![Akasa Air Starts Direct Flight on Chennai Bengaluru Route - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/12/akasa%20air.jpg.webp?itok=m9bRvlEb)
చెన్నై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్‌లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది.
ఈ రూట్‌లో రోజూ రెండు ఫ్లయిట్స్ నడపడంతో పాటు సెప్టెంబర్ 26 నుండి చెన్నై–కొచ్చి మధ్యలో కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ వివరించింది. దశలవారీగా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను వేగవంతంగా విస్తరించాలనే తమ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment