తల్లి ఒప్పుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పాఠశాల నుంచి నేరుగా సంజయ్‌నగర్‌లోని ఆమె ఇంటికి తీసుకెళ్లి పాప వెనక్కి తిరిగి ఉన్న సమయంలో మెడలో తువ్వాలు వేసి బిగించి చంపేసినట్లు అంగీకరించినట్టు చెబుతున్నారు. పాపను చంపేసిన తరువాత గోనె సంచిలో కట్టేసి సంజయ్‌నగర్ నుంచి బైక్‌పై ఇంద్రపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చి ఉప్పుటేరులో పడవేసినట్లు పోలీసుల విచారణలో సవతి తల్లి వివరించినట్లు తెలుస్తోంది. ఉప్పుటేరులో దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టిన పోలీసులు పోలీసుల గాలింపు చర్యలు దీంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు ఉప్పుటేరు, సామర్లకోట–ఇంద్రపాలెం పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ డీఎస్పీలు కరణం కుమార్, భీమారావు పర్యవేక్షణలో కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఒన్‌టౌన్ సీఐ రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక పడవలపై కాలువలో గాలించారు. మృతదేహం కోసం గాలిస్తున్నామని, ఆ తరువాత అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఐ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పగడాలపేటలో విషాదం దీప్తిశ్రీ హత్య గురైనట్టు పోలీసులు నిర్ధారణకు రావడంతో పగడాల పేటలో విషాదఛాయలు అలముకున్నాయి. రోజూ అందరినీ ఆప్యాయంగా పలకరించే దీప్తిశ్రీ ఇకలేదని తెలియడంతో ఆమె నాన్నమ్మ సూరాడ బేబీతో పాటు బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా ఉండేదని, మంచిగా చదువుకుంటానని అందరితో చెప్పేదని నాన్నమ్మ ఇంటి పరిసరాల వారు కంటనీరు పెట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో నానమ్మ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. కోడలు చనిపోయిన తరువాత పెళ్లి చేసుకుంటానని తన కుమారుడు చెబితే.. ఈ సంబంధం వద్దని చెప్పామని, వినకుండా శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడని నాన్నమ్మ విలపిస్తూ చెప్పింది ఇప్పుడు బంగారం లాంటి మనుమరాలిని చంపేసిందని ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. కేసు దర్యాప్తు ముమ్మరం దీప్తిశ్రీ ఐసాని కిడ్నాప్‌నకు కుటుంబ కలహాలే కారణమని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలి పారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రామ్మోహన్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇంద్రపాలెం వంతెన వద్ద మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడ తనిఖీ చేశామని డీఎస్పీ తెలిపారు. కొడుకును నిర్లక్ష్యం చేస్తారని.. దీప్తిశ్రీ తల్లి చనిపోవడంతో తండ్రి శ్యామ్‌కుమార్ సంజయ్‌నగర్‌కు చెందిన శాంతికుమారిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 13 నెలల బాబు ఉన్నాడు. దీప్తిశ్రీపైనే తండ్రి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని భావించిన సవతి తల్లి.. ఆమెను ఇబ్బందులకు గురి చేస్తుండేది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ చిన్నారి ఈ బాధలను తనలోనే దాచుకుంది. బాలిక వంటిపై కాల్చిన గుర్తు ఉండడంతో తండ్రి నిలదీయడంతో తల్లి పెడుతున్న చిత్రహింసలు బయటపడ్డాయి. దీంతో బాలికను అతడి చిన్నమ్మ ఇంటి వద్ద ఉంచి జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో చదివిస్తున్నాడు. సంజయ్‌నగర్ నుంచి చిన్నమ్మ ఇంటికి వెళ్లి రోజూ పాపను స్కూల్‌కి దింపి వస్తున్నాడు. దీంతో చిన్నారిపై సవతి తల్లి కక్ష పెంచుకుంది. తన బాబుని నిర్లక్ష్యం చేస్తాడన్న అనుమానంతో ఆమెను చంపేస్తే ఇబ్బంది ఉండదని భావించి దీప్తిశ్రీని చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసు ఛేదిస్తాం..
సాక్షి, కాకినాడ: చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసును ఛేదిస్తామని, మరో రెండు, మూడు రోజులు సమయం పట్టొచ్చని కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సవతి తల్లే చంపేసిందన్నది కేవలం వదంతి మాత్రమేనని, ఆ కోణంలోనూ విచారణ చేస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూడు బృందాలుగా ఏర్పడి ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నాయని వెల్లడించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు పాఠశాల నుండి దీప్తిశ్రీ అపహరణకు గురయిందన్నారు. కొన్ని చోట్ల సిసి కెమెరాలు సరిగా పని చేయకపోవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని డిఎస్పీ తెలిపారు. చిన్నారి కిడ్నాప్ ఘటనపై స్పందించిన మంత్రి వనిత.. చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. (చదవండి: దీప్తిశ్రీ కిడ్నాప్ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం బృందం) -
దీప్తిశ్రీ కిడ్నాప్ మిస్టరీ: రంగంలోకి ధర్మాడి సత్యం!
సాక్షి, కాకినాడ: కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. 48 గంటలైన చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. సవతి తల్లి శాంతికుమారినే దీప్తిశ్రీని హత్యచేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. దీప్తిశ్రీని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆమె విచారణలో వెల్లడించినట్టు సమాచారం. దీంతో ఆమె చెప్పిన ప్రదేశాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చిన్నారిని తానే చంపి గోనేసంచిలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ధర్మాడి సత్యం బృందం కూడా రంగంలోకి దిగి ఉప్పుటేరులో గాలింపు చర్యలు చేపడుతోంది. మొత్తం నాలుగు పడవల ద్వారా ఉప్పుటేరు, ఇంద్రపాలెం లాకులు వద్ద దీప్తిశ్రీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. జగన్నాథపురంలో చిన్నారి చదువుతోన్న స్కూల్ ఆవరణంలో కిడ్నాప్‌కు గురైంది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటున్న దీప్తిశ్రీని సవతితల్లి తీసుకెళ్లినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. తల్లి తీసుకెళ్లడంతో తాము ఏమి అడగలేకపోయామని అంటున్నారు. ఆ తర్వాత చిన్నారి కనిపించడం లేదని తండ్రి తమ దగ్గరకు వచ్చారని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. శాంతికుమారినే ఏమైనా చేసి ఉంటుందంటున్నారు. -
కలకలం రేపిన బాలిక కిడ్నాప్
సాక్షి, గుంతకల్లు : గుంతకల్లు పట్టణంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. అరగంటలోనే తిరిగి బాలిక ప్రత్యక్షం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలిక తల్లి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఆచారమ్మ కొట్టాల ఏరియాకు చెందిన ఆరోగ్యమేరీ, శాంతరాజ్ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె ఎం.అఖిలమేరీ సెయింట్ మేరీస్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. తల్లి స్కూల్ ఆవరణలో ఉన్న మదర్‌థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్‌లో ఆయాగానూ, తండ్రి రైల్వే హాస్పిటల్ క్యాంటీన్‌లోను పనిచేస్తున్నారు. రోజుమాదిరిగానే వారిద్దరూ మంగళవారం ఉదయాన్నే పనులకు వెళ్లిపోయారు. అఖిల మేరీ ఉదయం 8 గంటలకు స్కూల్ వెళ్లింది. హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అఖిలమేరీని మధ్యలో కూర్చోపెట్టుకుని, నోటికి గుడ్డ అడ్డంగా పెట్టి పోర్టర్స్‌లైన్, ధర్మవరం గేట్, బీరప్పగుడి సర్కిల్ మీదుగా చిప్పగిరి బ్రిడ్జి వరకు తీసుకెళ్లారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చిప్పగిరి బ్రిడ్జి వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. ఉపాధ్యాయుడు గుర్తించి.. బాలికను చేరదీసి బెల్డోనాలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహహ్మద్ రఫీ ఉదయం 8:30 గంటల సమయంలో ఆటోలో స్కూల్‌కు వెళ్తున్నాడు. ఒంటరిగా రోదిస్తున్న బాలిక అఖిలమేరీని గమనించాడు. ఆటో దిగి ఆ పాప ఆచూకీ, ఇతర వివరాలను ఆరాతీశారు. వెంటనే ఆ పాపను ఆటోలో ఎక్కించుకుని తనతో పాటు స్కూల్‌కు తీసుకెళ్లాడు. బాలిక మెడలోని స్కూల్ ఐడీ కార్డు ఆధారంగా బాలిక తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశాడు. దీంతో స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు బాలికను అప్పగించి విషయాన్ని గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు తెలియజేశారు. పొంతన సమాధానాలు వన్‌టౌన్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి ఆ బాలికను వెంటపెట్టుకుని కిడ్నాపర్లు బైక్ మీద తిప్పిన పరిసరాలను పరిశీలించారు. అయితే ఆ బాలిక మొదట ఆలూరు పక్కనున్న తన అమ్మమ్మ గ్రామానికి వెళ్తున్నానని ఓసారి, కిడ్నాపర్లు ఎత్తుకెళ్లారని మరోసారి పొంతన లేకుండా చెప్పడంతో కిడ్నాప్ జరిగిందా లేక తల్లిదండ్రులేమైనా మందలించి ఉంటే తనే అమ్మమ్మ దగ్గరకు వెళ్లడానికి ఈ విధంగా చెబుతోందా అనే కోణంలో విచారించారు. అయితే ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని, ప్రాథమికంగా తమకు అందిన సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించి దుండగుల కోసం గాలించామని సీఐ వెల్లడించారు. -
బాలిక కిడ్నాప్ కలకలం
మొయినాబాద్(చేవెళ్ల): ‘మీ నానమ్మ దగ్గరకు తీసుకెళ్తాను’ అంటూ బాలికకు నమ్మించిన ఓ దుండగుడు కిడ్నాప్‌కు యత్నించాడు. స్కూటీపై తీసుకెళ్తుండగా చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకుని స్థానికులతో కలిసి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలం చిలుకూరులో బుధవారం తీవ్ర కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కార్వాన్ ప్రాంతానికి చెందిన సమృద్దీన్(45) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన బాలిక(13)ను ‘మీ నానమ్మ వద్దకు తీసుకెళ్తాను’ అంటూ నమ్మబలికి తన స్కూటీపై ఎక్కించుకుని బయలుదేరాడు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్–తంగడపల్లి రోడ్డులో స్కూటీపై వెళ్తుండగా.. కార్వాన్కు చెందిన నజీమ్ అనే వ్యక్తి పని నిమిత్తం చిలుకూరు గ్రామానికి ప్రయాణమయ్యాడు. ఈక్రమంలో చిలుకూరు మహిళా ప్రాంగణం వద్ద అతడు బాలికను గుర్తించాడు. ఆమెను ఎక్కడి తీసుకెళ్తున్నావంటూ నజీమ్ ప్రశ్నించగా దుండగుడు తప్పించుకోవడానికి స్కూటీ వేగం పెంచాడు. నజీమ్ వెంబడించి అతడిని పట్టుకున్నాడు. స్థానికులంతా గుమ్మికూడి నిలదీశారు. బాలికను అడిగి విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడిని వారికి అప్పగించారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు ఠాణాకు రావడంతో వారికి ఆమెను అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమయాణం
హిమాయత్‌నగర్: ఆ బాలిక వయస్సు 13 సంవత్సరాలు. అబ్బాయి వయస్సు 22 సంవత్సరాలు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సదరు బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు ఈ నెల 15న స్కూల్ నుంచి ఆమెను కిడ్నాప్ చేశాడు. దీనిపై అదే రోజు సాయంత్రం నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిమాయత్‌నగర్‌లో అదృశ్యమైన బాలిక విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రత్యక్షమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..అంబర్ పేట్‌కు చెందిన బాలిక(13) హిమాయత్‌నగర్, స్ట్రీట్‌నెంబర్–14లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. ఇదే స్కూలుకు చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రూప్ చాటింగ్ చేసేది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం విజయనగరం ప్రాంతానికి చెందిన పవన్‌చైతన్య అనే యువకుడితో ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. హీరో నాగచైతన్య ఫ్యాన్‌నని చెప్పుకున్న పవన్ చైతన్య సదరు బాలికతో చాటింగ్ చేసేవాడు. ఆమె కూడా నాగచైతన్య అభిమాని కావడంతో ఇద్దరూ స్నేహితులు అయ్యారు. స్నేహం కొద్ది రోజులకు ప్రేమగా మారింది. అర్థరాత్రి వరకు చాటింగ్, ఫోన్లతో బిజీగా గడిపేవారు. స్కూల్ నుంచి కిడ్నాప్... కొద్ది రోజుల అనంతరం విజయనగరానికి రావాలని పవన్‌చైతన్య కోరడంతో బాలిక తిరస్కరించింది. ‘నేను నీ కోసం హైదరాబాద్ వస్తే కూడా రావా’? అనడంతో వస్తానంటూ బదులిచ్చింది. అంతే ఈ నెల 15న స్కూల్ వద్దకు వచ్చిన పవన్‌చైతన్య ఆమెను తీసుకుని పరారయ్యాడు. అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లిన వారు రైతులో బొబ్బిలికి వెళ్లారు. బొబ్బిలిలో పవన్‌చైతన్య బంధువుల ఇంట్లో ఉన్న వీరిని స్థానిక పోలీసులసాయంతో నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీజీపీ జోక్యంతో కొలిక్కి.. తమ కుమార్తె కనిపించడం లేదని అదే రోజు బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ.సైదులు, ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి సమస్య చెప్పడంతో స్పందించిన ఆయన కేసును వెంటనే చేధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు..సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా పవన్ చైతన్యను గుర్తించారు. వారిని తీసుకొచ్చేందుకు ఎస్ఐ సైదులు, సిబ్బంది బొబ్బిలి బయలుదేరి వెళ్లారు. -
ఆ పనికి అడ్డు తగిలిందని.. ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్
సాక్షి, శ్రీకాకుళం : తన అక్రమ సంబంధానికి అడ్డుతగిలిందనే నెపంతో ఓ కామాంధుడు ఓ మహిళ మనుమరాలును కిడ్నాప్ చేసిన సంఘటన శ్రీకాకుళంలో కలకలం సృష్టించింది. తనతో ఆమెను పంపించకపోతే ఆ పసిప్రాణాన్ని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. లంకపల్లి సురేష్ అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దికాలంపాటు గుట్టుగా సాగింది. వీరిద్దరి మధ్య దండి పార్వతి అనే మహిళ మద్యవర్తిత్వం వహించింది. కొద్ది రోజుల తర్వాత తప్పు తెలుసుకున్న పార్వతి, సురేష్ చేసే పని తప్పంటూ వారించింది. దీంతో పార్వతికి, సురేష్‌కు వివాదాలు వచ్చాయి. సదరు మహిళ సైతం సురేష్‌కు దూరంగా ఉంటోంది. ఈ విషయమై ఇరువురి మధ్య కొంత కాలంగా గొడవలు వస్తున్నాయి. దీంతో పార్వతిపై కోపం పెంచుకున్న సురేష్ పార్వతి మనుమరావలు ఏడేళ్ల దండి శరణ్యను కిడ్నాప్ చేశాడు. మహిళను తనతో పంపిస్తేనే బాలికను విడిచపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో పార్వతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
లండన్‌లో సింగ్ ఈజ్ 'కింగ్' !
లండన్: భారత సంతతికి చెందిన సిక్కు డ్రైవర్ 13 ఏళ్ల బాలికను కాపాడి లండన్‌లో హీరో అయ్యారు. అపహరణకు గురైన బాలికను తన చాకచక్యంతో రక్షించారు సత్బీర్ అరోరా. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తన క్యాబ్‌ను ఒకరు బుక్‌చేశారు. అయితే ఎప్పటిలానే అరోరా ప్యాసింజర్‌ను ఎక్కించుకోడానికి వెళ్లగా... అక్కడ స్కూలు యూనిఫాంలోఉన్న విద్యార్థిని ఉంది, ఆమెతో పాటు 24 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ క్యాబ్‌లో ఎక్కారు. వీరి వ్యవహారం చూసి అరోరా మనసు ఎందుకో కీడు శంకించింది. కారులో ఎక్కిన వ్యక్తి ఆ బాలికను ఏం చేయబోతున్నాడో ఫోన్లో అవతలి వ్యక్తికి వివరించడాన్ని అరోరా గుర్తించారు. అతని మాటల ద్వారా ఆ బాలిక కిడ్నాప్‌కు గురైందని గ్రహించారు. వెంటనే బాలిక గురించి తెలుసుకోమని తన భార్యకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆమె మాటల ద్వారా బాలిక కిడ్నాప్‌కు గురైందని నిర్ధారించుకున్నారు. దీంతో దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు అరోరా. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కిడ్నాపర్‌ని అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా బాలికను రక్షించినందుకు అరోరాకు ‘అవుట్ స్టాండింగ్ ఎచీవ్మెంట్ ఇన్ సేఫ్‌గార్డ్’ సర్టిఫికెట్‌ను అక్కడి జిల్లా కౌన్సిలర్ కీరోన్ మాలన్ అందించారు. -
చిన్నారి నందిని ఆచూకీ లభ్యం
-
చిన్నారి నందిని ఆచూకీ లభ్యం
తిరుమల(చిత్తూరు జిల్లా): తిరుమలలో కిడ్నాపైన చిన్నారి నందిని ఆచూకీ లభ్యమైంది. శాలినీ అనే మహిళ కిడ్నాప్ చేసి చిన్నారిని బెంగుళూరుకి ఎత్తుకెళ్లింది. పోలీసులు కిడ్నాపర్ శాలినీని అరెస్ట్ చేసి చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన ఏడేళ్ల నందినిని గుర్తుతెలియని మహిళ ఆదివారం కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని అమ్మపాళెంకు చెందిన సురేష్ తిరుమ లలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. భార్య దాక్షాయిణి, ఇద్దరు కుమార్తెలు నందిని(7), మహాలక్ష్మి(4)తో కలసి తిరుమలలోనే నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న స్థానిక యాత్రిసదన్–4 వద్దకు పెద్దకుమార్తె నందిని తాగునీటికోసం వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభించక పోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు సేకరించారు. ఆదివారం మధ్యాహ్నం 3.33 గంటలకు నందినిని ఓ మహిళ వెంట తీసుకెళ్తున్నట్టు అక్కడి ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. 3.50 గంటలకు తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా సీసీ కెమెరాల్లో నందిని, గుర్తుతెలియని మహిళ నడిచివెళుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనను టీటీడీ సీవీఎస్వో ఏ.రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి తీవ్రంగా పరిగణించారు. చిన్నారి గాలింపునకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. కిడ్నాప్‌కు పాల్పడిన మహిళ ఫొటోలతో విస్తృత ప్రచారం కల్పించారు. చివరకు నిందితురాలిని అరెస్ట్ చేసి చిన్నారిని సురక్షితంగా విడిపించారు. -
బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు
పామిడి : మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన వితంతువు రాజమ్మ కూతురు అశ్విని(14) కిడ్నాప్ కేసులో కర్నూలు జిల్లా డోన్ వాసి దాసరి మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు. వివరాలు.. తల్లితో పాటు అశ్విని బతుకుదెరువు కోసం రాజంపేటలోని పుల్లంపేటకు కూలి పనులకు వెళ్లింది. అక్కడ బాలికతో దాసరి మహేష్ పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 11న పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి అతడు వెంట తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత మోసపోయినట్లు బాలిక గ్రహించింది. వెంటనే అతడి బారి నుంచి తప్పించుకుని ఈనెల 25న బాలిక స్వగ్రామానికి వచ్చింది. తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు మహేష్‌ను ఎద్దులపల్లిరోడ్డులో అదుపులోకి తీసుకుని, అతడిపై 420 కేసు నమోదు చేసి గుత్తి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతి కిడ్నాప్.. ఐదుగురిపై కేసు నమోదు
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వాడ్రేవుపల్లి గ్రామంలో 17 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పి.వీరబాబు కథనం ప్రకారం.. ఈ నెల 23న వాడ్రేవుపల్లికి చెందిన ఎస్.సత్యనారాయణ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పరిసర గ్రామాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో యువతి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానేపల్లి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తన కుమార్తెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని, అతడికి మరో నలుగురు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిందితుడు దుర్గాప్రసాద్‌తో పాటు, మరో నలుగురిపై శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు వివరించారు. -
ఉరవకొండలో బాలిక కిడ్నాప్
ఉరవకొండ : పట్టణంలోని గవిమఠం సమీపంలో నివాసముంటున్న కూలీ యుగంధర్ కుమార్తె ఉమ (14) ఆదివారం రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ బెళుగుప్ప కేజీబీవీలో 8వతరగతి చదువుతోంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ఉమను పెద్దనాన్న శ్రీనివాసులు పని ఉందంటూ పిలుచుకెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శ్రీనివాసులుకు ఫోన్ చేయగా నంబర్ పనిచేయలేదు. ఆందోళనకు గురై శ్రీనివాసులు ఇంటి వద్దకు వెళితే తలుపులకు తాళం వేసి ఉంది. అక్కడి నుంచి బస్టాండ్ ప్రాంతంలో వెతుకుతుండగా ద్విచక్రవాహనంలో ఉమను బలవతంగా పెద్దనాన్న, మరో యువకుడు తీసుకెళుతుండటం కనిపించింది. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ యుగంధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బాలిక (15) పొరపాటుగా మరో రైలు ఎక్కడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఓ దుండగుడు ఓ మహిళ సాయంతో ఈ అమ్మాయిపై లైంగికదాడి చేసి, 70 వేల రూపాయలకు మరో వ్యక్తి అమ్మేశాడు. ఢిల్లీ పోలీసులు ఈ అమ్మాయిని రక్షించి విముక్తి కల్పించారు. గత అక్టోబర్‌లో బాధిత బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. కాగా పొరపాటుగా మరో రైలు ఎక్కడంతో ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయి అర్మాన్ అనే అతణ్ని కలసి తన పరిస్థితిని వివరించింది. సాయం చేస్తానని మాయమాటలు చెప్పి, అర్మాన్ ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య హసీనా సాయంతో ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరూ కలసి బాధితురాలిని పప్పు యాదవ్ అనే వ్యక్తిని అమ్మేశారు. ఆ తర్వాత పప్పు యాదవ్ ఆ అమ్మాయిని రెండు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు. అతని బారినుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చేరింది. అక్కడ హసీనా ఈ అమ్మాయిని గుర్తించి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చింది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక, మహ్మద్ అఫ్రాజ్ అనే వ్యక్తికి అప్పగించింది. అఫ్రాజ్ ఈ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తించిన ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాధితురాలిని రక్షించి, సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్లో నిందితులపై కేసు నమోదు చేశారు. అఫ్రాజ్, పప్పు యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. -
తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం!
తిరుమల: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో కలకలం రేపింది. యాత్రికుల ఉచిత సముదాయ భవనంలో నవ్య అనే చిన్నారిని కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని తెప్పించుకుని అధికారులు పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ అయిన చిన్నారి భవ్య ఫ్యామిలీది అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తుంచర్ల గ్రామం. నవ్య పొరపాటున తప్పిపోయిందా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్
రాజేంద్రనగర్: పాఠశాలకు వెళ్లిన బాలిక కిడ్నాప్ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్‌దేవిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబ నగర్‌కు చెందిన కీర్తీ(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. అదే కాలనీకి చెందిన సంతోష్(19) బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
కన్నీళ్లు తెప్పించే 'ఆమె' కథ!
న్యూఢిల్లీ: కన్నీళ్లకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నీటి గాథ ఆమెది. ఈ అభాగ్యురాలిపై కామాంధులు సాగించిన రాక్షక పర్వం గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. దేశంలో అబలలపై జరుగుతున్న దారుణోదంతాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఢిల్లీ బాలికకు పోలీసులు దశాబ్దకాలం తర్వాత విముక్తి కల్పించారు. చెర నుంచి బటయపడిన ఆమె జూలై 26న తిరిగి తల్లి, సోదరిని కలుసుకుంది. 12 ఏళ్ల వయసులో అపహరణకు గురైన బాలిక.. ఇద్దరు పిల్లల తల్లిగా సొంత గూడుకు చేరుకుంది. ఈ పదేళ్ల కాలంలో ఆమె అనుభవించిన నరకయాతన గురించి తెలుసుకుని పోలీసులు సైతం విస్తుపోయారు. పోలీసులు ఏం చెప్పారంటే.. ఈశాన్య ఢిల్లీలోని 12 ఏళ్ల బాలికను 2006, జూలై 2న కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు రాంజు, ఆమె భర్త శ్యామసుందర్ బాలికను అంబాలాకు తీసుకెళ్లి రూ. 12 వేలకు అరుణ్ అలియాస్ బాబ్లీ అనే మహిళకు అమ్మేశారు. సరూప్ చాంద్ అనే వ్యక్తికి బాలికను రూ.10 వేలకు అరుణ అమ్మేసింది. చాంద్ కు రూ.20 వేలు చెల్లించి ప్రతాప్ సింగ్, అతడి కొడుకు జగశీర్ సింగ్ అకా జగ్గీ.. బాలికను తమ వెంట గుజరాత్ కు తీసుకెళ్లారు. అక్కడ మూడేళ్లున్న తర్వాత పంజాబ్ లోని లోంగోవాల్ ప్రాంతానికి తిరిగొచ్చారు. తన కొడుక్కి బాలికతో పెళ్లి జరిపించాడు. తర్వాత ట్రక్కు డ్రైవర్ తో బలవంతంగా పెళ్లి చేశారు. 2009లో రెండు నెలల వ్యవధిలో ఆమెను తొమ్మిది మందికి విక్రయించడం దారుణాతి దారుణం. 2011లో భర్త మరణించడంతో ట్రక్కు డ్రైవర్ మేనల్లుడు ఆమెను లైగింకంగా వేధించడం మొదలు పెట్టాడు. గతేడాది ఇంటి నుంచి గెంటేయడంతో బతిందా ప్రాంతంలో నివసించింది. పెళ్లిళ్లల్లో వంటమనిషిగా, పలు కార్యక్రమాల్లో డాన్సర్ గా చేయసాగింది. తర్వాత ఆమెను పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి తీసుకెళ్లి ఓ డాన్స్ కు అమ్మేశారు. అక్కడ పరిచయమైన మహిళ డబ్బు సాయం చేయడంతో బాధితురాలు ఢిల్లీకి తిరిగివచ్చింది. తర్వాత ఏం జరిగింది? పదేళ్ల కాలంలో బాధితురాలిని 12సార్లు అమ్మేసినట్టు పోలీసులు గుర్తించారు. పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమెకు రెండు పర్యాయాలు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు సంతానం కలిగారు. బాధితురాలి జీవితం నాశనం కావడానికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలను కిడ్నాప్ చేసి పంజాబ్, హర్యానాలో అమ్మేయడం అధికమయిందని పోలీసులు గుర్తించారు. ఈ రెండు రాష్ట్రాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇలాంటి దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. పాలకులు, అధికారులతో పాటు ప్రజలు కూడా ఈ విషయంలో కళ్లు తెరవాల్సిఉంది. -
ఫేస్బుక్లో పరిచయం.. ఆపై కిడ్నాప్
మంగళూరు: ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలికను బుట్టలో పడేశాడు. కలుద్దామని చెప్పి పిలిపించి ఆమెను కిడ్నాప్ చేశాడు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళూరులోని స్టేట్‌బ్యాంకు సమీపంలో ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయికి, అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్(24) అనే యువకుడు ఏడాది క్రితం ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అవి నమ్మిన ఆ అమ్మాయి ఈ నెల 9 న స్కూల్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి మొదటిసారి షబ్బీర్‌ను కలవడానికి వెళ్లింది. చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విద్యార్థిని ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో బాధితురాలు నిర్బంధానికి గురైనట్లు గుర్తించారు. ఈ నెల 11న బాలికను విడిపించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. షబ్బీర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా స్నేహితులు షాకీర్, అజార్ సహాయంతో బాలికను కిడ్నాప్ చేసినట్టు అంగీకరించాడు. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.