
సాక్షి, చెన్నై: ఫెయిలయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పునఃమూల్యాకంనంలో పాస్ చేయించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉమపై సస్పెన్షన్ వేటు పడింది. పరీక్షల విభాగంలో అక్రమాలపై 50 మంది విద్యార్థులను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) శుక్రవారం విచారించింది. రీ వాల్యుయేషన్‌లో లంచం తీసుకుని విద్యార్థుల్ని పాస్ చేసిన ఘటన వెలుగచూడడం తెల్సిందే. దీంతో అన్నా వర్సిటీ ఉన్నతాధికారులు ఉమను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏ ఒక్కర్నీ వదిలేదలేదని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment