channai
-
చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు
చెన్నై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. ఈ రూట్లో రోజూ రెండు ఫ్లయిట్స్ నడపడంతో పాటు సెప్టెంబర్ 26 నుండి చెన్నై–కొచ్చి మధ్యలో కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ వివరించింది. దశలవారీగా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను వేగవంతంగా విస్తరించాలనే తమ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
మళ్లీ అదే తీరు!
యధాప్రకారం ముంబై మళ్లీ కుంభవృష్టిలో చిక్కుకుంది. దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని స్థాయిలో పడిన భారీ వర్షంతో ఆ మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. 28మంది మృత్యు వాత పడటం, రోడ్లపై గంటలతరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం, మెట్రో రైళ్ల దారంతా వరద నీటితో నిండటం, వందలాది విమానాలు రద్దు కావడం గమనిస్తే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరే షన్(బీఎంసీ) గతానుభవాలనుంచి ఏమీ నేర్చుకోలేదని అర్ధమవుతుంది. ఏటా వర్షాకాలంలో ముంబైకి ఈ వరదకష్టాలు తప్పడం లేదు. ముంబై నగరవీధుల నుంచి తాము తోడిపోసిన నీరు మూడు సరస్సుల నీటితో సమానమని అధికారులు చెబుతున్నారంటే ఆ నగరం ఎంత గడ్డు స్థితిలో ఉందో తెలుస్తుంది. జూన్ నెల మొత్తం కురవాల్సిన వర్షంలో 85 శాతం కేవలం నాలుగు రోజుల్లో పడిందని వాతావరణ విభాగం చెబుతోంది. భారీవర్షం పడినప్పుడు వరద నీరంతా పోవడానికి వీలుగా డ్రెయినేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని బీఎంసీ ఏడాది క్రితం ప్రకటించింది. అందు కోసం దాదాపు రూ. 1,600 కోట్ల వ్యయం చేసింది. కానీ చివరికి ఫలితం మాత్రం ఎప్పటిలానే ఉంది. ఒకపక్క చెన్నై మహానగరం గొంతెండి దాహార్తితో అలమటిస్తోంది. సరిగ్గా అదే సమయానికి పడమటి దిక్కునున్న ముంబై మహానగరం పీకల్లోతు వరదనీటిలో చిక్కుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతోంది. ఈ రెండు సమస్యలకూ మూలం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్లోనే ఉంది. నగరాల్లో ఆకాశహర్మ్యాలుంటాయి. వేలాదిమందికి ఉపాధి కల్పించే భారీ సంస్థలుంటాయి. విశాలమైన రోడ్లు, వాటిపై దూసుకుపోయే కార్లుంటాయి. ఇవి మాత్రమే నగరానికి ఆనవాళ్లని చాలా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ అవి సురక్షితంగా ఉండాలంటే వాటికి సమీపంలో చెరువులు, సరస్సులుండాలి. కురిసే వర్షాన్నంతా అవి ఇముడ్చుకోగలగాలి. చెట్లు, తుప్పలు, గడ్డి వగైరాలు కనబడాలి. ఇవన్నీ నగర కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాతావరణ సమతుల్య తను కాపాడతాయి. భూగర్భ జలవనరులను పెంచుతాయి. వీటన్నిటినీ ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తే నగరాల్లో ఇంతచేటు వేసవి తాపం ఉండదు. అంతేకాదు, కురిసే నీరు నేలలోకి ఇంకేందుకు వీలుండాలి. కానీ నగరాలన్నీ సిమెంటు రోడ్లతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ భారీ భవనాలు నిర్మాణమవుతున్నాయి. వీటి సంగతలా ఉంచి ఉపాధి నిమిత్తం, చదువుల కోసం, ఇతరత్రా అవ కాశాల కోసం జనమంతా నగరాలవైపు చూడక తప్పనిస్థితి కల్పించినప్పుడు వారికి అవసరమైన పౌర సదుపాయాలన్నీ అందుబాటులోకి తీసుకురావాలి. సురక్షితమైన మంచినీరు లభ్యమయ్యేలా చూడటం, మురుగునీటి వ్యవస్థ, చెత్త తొలగింపు ఈ సదుపాయాల్లో కీలకం. చెత్త తొలగింపు అనేది నగరాలను ఇప్పుడు పట్టిపీడిస్తున్న సమస్య. ప్రస్తుతం ముంబై వరదనీటిలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం కూడా ఈ చెత్తేనని అధికారులు చెబుతున్నారు. జనం వాడి పారేసిన ప్లాస్టిక్ సీసాలు, సంచులు వగైరాలు డ్రైనేజీ వ్యవస్థకు పెద్ద అవరోధంగా నిలిచాయని వారు చెబుతున్న మాట. నగరాన్ని వరదలు ముంచెత్తడానికి కురిసిన వాన నీరంతా సక్రమంగా పోయే దోవ లేక పోవడమేనని ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నగరంలో ప్లాస్టిక్ సంచులు, సీసాలు ఉత్పత్తిని, వినియోగాన్ని నిరోధించి వాటి స్థానంలో పర్యావరణహితమైన ఇతర ప్రత్యా మ్నాయాలను ఇన్నేళ్లుగా అమల్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారో పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. శివారు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు పెట్టి అక్కడ చెత్తను పారబోయడం పరి ష్కారం కాదు. ఆ చెత్తను రీసైక్లింగ్ చేసుకుని, తిరిగి వినియోగించగలిగే వ్యవస్థలు రూపొందించాలి. ముంబైలోని విరార్, జుహూ, మలాద్, గోరెగావ్, పోవై, అంధేరి, బొరివ్లీ, శాంతాక్రజ్, చెంబూర్, వొర్లి, పణ్వేల్, ఠాణే వంటి ప్రాంతాలు నడుంలోతుకు మించిన వరదనీటితో విల విల్లాడాయి. భారీ వర్షాలు ముంచెత్తిన ప్రతిసారీ ఈ ప్రాంతాల్లో ఇదే దుస్థితి. కాస్త ముందు చూపు ఉండి, ఏ ఏ ప్రాంతాలను తరచు వరద నీరు ముంచెత్తుతున్నదో గమనించి, ఆ నీరంతా పోవడానికి అనువైన కాల్వలను ఏర్పాటు చేస్తే సమస్య తలెత్తదు. కానీ ఆ పనులేవీ సక్రమంగా సాగటం లేదు. ముంబైలో కురిసిన వాన నీరంతా అటు సముద్రంలోగానీ, దానికి ఆనుకుని ఉన్న మహుల్, మహిం, ఠాణే కయ్యల్లోగానీ కలుస్తుంది. కొంత నీరు మిథి నదిలో కలుస్తుంది. మిథి తీరంలో అక్రమ కట్టడాలు పెరిగి, దాని దోవ కుంచించుకుపోవడంతో వరదనీరు పట్టాలపైకి చేరుతోంది. ఫలితంగా ప్రతిసారీ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షాకాలంలో ఈ మహానగరం ఎందుకిలా తల్లడిల్లుతున్నదో ముంబై ఐఐటీ, గాంధీనగర్ ఐఐటీ బృందాలు అధ్యయనం చేశాయి. వివిధ రకాల చర్యలను సూచిస్తూ నివేదికలిచ్చాయి. కానీ వాటిని అమలు చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వమూ, బీఎంసీ కూడా విఫలమయ్యాయి. నిజానికి రెవెన్యూపరంగా చూస్తే దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్లన్నిటికంటే బీఎంసీ రాబడే అధికం. కానీ సమర్ధవంతమైన ప్రణాళికలు రూపొందించుకుని నగరాన్ని తీర్చిదిద్దడంలో ఆ సంస్థ పదే పదే విఫలమవుతోంది. మన పొరుగునున్న చైనాలో నగరాలు ఇలా తరచు వరదల వాతబడుతున్న తీరుచూసి ఆ దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2013లో ఒక ప్రణాళిక ప్రకటించారు. చుక్క నీరు కూడా వృథా కాని రీతిలో కురిసిన వర్షం నీటినంతటినీ ఒడిసిపట్టాలని, అదంతా ఇముడ్చుకోవడానికి అనువైన సరస్సులు, చెరువులు నగరాల వెలుపల ఉండాలని, మురుగునీరు పునర్వినియోగానికి అవసరమైన సహజ విధానాలు అమలుకావాలని ఆదేశించారు. అయిదారేళ్లు గడిచాక చూస్తే ఆ నగరాలు అన్నివిధాలా మెరుగ్గా మారాయి. సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. అది కొరవడటం వల్లే మన దేశంలో ముంబైకి, చెన్నైకి, అనేక ఇతర నగరాలకూ తరచుగా ఈ ఈతిబాధలు! -
అన్నా వర్సిటీ ఉన్నతాధికారిణి సస్పెండ్
సాక్షి, చెన్నై: ఫెయిలయిన విద్యార్థుల నుంచి లంచం తీసుకుని పునఃమూల్యాకంనంలో పాస్ చేయించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ఉమపై సస్పెన్షన్ వేటు పడింది. పరీక్షల విభాగంలో అక్రమాలపై 50 మంది విద్యార్థులను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) శుక్రవారం విచారించింది. రీ వాల్యుయేషన్‌లో లంచం తీసుకుని విద్యార్థుల్ని పాస్ చేసిన ఘటన వెలుగచూడడం తెల్సిందే. దీంతో అన్నా వర్సిటీ ఉన్నతాధికారులు ఉమను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ మాట్లాడుతూ ఈ కేసులో ఏ ఒక్కర్నీ వదిలేదలేదని స్పష్టంచేశారు. -
నటి మనోరమకు అస్వస్థత
చెన్నై: ప్రముఖ తమిళ నటి మనోరమ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం మనోరమకు ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. మనోరమ గుండెపోటుకు గురై ఉండవచ్చని భావిస్తున్న వైద్యులు.. ఆమెకు యాంజియోప్లాస్టీ చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించారని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు -
చర్చలు రద్దు
సాక్షి, చెన్నై: సముద్రంలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జాలర్ల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే దాడుల నివారణ సాధ్యమని తేల్చారుు. అందుకు తగ్గ చర్యలను సంఘాల నాయకులు తీసుకున్నారు. రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చల ద్వారా కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా జనవరిలో చెన్నై వేదికగా జరిగిన రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు సంతృప్తికరంగా సాగారుు. ఇందులో తీసుకున్న నిర్ణయాల్ని రహస్యంగా ఉంచారు. మలి విడత చర్చల్లో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి నిర్ణయాలు ప్రకటించడంతో పాటు అందుకు తగ్గ ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత ఫిబ్రవరి నెలాఖరులో చర్చలకు ఏర్పాట్లు చేస్తే శ్రీలంక అధికారులు స్పందించలేదు. ఎట్టకేలకు ఈ నెల 13న చర్చలకు సర్వం సిద్ధం చేశారు. చర్చలకు మరో వారం ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన 177 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లడం వివాదానికి దారి తీసింది. వారందర్నీ విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చర్చల తేదీని ఈ నెల 25కు వాయిదా వేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన కేంద్రం శ్రీలంకతో సంప్రదింపులు జరిపి జాలర్లందర్నీ విడుదల చేయించింది. చర్చలకు ఈ పర్యాయం షురూ అన్న ధీమా పెరిగింది. రెండు రోజుల క్రితం శ్రీలంక నావికాదళం 77 మంది రాష్ట్ర జాలర్లను పట్టుకెళ్లడంతో చర్చలపై నీలి మేఘాలు ఆవహించాయి. ఈ క్రమంలో 77 మందిని మంగళవారం విడుదల చేస్తారని అందరూ భావించారు. శ్రీలంక నుంచి వచ్చే సంకేతం మేరకు కొలంబో బయలుదేరడానికి జాలర్ల సంఘాల ప్రతినిధులు, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యూరు. ఏ ఒక్కర్నీ శ్రీలంక ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో చర్చలు రద్దు అయినట్టేనన్న సంకేతం వెలువడింది. అధికారులు చర్చలు వాయిదా వేసుకోవడంతో జాలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా సమస్య కొలిక్కి వ స్తుందనుకుంటే, అందుకు తగ్గ ప్రయత్నాలు ఆదిలోనే హంస పాదు అన్న చందంగా మారడం జాలర్లను ఆవేదనకు గురిచేసింది. చర్చల్ని పక్కదారి పట్టించడమే లక్ష్యంగా శ్రీలంక సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
తనిఖీ సొమ్ము స్వాహా
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారులే రూ8.25 లక్షలు స్వాహా చేసి కటకటాలపాలైన సంఘటన సేలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎన్నికల నిబంధనలు మేరకు రాష్ట్రంలో వాహనాల తనిఖీ ముమ్మరంగా సాగుతోంది. ఓటుకు నోటు విధానంపై ఆధారపడే నాయకులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక్క వాహనాన్నీ వదలకుండా రేయింబ వళ్లు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాధారణ ప్రజలు రూ.50 వేలకు మించి తీసుకెళ్లరాదని, వ్యాపారులు రూ.10 లక్షల వరకు తీసుకెళ్లవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఆ నగదుకు సరైన డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలని తెలిపింది. స్వాధీనం చేసుకున్న డబ్బుకు సంబంధిం చి డాక్యుమెంట్లు చూపిస్తే తిరిగి ఇచ్చేయూలని ఎన్నికల ప్రధాన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పదేపదే ప్రకటిస్తున్నారు. ఎన్ని చేసినా నగదు మాత్రం తరలుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ వరకు వాహనాల తనిఖీల్లో రూ.13 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐలు చేతివాటం ప్రదర్శించారు. స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత స్వాహా చేశారు. ఎన్నికల సందర్భంగా నియమితులైన ప్రత్యేక ఎస్ఐలు సుబ్రమణియన్, గోవిందన్ కుప్పనూర్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఏర్కాడుకు చెందిన ఎం.కుప్పుస్వామి (37) కొడెకైనాల్‌కు కారులో వెళుతుండగా సోమవారం రాత్రి చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ఎస్ఐలు ఆపారు. రెండు సంచుల్లో నగదును గుర్తిం చారు. దీంతో కుప్పుస్వామి, కారులో ఉన్న రామసుందరం, డ్రైవర్ బాలకృష్ణన్‌ను వీరానం పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. అక్కడ రెండు సంచుల్లోని నగదును లెక్కించారు. నగదుకు సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లు లేవని కుప్పుస్వామి చెప్పడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల సహాయ అధికారి ముత్తురామలింగంకు అప్పగించారు. నగదును తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారి ఒక పత్రాన్ని సిద్ధం చేసి కుప్పుస్వామిని సంతకం చేయాల్సిందిగా కోరాడు. అందులో రూ.26.75 లక్షలు ఉన్నట్టు రాసి ఉండడాన్ని గమనించిన అతను సంతకం చేయడానికి నిరాకరించాడు. కొడెకైనాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని చెల్లించేందుకు రూ.35 లక్షలు తీసుకెళుతున్నానని, మిగిలిన సొమ్ము ఏమైందని కుప్పుస్వామి ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో బిత్తరపోయిన ముత్తురామలింగం పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన సేలం డీఐజీ అమర్‌రాజా, ఎస్పీ శక్తివేల్ పోలీసులే దొంగలని నిర్ధారించుకున్నారు. రూ.35 లక్షల నుంచి కాజేసిన రూ.8.25 లక్షలను వీరానం పోలీస్ స్టేషన్లోనే రహస్యంగా దాచినట్టు గుర్తించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత చెరిసగం పంచుకోవాలని ఇద్దరు ఎస్ఐలు పన్నిన పథకం బెడిసికొట్టింది. ఎస్ఐలు సుబ్రమణియన్, గోవిందన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. త్వరలో వారిద్దరినీ సస్పెండ్ చేయనున్నట్లు ఎస్పీ శక్తివేల్ ప్రకటించారు. తనిఖీలు వేధింపులు కాకూడదు వాహనాల తనిఖీల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేయడం ఎంతమాత్రం తగదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్‌కుమార్ మంగళవారం మరోసారి హెచ్చరించారు. తనిఖీల సమయంలో చిరు వ్యాపారుల నుంచి భారీ మొత్తంతోపాటు జేబుల్లో ఖర్చుకు పెట్టుకున్న నగదునంతా స్వాధీనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారికి అడ్డంకులు సృష్టించరాదని హితవు పలికారు. డాక్యుమెంట్లు సమర్పించేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా తొందరపాటుతో వ్యవహరించరాదని వివరించారు. డాక్యుమెంట్లు చూపిన వారి సొమ్మును ఇచ్చేయడంలో ఎటువంటి జాప్యం కూడదన్నారు. నకిలీ అధికారులు చలామణిలో ఉన్నందున తనిఖీ విధులు నిర్వర్తించేవారు విధిగా తమ గుర్తింపు కార్డులను ధరించాలని ఆదేశించారు. -
మాది గెలుపు కూటమి
చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో గెలుపు కూటమి ఆవిర్భవించడం తథ్యమని కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి కే వాసన్ ధీమా వ్యక్తంచేశారు.ఎన్నూర్ హార్బర్లో ఆదివారం నిలు వెత్తి కామరాజర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్నూర్ హార్బర్‌కు మాజీ సీఎం, దివంగత నేత కామరాజర్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ హార్బర్ ప్రవేశ మార్గంలో నిలువెత్తి కామరాజర్ విగ్రహం ఏర్పాటుకు కేంద్ర నౌకాయూన శాఖ చర్యలు తీసుకుంది. పది అడుగుల ఎత్తుతో 380 కిలోల బరువుతో కామరాజర్ నడిచి వస్తున్నట్టుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహావిష్కరణ ఉదయం జరిగింది. విగ్రహావిష్కరణ: నిలువె త్తు కామరాజర్ విగ్రహాన్ని కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్ ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామరాజర్ సేవల్ని కొనియాడుతూ వాసన్ ప్రసంగించారు. కామరాజర్ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో ఈ విగ్రహం రూపుదిద్దుకున్నదని వివరించారు. కామరాజర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కేంద్రంలోని తమ ప్రభుత్వం పయనిస్తున్నదన్నారు. ఆయన హయూంలో ప్రవేశ పెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో నేడు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి యాభై ఏళ్ల ముందే ఆయన పునాది వేసి వెళ్లారని వివరించారు. అందుకే ఆయన పేరును నామకరణం చేయాలని కేంద్రాన్ని పట్టుబట్టామన్నారు. కేంద్రం అంగీకరించడంతో ఎన్నూర్ హార్బర్‌కు ఆయన పేరును నామకరణం చేశామని, ఉప్పు శాఖ స్థలాల్ని ఈ పోర్టు పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు. కామరాజర్ విగ్రహావిష్కరణతో ఇక్కడి పనులు ముగియ లేదని, ఈ హార్బర్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నౌకాయూన శాఖ అధికారి మురుగానందన్, ఎన్నూర్ హార్బర్ చైర్మన్ భాస్కర్, చెన్నై హార్బర్ చైర్మన్ అతుల్య మిశ్ర తదితరులు పాల్గొన్నారు. వాసన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ నేతృత్వంలో గెలుపు కూటమి ఆవిర్భవించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వెలువడక ముందే, ఎలా కూటమిని ప్రకటిస్తామన్నారు. చర్చలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తమ నేతృత్వంలో ఏర్పడే కూటమి గెలుపు కూటమిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పథకాలు, నిధులు కేటాయిస్తూ వచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉందని, తమకు పట్టం కట్టడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమకేనని, ఎవరెన్ని కుట్రలు, కుతుంత్రాలు, జిమ్మిక్కులు చేసినా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని జోస్యం చెప్పారు. -
సర్వం సిద్ధం
చెన్నై: పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మరి కొన్ని గంటల్లో ప్లస్ టూ పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఎనిమిది లక్షల 26 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రెండు వేల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 వేల మందితో ఫ్లరుుంగ్ స్క్వాడ్లు పరీక్షల పర్యవేక్షణకు నియమించారు. ప్లస్‌టూ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు అభ్యసించేందుకు వీలుంది. ఏడాది కాలంగా చదువుపై దృష్టి పెట్టిన విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. రాష్ట్ర పరీక్షల విభాగం డెరైక్టర్ దేవరాజన్ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాలు: రాష్ట్రంలో 2,220 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రంలోని 884 మహోన్నత పాఠశాలలకు చెందిన ఎనిమిది లక్షల పన్నెండు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పుదుచ్చేరిలోని 120 మహోన్నత పాఠశాలల నుంచి 13,528 మంది పరీక్షలు రాయనున్నారు. 58 మంది ఖైదీలు : జైళ్లు సరస్వతీ నిలయాలుగా మారడంతో ప్లస్‌టూ పరీక్షలు రాసే ఖైదీల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 58 మంది ఖైదీ పరీక్షలు రాయడానికి సిద్ధం అయ్యారు. చెన్నై పుళల్ కేంద్ర కారాగారం సెంటర్‌గా పరీక్షకు ఏర్పాట్లు చేశారు. 53,629 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. చెవిటి, మూగ, బధిర, అంధత్వం వంటి శారీరక రుగ్మతలతో బాధ పడుతున్న వాళ్లు వెయ్యి మంది పరీక్షలు రాయడానికి సిద్ధం అయ్యారు. వీరికి లాంగ్వేజ్ సబ్జెకు మినహాయింపుతో పాటుగా, పరీక్షకు అదనంగా ఓ గంట ఇవ్వనున్నారు. స్క్వాడ్లు: మొత్తం ఇన్విజిలేటర్లుగా, పర్యవేక్షకులుగా లక్ష మంది సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. నాలుగు వేల మందితో ఫ్లయింగ్ స్క్వాడ్లు సిద్ధం అయ్యాయి. విద్యా శాఖ డెరైక్టర్ , జాయింట్ డెరైక్టర్లు, అన్నా వర్సిటీ అధ్యాపకులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారుల నేతృత్వంలోప్రత్యేక స్క్వాడ్లు రంగంలోకి దిగనున్నాయి. నిఘా నీడ: ప్రశ్నా పత్రాలను నిఘా నీడల్లో ఆయా జిల్లా, డివిజన్,నగర,మండల కేంద్రాలకు పంపించారు. ఆయాప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాల్ని తరలించేందుకు ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేశారు. పరీక్షల కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం మరుగు దొడ్లు, తాగునీటి వసతి కల్పించారు. కంట్రోల్ రూం: ఈ ఏడాది ప్రపథమంగా ఓ కంట్రోల్ రూంను చెన్నైలో ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన ఏదేని ఆరోపణలు, తప్పుల తడక గురించి, ఏదేని ఫిర్యాదులు చేయదలచినా ఈ కంట్రోల్ రూంను సంప్రదించవచ్చు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, రెండు నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టుల్లో ఈ కంట్రోల్ రూంలో సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. విద్యార్థులు ఈ కంట్రోల్ రూంలకు ధైర్యంగా ఫిర్యాదులు చేయొచ్చని పరీక్షల విభాగం ప్రకటించింది. 044-28278284, 28278286, 28272088 నంబర్లకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. మేలో ఫలితాలు: జాప్యానికి ఆస్కారం లేని రీతిలో ఈ ఏడాది మే మొదటి వారంలోనే ఫలితాలు ప్రకటించనున్నామని పరీక్షల విభాగం డెరైక్టర్ దేవరాజన్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరీక్షలు ఈనెల 25తో ముగియనున్నాయని, 66 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది తమిళ మాధ్యమంలో పరీక్షలు రాయనున్న ఐదు లక్షల 45 వేల 771 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయించినట్లు చెప్పారు. ఈ ఏడాది జవాబు పత్రాన్ని సరికొత్తగా రూపొందించినట్టు వివరించారు. తొలి పేజిలో విద్యార్థుల ఫొటో, నెంబర్లు, పరీక్ష తేదీ, సబ్జెక్టు వివరాలు తామే పొందు పరచి ఉన్నామన్నారు. వాటిని విద్యార్థులు సరి చూసుకుని సంతకం పెడితే చాలు అన్నారు. ఒక్కో గదిలో 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రశ్నా పత్రం చదువుకునేందుకు పది నిమిషాలు, తొలి పేజీ సరి చూసుకునేందుకు ఐదు నిమిషాలు అదనంగా కేటాయిస్తున్నామన్నారు. పరీక్ష సరిగ్గా 10.15గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.15కు ముగుస్తుందన్నారు. గుర్తింపు రద్దు : ఏదేని విద్యాసంస్థలు తమ చేతివాటాన్ని ప్రదర్శించినా, మాస్‌కాపీయింగ్‌కు పాల్పడినా, తక్షణం ఆ విద్యాసంస్థల గుర్తింపు రద్దు అవుతుందని దేవరాజన్ హెచ్చరించారు. ప్రశ్నలు తమిళం, ఆంగ్లంలో ఉంటాయని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ సౌకర్యం సైతం కల్పించామన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో శబ్ద కాలుష్యాన్ని సృష్టించొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం
తిరువొత్తియూరు: చెన్నైలో మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆయుర్వేద మసాజ్ సెంటర్ పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు లు అందాయి. దీనిపై విచారణ చేయాలని పోలీసు కమిషనర్ జార్జి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సాలిగ్రామం, అరుణాచలం వీధిలో ఉన్న ఓ మసాజ్ సెంటర్‌ను బుధవారం రాత్రి తనిఖీ చేశా రు. తనిఖీల్లో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి దళారి అరుణ్‌దేవ్ (24)ను అరెస్టు చేశా రు. అతని నుంచి ఇతర రాష్ట్రాలకు చెంది న నలుగురు యువతులను విడిపించా రు. అలాగే అరుంబాక్కంలో ఒక లాడ్జి లో తనిఖీ చేయగా కర్ణాటకకు చెందిన జక్కరియా(24), సైనుద్దీన్(24), అబ్దుల్ మజిత్ (24) అనే వ్యభిచార దళారులు చిక్కారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడిపించారు. కోడంబాక్కం పవర్ హౌస్ ప్రాంతంలో తనిఖీ చేయగా అక్క డ వ్యభిచారం నిర్వహిస్తున్న బ్రోకర్లు జోబిజాన్(31),మహమ్మద్ సాఖి(20)ని అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను విడిపించారు. ఆరుగురిని కోర్టులో హాజ రు పరచి పుళల్ జైలుకు తరలించారు. -
ఆరనిజ్వాల
కాంగ్రెస్, , తమిళ సంఘాల మధ్య రగిలిన జ్వాల రెండో రోజూ ఆరలేదు. బుధవారం జరిగిన రణరంగానికి ప్రతిఫలంగా గురువారం చెన్నైలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. నామ్ తమిళర్ కట్చి కార్యాలయంపై పెట్రో బాంబు దాడి జరిగింది. కాంగ్రెస్ వర్గాల ఆందోళనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్యమూర్తి భవన్ ముట్టడి, దాడి కేసులో ఏడుగురు తమిళ సంఘాల ప్రతినిధులను అరెస్టు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నామ్ తమిళర్ కట్చి, తమిళర్ మున్నేట్ర పడై తదితర ఈలం తమిళాభిమాన సంఘాలు ఇచ్చిన పిలుపు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బుధవారం సత్యమూర్తి భవన్ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. దీంతో ఆ పరిసరాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహాలపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ తమ ప్రతాపం చూపించారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. రాజీవ్ విగ్రహాల ధ్వంసం: వేప్పెరి పోలీసు స్టేషన్ సమీపంలో, పెరంబూరు బ్యారెక్స్ రోడ్డు - పురసై వాక్కం మార్గంలో, పటాలంలోని దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఒక చోట విగ్రహం ముఖాన్ని ధ్వంసం చేయగా, రెండు చోట్ల తలను తీసి పక్కన పెట్టేశారు. మరి కొన్ని చోట్ల విగ్రహాలను అవమానించే రీతిలో వ్యవహరించి వదిలి పెట్టారు. ఉదయాన్నే ఈ విగ్రహాలను చూసిన ఆయా ప్రాంతాల కాంగ్రెస్ నేతల్లో ఆక్రోశం రగిలింది. ఈ ధ్వంసం తమిళ సంఘాల పనేనంటూ ఆందోళనలకు దిగారు. రాయపురం, పెరంబూరు, పురసైబాక్కం, వలసరవాక్కంలలో కాంగ్రెస్ నేతలు రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. ఈ దాడులు నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ అండ్ బృందం పనిగా పేర్కొంటూ, వారిని అరెస్టు చేయాలని పట్టుబట్టారు. రాస్తారోకోలతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు. ఉద్రిక్తత వాతావరణం నెలకొనకుండా ఆయా పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్తగా కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామని కాంగ్రెస్ నేత రాయపురం మనో పేర్కొన్నారు. పెట్రో బాంబు దాడి: బుధవారం అర్ధరాత్రి నామ్ తమిళర్ కట్చి కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు పోరూర్‌లోని ఆ పార్టీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు. అదృష్ట వశాత్తు ఆ పెట్రోల్ బాంబు పేలలేదు. అక్కడి సిబ్బంది దానిని ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బాంబు దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు. విగ్రహాల ధ్వంసాలపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి కార్యాలయానికి భద్రతను కల్పించారు. ఉదయాన్నే కొందరు కాంగ్రెస్ నాయకులు వలసరవాక్కంలోని సీమాన్ ఇంటిపై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఏడుగురు అరెస్టు:సత్యమూర్తి భవన్‌వద్ద జరిగిన దాడిపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. ఆ కార్యాలయంపై దాడికి, కాంగ్రెస్ నాయకులపై హత్యాయత్నం చేశారంటూ ఏడుగుర్ని అరెస్టు చేశారు. వీరిలో తమిళర్ మున్నేట్ర పడైకు చెందిన వీర లక్ష్మి, దురై, పార్తీబన్, సురేష్, మదన్, వెంకటేష్, భరత్ ఉన్నారు. -
బీజేపీతో కెప్టెన్ దోస్తీ
భారతీయ జనతా పార్టీతో డీఎండీకే అధినేత విజయకాంత్ దోస్తీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తు ఖరారుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది . డీఎండీకేతో పొత్తుకోసం అన్ని ప్రయత్నాలు చేసి భంగపడిన బీజేపీ మళ్లీ చర్చలు ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శి ఎస్ మోహన్‌రాజు రెండు రోజులుగా విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతతో మంతనాలు జరుపుతున్నారు. రెండు పార్టీల్లో నెలకొన్న పంతా లు పొత్తు చర్చల ప్రతిష్ఠంభనకు దారితీశాయి. అయితే విజయకాంత్ ఒక మెట్టుదిగివచ్చి తొలుత డిమాండ్ చేసిన 20 స్థానాలను వదిలి 14 స్థానాలను కోరుతున్నారు. అయితే 12 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ సుముఖం గా ఉంది. బీజేపీ కూటమిలో ఇప్పటికే ఎండీఎంకే, పీఎంకే, కొంగునాడు, ఇండియ జననాయక కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. ఎండీఎంకే 10 స్థానాలు, పీఎంకే 12, తన మిత్రపక్షానికి 2 కోరుతున్నారుు. ఈ పార్టీలన్నింటీకి పంపాలు జరపాల్సి ఉందని బీజేపీ నేతలు కెప్టెన్‌కు నచ్చజెప్పారు. చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చిన దశలో పొత్తుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడయ్యే అవకాశం ఉంది. అన్బుమణి ఆగ్రహం : డీఎండీకేతో పొత్తు కోసం తమకు కేటాయించాల్సిన స్థానాల్లో కోత విధించడంపై పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పొత్తు ఖరారై 20 రోజులు దాటుతున్నా కెప్టెన్ కోసం తమ అంశాన్ని పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శిస్తున్నారు. తమ పార్టీతో పొత్తు చర్చలు జరిపినప్పటి సామరస్య ధోరణి నేడు కరువైందని అన్నారు. తమ పార్టీకి 10, తమ మిత్రపక్షాలకు కనీసం రెండు స్థానాలకు తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో పార్టీకోసం జరుపుతున్న పాకులాటలో తమను బలిపశువును చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖరారుచేసుకున్న సీపీఐ తమ పార్టీ నేతలకు కేటాయించాల్సిన స్థానాలపై శనివారం మూడో దశ చర్చలను పూర్తిచేసింది. అయితే ఇంకా స్థానాలపై స్పష్టత రాలేదు. -
అన్నదాతకు ‘కొత్త’ కానుక
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెరకు రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. టన్ను చెరకుకు 2,650 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం మంత్రి మండలి సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, విభాగాల వారీగా ప్రగతి, నిధుల కేటాయింపులు, కలెక్టర్ల మహానాడులో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తులు, రాష్ర్టంలో సాగవుతున్న పంటల ఉత్పత్తి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చెరకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టన్నుకు రూ. 2650 : రాష్ర్టంలో 8.65 లక్షల ఎకరాల్లో చెరకు సాగువుతోంది. చెరకు రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తోందని సీఎం జయలలిత గుర్తుచేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, రుణాల పంపిణీ గురించి విశదీకరించారు. చక్కెర ఉత్పత్తి పెంపు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం చెరకు మద్దతు ధర ప్రకటించినప్పుడల్లా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కొంత మొత్తాన్ని చేరుస్తూ, అన్నదాతకు అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ ఏడాది టన్నుకు రూ.2100 కేంద్రం నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా రూ.550ను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పెంచామన్నారు. టన్ను మద్దతు ధర రూ.2650గా నిర్ణయించామన్నారు. 2013-14 సంవత్సరానికి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించినా, రాష్ర్ట వాటాలో చడీచప్పుడు కాకుండా రూ.వంద కోత పెట్టడం గమనార్హం. 2011-12లో కేంద్రం రూ.1450ను ప్రకటించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా650ను ప్రభుత్వం ఇచ్చింది. అలాగే, 2012-13కు గాను కేంద్రం రూ.1700 నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తోపాటుగా 650ను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అయితే, తాజాగా రూ.650, నుంచి రూ.550 కావడం గమనించాల్సిందే. -
జయ పాలనను కాంగ్రెస్ వ్యతిరేకించడంలేదు
టీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జయలలిత పాలనను వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ విముఖత చూపడంలో అంతర్యమేమిటని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ధ్వజమెత్తారు. సేలం జిల్లా, వాళప్పాడిలో డీఎంకే ఆధ్వర్యంలో బహిరంగ సభ మంగళవారం జరిగింది. సేలం జిల్లా నిర్వాహకుడు శివలింగం అధ్యక్షత వహించారు. ఈ సభలో డీఎంకే కోశాధికారి స్టాలిన్ మాట్లాడుతూ ఏర్కాడు ఉప ఎన్నికలో డీఎంకే పార్టీకి 65 వేల ఓట్లు లభించాయని, ఇది సామాన్యమైన విషయం కాదన్నారు. అందుచేత నియోజకవర్గ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టామని, ఇందులో పార్లమెంటు ఎన్నికల గురించి,డీఎంకే పనితీరు గురించి అధ్యక్షుడు కరుణానిధి కొన్ని ప్రకటనలు చేశారన్నారు. జయలలిత ప్రభుత్వ తీరును ఎదిరించేందుకు మద్దతు కోరుతూ అన్ని ప్రతిపక్ష పార్టీలకు లేఖలు రాశారన్నారు. అయితే కాంగ్రెస్ ఇందుకు నిర్విద్ధంగా నిరాకరించిందన్నారు. జయ పాలనలో అభివృద్ధి పథకాలు అమలు జరగలేదని, రెండున్నరేళ్లలో 21 మంది మంత్రులను మార్చడం గొప్పగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. అనేక మంది డీఎంకే నేతలపై అబద్దపు కేసులు దాఖలు చేసి జైళ్లకు పంపారని, అయితే ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారన్నారు. డీఎంకే పార్టీ అభివృద్ధి పథంలో పయనించే రోజు త్వరలో ఉందని తెలిపారు. -
దేశంలో అంతర్జాతీయ స్టార్ హోటళ్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మరిన్ని స్టార్ హోటళ్లను ప్రారంభించనున్నట్లు ఇంటర్నేషనల్ హోటల్స్ గ్రూప్ (భారత్, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా) సీఈవో పాస్కల్ గోవిన్ తెలిపారు. చెన్నై సమీపంలోని మహీంద్రా వర ల్డ్సిటీలో హాలిడే ఇన్ ఎక్స్‌ప్రెస్ స్టార్ హోటల్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోవిన్ మాట్లాడుతూ, 1991 నుంచి ఇప్పటి వరకు తమ బ్రాండ్‌పై ప్రపంచ వ్యాప్తంగా 2,235 హోటళ్లు నిర్మించినట్లు తెలిపారు. భారత్‌తోపాటూ విదేశాల్లో మరో 18 హాలిడేఇన్ హోటళ్లు రానున్నాయని తెలిపారు. డ్యూయట్ గ్రూపు హోటళ్ల పరిధిలో నిర్మించిన ఈ హాలిడేఇన్ భవిష్యత్తులో భారత్‌లోనే ఒక బ్రాండుగా మారగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్‌లో హోటళ్ల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వాణిజ్య, వ్యాపార ప్రముఖులను దృష్టిలో ఉంచుకుని హోటళ్లలో వసతులు కల్పించడం తమ ప్రత్యేకతగా ఆయన చెప్పారు. డ్యూయెట్ ఇండియా హోటల్స్ ప్రెసిడెంట్ నవీన్‌జైన్ మాట్లాడుతూ, దక్షిణ భారతావనిలోనే కమర్షియల్ హబ్‌గా పేరుగాంచిన చెన్నైలోని ఈ హోటల్‌కు ఉజ్వలభవిష్యత్తు ఉందని భావిస్తున్నామని అన్నారు. డ్యూయట్ హోటల్స్ కంట్రీహెడ్ సౌరభ్ సొంతాలియా మాట్లాడుతూ, దేశంలోనే ఇది రెండో ప్రాజెక్టని తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే వ్యాపార, పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకుని చెన్నైని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువని గుర్తించినందునే హోటల్ ఆవశ్యకత ఉందని ఇంటెగ్రేటెడ్ సిటీస్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, మహేంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ సీఈవో సంగీతా ప్రసాద్ అన్నారు. -
రేపు చెన్నైకు ప్రణబ్ రాక
సాక్షి, చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం చెన్నైకు రానున్నారు. నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘా లు నిరసనలకు దిగాలని నిర్ణయించాయి. దీంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక రోజు పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెన్నైకు వచ్చేందుకు నిర్ణయించారు. ఎంఆర్సీ నగర్‌లోని హోటల్లో జరిగే కార్యక్రమంలోనూ, నుంగబాక్కంలోని లయోల కళాశాలలో జరిగే వేడుకలోనూ ఆయన పాల్గొననున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, రాష్ర్టపతి పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు విద్యార్థి సంఘాలు ప్రకటించారుు. ఈ సంఘాల్లో లయోల కళాశాల విద్యార్థులు సైతం ఉన్నారు. ఈలం తమిళులను అణగతొక్కేయడంలో మంత్రిగా ఉన్న సమయంలో ప్రణబ్ పాత్ర ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టబోతున్నామని ప్రకటించారుు. దర్శకుడు గౌతమన్ నేతృత్వంలో కొన్ని సంఘాలు ఇందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఎక్కడెక్కడ నిరసనలు తెలియజేయాలన్న వివరాలు విద్యార్థి సంఘాలు గోప్యంగా ఉంచడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రైవేటు కార్యక్రమం జరిగే హోటల్ పరిసరాల్లోను, ఆ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కర్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి నిర్ణయించారు. ఆహ్వాన పత్రికలు ఉన్న వాళ్లను మాత్రమే ఆ కార్యక్రమానికి అనుమతించనున్నారు. ఇక, ప్రధానంగా లయోల కళాశాల వేడుక పోలీసులకు సవాల్‌గా మారింది. ఈలం తమిళులకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాల్లో ఆ కళాశాల విద్యార్థులు భాగస్వాములుగా ఉన్నారు. దీంతో అక్కడ విద్యార్థులకు ఆంక్షలు విధించాలంటే సమస్య తలెత్తుతోంది. దీంతో పకడ్బందీగా వ్యవహరించి విద్యార్థి సంఘాల వ్యూహాలకు చెక్‌పెట్టే పనిలో నగర పోలీసు యంత్రాంగం ఉరకలు తీస్తున్నది. ప్రణబ్ పర్యటించే ప్రాంతాల్లో ఆగమేఘాలపై రోడ్లకు మెరుగులు దిద్దుతున్నారు. -
నిర్ణయం ఎటో?
సాక్షి, చెన్నై: వానగరం శ్రీవారు వెంకటాచలపతి కల్యాణ మండ పం వేదికగా గురువారం అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఇందులో ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 40 ఎంపీ సీట్లు లక్ష్యంగా ఆ పార్టీ కార్యాచరణ సిద్ధమవుతున్నా, తుది నిర్ణయం ఎటు వైపు మళ్లుతుందో అన్న ఎదురు చూపుల్లో వామపక్షాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల సందడి రాష్ట్రంలో మొదలైంది. నాలు గు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోం దన్న సంకేతాలకు బలం చేకూరింది. దీంతో రాష్ట్రంలోని ఆ పార్టీ లో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి. మరోవైపు తమది ఒంటరి సమరమేనని డీఎంకే అధినేత కరుణానిధి తేల్చారు. అయితే, లోక్‌సభ ఎన్నికల వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే యడం, ఆ కమిటీ తుది నివేదిక ఆధారంగా డీఎంకే ప్లేటు మార్చే అవకాశాలు కూడా ఉన్యా. డీఎండీకే మల్లగుల్లాలు పడుతుంటే, కాంగ్రెస్ అయోమయంలో పడింది. అధికార అన్నాడీఎంకే తన వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమైంది. కేంద్రంలో చక్రం తిప్పడం లక్ష్యంగా 40 సీట్ల కైవశం తమ కర్తవ్యం అన్నట్టు ఆ పార్టీ వర్గాలు దూసుకెళుతున్నారుు. దీంతో ఆ కూటమిలో తామున్నామని చెప్పుకుంటున్న వామపక్షాలకు సంశయం మొదలైంది. తమను అన్నాడీఎంకే అక్కున చే ర్చుకుంటుందా..? లేదా తిరస్కరిస్తుందా..? అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఈ ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడే అవకాశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల వైపు జయలలిత తలొగ్గేనా, లేదా బీజేపీకి స్నేహ హస్తం ఇచ్చేనా అన్నది సర్వ సభ్య సమావేశంలో తేలబోతోంది. నేడు సర్వ సభ్య సమావేశం : వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ కల్యాణ మండపం వేదికగా తన నిర్ణయం ఏమిటో సీఎం జయలలిత ప్రకటించబోతున్నారు. సర్వసభ్య సమావేశం అంటే, అన్నాడీఎంకే నాయకులకు దడ. అధినేత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయోనన్న బెంగ వారిలో నెలకొంది. లోక్ సభ ఎన్నికలపై నిర్ణయం ఎలా ఉన్నా, పార్టీ పరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభం అయ్యే ఈ సమావేశం కోసం సర్వం సిద్ధం చేశారు. జయలలితకు ఆహ్వానం పలికే ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు ఈ సమావేశం నిమిత్తం చెన్నైకు తరలి వస్తున్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు రాష్ట్రం లోని అన్ని జాతీయ బ్యాంకులు, ఎంతో కాలంగా సేవలందిస్తున్న కొన్ని ప్రయివేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఐసీఐసీఐ, యాక్సెస్, ఐడీబీఐ, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేదు. రాష్ట్రంలోని 14 వేల బ్యాంకులకు చెందిన 60 వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఆయా బ్యాంకుల ముందు ఉద్యోగులు తమ డిమాండ్లతో నినాదాలు చేశారు. దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. కొన్ని చోట్లు బ్యాంకులు తెరిచినా సిబ్బంది లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రంలో 3 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు, 5 లక్షల క్లియరెన్స్‌లు నిలిచిపోయాయి. చెన్నైలోని 1400 బ్యాంకుల్లో 3 లక్షల చెక్కులు నిలిచిపోయా యి. బ్యాంకుల సమ్మెను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలో మంగళవారం రాత్రే నగదుతో నింపివేశారు. ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే రూ.40వేలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఏటీఎంల వద్ద జనం క్యూకట్టారు. అనేక ఏటీఎంలలో బుధవారం సాయంత్రానికే నగదు ఖాళీ అయింది. చెన్నై బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షుడు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ, ఇందిరాగాంధీ హయాంలో ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయగా, నేడు పునర్ వ్యవస్థీకరణ పేరుతో మళ్లీ ప్రయివేటీకరణ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల తరబడి బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగ భద్రత కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా డిపాజిట్టుదారులకు రాయితీలు కల్పించడం, పాత బకాయిలను రద్దుచేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పై డిమాండ్లతోపాటూ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెంచాలనే తమ కోర్కెలకు కేంద్రం దిగిరాని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ఆలయాన్ని కూల్చేయండి!
సాక్షి, చెన్నై: అందరివాడు, దివంగత ఎంజియార్ ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్మించిన ఆలయం మరి కొద్ది రోజుల్లో నేల మట్టం కానుంది. శ్రీనీది కరుమారియమ్మన్ ఆలయా న్ని కూల్చి వేయాల్సిందేనని మంగళవారం మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయు డు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీయా ర్. అందరి వాడిగా మన్ననలు అందుకున్న ఎంజియార్కు రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయన విగ్రహం అంటూ లేని ఊరు ఉండదు. ఇందులో మద్రాసు హైకోర్టు ప్రవేశ మార్గంలో ఉన్న శ్రీనీది (న్యాయ) కరుమారియమ్మన్ ఆలయం ఒకటి. ఈ ఆలయ నిర్మాణానికి ఓ కారణం ఉంది. 27 ఏళ్ల క్రితం ఎంజియార్ అనారోగ్యం బారిన పడి అమెరికాలో చికిత్స పొందారు. ఆయన సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావాలని కాంక్షిస్తూ ఈ ఆలయాన్ని అభిమానులు అప్పట్లో నిర్మించా రు. న్యాయ స్థానం ప్రవేశ మార్గంలో శ్రీ నీది కరుమారియమ్మన్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 27 ఏళ్లుగా ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ వస్తున్నారు. వివిధ వేషాల్లో దివంగత నేత ఎంజియార్ చిత్ర పటాలను కొలువు దీర్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ట్రస్టీగా కంద శ్రీనివాసన్ వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయం హైకోర్టు ప్రవేశ మార్గంలోని ఎన్ఎస్సీ బోర్డు రోడ్డుపై ఉండటం, ఆ రోడ్డు విస్తరణ కావడం, ఫుట్ పాత్‌లు ఏర్పడటంతో ఈ ఆలయానికి చిక్కులు ఎదురయ్యాయి. పిటిషన్: రాకపోకలు అడ్డంకిగా ఉన్న ఈ ఆలయాన్ని తొలగించాలంటూ ఇటీవల సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ ఆలయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే, అధికారులు అందుకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయలేదు. అదే సమయంలో ఆలయాన్ని కూల్చి వేయకుండా స్టే కోరుతూ కంద శ్రీనివాసన్ హైకోర్టును ఆశ్రయించాడు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మళ్లీ ట్రాఫిక్ రామస్వామి కోర్టుకు ఎక్కారు. కూల్చండి: న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్ని హోత్రి, కేకే శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చింది. మంగళవారం వాదనల అనంతరం ఆ ఆలయాన్ని కూల్చి వేయాల్సిందేనని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఆలయం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మితమైందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ఈ స్థలం ప్రైవేటు స్థలం కూడా కాదన్న విషయాన్ని గుర్తించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రైవేటు స్థలంలో నిర్మించుకోవాలేగానీ, ఇలా ప్రభుత్వ స్థలంలో కాదంటూ అక్షింతలు వేసింది. చెన్నై కార్పొరేషన్, దేవాదాయ శాఖ అధికారుల వివరణలు సైతం బెంచ్ పరిగణనలోకి తీసుకుందని వివరించారు. ఫుట్‌పాత్‌ను, కోర్టు ప్రవేశ మార్గాన్ని ఆక్రమిస్తూ నిర్మించిన ఈ ఆలయాన్ని పదిహేను రోజుల్లోపు కూల్చి వేయాల్సిందేనని కార్పొరేషన్ అధికారుల్ని బెంచ్ ఆదేశించింది. స్టే కోసం కందా శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. -
‘యూనివర్సల్’లో మొబైల్ బీమా
సాక్షి, చెన్నై: మొబైల్ ఫోన్లకు బీమా పథకం వర్తింప చేస్తూ యూనివర్సల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. తమ షోరూంలలోనే కాకుండా, ఇతర దుకాణాల్లో కొనుగోలు చేసినా ఈ బీమా వర్తిస్తుంది. ఈ మేరకు మంగళవారం చెన్నైలో యూనివర్సల్ టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ నందకుమార్ ప్రకటించారు. ఇటీవల తాము మొబైల్ ఫోన్లపై దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించామన్నారు. ఇందులో 80 శాతం మంది తమ ఫోన్లు చోరీకి గురవుతున్నట్టు, కన్పించకుండా పోతున్నట్టు తేలిందని చెప్పారు. 20 శాతం మంది మాత్రమే ఫోన్లను అత్యంత జాగ్రత్తగా వాడుకుంటున్నట్లు చెప్పారు. యువకులు, విద్యార్థులైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్లను పోగొట్టుకుంటోన్నారని తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల విప్లవం వచ్చిందని గుర్తు చేస్తూ, ఖరీదైన ఫోన్లను పోగొట్టుకునే వారు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారన్నారు. ఈ పరిస్థితులను పరిగణ నలోకి తీసుకుని ఓరియంటల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌తో కలసి మొబైల్ ఫోన్లకు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని ప్రకటించారు. తమ షోరూం లలోనే కాకుండా, ఇతర షోరూంలలోను కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లకు కూడా ఈ స్కీం వర్తిస్తుందని వివరించారు. రూ.4 వేలకు పైబడి ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు ఈ బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ బీమా ఆధారంగా ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా, అగ్ని ప్రమాదం లో దగ్ధమైనా, ప్రమాదాలతో కన్పించకుండా పోయి నా, అందుకు తగ్గ ఆధారాల్ని, ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే, మొబైల్ ఫోన్ ధరలో 80 శాతం క్లయిమ్ చేయనున్నట్లు తెలిపారు. పన్నెండు నెలల కాల పరిమితితో ఈ బీమాను అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో బెంగళూరులో ఏర్పాటు చేసినట్టుగానే, చెన్నైలో అతి పెద్ద యూనివర్సల్ సింక్ షోరూం ప్రారంభించనున్నామని చెప్పారు. ఇందులో అదనపు సౌకర్యాలతో పాటుగా ప్రత్యేక ఆప్షన్లు ఉంటాయని వివరించారు. ఈ సమావేశంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ డిప్యూటీ జీఎం డాక్టర్ కోహ్లీ, యూనివర్సల్ ఉపాధ్యక్షురాలు సౌమ్య, ఆల్జీన్ ఎండీ రవీంద్రన్ పాల్గొన్నారు. -
మల్లగుల్లాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ పొత్తులపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కెప్టెన్‌కు గాలం వేసే పనిలో పడ్డాయి. అన్నాడీఎం, డీఎంకేలు తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఇక మూడో ప్రాంతీయ పార్టీ అరుున డీఎండీకేపై రెండు జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. రాజ్యసభ ఎన్నికల్లో తనకు స్నేహ హస్తం ఇవ్వలేదనే కోపంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. డీఎంకే సైతం చివరి వరకు ఆశచూపి కాంగ్రెస్ మద్దతును పొందడం విజయకాంత్‌ను బాధించింది. ఈ కారణంగా డీఎంకేపై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా మారుతున్న బీజేపీవైపు వెళితే ఎలా ఉంటుందో తేల్చుకోలేక పోతున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చెందిన మరో ప్రాంతీయ పార్టీకూడా బీజేపీ కూటమిలో చేరితే తన ప్రాధాన్యత ఉండదనే సంశయంలో ఉన్నారు. ఎండీఎంకే ఇప్పటికే బీజేపీకి పచ్చజెండా ఊపింది. పీఎంకే సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉంది. తన నాయకత్వాన్ని మన్నించి, గౌరవించినవారికే తన పార్టీ మద్దతు పలుకుతుందని విజయకాంత్ ఇటీవలే ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర స్థాయిలో కొత్తకూటమికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందు ఉంది. ఈ కొత్తకూటమిల దృష్టిలో ప్రధానమైన అంశంగా డీఎండీకే ఉంది. మాజీ కాంగ్రెస్ నేత, గాంధేయ మక్కల్ ఇయక్కం అధినేత తమిళరువి కెప్టెన్‌కు నచ్చజెప్పే పనిలో పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతును విజయకాంత్ కోరారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీఎంకే వైపు మొగ్గుచూపింది. అప్పుడు కాదని నేడు కలుపుకుపోతామని కోరితే కెప్టెన్ అంగీకరిస్తాడా అని కాంగ్రెస్ సంశయిస్తుండగా, ఎవ్వరూ దిక్కులేకపోవడంతో తనతో బేరసారాలకు దిగిందని కెప్టెన్ కాంగ్రెస్ వైపు గుర్రుగా చూస్తున్నారు. ప్రతి కీలకమైన అంశాన్ని నాన్చే అలవాటున్న కెప్టెన్ ఏర్కాడులో పోటీ చేయాలా వద్దా అని నెలరోజుల పాటు మీమాంసలో పడ్డారు. నేడు లోక్‌సభ వంతు వచ్చింది. ఏదేమైనా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎండీకే ఏదో ఒక పార్టీ పంచన చేరకతప్పదని తెలుస్తున్నా, దాదాపు అన్ని పార్టీలు కెప్టెన్ చుట్టూ తిరుగుతున్నా అయోమయం వీడకపోవడం డీఎండీకే వర్గాల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తాము అన్ని పార్టీల చుట్టూ తిరిగితే లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తమ చుట్టూ తిరగడం శుభపరిణామమంటున్నారు. -
‘భారతరత్న’కు సచిన్ అర్హుడే
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతరత్న అవార్డుకు సచిన్ అర్హుడేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. సచిన్‌కు ప్రకటించిన ఈ అవార్డు నిబంధనలకు వ్యతిరేకమంటూ మద్రాస్ హైకోర్టులో ఇటీవల న్యాయవాది కనకసబై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా సోమవారం కేంద్రం తమ వాదనను వినిపించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌కుమార్, న్యాయమూర్తి రవిచంద్రబాబుతో కూడిన బెంచ్ సోమవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ పి.విల్సన్ ఒక ప్రకటనను సమర్పించారు. సాహిత్య, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు ఇతర రంగాల్లో విశిష్ట నైపుణ్యాన్ని కనబరిచిన వారికి సైతం భారతరత్న అవార్డును ప్రదానం చేయవచ్చంటూ 2011 నవంబరు 16న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని ఇందులో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు కేసును మంగళవారానికి వాయిదా వేశారు. -
కార్ల్సెన్కు రూ. 9.90 కోట్లు
చెన్నై: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవం సోమవారం జరిగింది. కొత్త చాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)కు రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీని అందజేశారు. కేవలం 10 నిమిషాలపాటు జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత కార్ల్సెన్కు ఆలివ్ ఆకులతో కూడిన దండను మెడలో వేసి... బంగారు పూతతో కూడిన ట్రోఫీని, రూ. 9 కోట్ల 90 లక్షల ప్రైజ్‌మనీ చెక్నూ అందజేశారు. అనంతరం రన్నరప్ విశ్వనాథన్ ఆనంద్‌కు వెండి పళ్లెంతోపాటు రూ. 6 కోట్ల 3 లక్షల ప్రైజ్‌మనీని బహూకరించారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడే) అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యూమ్జినవ్ వరుసగా కార్ల్సెన్, ఆనంద్‌లకు స్వర్ణ, రజత పతకాలను అందజేశారు. ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్ల్సెన్ 6.5-3.5 పాయింట్ల తేడాతో నెగ్గి ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వైఫల్యం చెందినప్పటికీ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను తమ బ్రాండ్అంబాసిడర్గా కొనసాగిస్తామని ఐటీ శిక్షణ సంస్థ ‘నిట్’ స్పష్టం చేసింది.