ఉరవకొండలో బాలిక కిడ్నాప్‌ | girl kidnap in uravakonda | Sakshi
Sakshi News home page

ఉరవకొండలో బాలిక కిడ్నాప్‌

Published Mon, Apr 24 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

girl kidnap in uravakonda

ఉరవకొండ : పట్టణంలోని గవిమఠం సమీపంలో నివాసముంటున్న కూలీ యుగంధర్‌ కుమార్తె ఉమ (14) ఆదివారం రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ బెళుగుప్ప కేజీబీవీలో 8వతరగతి చదువుతోంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ఉమను పెద్దనాన్న శ్రీనివాసులు పని ఉందంటూ పిలుచుకెళ్లాడు.

ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శ్రీనివాసులుకు ఫోన్‌ చేయగా నంబర్‌ పనిచేయలేదు. ఆందోళనకు గురై శ్రీనివాసులు ఇంటి వద్దకు వెళితే తలుపులకు తాళం వేసి ఉంది. అక్కడి నుంచి  బస్టాండ్‌ ప్రాంతంలో వెతుకుతుండగా ద్విచక్రవాహనంలో ఉమను బలవతంగా పెద్దనాన్న, మరో యువకుడు తీసుకెళుతుండటం కనిపించింది. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదు. తమ కుమార్తెను కిడ్నాప్‌ చేశారంటూ యుగంధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement