Uma
-
టీడీపీ ఉచిత ఇసుక అక్రమాలపై పెట్ల ఉమాశంకర్ గణేష్ ర్యాలీ
-
30 ఏళ్లకు తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం
జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి ఆలయాన్ని 30 ఏళ్ల తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరవడంతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గల షాంగస్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది.మూడు దశాబ్దాల తర్వాత ఆలయంలోకి భక్తులు ప్రవేశించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఉమా దేవి విగ్రహాన్ని వేదమంత్రాల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానిక కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానికుడు గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ ‘మా పండిట్ సోదరులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.కశ్మీరీ పండిట్లు తెలిపిన వివరాల ప్రకారం 1990లో ఈ ఆలయం ధ్వంసమైంది. దీని వెనుక పలు కారణాలున్నాయి. 1990లలో ఉగ్రవాదులు అలజడి కారణంగా కశ్మీరీ పండిట్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారు. 2019 తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గాయి. ఈ నేపధ్యంలో గతంలో తీత్వాల్ వద్దనున్న మాతా శారదా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద శ్రీనగర్‌లోని పలు దేవాలయాలతో సహా మతపరమైన ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
టీడీపీ ఫ్రీ ఇసుకపై వైఎస్సార్సీపీ ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ట్రైనీ ఐఏఎస్‌గా పోలీస్ అకాడమీకి కుమార్తె.. సెల్యూట్ చేసిన ఐపీఎస్ తండ్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఒక అరుదైన, స్ఫూర్తిదాయకమైన సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఉమాహారతి యూపీఎస్సీ సివిల్స్-2022 పరీక్షల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పని చేసిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు.. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.ఉమాహారతి ట్రైనీ ఐఏఎస్‌గా తెలంగాణ పోలీస్ అకాడమీకి రావడంతో అక్కడ తన కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి అయిన వెంకటేశ్వర్లు హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. గర్వంతో ఆయన తన కుమార్తెకు సెల్యూట్ చేసి.. పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.Proud father, who is SP rank police officer, salutes his trainee IAS daughter N Uma Harathi when she visited #Telangana Police Academy #TGPA today. N Venkateshwarlu works as Deputy Director, TGPA, while his daughter topped #UPSC civils exam 2022 securing All India 3rd rank. pic.twitter.com/xM1haCHO2m— L Venkat Ram Reddy (@LVReddy73) June 15, 2024 -
Umamani: సముద్రం ఘోషిస్తోంది..
సముద్రం నిత్యం ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఘోషకు భావకవులు రకరకాల అర్థాలు చెప్తుంటారు. కానీ సముద్రం లోపల ఏముంది? సముద్రం లోపల మరో ప్రపంచం ఉంది. పగడపు దీవులమయమైన ఆ అందమైన ప్రపంచాన్ని చందమామ కథల్లో చదివాం. మన ఊహల్లో అద్భుతమైన దృ«శ్యాన్ని ఊహించుకున్నాం. ఇప్పటికీ అదే ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహలో నుంచి వాస్తవంలోకి రమ్మని చెబుతున్నారు ఉమామణి. ఒకప్పుడు అందమైన పగడపు దీవులను చిత్రించిన ఆమె కుంచె ఇప్పుడు అంతరించిపోయిన పగడపు దీవులకు అద్దం పడుతోంది. బొమ్మలేయని బాల్యం..‘‘మాది తమిళనాడులోని దిండిగల్. నాకు బొమ్మలేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తూ కనిపించేదాన్ని. అది చూసి నానమ్మ ‘పిచ్చి బొమ్మల కోసం కాగితాలన్నీ వృథా చేస్తున్నావు. చక్కగా చదువుకోవచ్చు కదా’ అనేది. అలా ఆగిపోయిన నా చిత్రలేఖనం తిరిగి నలభై దాటిన తర్వాత మొదలైంది. ఈ మధ్యలో నాకు ఓ డాక్టర్‌తో పెళ్లి, వారి ఉద్యోగరీత్యా మాల్దీవులకు వెళ్లడం, ఓ కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి కాలేజ్ వయసు రావడం జరిగిపోయాయి.ఇంతకాలం గృహిణిగా ఉన్న నాకు కొడుకు కాలేజ్కెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని చిన్నప్పుడు తీరని కోరిక కోసం కేటాయించాను. గులాబీల నుంచి టులిప్స్ వరకు రకరకాల పూలబొమ్మలు వేసిన తర్వాత నా చుట్టూ ఉన్న సముద్రం మీదకు దృష్టి మళ్లింది. పగడపు దీవులు నా చిత్రాల్లో ప్రధాన భూమిక అయ్యాయి. తొలి చిత్ర ప్రదర్శన మాల్దీవులలోని మెరైన్ సెంటర్లో పెట్టాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. వివాంత మాల్దీవ్స్ ప్రదర్శన సమయంలో ఒక భారతీయ మహిళ వేసిన ప్రశ్న నా దిశను మార్చింది.‘సముద్ర గర్భం ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో స్వయంగా చూడకుండా బొమ్మలేయడం ఏమిటి’ అన్నదామె. ఆమె వ్యాఖ్య నాకు మొదట్లో అసమంజసంగా అనిపించింది. అనేక పరిశోధకుల డాక్యుమెంటరీలను చూసిన అనుభవంతోనే కదా చిత్రించాను. నేను స్వయంగా చూస్తే కొత్తగా కనిపించేది ఏముంటుంది... అని కూడా అనుకున్నాను. ఇంత సందిగ్ధం ఎందుకు... ఒకసారి సముద్రగర్భంలోకి వెళ్లి చూద్దాం అని కూడా అనుకున్నాను. అప్పుడు మా అబ్బాయి మా ΄ాతికేళ్ల వివాహ వార్షికోత్సవం బహుమతిగా నన్ను స్కూబా డైవింగ్ కోర్సులో చేర్చాడు.డైవింగ్కంటే ముందు ఈత రావాలి కదా అని చెన్నైకి వచ్చి రెండు వారాల స్విమ్మింగ్ కోర్సులో చేరాను. తిరిగి మాల్దీవులకెళ్లి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తొలి రోజు అంతా అగమ్యంగా అనిపించింది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మానేద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. కోచ్ నా మాటలు పట్టించుకోలేదు. ప్రయత్నాన్ని కొనసాగించమని మాత్రం చె΄్పారు. నాకు నేను నెల రోజుల గడువు పెట్టుకున్నాను. ఆ నెలలో నావల్ల కాకపోతే మానేద్దామని నా ఆలోచన. ఆ నెల రోజుల్లో డైవింగ్‌కి అనుగుణంగా మానసికంగా ట్యూన్ అయిపోయాను.సముద్రగర్భాన్ని చిత్రించాను.. సముద్రం అడుగున దృశ్యాలు నన్ను వేరేలోకంలోకి తీసుకెళ్లిపోయాయి. పగడపు చెట్లు నిండిన దిబ్బలు, రకరకాల చేపలు, ΄ాములు ఒక మాయా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచాన్ని కాన్వాస్ మీద చిత్రించడం మొదలుపెట్టాను. ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య మాటల్లో వర్ణించలేనంత వైవిధ్యత వచ్చేసింది. ఆ చిత్రాలన్నింటినీ మాల్దీవుల మెరైన్ సింపోజియమ్ 2016లో ప్రదర్శించాను. ఆ చిత్రాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఓషన్ రీసెర్చర్లు, అంతరించిపోతున్న పగడపు దిబ్బల పరిశోధకులకు ఉపయోగపడ్డాయి. కొంతకాలం తర్వాత సముద్రగర్భంలోని సన్నివేశాలను కెమెరాలో బంధించాలనుకున్నాను. ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోవడంతో శబ్దరహితంగా పేలవంగా వచ్చింది ఫిల్మ్. అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీలు తీసే వారి దగ్గర మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. చాలామంది స్పందించలేదు. ఫిల్మ్ మేకర్ ప్రియా తువాస్సెరీ మాత్రం నాతో కలిసి ఫిల్మ్ తీయడానికి సిద్ధమయ్యారు.చిత్రీకరణ కోసం 2018లో మనదేశంలోని రామేశ్వరం, రామనాథపురం, టూటికోరన్ తీరాల్లో డైవ్ చేశాను. ఆశ్చర్యంగా సముద్రం అడుగుకి వెళ్లే కొద్దీ పగడపు దిబ్బలు కాదు కదా జలచరాలు కూడా కనిపించలేదు. ΄్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బలుగా పేరుకుపోయి ఉన్నాయి. రసాయనాలు, పురుగుమందులు, ఎరువుల వ్యర్థాలను సముద్రపు నీటిలోకి వదలడంతో జలచరాలు అంతరించిపోయాయి. సునామీ విలయంలో పగడపు దీవులు అతలాకుతలం అయిపోయాయి. శిథిలమైన ఆనవాళ్లు తప్ప పగడపు చెట్ల సమూహాలు లేవు. చెట్లు చనిపోయిన దిబ్బలనే వీడియో, ఫొటోలు తీశాను.మనిషి తన సౌకర్యం కోసం చేసే అరాచకానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతోందో తెలియచేస్తూ ఆ ఫొటోలతో ప్రదర్శన పెట్టాను. మా సొంతూరు తమిళనాడులోని దిండిగల్‌తో మొదలు పెట్టి అనేక స్కూళ్లు, కాలేజ్‌లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాను. సముద్రం ఘోషిస్తోంది. ఆ ఘోషను విందాం. ప్రకృతి సమతుల్యతను కా΄ాడుకుందాం. ఓషన్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మీద పరిశోధన చేసే వాళ్లకు నేను తీసిన ఫొటోలు, చిత్రలేఖనాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఉపయోగపడుతున్నాయి.ఒక సాధారణ గృహిణిగా నేను 43 ఏళ్ల వయసులో కుంచె పట్టి పెయింటింగ్స్ మొదలుపెట్టాను. 49 ఏళ్లకు స్కూబా డైవింగ్ నేర్చుకుని సాగర సత్యాలను అన్వేషించాను. సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాననే సంతృప్తి కలుగుతోంది. మొత్తంగా నేను చెప్పేదేమిటంటే ‘వయసు ఒక అంకె మాత్రమే. మన ఆసక్తి మనల్ని చోదకశక్తిగా నడిపిస్తుంది’. అంటారు ఉమామణి.ఇవి చదవండి: Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ సింగర్ ఉమా రామనన్ కన్నుమూశారు. ప్రస్తుతం 69 ఏళ్ల వయసులో ఉన్న ఆమె అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో విజయవంతంగా రాణించారు. ఉమకు ఆమె భర్త ఏవీ రామనన్, కుమారుడు విఘ్నేశ్ రామనన్ ఉన్నారు.కాగా.. ఉమ 1977లో శ్రీ కృష్ణ లీల సినిమా కోసం ఎస్వీ వెంకట్రామన్ స్వరపరిచిన మోహనన్ కన్నన్ మురళి అనే పాటతో ఆమె ప్రయాణం ప్రారంభించింది. విజయలక్ష్మి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన ఆమె ఏవీ రామమన్ను పెళ్లాడింది. ఆ తర్వాత ఇళయరాజా రచించిన పూంగతావే చొచ్చా తకవై పాట తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆమె శంకర్ గణేష్, టీ రాజేందర్, దేవా, ఎస్ఏ రాజ్‌కుమార్, మణి శర్మ, శ్రీకాంత్ దేవా, విద్యాసాగర్ వంటి సింగర్స్‌తో కలిసి పనిచేశారు. హిందీ చిత్రం ప్లేబాయ్ కోసం ఉమా ఒక పాట పాడారు. ఇళయారాజాతో కలిసి ఎక్కువగా పాటలు పాడారు. Woke up to the sad news of the death of my most fav singer,Uma Ramanan.Highly under-rated singer,she didn't get a fair share of her fame compared to her contemporaries.Every song of hers is a super hit,from 'Poongathave Thazthiravai...' Condolences to AV Ramanan sir. Om Shanthi!+ pic.twitter.com/5ahzsg9KYI— Ramesh रमेश ரமேஷ் (@Udumalai_Ramesh) May 2, 2024 -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్‌కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్‌లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్‌లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
బీసీ ఆడబిడ్డకు బీజేపీ అన్యాయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తుల ఉమకు బీ ఫారం ఇవ్వకుండా చివరి నిమిషంలో నిరాకరించడం ద్వారా బీసీ ఆడబిడ్డను బీజేపీ అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ, బీసీ నేతలను అవమానాలకు గురి చేస్తోందన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, బీజేపీ నాయకురాలు తుల ఉమ సోమవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం తుల ఉమతో పాటు ఆమె వెంట వచ్చిన నేతలను కేటీఆర్ పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమకు మరింత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని, వేములవాడ టికెట్ విషయంలో మరొకరికి దొంగదారిలో బీ ఫారం ఇచ్చారని తుల ఉమ అన్నారు. బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి కల అని, కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని మాత్రమే ఆ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా, ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు సుదగోని హరిశంకర్‌గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హరిశంకర్‌గౌడ్‌తో పాటు పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్, మేడబోయిన పరశురాములు, ఉదయకిరణ్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి తదితరులను కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వనించారు. నల్లగొండ డీసీసీబీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్లోకి పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి, తిరిగి కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారో అర్ధంకాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్‌రెడ్డికి మునుగోడులో బుద్ధి చెప్పాలన్నారు. గౌరవం లేనిచోట ఉండకూడదనే తన తండ్రి మాటలు స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్‌ను వీడినట్లు పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు. -
సివిల్స్‌లో నారీ భేరి
న్యూఢిల్లీ: సివిల్ సర్విసెస్–2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్విసు కమిషన్(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించారు. గరీమా లోహియా, తెలుగు యువతి నూకల ఉమా హారతి, స్మృతీ మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నారు. టాప్–25 ర్యాంకర్లలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్‌లో టాప్–3 ర్యాంకులు మహిళలే సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. సివిల్స్–2021లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మూడో ప్రయత్నంలో తొలి ర్యాంక్ ఈసారి సివిల్స్ తొలి ర్యాంకర్ ఇషితా కిశోర్ ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంచుకొని మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని శ్రీరామ్ కాలేజీ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. రెండో ర్యాంకర్ గరీమా లోహియా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరీమల్ కాలేజీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ అభ్యసించారు. సివిల్స్‌లో కామర్స్ అండ్ అకౌంటెన్సీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్ సాధించారు. మూడో ర్యాంకర్ నూకల ఉమా హారతి ఐఐటీ–హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఐదో ప్రయత్నంలో మూడో ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక స్మృతీ మిశ్రా మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో బీఎస్సీ చదివారు. జువాలజీ ఆప్షనల్ సబ్జెక్టుగా సివిల్స్‌లో జయకేతనం ఎగురవేశారు. ఐదో ర్యాంకర్ మయూర్ హజారికా తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. అస్సాంకు చెందిన హజారియా ఎంబీబీఎస్ చదివారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి రాక టాప్–25 ర్యాంకర్ల విద్యార్హతలను గమనిస్తే చాలామంది ఐఐటీ, ఎన్ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, హుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారే ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీని ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రిజర్వ్ లిస్టులో 178 మంది అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరీ, 99 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్), 263 మంది ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), 154 మంది షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), 72 మంది షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) వర్గానికి చెందినవారున్నారు. 178 మంది అభ్యర్థులను రిజర్వ్ జాబితాలో చేర్చినట్లు యూపీఎస్సీ తెలియజేసింది. మొత్తం విజేతల్లో 41 మంది దివ్యాంగులు ఉన్నారు. నా కల నెరవేరింది సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఐఏఎస్ అధికారిగా మహిళా సాధికారత కోసం, అణగారిన వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తా. మొదటి ర్యాంకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తొలుత నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి. సివిల్స్‌లో మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మెరుగైన ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో ప్రతిరోజూ 8 గంటల నుంచి 9 గంటలపాటు చదివాను. నా కఠోర శ్రమకు ఈ ఫలితం దక్కిందని భావిస్తున్నా. నా ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ క్యాడర్. ఈసారి సివిల్స్‌లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది – ఇషితా కిశోర్, సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ రెండో ర్యాంకు ఊహించలేదు ‘‘సివిల్స్ సాధించాలన్నది నా చిన్నప్పటి కల. ఏకంగా రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించా. ఈ ప్రయాణంలో మా అమ్మ, కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ప్రిపరేషన్ నిరంతరం కాకుండా మధ్యలో అప్పుడప్పుడు విరామం ఇచ్చా. బంధుమిత్రులను కలుసుకున్నా. స్ఫూర్తి, సొంతంగా చదుకోవడం, విశ్లేషణతో ఎవరైనా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం కూడా అవసరమే. పెద్ద నగరంలో ఉంటున్నామా, చిన్న పట్టణంలో ఉంటున్నామా అనేది సమస్య కాదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్విసులో చేరాక మహిళాభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేస్తా’’ – గరీమా లోహియా, సివిల్స్ రెండో ర్యాంకర్ 15 రోజుల్లోగా మార్కుల వివరాలు యూపీఎస్సీ వెబ్సైట్ http//www.upsc. gov.in ద్వారా ఫలితాలు, సివిల్స్ విజేతల వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలంటే 011– 23385271/ 23381125/ 23098543 ఫోన్ నంబర్ల ద్వారా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. సివిల్స్–2022లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది జూన్ 5న నిర్వహించారు. 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,090 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గత ఏడాది సెపె్టంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 933 మంది అర్హత సాధించారు. విజేతలకు మోదీ అభినందనలు సివిల్స్–2022 విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం రావడం, ప్రజల జీవితాన్ని సానుకూల మార్పును తీసుకొచ్చే అదృష్టం లభించడం గొప్ప విషయమంటూ ట్వీట్ చేశారు. విజయం సాధించలేకపోయినవారు నైపుణ్యాలను, బలాలను ప్రదర్శించేందుకు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ర్యాంకర్లకు కేంద్ర మంత్రులు అమిత్ షా, జితేంద్ర సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్‌కు 667వ ర్యాంక్ ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్ కుమార్ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. -
భర్తను చంపిన వ్యక్తి విడుదల.. సుప్రీంకోర్టుకు ఐఏఎస్ అధికారి భార్య
న్యూఢిల్లీ: 1994లో దారుణ హత్యకు గురైన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య సతీమణి ఉమ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఉరిశిక్షకు బదులు యావజ్జీక కారాగార శిక్ష పడిన వ్యక్తి జైల్లో ఉండాలని, కానీ బిహార్ ప్రభుత్వం నిబంధలనలు మార్చి విడుదల చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈమె ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను 1994లో బిహార్‌లో మూకదాడి చేసి దారుణంగా హత్య చేశారు. వీరికి ఆనంద్ మోహన్ నేతృత్వం వహించారు. ఈ కేసులో న్యాయస్థానం అతడ్ని దోషిగా తేల్చి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే బిహార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న జైలు నిబంధలను మార్చింది. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన వారిని కూడా విడుదల చేసేలా సవరణలు చేసింది. దీంతో 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న మోహన్ జైలు నుంచి విడుదల అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈయన విడుదలను ప్రతిపక్షాలు సహా ఐఏఎస్ అధికారులు సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. బిహార్ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోలేదు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు శిక్ష -
తెలుగు ఐఏఎస్ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు!
పట్నా: అతనో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. మాజీ ఎంపీ కూడా. పేరు ఆనంద్ మోహన్. దాదాపు 30 ఏళ్ల కింద బిహార్‌లో ఏకంగా ఐఏఎస్ అధికారిపైకే మూకను ఉసిగొల్పి అత్యంత పాశవికంగా రాళ్ల దాడి చేయించి పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో 15 ఏళ్లుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ నితీశ్‌కుమార్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా జైలు నిబంధనలనే మార్చేసింది! ఆనంద్‌తో సహా పలు తీవ్ర నేరాలకు పాల్పడి జీవితఖైదు అనుభవిస్తున్న మరో 26 మంది దోషుల విడుదలకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ మీద ఉన్న అతడు ఆ సమయంలో తన కుమారుడైన ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థ వేడుకను ఆస్వాదిస్తున్నాడు! నితీశ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్‌లోని రాజకీయ తదితర రంగాల ప్రముఖులంతా అందులో పాల్గొన్నారు. తనకు విముక్తి ప్రసాదిస్తున్నందుకు నితీశ్‌కు ఆనంద్ మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో డెహ్రాడూన్‌లో జరిగే కొడుకు పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించుకుంటానంటూ హర్షం వెలిబుచ్చాడు. పెరోల్ ముగియడంతో మంగళవారం జైలుకు తిరిగి వెళ్లిన అతను బుధవారం రెమిషన్‌పై విడుదల కానున్నాడు. నితీశ్ సర్కారు నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ, బీజేపీతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టగా అధికార జేడీ(యూ) మాత్రం సమర్థించుకుంది. క్షమాభిక్ష జాబితాలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషి ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్, పలు తీవ్ర క్రిమినల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే అవధేశ్ మండల్ కూడా ఉన్నారు. ఏం జరిగింది? 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. మండల్ రిజర్వేషన్లపై దేశమంతా అట్టుడుకున్న వేళ అగ్రవర్ణ భూమిహార్ అయిన శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిసెంబర్ 5న శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గోపాల్‌గంజ్ కలెక్టర్ అయిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను కార్లోంచి బయటికి లాగి రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి పొట్టన పెట్టుకున్నారు. ఆనంద్ మోహన్ దగ్గరుండి మరీ వారిని ఈ దాడికి ప్రేరేపించినట్టు చెబుతారు. ఈ కేసులో జైల్లో ఉండగానే ఎంపీగా గెలిచాడు. 2007లో కింది కోర్టు మరణశిక్ష విధించింది. దాంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. తర్వాత దాన్ని పట్నా హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అప్పట్నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల హత్యకు, అత్యాచారాలకు పాల్పడ్డవారికి రెమిషన్ మంజూరు చేయరాదన్న నిబంధనను నితీశ్ సర్కారు తాజాగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఏప్రిల్ 10న నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఆనంద్ మోహన్ విడుదల కోసమేనని అప్పట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నితీశ్‌తో అతని బంధం ఇప్పటిది కాదు. వారిద్దరూ సమతా పార్టీ సహ వ్యవస్థాపకులు. కృష్ణయ్య...అట్టడుగు నుంచి ఎదిగిన తెలుగు తేజం మూక దాడికి బలైన ఐఏఎస్ జి.కృష్ణయ్య తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ఇల్లు గడిచేందుకు తండ్రితో పాటు కూలి పనికి వెళ్లారు. జర్నలిజం కోర్సు చేసిన అనంతరం కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా పని చేశారు. 1985లో సివిల్స్ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌గా బిహార్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ విధిగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఆయన దొరికిన తొలి పోస్టింగే బందిపోట్లకు, కిడ్నాపర్లకు స్వర్గధామంగా పిలిచే వెస్ట్ చంపారన్ జిల్లాలో! తన పనితీరుతో జిల్లాకున్న చెడ్డపేరుతో పాటు దాని రూపురేఖలనే సమూలంగా మార్చేశారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత నాటి సీఎం లాలు సొంత జిల్లా గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. అప్పుడాయనకు కేవలం 35 ఏళ్లు! ఈ దారుణంపై సీఎం హోదాలో లాలు పేలవ స్పందన తీవ్ర విమర్శలపాలైంది. కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన లాలును వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నేరగాళ్లను జైళ్లలోంచి విడుదల చేసి విచ్చలవిడిగా సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఎక్కడుంటుందన్న ఆమె ప్రశ్న చాలాకాలం అందరి మనసులనూ తొలిచేసింది. ఇప్పటికీ మాఫియా రాజ్యమే కృష్ణయ్య భార్య ఉమ ఆవేదన ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమ షాకయ్యారు. తన గుండె పగిలిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం కొన్ని రాజ్‌పుత్ ఓట్ల కోసం ఒక దారుణమైన ఒరవడికి నితీశ్ సర్కారు శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. ‘‘ఆనంద్ మోహన్ మరణశిక్ష ఇతర నేరగాళ్లకు ఓ హెచ్చరికలా, నికార్సైన అధికారులకు భరోసాగా ఉంటుందని ఆశపడ్డా. కానీ దాన్ని జీవితఖైదుకు తగ్గించారు. దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ బిహార్‌లో మాఫియా రాజ్యమే నడుస్తోందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడేందుకు నేరగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహమిస్తుంది. ఆనంద్ మోహన్ వంటి నేరగాళ్లు, వాళ్ల కుటుంబీకులే ఇంకా తమకు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా అన్నది రాజ్‌పుత్‌లు ఆలోచించుకోవాలి’’అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయం రద్దయ్యేలా చూడాలని కోరారు. ‘‘ఇలాంటి కేసుల్లో దోషులు జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే నితీశ్ సర్కారు నిర్ణయంపై పట్నా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది. దీనిపై నా భర్త బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తున్నా’’అని వెల్లడించారు. కృష్ణయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రిని కోల్పోయేనాటికి వారికి పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు, చిన్నమ్మాయి పద్మకు ఐదేళ్లు. వారిని తీసుకుని ఉమ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా, పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!
కోల్‌సిటీ (రామగుండం): పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. సిజేరియనైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వారమైనా కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడంతో ప్రసూతి వార్డులోనే ఉండాల్సి వచ్చింది. రెండుసార్లు కుట్లేసినా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం, మూడోసారి కుట్లేస్తామని వైద్యులు చెప్పడంతో హడలిపోయింది. ఓ పక్క నొప్పి.. మరోపక్క వైద్యుల నిర్లక్ష్యంతో మనోవేదన చెంది ఆదివారం వేకువజామున ప్రసూతి వార్డులోని బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించి ఉరి నుంచి తప్పించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో కళ్లముందే చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నొప్పితో తల్లడిల్లి.. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ (29)ను ప్రసవం కోసం ఈ నెల 11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మర్నాటి రాత్రి ఉమకు సిజేరియన్‌చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. ఉమతో పాటు శిశువును ప్రసూతి వార్డుకు తరలించారు. ఉమ (ఫైల్) సిజేరియన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయలేదో ఏమోగాని అవి అతుక్కోలేదు. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చింది. 18న వైద్యులు రెండోసా రి కుట్లేశారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. శనివారం పరిశీలించిన వైద్యులు మరోసారి కుట్లు వేయాల్సి వస్తుందన్నారు. అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పిగా ఉందని తల్లడిల్లిందని ఉమ తల్లి రాజేశ్వరి, అత్త మల్లమ్మ, ఆడబిడ్డ స్వప్న తెలిపారు. వేకువజామున ఉరేసుకొని.. బిడ్డను తన అత్త మల్లమ్మ వద్ద పడుకోబెట్టిన ఉమ.. ఆదివారం వేకువజామున 4.50 సమయంలో బాత్రూమ్కు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో అత్త, ఆడపడుచు వెళ్లిచూడగా షవర్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఉరి నుంచి తప్పించి బెడ్‌పైకి తరలించారు. విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, అరగంటైనా వైద్యులు రాకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తే ప్రాణాలు దక్కేవని.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉమ తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. బాలింత మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని, వాళ్ల నిర్లక్ష్యంతోనే ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డీసీహెచ్ఎస్ విచారణ ఉమ మృతిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ వాసుదేవరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఉమకు సిజేరియన్ చేసిన డాక్టర్, శనివారం రాత్రి డ్యూటీలోని డాక్టర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిందని తెలిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలోగా వెళ్లారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త సంజీవ్‌తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని డీసీహెచ్ఎస్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు వైద్యుల నిర్లక్ష్యం లేదు. డీసీహెచ్ఎస్ దర్యాప్తు చేస్తున్నారు. కొందరిలో కుట్లు మానకపోవడమనేది జరుగుతుంది. – డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు రెండుసార్లు కుట్లేసినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మూడోసారి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. శనివారం రెండు గంటలు లేబర్ రూంలో డ్రెస్సింగ్ చేసి నరకం చూపించారు. లేబర్ రూం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మంట, నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. ప్రైవేట్‌కు తీసుకుపోవాలనుకున్నాం. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – రాజేశ్వరి, మృతురాలి తల్లి -
అమ్మవారి విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి..
ముదిగొండ: దసరా సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనంకోసం తీసుకువెళుతుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ముదిగొండ మండలం కమలాపురంలో స్థానికులు దు ర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో శనివారం అమ్మ వారి ప్రతిమతో నిమజ్జనానికి రెండు ట్రాక్టర్లలో సాగర్ కాల్వ వద్దకు బయలుదేరారు. గ్రామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో కాల్వ ఉండగా, ఊరేగింపు అనంతరం బయలుదేరి న స్థానికులు నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బాణాపురం సమీపాన ఇసుక బావి వద్ద అమ్మవారి విగ్రహం ఉన్న ట్రాక్టర్ ముందుగా వెళ్లింది. ఆ వెనుకాల ఉన్న ట్రాక్టర్లో 25 మంది గ్రామస్తులు ఉండగా, ప్రమాదవశాత్తు అది బోల్తా పడింది. ఈ ఘటనలో కమలాపురం గ్రామానికి చెందిన భిక్షాల ఎలగొండ స్వామి(55), అవసాని ఉపేందర్ (26), ములకలపల్లి ఉమ (36), చూడబోయిన నాగరాజు (20) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరికొందరు గాయపడగా 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఇక్కడ మా కథలు నచ్చవని హిందీకి వెళ్లాం
‘‘మా ప్రాజెక్ట్స్ అన్నీ రిస్క్‌తో కూడు కున్నవే... కమర్షియల్స్ కాదు... అందుకే కంటెంట్‌ని నమ్మి సినిమా బండి’ విషయంలో మరోసారి రిస్క్ తీసుకున్నాం. మా నమ్మకం మంచి ఫలితాన్ని ఇచ్చింది’’ అన్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. వికాస్ వశిష్ఠ, సందీప్, రాగ్ మయూర్, ఉమ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సినిమా బండి’. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 14 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రాజ్ అండ్ డీకే చెప్పిన విశేషాలు. ► ప్రవీణ్ మా దగ్గర వర్క్ చేయలేదు. కానీ ‘సినిమా బండి’ కంటెంట్, ప్రవీణ్ నైపుణ్యం నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. కొత్తవాళ్ల ప్రతిభను నమ్మి, మా డబ్బులతోనే చిన్న సినిమాలను ప్రోత్సహించాలనుకున్నాం. వేరే స్టూడియోస్కి వెళితే వాళ్ల జోక్యం ఉంటుంది. అలా అయితే క్రియేటివ్ పరంగా ఇబ్బందులు వస్తాయనుకుని ‘డీటుఆర్ ఇండీ’ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాం. ‘సినిమా బండి’ నిర్మించాం. ఈ సినిమాకి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. ► మా సినిమా కెరీర్ హైదరాబాద్ నుంచే మొదలైంది. సినిమాలపై ప్రేమతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏడాది పాటు ఇక్కడే ఉన్నాం. తెలుగు సినిమాలు తీయా లని ప్రయత్నించాం. సమయం గడుస్తోంది కానీ సినిమాలు కుదర్లేదు. సరే.. మా కథలు ఇక్కడ నచ్చవేమో అనుకుని హిందీకి వెళ్లాం. అయితే తెలుగు సినిమాకు కనెక్ట్ అయ్యే ఉన్నాం. హీరోలు మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ... ఇలా మరికొంత మంది హీరోలతో మాకు మంచి అనుబంధం ఉంది. మంచి కథ కుదిరితే మా దర్శకత్వంలో తెలుగులో సినిమా ఉంటుంది. ► ఆ రకం సినిమాలు చేయండి, ఈ రకం సినిమాలు తీయండి, రీమేక్ సినిమాలు చేయండి.. అని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ మేం మా ఆలోచనాధోరణికి తగ్గ సినిమాలే చేస్తున్నాం. మా నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోంది. దర్శక–నిర్మాతలుగా మేం చేసిన ‘ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో నిర్మించిన ‘స్త్రీ’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్. ఇప్పుడు నిర్మించిన ‘సినిమా బండి’ చిన్న సినిమా అయినా మంచి స్పందన లభిస్తోంది. మా ఇద్దరి మధ్య వాదనలు జరగవని కాదు. కానీ మా గొడవ అంతా మంచి అవుట్‌పుట్ కోసమే. ► భవిష్యత్‌లో ఓటీటీల హవా ఉంటుందని మేం ఐదేళ్ల క్రితమే ఊహించాం. 2016లో ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ కోసం అమెజాన్‌తో సైన్ చేశాం. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పుడు ఉన్నంత పాపులారిటీ అప్పుడు లేదు. టెక్నాలజీ, కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వంటి కారణాల వల్ల ఓటీటీలు ప్రేక్షకులకు వేగంగా దగ్గరయ్యాయి. ఇక 2016లోనే మేం ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్‌సిరీస్ సైన్ చేసినా.. ఇతర కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని షూటింగ్ మొదలు పెట్టడానికి రెండేళ్లు పట్టింది. ► సినిమా కావొచ్చు, వెబ్ సిరీస్ కావొచ్చు.. ఇది చిన్న పిల్లల కంటెంట్, ఇందులో హింస ఎక్కువగా ఉంది, ఇది పెద్దల సినిమా అంటూ.. ఆ ప్రాజెక్ట్ కంటెంట్‌కు ఒక గుర్తింపు ఉంటే మంచిదే. ఇక సెన్సార్షిప్ విషయానికి వస్తే.. మా వరకు మేం ఒక సెల్ఫ్ సెన్సార్‌ను ఫాలో అవుతాం. చైల్డ్ అబ్యూజ్, మితిమీరిన హింస వంటి అంశాలకు సంబంధించి అందరి ఫిల్మ్ మేకర్స్‌కు నియమనిబంధనలు ఉండటం మంచిదే. ఓటీటీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేస్తే, అవి వ్యూయర్స్‌కు మేలు చేయాలని మేం కూడా కోరుకుంటాం. ► షారుక్ ఖాన్‌కి ఓ కథ చెప్పాం. ఆయనకు నచ్చింది. కానీ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్స్‌కు కాస్త టైమ్ పడుతుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కాంబినేషన్లోని వెబ్ సిరీస్ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగింది. మరొక మూడు ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నాం. ఆ ట్రైలర్లో సమంత పాత్ర గురించి మరింత తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంతను తీసుకోవడానికి కారణం ఉంది. ఆమె క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉంటాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్... సమంతది విలన్ పాత్ర అని చెప్పలేం కానీ మనోజ్ బాజ్‌పాయ్‌కి అపోజిట్ క్యారెక్టర్. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాన్ చేస్తున్నాం. రాజ్, డీకేతో సమంత -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని..
అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తెను వధువుగా చూసి మురిసిపోవాలకున్న ఆ తల్లిదండ్రుల ఆశ తీరలేదు.. కాళ్ల పారణితో బుగ్గన చుక్క పెట్టుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలకున్న ఆ యువతి కాంక్ష నెరవేరలేదు.. నచ్చిన మెచ్చిలిపై తలంబ్రాలు పోసి జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్న ఆ యువకుడి కల ఫలించలేదు. శుభలేఖలు రావాల్సిన ఆ ఇంట్లో నుంచి చావు కబురు వినిపించింది. పెళ్లి బాజాలు మోగాల్సిన చోట మరణ మృదంగం మోగింది. పచ్చని పెళ్లిపందిరి, బంధుమిత్రులతో సందడిగా మారాల్సిన ఆ ఇంటి ప్రాంగణం శోక సంద్రంలో మునిగిపోయింది. వాయువేగంతో దూసుకొచ్చిన మృత్యువు మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిని చిదిమేసింది. యువకుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆ యువతి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన సోమవారం రాత్రి విజయవాడ లబ్బీపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది. కృష్ణలంక(విజయవాడ తూర్పు): మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా బ్రెయిడ్ డెడ్ అయ్యి కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఘటన సోమవారం రాత్రి లబ్బిపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాల రాము కుండలు విక్రయిస్తూ భార్య, కొడుకు, కూతురుతో కలసి జగ్గయ్యపేట రంగుబజార్‌లో నివాసముంటున్నాడు. అతని కూతురు ముత్యాల ఉమా(26) డిగ్రీ పూర్తిచేసుకుని తండ్రికి ఆర్థికంగా సహాయ పడేందుకు నాలుగేళ్లుగా నగరంలోని ఎంజీరోడ్డులోనున్న కాల్సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ లబ్బీపేటలోని లేడిస్ హస్టల్లో నివాసముంటుంది. ఇటీవలే కుటుంబ సభ్యులు ఒంగోలులోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే తమ సమీప బంధువు రాయల వివేక్కుమార్తో ఉమాకు నిశ్ఛితార్థం చేసి ఏప్రిల్ 8న వివాహం నిశ్చయించారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో లబ్బీపేట ఎంజీరోడ్డులోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదు డ్రాచేసుకుని రోడ్డు దాటుతుండగా ఏపీ05ఈఎస్6895 నెంబర్ కలిగిన వాహనంపై ముగ్గురు యువకులు బెంజిసర్కిల్ నుంచి బస్‌స్టేషన్ వైపు మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆమెను బలంగా ఢీకొట్టారు. దీంతో యువతి ఎగిరి దూరంగా పడిపోవడంతో తల వెనుక గాయమై తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ సమయంలో ఆమెతోపాటు పనిచేసే తోటి ఉద్యోగులు చూసి ఆమెను దగ్గరలోని రమేష్ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమెను పెళ్లిచేసుకోబోయే యువకుడు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. బ్రెయిన్ డెడ్అయినట్లు డాక్టర్లు చెప్పడంతో వారు బోరున విలపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేశారు. వాహనం నడిపిన జయంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ట్వంటీ ప్లస్
చక్రవర్తి, బంగార్రాజు, ఆంధ్ర అప్పాచీ, అక్షర, సంతోషిని, ఉమ ముఖ్య తారలుగా వెల్లంకి దుర్గాప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపం ఎస్, 20ప్లస్’. సాయిలోకేష్ ప్రొడక్షన్ పతాకంపై సి.రామాంజనేయ నిర్మించిన ఈ సినిమా పోస్టర్ని నిర్మాత సాయివెంకట్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. దుర్గాప్రసాద్ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తి. తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది’’ అన్నారు. ‘‘దర్శకు డిగా అవకాశం ఇచ్చిన రామాంజనేయగారికి థ్యాంక్స్. వెల్లంకి విజయలక్ష్మి రాసిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని వెల్లంకి దుర్గాప్రసాద్ అన్నారు. ‘‘ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాం. ఆరవన్, మెలోడి శ్రీనివాస్ కలిసి ఈ చిత్రానికి మంచి సంగీతం అందించారు’’ అని రామంజనేయ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సాగర్. -
అన్నా వర్సిటీ ఉన్నతాధికారిణి సస్పెండ్
సాక్షి, చెన్నై: ఫెయిలయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పునఃమూల్యాకంనంలో పాస్ చేయించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉమపై సస్పెన్షన్ వేటు పడింది. పరీక్షల విభాగంలో అక్రమాలపై 50 మంది విద్యార్థులను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) శుక్రవారం విచారించింది. రీ వాల్యుయేషన్‌లో లంచం తీసుకుని విద్యార్థుల్ని పాస్ చేసిన ఘటన వెలుగచూడడం తెల్సిందే. దీంతో అన్నా వర్సిటీ ఉన్నతాధికారులు ఉమను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏ ఒక్కర్నీ వదిలేదలేదని స్పష్టంచేశారు. -
స్వరూప దగ్గరికే చిన్నారి తన్విత
-
‘తన్విత’ను దక్కించుకున్న స్వరూప
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి తన్విత ఉదంతంలో పెంచిన తల్లికి ఊరట లభించింది. ఓ వైపు కన్నపేగు, మరోవైపు పెంచిన మమకారం... తన్విత కోసం ఇద్దరు తల్లులు కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. చివరకు పెంపుడు తల్లి స్వరూప దగ్గరే తన్విత ఉండాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకూ స్వరూప వద్దే తన్విత ఉండాలని కొత్తగూడెం 5వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పుట్టిన రోజు నుంచి తన్విత తనవద్దనే పెరిగిందని స్వరూప కోర్టులో తన వాదనలు వినిపించింది. మరోవైపు తన్విత కన్నతల్లి ఉమ సమర్పించిన అఫిడవిట్ పరిశీలించిన అనంతరం కోర్టు పెంపుడు తల్లికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ప్రస్తుతం ఖమ్మం బాలల సదనం ఉన్న తన్వితను తన వెంట తీసుకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..వివరాలివీ.. మహబుబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిస్టాపురం గ్రామానికి చెందిన మాలోతు భావు సింగ్, ఉమ దంపతులు తమ కూతురు తన్వితను రెండేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ స్వరూపలకు దత్తత ఇచ్చారు. భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి తన్విత ఖమ్మంలోని శిశు గృహంలో ఉంచారు. ఈ క్రమంలో తల్లి ఉమ తనకే అప్పగించాలని, పెంచిన తల్లి తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉండగా తన్విత మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత తంతు జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసులు దర్యాప్తులో తెలపడంతో కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పోలీసులు కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో విచారణ జరిపారు. చివరకు తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే దత్తత వ్యవహారం జరిగిందని, దత్తత ఒప్పంద పత్రంలో ఉన్న సంతకం కన్నతల్లి ఉమదేనని నిర్ధారించారు. బాగా చూసుకోవడం లేదనే భావుసింగ్ , ఉమలకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని లింగ నిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన భావు సింగ్ ఆబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లికి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆ ప్రయత్నం నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్నరాజేంద్రప్రసాద్ స్వరూపలకు వారి విషయం తెలిసింది. ఇందులో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించాలని ఒప్పంద పత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్‌తో పాటు భావు సింగ్ పై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఉమ కేసు వాపసు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్లు తనకు చెప్పారని.. కాని దత్తత తీసుకున్న వారు బాగా చూసుకోవడం లేదనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఉమ వాంగ్మూలం ఇచ్చింది. కోర్టు తీర్పు మేరకే అప్పగింత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఖమ్మం గృహంలో ఉన్న తన్వితను పెంపుడు తల్లి స్వరూపకు అప్పగించారు. -
కోవూరు సర్పంచ్ ఉమ అరెస్ట్
కోవూరు: కోవూరు సర్పంచ్ కూట్ల ఉమను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ఎస్టీగా తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది. అయితే పాలకవర్గం ఉమ ఎస్టీ కాదని తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించిందని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపించి ఉమ ఎస్టీ కాదని ధ్రువీకరించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోవూరు తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శీలం రామలింగేశ్వరరావు కూట్ల ఉమపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కూట్ల ఉమపై కేసు నమోదు చేయకపోవడంపై సాక్షి దినపత్రికలో వార్త రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోవూరు అడిషనల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ పెద ఖాసిమ్ ఉమకు మార్చి ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. -
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేద్దాం
► జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం ► జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ కరీంనగర్: సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ కోరారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జెడ్పీలో ఉద్యోగులు అభినందనసభ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ మూడేళ్లలో అందరి సహకారంతో జిల్లాను ప్రగతి వైపు నడిపించామని, భవిష్యత్‌లోనూ మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా తుల ఉమ కేక్ కట్ చేశారు. అనంతరం ఉమను ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. జెడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు ఎడ్ల శ్రీని వాస్, సిద్దం వేణు, వీర్ల కవిత, లచ్చిరెడ్డి, పూర్ణిమ, ఆకుల లలిత, శోభారాణి, వీరమల్ల శేఖర్, గంగుల రజి త, కో ఆప్షన్ సభ్యులు జమీలొద్దీన్ పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ సీఈవో పద్మజారాణి ఆధ్వర్యంలో జెడ్పీ ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించారు. పీఆ ర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు రా జిరెడ్డి, అశోక్, శ్రీనివాస్, జగదీశ్వరాచారి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
డిస్ట్రిబ్యూటరీ పనులు తక్షణం చేపట్టాలి
అనంతపురం అర్బన్ : హంద్రీ-నీవా ద్వారా నిర్ధేశిత 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ పనులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, ఇతర నాయకులు విన్నవించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన మంత్రిని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తి ప్రభుత్వం మూడు నెలలు గడువు విధించిందని, పనులు ఇలా సాగితే ఆరునెలలైనా పూర్తి కావన్నారు. పనులు జాప్యంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ నాయకులు సి.జాఫర్, శ్రీరాములు, కేశవరెడ్డి, తదితరులు ఉన్నారు. -
ఉరవకొండలో బాలిక కిడ్నాప్
ఉరవకొండ : పట్టణంలోని గవిమఠం సమీపంలో నివాసముంటున్న కూలీ యుగంధర్ కుమార్తె ఉమ (14) ఆదివారం రాత్రి కిడ్నాప్‌కు గురైంది. బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ బెళుగుప్ప కేజీబీవీలో 8వతరగతి చదువుతోంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న ఉమను పెద్దనాన్న శ్రీనివాసులు పని ఉందంటూ పిలుచుకెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు శ్రీనివాసులుకు ఫోన్ చేయగా నంబర్ పనిచేయలేదు. ఆందోళనకు గురై శ్రీనివాసులు ఇంటి వద్దకు వెళితే తలుపులకు తాళం వేసి ఉంది. అక్కడి నుంచి బస్టాండ్ ప్రాంతంలో వెతుకుతుండగా ద్విచక్రవాహనంలో ఉమను బలవతంగా పెద్దనాన్న, మరో యువకుడు తీసుకెళుతుండటం కనిపించింది. వారిని వెంబడించినప్పటికీ దొరకలేదు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ యుగంధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
లేడీ డాక్టర్‌తో లవ్
అనగనగా ఓ యువకుడు. తలకి బలమైన గాయం కావడంతో గతం మర్చిపోతాడు. పేరు కూడా గుర్తు ఉండదు. తానెవరో తెలుసుకోవాలని హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో లేడీ డాక్టర్ అతనితో ప్రేమలో పడుతుంది. ఏంటీ.. సూర్య ‘గజని’ గుర్తొస్తుందా? అలాంటి కథతోనే నందా దురైరాజ్, ఉమ, వాణి ముఖ్య తారలుగా ‘ప్రేమలేఖ’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ చిత్రాల దర్శకుడు అగస్త్యన్ తమిళంలో ‘సెల్వమ్’ తీశారు. ఈ చిత్రాన్ని ‘లక్ష్మీపుత్రుడు’ పేరుతో నిర్మాత ఎ. రమేశ్‌బాబు తెలుగులోకి అనువదించారు. దేవా స్వరపరిచిన పాటల్ని ఇటీవల విడుదల చేశారు. ‘‘ప్రేమకథా చిత్రమిది. ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రమేశ్‌బాబు. ఈ చిత్రానికి మాటలు–పాటలు: భారతీబాబు, సమర్పణ: ఎ. రమాదేవి. -
మహల్లో ఏం జరిగింది?
మున్నా, బిందు అశ్విని, ఉమ ముఖ్య పాత్రల్లో సిద్ధార్థ్ కన్నా దర్శకత్వంలో సుధీర్ గుండెపూడి శివ నిర్మిస్తున్న హారర్ మూవీ ‘శాంతాబాయ్’. ప్రచార చిత్రా లను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. శాంతాబాయ్ మహల్లో ఏం జరిగింది? అన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘శాంతాబాయ్ అనే అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని, ఈ చిత్రకథ తయారు చేశా’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబి సుహాన, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకట్.