starts
-
నేటి నుంచి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో
లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యూపీఐటీఎస్) నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో నేడు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.ఈ ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియా ఎక్స్పొజిషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలో 2500కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ కొనుగోలుదారులు ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండనుంది. 'वैश्विक व्यापार का महाकुंभ'Uttar Pradesh International Trade Show के द्वितीय संस्करण का उद्घाटन आज माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी के कर कमलों से सम्पन्न होगा।कार्यक्रम में #UPCM श्री @myogiadityanath जी की भी गरिमामयी उपस्थिति रहेगी।दिनांक: 25 सितंबर 2024समय:… pic.twitter.com/wAk8ZggvqN— Government of UP (@UPGovt) September 25, 2024గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ప్రీ-ఈవెంట్ బ్రీఫింగ్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రి రాకేష్ సచన్ మాట్లాడుతూ ఈ ఏడాది ట్రేడ్ ఫెయిర్ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. యూపీ ఆర్థికాభివృద్ధికి యూపీఐటీఎస్ చిహ్నంగా మారిందని సచన్ తెలిపారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం -
పట్టాలెక్కనున్న ‘స్లీపర్ వందే భారత్’.. రూట్ ఇదే!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనంతరం ‘స్లీపర్ వందే భారత్’ త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం పలువురు ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందే భారత్ మాదిరిగానే ‘స్లీపర్ వందే భారత్’ కూడా ప్రత్యేకమైన రైలుగా గుర్తింపు పొందనుంది. దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ ఏ మార్గంలో నడుస్తుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్‌పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్‌లో ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లన్నీ చైర్ కార్ సౌకర్యం కలిగినవి. అంటే వీటిలో కూర్చుని ప్రయాణించవచ్చు. రాబోయే రోజుల్లో ‘వందే భారత్’ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లలో మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఇవి రాత్రిపూట నడుస్తాయి. ఇందులో ప్రయాణికులు నిద్రిస్తూనే ప్రయాణం సాగించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రూట్లలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకకాలంలో ఈ రెండు మార్గాల్లో నడపపనున్నారని తెలుస్తోంది. ఈ రెండు మార్గాలే కాకుండా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-గౌహతి, ఢిల్లీ-భువనేశ్వర్, ఢిల్లీ-పాట్నా రూట్లలో 10 ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లు నడవనున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని, ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో కోచ్‌లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. దీనితో పాటు మినీ ప్యాంట్రీ కూడా ఉంటుంది. స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్‌లు, రైల్వే సిబ్బందికి 34 బెర్త్‌లు ఉంటాయి. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
ప్రారంభమైన రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మణిపూర్ ప్రజలు తమ ఆవశ్యకత, విలువను పోగొట్టుకున్నారు. ఇక్కడి ప్రజలు ఏం కోల్పోయారో తాము చూశామని తెలిపారు. #WATCH | Congress MP Rahul Gandhi kickstarts Bharat Jodo Nyay Yatra from Thoubal, Manipur. pic.twitter.com/6F8hLDgAqa — ANI (@ANI) January 14, 2024 మణిపూర్ ప్రజలు ఏం కోల్పోయారో వాటిని మళ్లీ అందిస్తామని హామీ ఇచ్చారు. మణిపూర్ ప్రజల బాధలు చూశామని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దు:ఖాన్ని తాము తొలగిస్తామని అన్నారు. ఇక్కడ ప్రజల్లో మునుపటిలా శాంతి, ప్రేమ, శ్రేయస్సును పునరుద్ధరిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. #WATCH | Thoubal, Manipur: Congress MP Rahul Gandhi says, " You (people) have lost what you have valued but we will find what you have valued once again and bring it back to you. We understand the pain the people of Manipur have been through. We understand the hurt, the loss and… pic.twitter.com/RQ0d1OZ5Pe — ANI (@ANI) January 14, 2024 న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను.. మార్చి 20 లేదా 21న ముంబైలో యాత్రను ముగించనున్నారు. చదవండి: ‘రాహుల్’ రాజకీయం.. కాంగ్రెస్‌ను వీడిన 11 మంది సీనియర్లు -
రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం
జైపూర్: రాజస్థాన్‌లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. రైలు ప్రత్యేకతలు.. ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. గోరమ్ ఘాట్(రాజస్థాన్ మినీ కశ్మీర్), భిల్ బేరీ వాటర్‌ఫాల్ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబిస్తుంది. రైలు వేళలు.. మార్వార్ జంక్షన్ వద్ద ఉదయం 8:30కు ప్రారంభమైన ఈ రైలు కామ్లిఘాట్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుతుంది. వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ హెరిటేజ్ రైలు.. సాయంత్రం 5:30కి మార్వార్ చేరుతుంది. హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్‌కు రూ.2000 వసూలు చేయనున్నారు. హెరిటేజ్ రైలు ప్రారంభం సందర్భంగా బీజేపీ ఎంపీ దివ్యా కుమారి తన మొదటి ప్రయాణం అద్భుతంగా ఉందని వెల్లడించారు. UNESCO భారత్‌లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (1999), నీలగిరి మౌంటైన్ రైల్వే (2005), కల్కా సిమ్లా రైల్వే (2008), ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై (2004)లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
ఉద్యోగాలపై బారి వేటు అదిరి పోయే ప్యాకేజ్..
-
చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు
చెన్నై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. ఈ రూట్లో రోజూ రెండు ఫ్లయిట్స్ నడపడంతో పాటు సెప్టెంబర్ 26 నుండి చెన్నై–కొచ్చి మధ్యలో కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ వివరించింది. దశలవారీగా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను వేగవంతంగా విస్తరించాలనే తమ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
TS SSC Exams 2022 : పదో తరగతి పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)
-
చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం
-
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు..
సాక్షి, కరీంనగర్ : గతేడాది కోవిడ్ తొలిదశ లాక్డౌన్ సందర్భంగా మార్చినెలాఖరులో నిలిపివేసిన రైళ్లను సోమవారం నుంచి పున:ప్రారంభించేందుకు దక్షిణ మధ్యరైల్వే చర్యలు చేపట్టింది. దాదాపు 16నెలల సుదీర్ఘ విరామం అనంతరం దశలవారీగా రైళ్లను నడిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే కరీంనగర్– తిరుపతి ప్రత్యేక రైలు వారంలో రెండు పర్యాయాలు గురు, ఆదివారాల్లో నడుస్తుండగా సోమవారం నుంచి కాచిగూడ – కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 6గంటలకు కాచిగూడలో బయల్దేరి నిజామాబాద్ మీదుగా మధ్యాహ్నం 2గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరిగి మరుసటిరోజు 20న మధ్యాహ్నం 2.20గంటలకు కరీంనగర్ నుంచి బయల్దేరి రాత్రి 11గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ నెల 20న ఉదయం 8గంటలకు కరీంనగర్ నుంచి పుష్పుల్ రైలు బయల్దేరి పెద్దపల్లికి 8.30 గంటలకు చేరుకుంటుంది. పెద్దపల్లి నుంచి మధ్యాహ్నం 1గంటకు బయల్దేరి కరీంనగర్‌కు 1.45గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కరీంనగర్ రైల్వేస్టేషన్ మేనేజరు ప్రసాద్ కోరారు. -
వర్సిటీ వరమిచ్చినా కాలేజీల కొర్రీలు!
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 12 నుంచి బీటెక్, ఎంటెక్ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉంటున్న చోటే ఏదైనా కాలేజీలో పరీక్ష రాసే అవకాశాన్ని జేఎన్టీయూ కల్పించింది. కానీ విద్యార్థి చదువుతున్న కాలేజీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. తమ కాలేజీకి వచ్చి పరీక్షలు రాయాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక, కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండేందుకు జంకుతున్నాడు. ఇదీ ఆ ఒక్క విద్యార్థి పరిస్థితే కాదు.. జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వేల మందిదీ.. ఆయా విద్యార్థులందరికీ ఇప్పుడు పరీక్షల తంటా వచ్చి పడింది. కరోనా నేపథ్యంలో తమ గ్రామాలకు వెళ్లిపోయిన విద్యార్థులు ఈనెల 12 నుంచి జరిగే సెమిస్టర్ పరీక్షలకు ఎలా హాజరు కావాలన్న ఆందోళనలో పడ్డారు. తామున్న చోటే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ అనుమతిచ్చినా చాలా కాలేజీల యాజమాన్యాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఏ విద్యార్థి ఎక్కడ పరీక్షలు రాయాలనుకుంటున్నారో ఆ వివరాలను కాలేజీ యాజమాన్యాలు సేకరించి జేఎన్టీయూకు అందజేయాల్సి ఉంది. అయితే ఆ పనిని తప్పించుకునేందుకు యాజమాన్యాలు పరీక్షలు రాసేందుకు కాలేజీకి రావాల్సిందేనని చెబుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లలో ఉండేదెలా..? జేఎన్టీయూ పరిధిలోని దాదాపు 450 సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను అందించే కాలేజీలున్నాయి. అందులో 300కు పైగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిల్లో ఆరేడు లక్షల మంది ఉన్నారు. అందులో బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల్లో ఫైనలియర్ చదివే విద్యార్థులు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. వారికి గత నెలలో పరీక్షలు నిర్వహించింది. ఇక రెండో, మూడో విడతలో మిగతా సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 12వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో విద్యార్థులు తమ కాలేజీలకు వచ్చి పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తాముంటున్న ప్రాంతంలోని ఏదైనా కాలేజీ పేరు ఇస్తే అక్కడ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఆ వివరాలను విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీల్లో అందజేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఈ నిబంధనను చాలా కాలేజీలు అనుమతించడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిగా పేరున్న కాలేజీలు ఇందుకు ఒప్పుకోవడం లేదని, కాలేజీకి రావాల్సిందేనని చెబుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని టాప్ కాలేజీలు ఇలా చేస్తున్నాయని, విద్యార్థి వారీగా వివరాలను సేకరించి, వాటిని యూనివర్సిటీకి పంపించే పని నుంచి తప్పుకునేందుకే, హాస్టళ్ల ఫీజుల కోసం పిల్లలను కాలేజీలకు రమ్మని చెబుతున్నాయని ఆరోపిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను హాస్టళ్లకు ఎలా పంపాలని, హాస్టళ్లకు వచ్చే వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా, అందరికీ వ్యాపించే ప్రమాదమేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి విద్యార్థులు అక్కడే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ జారీ చేసిన నిబంధనను కాలేజీలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
టైటిల్ వేటలో భారత్
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటేందుకు స్టార్లతో కూడిన భారత జట్టు సన్నద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో నేటి నుంచి జరుగనున్న ఈ ఈవెంట్లో టీమిండియా టైటిల్‌పై దృష్టి సారించింది. భారత్‌తో పాటు చైనా, రష్యా, అమెరికా జట్లు ఫేవరెట్లుగా ఈ టోర్నీ బరిలో నిలిచాయి. మాజీ ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, విదిత్ ఎస్ గుజరాతీ (కెప్టెన్), కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, యువ ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ తదితరులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగనున్న భారత్ టాప్ డివిజన్ పూల్ ‘ఎ’లో చైనా, జార్జియా, వియత్నాం, జర్మనీ, ఇరాన్, ఇండోనేసియా, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, జింబాబ్వే జట్లతో కలిసి ఆడనుంది. లీగ్ దశ అనంతరం ప్రతీ పూల్‌లోనూ టాప్–3లో నిలిచిన జట్లు నాకౌట్ పోటీలకు అర్హత సాధిస్తాయి. పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం గం. 1:30కు జింబాబ్వేతో, రెండో మ్యాచ్‌లో వియత్నాం (గం. 2:30), మూడో మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్ (గం. 3:30)తో భారత్ తలపడుతుంది. మే నెలలో జరిగిన ఆన్లైన్ నేషన్స్ కప్‌లో రాణించలేకపోయిన భారత్ ఒలింపియాడ్‌లో సత్తా చాటుతుందని కెప్టెన్ విదిత్ గుజరాతీ ఆశాభావం వ్యక్తంచేశాడు. ఆరు జట్లు పాల్గొన్న నేషన్స్ కప్‌లో భార™Œత్ ఐదో స్థానంతో ముగించింది. హరికృష్ణ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. టోర్నీలో భారత్ గట్టి పోటీనిస్తుందని అన్నాడు. భారత జట్టు : పురుషులు: ఆనంద్, విదిత్ (కెప్టెన్). మహిళలు: హంపి,్ల హారిక. జూనియర్ బాలురు: నిహాల్ సరీన్. జూనియర్ బాలికలు: దివ్య దేశ్‌ముఖ్. రిజర్వ్ ప్లేయర్లు: పి. హరికృష్ణ, అరవింద్ చిదంబరం, భక్తి కులకర్ణి, ఆర్. వైశాలి. ఆర్. ప్రజ్ఞానంద, వంతిక అగర్వాల్. -
హరికృష్ణకు మూడో ‘డ్రా’
చెన్నై: బీల్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో పెంటేల హరికృష్ణ తన ‘డ్రా’ల పరంపర కొనసాగిస్తున్నాడు. నోయెల్ స్టడర్ (స్విట్జర్లాండ్)తో జరిగిన పోరులో సమ ఉజ్జీగా నిలిచిన హరికృష్ణ టోర్నీలో వరుసగా మూడో డ్రా నమోదు చేశాడు. 52 ఎత్తుల తర్వాత ఈ పోరు ముగిసింది. ప్రస్తుతం 13.5 పాయింట్లతో హరి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రేపటినుంచి చెస్ ఒలింపియాడ్ ఈ నెల 25న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఆన్లైన్లో జరిగే ఈ టోర్నమెంట్ పురుషుల, మహిళల విభాగాలతో పాటు జూనియర్ బాలుర, బాలికల విభాగాల్లో భారత్ పాల్గొంటుంది. ఈ టోర్నీ ఆగస్టు 30 వరకు జరుగుతుంది. పురుషుల జట్టులో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ఉండగా... సారథిగా విదిత్ సంతోష్ గుజరాతి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో పురుషుల ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే) పాల్గొనడం లేదు. ఇక మహిళల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. టాప్–8లో నిలిచిన జట్లు స్టేజ్–2కు అర్హత సాధిస్తాయి. -
దేశమంతా.. రైలుకూత
సాక్షి, హైదరాబాద్: జూన్ 1 నుంచి పలు రైళ్ల రాకపోకలకు వీలుగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు సిద్ధమవుతున్నాయి. సుమారు 9 రైళ్లు ఈ రెండు స్టేషన్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10వ నంబర్‌కు అదనంగా ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – బెంగళూరు మధ్య రోజూ రెండు రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే వారానికి ఒక రైలు సికింద్రాబాద్ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ఈ ప్రత్యేక రైళ్లతో పాటు జూన్ 1 నుంచి సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల మీదుగా హైదరాబాద్ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – ధానాపూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, ముంబై – భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – ముంబై హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవికాక మరికొన్ని రైళ్లు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లన్నింటిలోనూ రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్ లిస్టు సైతం 80 నుంచి 100 వరకు చేరుకుంది. రెండుచోట్లా అదనపు ఏర్పాట్లు ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తుండటంతో సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య రోజుకు 900 నుంచి 1,000 వరకు మాత్రమే ఉంది. దీంతో రైళ్ల రాకపోకలను ప్రస్తుతం 10వ నంబర్‌కే పరిమితం చేశారు. జూన్ 1 నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాంపల్లిలోనూ ఇక నుంచి రైళ్లు ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరగనున్న దృష్ట్యా వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యా పెరగనుండటంతో ఈ రెండు రైల్వేస్టేషన్లలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా థర్మల్ స్క్రీనింగ్‌లు సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం ప్రవేశమార్గంలో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులను స్క్రీనింగ్ చేశాకనే లోనికి అనుమతిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్ల నిబంధనలే జూన్ 1 నుంచి నడిచే వాటికీ వర్తిస్తాయి. ప్రయాణికుల మధ్య భౌతికదూరం తప్పనిసరి. ప్రతి ప్రయాణికుడి వివరాలు రైల్వే వద్ద నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిందే. రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులనే అనుమతిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లను మాత్రం వినియోగించరు. రైళ్లలో, రైల్వేస్టేషన్లలో టికెట్ తనిఖీ సిబ్బందిని కూడా పెంచనున్నారు. రైళ్లను, రైల్వేస్టేషన్‌ను పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు అనుమతి లేనివారు ప్రవేశించకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తారు. వివరాల నమోదు తప్పనిసరి లాక్డౌన్ వేళలో నడుపుతున్న ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ఇకపై సాధారణ బోగీల్లో ప్రయాణించాలన్నా రిజర్వేషన్ తప్పనిసరి. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల వివరాలను నమోదు చేసేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా, రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్ పొందే వారంతా తమ వివరాలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. -
ఆస్ట్రియా రేసుతో ఆరంభం!
పారిస్: ఫార్ములావన్ (ఎఫ్1) అభిమానులకు శుభవార్త. కరోనా మహమ్మారితో వాయిదా పడిన 2020 ఫార్ములావన్ సీజన్ జూలై నెలలో ఆరంభం కానుంది. జూలై 5న ఆస్ట్రియా గ్రాండ్‌ప్రితో తాజా సీజన్‌ను ఆరంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఎఫ్1 చీఫ్ చేజ్ క్యారీ సోమవారం ప్రకటించారు. జూలై–ఆగస్టు నెలల్లో యూరప్‌లో రేసులను నిర్వహించి... అనంతరం ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లో పూర్తి చేసి డిసెంబర్లో మధ్య ఆసియాలో సీజన్‌ను ముగించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది కనీసం 15 రేసులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు∙ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రిని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దాంతో ఈ ఏడాది రద్దయిన మూడో గ్రాండ్‌ప్రి జాబితాలో ఫ్రాన్స్ చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, మొనాకో రేసులు రద్దవగా... మరో ఏడు వాయిదా పడ్డాయి. మరోవైపు ప్రేక్షకులు లేకుండానే ఈసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. -
‘అజహర్ స్టాండ్’
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ పేరిట ఒక స్టాండ్ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒకదానికి అజహర్ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్ 6న భారత్, వెస్టిండీస్ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ క్రికెటర్లు అర్షద్ అయూబ్, వెంకటపతిరాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్ పెవిలియన్ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్.దయానంద్ పేరు పెట్టనున్నారు. గరిష్ట విలువ రూ. 12,500/– టి20 మ్యాచ్ కోసం నేటినుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్ ప్రకటించారు. క్రికెట్ పరిపాలకుడిగా ఇది తనకు తొలి మ్యాచ్ అని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. టికెట్లను ఆన్లైన్లో ఠీఠీఠీ. ్ఛఠ్ఛిn్టటnౌఠీ. ఛిౌఝలో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలను రూ.800, రూ.1000, రూ.1500, రూ.4000, రూ.5000, రూ.7500, రూ.10000, రూ.12500గా నిర్ణయించారు. -
ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సంక్షేమ భవన్లో మేడారం జాతర ఏర్పా ట్లపై ఆమె సమావేశం నిర్వహించారు. జాతరకు డిసెంబర్ చివరి వారం నుం చే భక్తుల తాకిడి ఉంటుందని, కాబట్టి డిసెంబర్ నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పార్కిం గ్, వసతుల కల్పనలో లోపాలు ఉండద్దన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించేందుకు వీలుగా పర్యా టక ప్రాంతాలపై ప్రచారం చేయాలన్నారు. జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. పాలు, పాల ఉత్పత్తుల సరఫ రా కోసం విజయ డైరీని భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. జాతర కోసం ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసిందని, వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని వెచ్చిస్తామని మంత్రి చెప్పారు. -
గులాబీ కథ షురూ కావళి
సాధారణంగా అయితే ఒక టెస్టు మ్యాచ్ మొదలవుతుందంటే మ్యాచ్ ఫలితం గురించో, ఆటగాళ్ల ప్రదర్శన గురించో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే టెస్టులో అలాంటివన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. గత మ్యాచ్‌లో భారత్ ప్రదర్శించిన ఆధిపత్యం, బలహీన ప్రత్యర్థిని చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమాని ఫలితం గురించి ఒక అంచనాకు వచ్చేశాడు. కానీ ఇప్పుడంతా గులాబీమయంగా మారిపోయిన టెస్టు గురించే చర్చ. పింక్ బంతి ఎలా కనిపిస్తుంది, ఎలా స్పందిస్తుంది, పట్టు చిక్కుతుందా, పరుగులు ధారాళంగా వస్తాయా, ప్రేక్షకులకు తగిన వినోదం లభిస్తుందా, ఫ్లడ్‌లైట్ల వెలుగులో టెస్టు మ్యాచ్ అనుభూతి ఎలా ఉండబోతోంది... ఇవి మాత్రమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత గడ్డపై ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలిసారి జరగబోతున్న పింక్ టెస్టు తొలి బంతి పడక ముందే అమితాసక్తిని రేపి సూపర్ హిట్ టాక్ ఇప్పటికే తెచ్చుకుంది. ఇక మైదానంలో ఆట ఎలా ఉండబోతోందో చూడాల్సిందే. కోల్‌కతా: భారత గడ్డపై తొలి పింక్ బాల్ టెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేటినుంచి జరిగే పోరులో భారత్, బంగ్లాదేశ్ తలపడబోతున్నాయి. ఇండోర్‌లో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించి 1–0తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరో వైపు పేలవ ప్రదర్శనతో గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన బంగ్లా ఈ మ్యాచ్‌లోనైనా పోరాడి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. మార్పుల్లేకుండానే... ఈ టెస్టుకు సంబంధించి పింక్ బంతి, మంచు ప్రభావం తదితర అంశాలకు సంబంధించి ప్రాధాన్యత పెరిగినా... జట్టు బలాబలాల విషయంలో భారత్ ఎప్పటిలాగే తిరుగులేనిదిగా కనిపిస్తోంది. జట్టులో ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగుతుండటంతో కోహ్లి సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. డబుల్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్‌తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడి జట్టుకు మరో చక్కటి ఆరంభాన్నిచ్చేందుకు సిద్ధంగా ఉంది. మూడో స్థానంలో టెస్టు స్టార్ పుజారా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లి తనదైన స్థాయిలో చెలరేగితే బంగ్లాకు కష్టాలు తప్పవు. తర్వాతి స్థానాల్లో రహానే, జడేజా, సాహా తమ బ్యాటింగ్‌తో చెలరేగిపోగల సమర్థులు. భారత పేస్ బౌలింగ్ పదును ఏమిటో గత మ్యాచ్‌లో మరోసారి కనిపించింది. షమీ, ఉమేశ్, ఇషాంత్ ఈ సారి గులాబీ బంతిని ఎలా వాడతారనేది ఆసక్తికరం. పింక్ బాల్‌తో గతంలో క్లబ్ స్థాయి మ్యాచ్ ఆడిన అనుభవం షమీకి ఉంది. ప్రధాన స్పిన్నర్ అశ్విన్ ఇప్పటికే పింక్ బాల్‌తో తీవ్ర సాధన చేశాడు. మొత్తంగా గులాబీ బంతి అనుభవం కొత్తదే అయినా పటిష్టమైన టీమిండియాకు అది పెద్ద సమస్య కాకపోవచ్చు. రెండు మార్పులతో... టెస్టు క్రికెట్లోకి ప్రవేశించి రెండు దశాబ్దాలు అవుతున్నా బంగ్లాదేశ్ ఇప్పటికీ పసికూనగానే కనిపిస్తోంది. ఆటగాళ్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతుండటంతో ఆ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. ఇండోర్‌లో బంగ్లా జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడటం అది మళ్లీ చూపించింది. ఈ మ్యాచ్‌లో జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలర్లు తైజుల్, ఇబాదత్ స్థానాల్లో అల్ అమీన్, ముస్తఫిజుర్ రానున్నారు. దురదృష్టవశాత్తూ జట్టు రిజర్వ్ ఆటగాళ్లలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఎవరూ లేరు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయాల్సిన సైఫ్ హసన్ గాయంతో చివరి నిమిషంలో దూరం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరోసారి సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్పైనే జట్టు అతిగా ఆధారపడుతోంది. గత మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఓపెనర్లు షాద్మన్, కైస్ ఈ సారైనా రాణిస్తారో చూడాలి. కెప్టెన్ మోమినుల్ హక్ రాణించడం కూడా కీలకం. ఎంతో సీనియర్ అయిన మహ్ముదుల్లా ఇప్పటికీ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. దాస్, మిథున్ ఏమాత్రం రాణిస్తారో చూడాలి. బంగ్లాకు కూడా ఇదే తొలి పింక్ టెస్టు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, జడేజా, సాహా, అశ్విన్, ఇషాంత్, ఉమేశ్, షమీ బంగ్లాదేశ్: మోమినుల్ (కెప్టెన్), కైస్, షాద్మన్, ముష్ఫికర్, మహ్ముదుల్లా, మిథున్, లిటన్ దాస్, మెహదీ హసన్, ముస్తఫిజుర్, అబూ జాయెద్, అల్ అమీన్ పిచ్, వాతావరణం ఈ టెస్టు మొత్తానికి కీలక అంశం పిచ్ గురించే. పింక్ బాల్ పాడవకుండా వికెట్‌పై కొంత మేర పచ్చిక ఉంచుతున్నారు. మరీ గ్రీన్ టాప్ స్థాయిలో కాకపోయినా కొంత ఎక్కువగా పేసర్లకు అనుకూలించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన 10 పింక్ టెస్టుల్లో స్పిన్నర్లకంటే రెట్టింపు సంఖ్యలో ఓవర్లు వేసిన పేసర్లు మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో వికెట్లు తీశారు. ఇక్కడా అదే జరగవచ్చని అంచనా. వర్షం సమస్య లేదు. అన్ని రోజులూ ఆటకు అనుకూల వాతావరణం ఉంది. -
ఒడిశా వారియర్స్‌కు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న ‘బిగ్ బౌట్ ఇండియన్ బాక్సింగ్ లీగ్’ బరిలో దిగే బాక్సర్ల వివరాలను ప్రకటించారు. ఈ లీగ్ డిసెంబర్ 2 నుంచి 21 వరకు జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం తలపడతాయి. తెలంగాణ బాక్సర్, ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్ ఒడిశా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పంజాబ్ రాయల్స్ తరఫున పోటీపడనుంది. వీరిద్దరు 51 కేజీల విభాగంలో బరిలోకి దిగుతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్ పురుషుల 52 కేజీల విభాగంలో పంజాబ్ రాయల్స్ జట్టుకు ఆడతాడు. ఇదే విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అమిత్ పంఘాల్ టీమ్ గుజరాత్ అదానీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. జట్ల వివరాలు ఒడిశా వారియర్స్, బెంగళూరు బ్రాలర్స్, పంజాబ్ రాయల్స్, టీమ్ గుజరాత్ అదానీ, బాంబే బుల్లెట్స్, నార్త్ ఈస్ట్ రైనోస్. వెయిట్ కేటగిరీలు మహిళల విభాగం: 51 కేజీలు, 60 కేజీలు; పురుషుల విభాగం: 52 కేజీలు, 57 కేజీలు, 69 కేజీలు, 75 కేజీలు, 91 కేజీలు. -
ఓయూ పరిధిలో 19 నుంచి డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈనెల 19 నుంచి డిగ్రీ (రెగ్యులర్ కోర్సులు) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినట్లు చెప్పారు. వాయిదా పడిన పరీక్షలు వచ్చే నెలలో.. ఆర్టీసీ కార్మికుల సమ్మె, బంద్ కారణంగా అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో జరగాల్సిన వివిధ డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలు (పాత బ్యాచ్) వచ్చే నెల నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. సెలవు దినాలైన డిసెంబర్ రెండో శనివారం, ఆదివారం ఈ పరీక్షలు ఉంటాయని సూచనప్రాయంగా చెప్పారు. పూర్తి వివరాలకు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు. -
కీలకంగా హైదరాబాద్ ఆర్అండ్డీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిలో ఈ కేంద్రం కీలకం కానుంది. భారత కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఆవిష్కరణలకు ఊతమిస్తుందని వన్‌ప్లస్ ఫౌండర్ పీట్ లూ వెల్లడించారు. మూడేళ్లలో ఇక్కడి ఆర్అండ్డీ కేంద్రం అతిపెద్ద సెంటర్‌గా అవతరిస్తుందని చెప్పారు. ‘సంస్థకు అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. అలాగే అంతర్జాతీయంగా విజయవంతం అయ్యే ఉత్పత్తుల రూపకల్పనకు సైతం బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. పరిశోధన, అభివృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేసి అంతర్జాతీయ ఉత్పాదన రూపకల్పనలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. స్టార్టప్‌లు కొలువుదీరడంతోపాటు నిపుణులైన మానవ వనరులు ఉన్నందునే భారత్‌లో తొలి ఆర్అండ్డీ సెంటర్‌ను భాగ్యనగరిలో నెలకొల్పుతున్నాం. వన్‌ప్లస్‌కు వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో హైదరాబాద్ ఒకటి. ఈ ప్రాంతంలో ఆఫ్‌లైన్ విపణిని విస్తరిస్తాం’ అని వివరించారు. -
ఇచ్చాపురం నుంచి పవన్ పోరాట యాత్ర ప్రారంభం
-
23 నుంచి డిగ్రీ పరీక్షలు
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధంగా జిల్లాలోని 106 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న 45,000 మంది విద్యార్థులు 61 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 6వ సెమిస్టర్‌కు 13,000, 2వ సెమిస్టర్‌కు 17,000,4వ సెమిస్టర్‌కు 15,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటల పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 1800 మంది ఇన్విజిలేటర్లు, 61 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది కేంద్రాల పరిశీలకులు, మూడు స్క్వాడ్ బృందాలను నియమించినట్లు ఆర్యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం మూడో విడత జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు కేంద్రాలకు వచ్చేందుకు ఇబ్బంది ఉన్న చోట బస్సులు ఏర్పాటు చేసుకోవాలని కళాశాలల యాజమాన్యాలకు సూచించామన్నారు. ఈ ఏడాది కొత్తగా కోసిగి ఏపీ మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జంబ్లింగ్‌లో పారదర్శకత ఉండేనా జంబ్లింగ్‌లో పరీక్షల నిర్వహణ మంచిదే. అయితే పరీక్షలు రాసే విద్యార్థులను జంబ్లింగ్ చేయకుండా కళాశాలలను మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. కళాశాలల యాజమాన్యాలు అనుకూలంగా ఉన్న చోట కాపీయింగ్ జరిగే అవకాశం ఉంది. అదే పోటీ తత్వం ఉంటే విద్యార్థులు ఇబ్బందులు పడే వీలుంది. కొన్ని మండలాల్లో ప్రైవేట్ కళాశాలలు మాత్రమే ఉండటంతో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. దీన్ని ఆర్యూ అధికారులు నివారించాల్సిన అవసరం ఉంది. -
టెక్నికల్ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో టెక్నికల్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. టైలరింగ్ లోయర్ పరీక్షకు 124 మందికి గాను 78 మంది హాజరయ్యారు. బాలికల ఉన్నత పాఠశాల డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 104 మందికి గాను 68, గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ హయ్యర్ పరీక్షకు 32 మందికిగాను 32 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 2 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డీఈవో డాక్టర్ కె.రవికాంత్‌రావు, పరీక్షల విభాగం జిల్లా సహయక కమిషనర్ సురేష్‌బాబు పరీక్షలను పర్యవేక్షించారు. -
ఆరోగ్యానికి ఉపకరించనున్న ఈత
సాక్షి, విజయవాడ: విజయవాడలోని దుర్గా ఘాట్‌లో ఆక్వాడెవిల్స్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపి గోకరాజు గంగరాజు, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అయిదేళ్లుగా ఆక్వాడెవిల్స్ కృష్ణా నదిలో ఈత పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఈత ఉపకరిస్తుందని అన్నారు. పోటీల్లో విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. అయిదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వయస్సు వరకు స్విమ్మర్లు ఆయా కేటగిరీల్లో ఈత పోటీల్లో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజికి సమాంతరంగా 1.5 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో స్విమ్మర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు పోటీపడ్డారు. -
ఫిబ్రవరిలో తేజ్‌పాల్ రేప్ కేసు విచారణ
పనాజి: తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ రేప్ కేసు సంవత్సరాల ఆలస్యం తర్వాత వచ్చే నెల నుంచి విచారణకు రానుంది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభమవుతుందని గోవా కోర్టు తెలిపింది. తన సహచర ఉద్యోగినిపై ఆయన అత్యాచారం జరిపారనేది అభియోగం. ఫిబ్రవరి 26నుంచి విచారణ ప్రారంభమై నాలుగు రోజులపాటు జరుగుతుందని, ఇన్‌కెమెరా విచారణ చేస్తామని అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి విజయపాల్ రూలింగ్ ఇచ్చారు. 2013లో తేజ్‌పాల్ తెహెల్కా మ్యాగజిన్కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నపుడు గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో తెహెల్కా నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం సందర్భంగా తనపై అత్యాచారం జరిపారని సంస్థలోని మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి ఆయన్ను అరెస్టు చేయగా ఏడాదిపాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. దాంతో ఆయన మ్యాగజిన్లో తన పదవికి రాజీనామా చేశారు. -
ఆక్వాపార్క్ నిలిపివేసే వరకు ఆందోళన
-
ఆక్వాపార్క్ నిలిపివేసే వరకు ఆందోళన
భీమవరం : తుందుర్రులో ఆక్వాపార్క్ నిర్మాణం వద్దంటూ మూడేళ్లుగా వేల మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూర్కంగా గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) విమర్శించారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను తీరప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో శుక్రవారం చేపట్టిన రెండురోజుల నిరాహారదీక్ష ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఆక్వాపార్క్ వద్దంటూ 40 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా యాజమాన్యానికి మద్దతుగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిర్మాణం కొనసాగించేందుకు సహకరిస్తుందన్నారు. మొగల్తూరు నల్లంవారితోటలో ఆనంద గ్రూప్ నిర్వహిస్తున్న చిన్న ఫ్యాక్టరీలో విషవాయువుల కారణంగా ఐదుగురు కార్మికులు మృతి చెందారన్నారు. తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్‌పార్క్‌లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ ప్రాంత ప్రజలు ముందుగానే ఊహించి ఫ్యాక్టరీని జనావాసాలకు దూరంగా సముద్రతీరానికి తరలించాలని పోరాటం చేస్తున్నారన్నారు. దీనిని అధికార పార్టీ నాయకులు గుర్తించకుండా ముడుపులే ముఖ్యమన్నట్టు వ్యవహరించడం దారుణమని ఆళ్ల నాని దుయ్యబట్టారు. ప్రజల ఆందోళనలో న్యాయం ఉండడం వల్లే వారి పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారన్నారు. ప్రభుత్వ మొండివైఖరి వల్లే ముదునూరి దీక్ష ప్రజల ఆందోళనలు గుర్తించి ఆక్వా పార్క్ పనులు నిలిపివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు అల్టిమేటం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో నిరాహారదీక్షకు పూనుకున్నట్టు చెప్పారు. దీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో కాలికి గాయమై వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ప్రజలకిచ్చిన మాట మేరకు ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దీక్షకు కూర్చోవడం అభినందనీయమన్నారు. తన దీక్షతోనైనా ప్రజల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించే ప్రసాదరాజు దీక్ష చేపట్టారన్నారు. కార్మిక మంత్రి పితాని దృష్టిపెట్టాలి కొత్తగా రాష్ట్ర కార్మిక మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన పితాని సత్యనారాయణ తుందుర్రు సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దీక్ష చేపట్టిన ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూయనమదుర్రు మాదిరిగా గొంతేరు డ్రెయిన్‌ను కాలుష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నల్లంవారితోట ఫ్యాక్టరీలోని కాలుష్యాన్ని నేటికీ పైప్‌లు ద్వారా గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గ పార్టీ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కౌరు శ్రీనివాస్, పీడీ రాజు, సాయినా«థ్ ప్రసాద్, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల గోడు పట్టదా? యనమదుర్రు డ్రెయిన్ వెంబడి ఉన్న అనేక పరిశ్రమల కారణంగా తాగునీటికి సైతం ఉపయోగపడే యనమదుర్రు కాలుష్యకారకమై నేడు ఆ నీటిలో కాలుపెడితేనే రోగాలు అంటుకునే విధంగా ఉన్నాయని నాని ఆందోళన వ్యక్తం చేశారు. తుందుర్రు ఆక్వాపార్క్ కారణంగా జీవనదిలాంటి గొంతేరు డ్రెయిన్ కాలుష్యంబారిన పడి వరి, చేపలు, రొయ్యల సాగు దెబ్బతినడమేగాక వేలాదిమంది మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారన్నారు. ఈ విషయంపై మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండదండలతోనే ఫ్యాక్టరీ యాజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా తుందుర్రులో ఫ్యాక్టరీని తొలగించడం ఖాయమన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తీరు దారుణం నల్లంవారితోటలోని రొయ్యల షెడ్ నుంచి వచ్చే వ్యర్థాలు గొంతేరు డ్రెయిన్‌లో కలుస్తున్నాయంటూ ఆధారాలతో సహా వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంత్రి అచ్చెన్నాయుడు దానివల్ల ఎటువంటి కాలుష్యం లేదంటూ బుకాయించడం అధికార పార్టీ నాయకుల అబద్ధాలకు అవధులు లేకుండా పోయాయన్నారు. అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని నాని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమల స్థాపనకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రాంతాల్లో పెట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. తుందుర్రు పార్క్ వద్దంటూ వేలాదిమంది ప్రజలు ఆందోళనలు చేస్తుంటే స్థానిక ఎంపీలు గోకరాజు గంగరాజు, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పులపర్తి అంజిబాబు పట్టించుకోకపోవడం వారికి ప్రజలపై ఉన్న మమకారాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రజాభీష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ నరసాపురం రూరల్ : ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌పార్కు విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షలో శుక్రవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు పోలీస్ పెద్దల సహకారంతో ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత వ్యవహారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. నేడు రోజా, అంబటి రాక నరసాపురం రూరల్ : ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షలో పాల్గొనేందుకు శనివారం పలువురు ప్రముఖులు రానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు తరలిరానున్నారు. మొగల్తూరు : తుందుర్రు గోదావరి మెగా ఆక్వా పరిశ్రమను తీరప్రాంతానికి తరలించాలి్సందేనని పలువురు ముక్తకంఠంతో పేర్కొన్నారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణ పనులు నిలుపుదల చేసి తీరప్రాంతానికి తరలించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు శుక్రవారం నరసాపురంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నాయకులు, ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలి ప్రజల ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పుడైనా కళ్లు తెరవాలి. తుందుర్రు ఆక్వా పరిశ్రమను తీర ప్రాంతానికి తరలించాలి. అభివృద్ధికి, పరిశ్రమలకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదు. ప్రజలకు హాని తలపెట్టే పరిశ్రమల ఏర్పాటుకు మాత్రమే వ్యతిరేకం. – గుణ్ణం నాగబాబు, పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ మహిళలంటే బాబుకు చులకన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహిళలంటే చులకన. అందుకే మహిళా ది నోత్సవం రోజున మహిళలను అరెస్ట్ చేయించి జైలు పాలు చేశాడు. జనావాసాల మధ్యన పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నందుకు మహిళలని చూడకుండా పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. – కె.సాయిబాల పద్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు తరలించే వరకూ పోరు తుందుర్రు ఆక్వాపార్క్‌ను తీరప్రాంతానికి తరలించే వరకు పోరాటం చేస్తాం. ప్రసాదరాజు చేపట్టిన నిరాహార దీక్షతోనైనా ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలుపుదల చేసి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయాలి. – మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్సీ భయ్రభ్రాంతులకు గురిచేస్తున్నారు మూడు సంవత్సరాలుగా జనావాసాల మధ్య పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేస్తుంటే నన్ను 53 రోజులు జైల్లో పెట్టించి హింసించారు. ఏదైనా చిన్న అలికిడి వినిపిస్తే పోలీసులు రావడం, మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడం ఆనవాయితీగా మారింది. – ఆరేటి సత్యవతి, తుందుర్రు ఆక్వా పరిశ్రమ వ్యతిరేక కమిటీ ఉద్యమరాలు పరిశ్రమ వద్దంటే హింసిస్తున్నారు ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేకుండా చేస్తున్నారు. పరిశ్రమ జనావాసాల మధ్య వద్దు అన్నందుకు పోలీసులు హింసిస్తున్నారు. ముఖ్యమంత్రి పోలీసులను ఆనందాకు కాపలాకాసేందుకు నియమించినట్టుగా ఉంది. – సముద్రాల సత్యవాణి, కె.బేతపూడి ఉద్యమాన్ని అణిచేందుకు ప్రయత్నం పోలీసులతో తమపై అక్రమకేసులు బనాయించి, జైలు పాలు చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ముప్పై గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. – ఆరేటి వాసు, ఉద్యమ నాయకుడు -
తస్మాత్ జాగ్రత్త!
- అకాల వర్షాలు ప్రారంభం - పొంచి ఉన్న పెనుగాలుల ముప్పు - ఏటా మార్చి, ఏప్రిల్‌లో ఉద్యాన పంటలను దెబ్బతీస్తున్న వైనం - భారీగా నష్టపోతున్న రైతులు అనంతపురం అగ్రికల్చర్ : సూర్య ప్రతాపం కొనసాగుతోంది. మండే ఎండల నడుమే మూడు రోజుల కిందట అకాల వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే సందర్భంలో ఉరుములు, పిడుగులు, వడగళ్లతో కూడిన వానలతో పాటు పెనుగాలుల ముప్పు పొంచి ఉంది. ఇవి ఉన్నట్లుండి ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదముంది. ఏటా వేసవి ప్రారంభం కాగానే అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్లు పండ్లతోటల రైతులను భయపెడుతున్నాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో వీటి ప్రభావం అధికంగా ఉంటోంది. అరటి, బొప్పాయి, మామిడి, మునగ, కర్భూజా, కళింగర, దోస, ఆకు, వక్క తోటలతో పాటు పాలీహౌస్, షేడ్‌నెట్స్, ఉద్యాన నర్సరీలు, టమాట లాంటి కూరగాయల పంటలకు నష్టం వాటిల్లుతోంది. కాపునకు వచ్చిన, కోతకు సిద్ధంగా ఉన్న తోటలు నేలవాలడం, మామిడి, సపోటా, చీనీ కాయలు రాలిపోవడం, రూ.లక్షల పెట్టుబడులతో నిర్మించుకున్న పాలీహౌస్‌లు, షేడ్నెట్లు కూలిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యాన రైతులతోపాటు విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. విపరీతమైన గాలులుకు కరెంటు స్తంభాలు కూలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు దెబ్బతింటున్నాయి. పెద్దఎత్తున ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యాన, ఇతర అనుబంధ రంగాలతో పాటు విద్యుత్‌శాఖ, ఇతరత్రా వాటికి జరిగే నష్టం ప్రతియేటా ఎంతలేదన్నా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటోంది. ఏటా అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా.. ఈ సమస్యను అధిగమించడానికి చర్యలు చేపట్టడంలో ఉద్యానశాఖతో పాటు జిల్లా యంత్రాంగం వైఫల్యం చెందుతోంది. ఆపద సంభవించిన సమయంలో మాత్రం ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల వరకు అందరూ హడావుడి చేస్తున్నారు. నష్టపోయిన రైతులను కంటితుడుపుగా ఓదార్చడం మినహా పరిహారం ఇచ్చి ఆదుకున్న సందర్భాలు చాలా తక్కువ. గతంలో జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటికీ పండ్లతోటల రైతులకు పరిహారం రాని పరిస్థితి ఉంది. 2011 సంవత్సరంలో 250 ఎకరాలు, 2012లో 190 ఎకరాలు, 2013లో 910 ఎకరాలు, 2014లో 780 ఎకరాలు, 2015లో 510 ఎకరాలు, 2016లో 230 ఎకరాల్లో అరటి, బొప్పాయి, చీనీ, మామిడి, సపోటా, కూరగాయలు తదితర పంటలు దెబ్బతినడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈసారి కూడా పండ్లతోటల రైతుల్లో గుబులు రేగుతోంది. నష్ట నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఆత్మకూరులో భారీ వర్షం జిల్లాలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే.. గాలివేగం తక్కువగా ఉండటంతో పంట నష్టం పెద్దగా జరగలేదు. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆత్మకూరు మండలంలో ఏకంగా 63 మిల్లీమీటర్ల (మి.మీ) భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. కదిరిలో 38 మి.మీ, డి.హీరేహాళ్ 25, బొమ్మనహాళ్ 21, బ్రహ్మసముద్రం 16, అగళి 15, కణేకల్లు 14, ఉరవకొండ 14, రాయదుర్గం 13, విడపనకల్లు 12, రాయదుర్గంలో 11 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. శెట్టూరు, బెళుగుప్ప, గుడిబండ, వజ్రకరూరు, గుమ్మఘట్ట, గార్లదిన్నె, కూడేరు, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రొద్దం, గుత్తి, పామిడి, కంబదూరు తదితర మండలాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి. అకాల వర్షాల కారణంగా జిల్లా అంతటా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం అత్యధికంగా చెన్నేకొత్తపల్లి మండలంలో 38 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 23 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమ శాతం ఉదయం 75 నుంచి 90, మధ్యాహ్నం 25 నుంచి 35 మధ్య నమోదైంది.గాలులు గంటకు 6 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. -
తేడావస్తే ఇంటికే
– ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం – సెంటర్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా ఇంటికి పంపుతామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 66 కేంద్రాలకు గాను మొదటి విడత తొలిరోజున జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 1378 మంది విద్యార్థులకు గాను 19 మంది గైర్హాజరయ్యారు. 1359 మంది విద్యార్థులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్ఐఓ వెంకటేశులు జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్బీఎన్, ఎస్ఎస్ఎస్ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. జేసీ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పని చేసి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని ఆదేశించారు. హిందూపురం లాంటి ఘటనలు పునరావృతమైతే ఉద్యోగాల నుంచి తొలిగించడంతో పాటు, క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేస్తామని జేసీ హెచ్చరించారు. తొలివిడత 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇదిలాఉండగా జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అనంతపురం, ధర్మవరంలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
కొత్త ఏడాదిలో పసిడి కళకళ
బెంగళూరు: నూతన సంవత్సరం2017 లో బంగారం ధరలు శుభారంభాన్ని నిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు బలపడ్డాయి. 2016లో 8 శాతం లాభపడిన బంగారం ధరలు కొత్త ఏడాది ఆరంభంలో కళకళలాడుతున్నాయి. బలపడుతున్న డాలర్ ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ తొలిరోజు (మంగళవారం) పసిడికి టెక్నికల్ బైయింగ్ సపోర్ట్ లభిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) బంగారం 0.46 శాతం పెరిగి 1157 డాలర్లను తాకింది. వెండి కూడా ఔన్స్ 0.6 శాతం లాభపడి 16.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే కామెక్స్ ధరలు 2015తో పోలిస్తే 2016 లో 7.1 శాతం ఎగిసింది. దేశీయంగా మాత్రం సోమవారం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం స్వల్పంగా క్షీణించి రూ. 27,990 వద్ద, వెండి కేజీ రూ. 570 తగ్గి రూ. 39,360 వద్ద ముగిసాయి. మరోవైపు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర రూ. 125 లాభపడి రూ. 27,570ను తాకగా, వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 87 పెరిగి రూ. 39,136కు చేరింది. అమెరికా నాన్ ఫాం పే రోల్స్ డేటా కోసం మార్కెట్ వేచి చూస్తోంది.. ఊహించిన డేటా ఉంటే తక్కువ నమోదైతే అది బంగారానికి సానుకూలసంకేతమని ,బలమైన రీబౌండ్ అయ్యే అవకాశం ఉందని షాన్ డాంగ్ గోల్డ్ గ్రూపు ఎనలిస్ట్ షు చెప్పారు. ఈ డేటా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఫెడ్ వడ్డీ రేట్ల పెంచితే భవిష్యత్తులో బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుందన్నారు. -
టోల్గేట్ వద్ద స్వైపింగ్ మెషిన్లు
ఉంగుటూరు : పెద్ద నోట్ల రద్దుతో సుమారు 20 రోజులపాటు విశ్రాంతి తీసుకున్న టోల్గేట్లు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిం చాయి. దారి సుంకం (టోల్ ఫీ) వసూళ్లను మొదలుపెట్టారు. వీటివద్ద పాతనోట్లు తీసుకోవడం లేదు. ఉంగుటూరు మండలం నాచుగుంట టోల్‌ప్లాజా వద్ల 6 స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేశారు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను అంగీకరిస్తున్నారు. వాహన చోదకుల్లో ఎక్కువ మంది వీటిని ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో టోల్గేట్ల వద్ద చిల్లర సమస్య తీరింది. -
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనకు పింక్‌రన్
విజయవాడ (లబ్బీపేట) : బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన యువతి నీలిమ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే విజయవాడ నుంచి విశాఖపట్నం వరకూ షూ, చెప్పులు లేకుండా పింక్‌రన్‌ను ప్రారంభించింది. బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ వద్ద శనివారం వేకువజామున 4 గంటలకు ఈ పరుగును ప్రారంభించిన ఆమె వారం రోజుల్లో విశాఖ చేరుకోనుంది. అక్కడ పింక్‌రన్–2016 పేరులో ఈనెల 20న నిర్వహించనున్న కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమని, సరైన అవగాహన లేకపోవడం వల్లే మహిళలు మృత్యువాత పడుతున్నారన్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే షూ, చెప్పులు లేకుండా రన్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
ఈనెల 16 నుంచి కాపు సత్యాగ్రహయాత్ర
-
ఇంద్రకీలాద్రి టూ శబరిమల
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి వరకు పాదయాత్రను చేపట్టారు నగరానికి చెందిన ఇద్దరు అయ్యప్ప మాలధారులు. విజయవాడ సమీపంలోని జక్కంపూడి గ్రామానికి చెందిన తన్నేరు వెంకట శివ మల్లేశ్వరరావు, తాపీ మేస్త్రీ పాలబోయిన వెంకటేశ్వరరావు అయ్యప్ప మాలధారణ చేశారు. అయ్యప్ప సన్నిధికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుని శుక్రవారం రాత్రి ఇరుముడి ధారణతో బయలుదేరారు. శుక్రవారం రాత్రి అమ్మవారి సన్నిధికి చేరుకుని నిద్ర చేసిన స్వాములు, తెల్లవారుజామున స్నానంచేసిన అనంతరం స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి దుర్గమ్మను దర్శించుకుని యాత్ర ప్రారంభించారు. మొత్తం 1250 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని వెంకటేశ్వరరావు చెప్పారు. గ్రామంలో అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించిన వెంకటేశ్వరరావు, ఆలయ నిర్మాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని స్వామి వారికి మొక్కుకున్నారు. గుడి నిర్మాణం పూర్తికావడంతో స్వామివారికి మొక్కు చెల్లించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. -
డి పార్క్ హోటల్లో ఎఫ్‌పీఎల్ లీజ్ జెర్సీ
-
సైన్స్‌సెంటర్‌లో అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్: తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో అంతరిక్ష వారోత్సవాలను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ జయరామన్ ముఖ్య అతిథిగా హాజరై అంతరిక్ష వారోత్సవాల ఆవశ్యకత వివరించారు. విక్రం సారాబాయి అంతరిక్ష పరిశోధనకు చేసిన కషిని విద్యార్థులకు చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశం ఎంతో పురోగమించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ అధ్యాపకులు విజయభాస్కర్‌రావు పాల్గొన్నారు. -
సత్యసాయి గ్రామసేవలు ప్రారంభం
దసరా వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి ట్రస్ట్ గ్రామ సేవలను సోమవారం ఘనంగా ప్రారంభించింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, కార్యదర్శి ప్రసాద్‌రావు ప్రశాంతి నిలయంలో గ్రామసేవ కార్యక్రమాన్ని పూజలు నిర్వహించి ప్రారంభించారు. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే గ్రామసేవలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన సుమారు 60 వేల కుటుంబాలకు చీర, ధోవతి, సత్యసాయి అన్న ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, సిబ్బంది సుమారు 600 మంది సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్రాజు మాట్లాడుతూ ప్రతి ఏడాది లాగే సత్యసాయి చూపిన మార్గంలో నడుస్తూ ఆయన సేవలను ట్రస్ట్ కొనసాగిస్తోందన్నారు. దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సాయికుల్వంత్ సభా మందిరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. తొలి రోజు పుట్టపర్తి నగరపంచాయతీ పరిధిలో గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలరించిన సంగీత కచేరి సత్యసాయిపై భక్తిప్రపత్తులు చాటుతూ చక్కటి స్వరాలతో విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది.సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి మిరుపురీ సంగీత కళాశాల విద్యార్థులు,సిబ్బంది సంగీత కచేరి నిర్వహించారు. అనంతం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
ప్రారంభమైన గూగూడు బ్రహ్మోత్సవాలు
గూగూడు బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు పీర్లచావిడిలోని పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంచ లోహపు ప్రతిమను దొరికిన కొండారెడ్డి వంశీకులు బయటకు తీసి ప్రథమ దర్శనం చేయించారు. కుళ్లాయిస్వామి పంజాను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి పీరును ప్ర«థమ దర్శనం కోసం చావిడి ముందుటి అరుగు పైకి తీసుకు రాగానే భక్తులు పెద్ద ఎత్తున కుళ్లాయిస్వామి నామస్మరణ చేశారు. -
అట్టహాసంగా ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అట్టహాసంగా ఐటా టెన్నిస్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నదాల్ టెన్నిస్ స్కూల్ ఆధ్వర్యంలో ఫాదర్ ఫెర్రర్ స్మారక చాంపియన్ టోర్నీని ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టెన్నిస్ టోర్నీకి అనంత క్రీడాగ్రామం వేదిక కావడం ఎంతో సంతోషకరమన్నారు. మెయిన్ డ్రా పోటీలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. పోటీలను ఐటా రిఫరీ శ్రీకుమార్, నదాల్ టెన్నిస్ స్కూల్ కో ఆర్డీనేటర్ సిస్కో, టోర్నీ డైరెక్టర్ భాస్కరాచార్య, కంప్యూటర్ టీచర్ కష్ణా తదితరులు పాల్గొన్నారు. క్వాలిఫయింగ్ పోటీల్లో విజేతల వివరాలు అండర్–14 బాలుర విభాగం : ప్రియతం, ఆదిత్ అమర్నాథ్, రమణ. శేఖర్, నాయుడు రిత్వీక్, శివకార్తీక్, సోమసి శ్రావణి, వెంకటేష్, హేమవర్ధన్. అండర్–16 బాలుర విభాగం : సుందర గణపతి, ప్రణీత్, నితిన్, హరి, వంశీ రెడ్డి, హేమాశ్రీ రాజసింహ, సాయిధనుష్, హరీష్ లు విజయం సాధించి మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధించారు. -
ఓనం వేడుకలు ప్రారంభం
పుట్టపర్తి టౌన్ : కేరళీయులు పవిత్రంగా భావించే ఓనం పర్వదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది కేరళ భక్తులతోపాటు, దేశ విదేశాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కేరళ భక్తులు వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కేఎస్ శభరినాథన్ హాజరై ప్రసంగించారు. ప్రపంచ నలుమూలలా సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య, తాగునీటి సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం కేరళకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు విట్టల్ వినోద్ భాగవతార్ బృందం సంగీత కచేరి నిర్వహించారు. కేరళ సంగీత రీతులలో చక్కటి స్వరాలోలికిస్తూ భాగవతార్ బృందం నిర్వహించిన సంగీత కచేరీతో భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లి దర్శించుకున్నారు. -
పులిచింతల పవర్ ట్రయల్ రన్ ప్రారంభం
పులిచింతల ప్రాజెక్టు(మేళ్లచెర్వు): మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న 120 మోగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు మొదటి యూనిట్ మెకానికల్ స్పిన్నింగ్ ట్రయిల్ రన్‌ను సోమవారం హైడల్ డైరక్టర్ వెంకటరాజం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదిహేను రోజుల్లో మొదటి యూనిట్ ద్వారా 30 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. మరో యూనిట్‌ను సెప్టంబర్ చివరి నాటికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే మార్చి నాటికి నాలుగు యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన పులిచింతల ప్రాజెక్టును సందర్శించి నీటి నిల్వను పరిశీలించడంతో పాటు విద్యుత్ తయారికి కావల్సిన నీటి సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆయన వెంట సీఈ సివిల్ శివాజి, హైడల్ పవర్ కంపెనీ సీఈ మూర్తి, ఓఎస్డీ దివాకర్,హెపీసీ ఎస్ఈ వర్మ, ఎస్ఈ సద్గుణకుమార్, ఓఎస్డీ పూర్ణచందర్రావు, ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఐసెట్ కౌన్సెలింగ్
టూటౌన్: నల్లగొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఐసెట్–2016 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఒకటవ ర్యాంకు నుంచి 12000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 222 మంది విద్యార్థులు హాజరు కాగా అధికారులు వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగం, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ సరికొత్త వెబ్సైట్
నిడమర్రు : విద్యాశాఖ కొత్తపుంతలు తొక్కుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే సర్వశిక్షాభియాన్ ద్వారా వివిధ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కొత్త వెబ్సైట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. అభిప్రాయాల వేదిక ఏపీ సబ్జెక్ట్ ఫోరం ఆన్లైన్లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులతో అభిప్రాయాలు పంచుకునేందుకు ‘ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఫోరం’ పేరుతో ఓ కొత్త వెబ్ పోర్టల్‌ను విద్యాశాఖ రూపొందించింది. దీనిద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులకు అందించవచ్చు. దీనిని గురుపూజోత్సవం సందర్భంగా వచ్చేనెల 5న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఆ పోర్టల్‌లో పేర్కొన్నారు. పూరై ్తన వర్క్‌షాప్ ఈ వెబ్సైట్ పనితీరుపై వివిధ అంశాలు చర్చించేందుకు జిల్లాలో కొంతమందిని కోర్ గ్రూప్ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరికి ఈనెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో వర్క్‌షాప్ నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో పశ్చిమగోదా జిల్లాతోపాటు తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా,విశాఖ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోర్టల్‌లో లాగిన్ ఇలా... జ్టి్టp://111.93.8.43:8080 అని గూగుల్‌లో టైప్ చేస్తే ‘ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఫోరం’ అనే పేరుతో ఓ వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. – వెబ్సైట్ ముఖ చిత్రంలో కనిపించే టీచర్ జోన్ అనే టాబ్ క్లిక్ చేయాలి. ’ అక్కడ కొత్తగా నమోదయ్యేవారు న్యూటీచర్ రిజిస్ట్రేషన్ క్లిక్ వద్ద క్లిక్ చేయాలి. ’ అక్కడ పైకాంలలో రిజిస్ట్రేషన్ టైప్ వద్ద టీచర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ’ కింది కాలంలో సెల్‌నంబర్‌ను నమోదు చేయాలి. (ఇటీవల నమోదు చేసిన టీచర్ డేటా సిస్టంలో ఇచ్చిన ఫోన్‌నంబర్ మాత్రమే తీసుకుంటుంది) –అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్ అంకెలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. ’అనంతరం ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇటీవల టీచర్ డేటాలో నమోదు చేసిన వివరాలతో లాగిన్ అయిన పేజీ కనబడుతుంది. ’ ఆ పేజీలో మీ ఫోటోఅప్లోడ్ చేయాలి. మీ తండ్రి పేరు, మీసబ్జెక్ట్ వివరాలు మీరు ఏ అంశంలో నిష్ణాతులో తెలిపి మీ గురించి పరిచయ వాక్యాలు నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. దీంతో ఈ వెబ్సైట్లో మీ పేరుమీద రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. –––––––––––––– లక్ష్యాలు ఇవీ.. ఈ వెబ్‌పోర్టల్‌లో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరిని భాగస్వాములుగా చేయాలనేది ప్రధాన లక్ష్యం. – ఉపాధ్యాయులకు అవసరమైన వృత్తి నైపుణ్యం పెంచేందుకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలి. –ఇకపై మీ సబ్జెక్ట్లోగానీ, లేదా ఇరత సబ్జెక్ట్లోగానీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉపాధ్యామిత్రులు పోస్ట్ చేసిన విద్యాసంబంధిత అంశాలు తెలుసుకోవచ్చు. అనుభవాలు, తరగతి గదిలోని అనుభూతులు పంచుకునేందుకు వీలుంటుంది. ’అలాగే నమోదైన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను కూడా ఈ వెబ్సైట్లో చేర్చాలి. దానికి సంబంధించిన నమోదు కాలం వెబ్సైట్లో పొందుపరిచారు. ’ ఈవెబ్సైట్లో సభ్యులుగా నమోదైనవారు విద్యా సంబంధిత సమాచారాన్ని వీడియోలు, చిత్రాలు, పాఠ్యప్రణాళికలు, ప్రాజెక్ట్‌లు, అనుభవాలు, విద్యార్థుల ప్రతిస్పందనలు తదితర అంశాలు పంచుకునే అవకాశాన్ని కల్పించారు. ’ విద్యా సంబంధిత నోటిఫికేషన్లు, సెమినార్లు, రూపొందించే ఫారాలు, ధ్రువీకరణ పత్రాలు వంటివి ఈ సైట్లో అందాబాటులోకి తీసుకువస్తారు. ’ ఈ వెబ్సైట్ ద్వారా ఈ– కాంటాక్ట్‌ను తయారు చేసి ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు అందించవచ్చు. -
నేటి నుంచి లాంచీ సేవలు
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయంలో గురువారం నుంచి లాంచీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం మనోహర్ బుధవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. తెలంగాణ(హిల్‌కాలనీ) వైపు నుంచి లాంచీలు నిత్యం జాలీ ట్రిప్పులు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాంచీలను తిప్పనున్నట్లు వెల్లడించారు. లాంచీ నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంటుతో అనుమతి పొందాల్సి ఉందనిన్నారు. అనుమతి కోసం ధరఖాస్తు చేసినట్లు వివరించారు. పర్యాటకులను బట్టీ లాంచీ ట్రిప్పులు వేస్తామని చెప్పారు. అలాగే కంపెనీలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు గంటల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు మరో లాంచీని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. -
కోల్‌కతాకు విమాన సర్వీసు ప్రారంభం
గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయం నుంచి సోమవారం ఇండిగో విమాన సంస్థ కోల్‌కతాకి విమాన సర్వీసులు ప్రారంభించింది. ఇది కోల్‌కతాలో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ చేరింది. ఇక్కడి నుంచి 12.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కోల్‌కతాకి చేరింది. -
అంతర్జాతీయ వినియోగదారుల ఎక్సపో ప్రారంభం
బీచ్‌రోడ్: శుక్రవారం ఆర్కేబీచ్ వద్ద వున్న నోవెటల్‌లో అంతర్జాతీయ వినియోగదారుల ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎక్స్‌పోలో పలు అంతర్జాతీయ బ్రాడ్స్కు చెందిన వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పో వివిధ రాష్ట్రలకు చెందిన వస్తువులు అందుబాటులో ఉంచారు.. -
ఎయిర్టెల్ మరో బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో పోటీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్ల కోసం బుధవారం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి ఎదురవుతున్న ముప్పు ను తట్టుకొనే చర్యల్లో భాగంగా తాజాగా భారతీ ఎయిర్టెల్ తన ప్రతి పోస్ట్ పెయిడ్ బ్రాడ్ బ్యాండ్ లేదా డీటీహెచ్ వినియోగదారులకు 5 జీబీ అదనపు డేటాను అందించనుంది. ఎయిర్ టెల్ ల్యాండ్ లైన్ లో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం తో పాటు, వినియోగదారులకు ఇప్పుడు ఉచిత అదనపు డేటా ప్రయోజనాలు కల్పిస్తోంది. వారికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులను ధన్యవాదాలు చెప్పారు భారతి ఎయిర్టెల్ (భారతదేశం) సీఈఓ హేమంత్ కుమార్ గురుస్వామి. 'మై హోం రివార్డ్స్' పథకం కింద ఈ అఫర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు. -
సత్తుపల్లిలో రెండో ఓసీ ప్రారంభించాలి
సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లిలో రెండో ఓసీని వెంటనే ప్రారంభించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకులు జోషి, సుధాకర్ డిమాండ్ చేశారు. జేవీఆర్ ఓసీ–1లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు సోమవారం నల్లబ్యాడ్జీల ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేవీఆర్ ఓసీ–1 ప్రాజెక్టు ప్రారంభించి 11 సంవత్సరాలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలిచినా, ఓడినా కార్మికుల పక్షానే ఉంటుందన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు, అధిక మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. కార్మికులకు క్వార్టర్లు నిర్మించాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కూడా నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికులు నిరసన తెలుపుతారని అన్నారు. 10న ఆందోళన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందిస్తామన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకులు నర్సయ్య, జె.శ్రీను, సుబ్బారావు, కార్మికులు పాల్గొన్నారు. -
తిరుమలలో ప్రారంభమైన పుష్కర యాత్ర
-
బోర్ల తవ్వకానికి శంకుస్థాపన
సొంత నిధులు రూ.5 లక్షలతో బోర్ల ఏర్పాటు మాచర్ల: పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం సొంత ఖర్చుతో ఐదుబోర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నా.. అందులో భాగంగానే గురువారం రాత్రి చెన్నకేశవకాలనీలో బోర్ వేయించా, 7, 9 వార్డులలో బోర్లు తవ్విస్తున్నాం.. మరో మూడుచోట్ల బోర్లు వేయాల్సి ఉందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం వివిధ ప్రాంతాలలో మంచినీటి బోర్ల తవ్వకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చినమాట ప్రకారం రూ.5 లక్షలు వెచ్చించి శివారు కాలనీలో బోర్లు తవ్విస్తున్నామని చెప్పారు. 9వ వార్డులో బోరు తవ్వకం పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ 9వ వార్డుకు చెందిన కృష్ణబలిజ సంఘం నాయకులు పండ్ల అంజిబాబు, ఆంజనేయులు, శ్రీనివాసరావు, జి.హనుమంతరావు, వైఎస్సార్సీపీ నాయకులు షేక్ కరిముల్లా, మరియమ్మ, మెట్టు శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బోయ రఘురామిరెడ్డి, షేక్ కరిముల్లా పాల్గొన్నారు. సాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. మంచినీటి అవసరాల కోసం రెండువారాలకుపైగా సాగర్ కుడికాలువకు ప్రభుత్వం నీటిని విడుదల చేయటానికి అంగీకరించటం వల్ల మంచినీటి సమస్య పరిష్కారం లభించినట్లయిందని ఎమ్మెల్యే పీఆర్కే అన్నారు. పురపాలక అధికారులు భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా ఎక్కువ మోటార్లతో ఈ 15 రోజుల వ్యవధిలో క్వారీని నింపితే నీటిఎద్దడి సమస్య తలెత్తే అవకాశం లేదన్నారు. -
ఎన్‌సీసీతో నాయకత్వ లక్షణాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఎన్సీసీ అంటే దేశభక్తితో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడమని ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్నల్ బి. హరికృష్ణ నాయుడు పేర్కొన్నారు. రింగ్‌రోడ్డులోని భాష్యం బ్లూమ్స్ సెకండరీ క్యాంపస్‌లో ఎన్సీసీ అకాడమీని ప్రారంభించారు. ఎన్సీసీ యూనిట్ 25 (ఏ) బెటాలియన్ కల్నల్, గ్రూప్ కమాండర్ బి. హరికృష్ణ నాయుడు, కమాండింగ్ అధికారి సునీల్ యాదవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై ఎన్సీసీ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా అమర జవానులకు నివాళిగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా హరికృష్ణ నాయుడు మాట్లాడుతూ ఎన్సీసీ అంటే సర్టిఫికెట్ పొందడమే కాదని, దేశభక్తి, మంచి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు, లౌకిక వాదం, సేవా దృక్పథం, దేశం కోసం పాటు పడే మంచి పౌరులుగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా 2016–17 హెడ్ బాయ్స్, హెడ్ గర్‌్ల్స కెప్టెన్స్, హౌస్ కెప్టన్స్ కల్నల్ చేతుల మీదుగా షోల్డర్, చెస్ట్ బ్యాడ్జెస్ గౌరవాన్ని అందుకుని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
R&B కార్యలయం ప్రారంభించిన మంత్రి
-
2వ రోజు పార్లమెంట్ సమావేశాలు
-
‘ప్రగతి’లో సందడి
♦ తొలిరోజు కొనసాగిన కార్పొరేటర్లకు శిక్షణ ♦ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ ♦ తరలివచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ♦ ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జిల్లా నేతలు ♦ ప్రజాప్రతినిధుల రాకతో కిక్కిరిసిన రోడ్లు ♦ రహదారుల వెంట భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు చేవెళ్ల: కార్పొరేటర్ల శిక్షణా తరగతులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఓరియెంటేషన్ వర్క్‌షాప్ శంకర్పల్లి మండలం పొద్దటూరు గ్రామ పరిసరాల్లోని ప్రగతి రిసార్ట్స్‌లో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు దారిపోడవునా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. కాగా రిసార్ట్స్‌లోకి మీడియాతో సహా స్థానికులెవరినీ అనుమతించకపోవడంతో రిసార్ట్స్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. జీహెచ్ఎంసీ (హైదరాబాద్), వరంగల్, రా మగుండం, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు నేటినుంచి ఈ కార్యక్రమాన్ని ఈ శిక్షణ , అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. గతంతో రెండుసార్లు ఇక్కడికి పలు అధికారిక కార్యక్రమాలకు రావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో పర్యటనను రద్దుచేసుకున్న కేసీఆర్ ఎట్టకేలకు ముచ్చటగా మూడోసారి మాత్రం ప్రగతి రిసార్ట్స్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 10.40 నిమిషాలకు ఆయన రిసార్ట్స్‌కు చేరుకున్నారు. 11 గంటలకు వేదికపైకి వచ్చి కార్పొరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు హాజరయ్యారు. హైదరాబాద్ అభివృద్ధికోసం నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, ఎమ్మెల్యేలకు సుమారుగా గంట కుపైగా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంపొందించే విధంగా ప్రజలను భాగస్వాములను చేసి నగరాన్ని సుందరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేయాలని కోరారు. నగరంలో పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయని, అప్పుడే మనం ప్రజలకోసం ఏంచేయాలో పనులను చేపట్టవచ్చంటూ.. కార్యాచరణను ప్రకటించారు. బా గా పనిచేసే డివిజన్లకు ముఖ్యమంత్రి నిధుల నుంచి నిధులను కేటాయిస్తానంటూ వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్, రవాణాశాఖా మం త్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, నగర మేయర్ బొంతు రాంమ్మోహన్, డిప్యూటీ మేయర్ మాజిద్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. భారీ బందోబస్తు.. ప్రగతి రిసార్ట్స్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా నగరం నుంచి దారి పొడవునా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గండిపేట, హిమాయత్‌సాగర్, చిలుకూరు మీదుగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రగతి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఈ దారి పొడవునా సైబరాబాద్ పోలీసులతో జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాకు నో ఎంట్రీ.. కార్పొరేటర్లకు పరిపాలన, అభివృద్ధిపై అవగాహన కల్పించడానికి సోమవారం నుంచి ఏర్పాటు చేసిన మూడురోజుల శిక్షణా కార్యక్రమానికి మీడియాను అనుమతించ లేదు. వికాఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మీడియాను లోపలికి అనుమతించబోమని రాబాద్ డీఎస్పీ స్వామి స్పష్టం చేశారు. కాగా సమావేశానికి అనుమతి కోసం విలేకరులు ప్రధాన గేటు వద్ద ఎండలో నిరీక్షించారు. -
మొదలైన మేడారం జాతర సందడి
-
గోళ్లపాడు ఛానల్ కాల్వను పునరుద్ధరించాలి
-
కోడిపందాలను ప్రారంభించిన 'ఎమ్మ్ల్యే'
-
హద్దు మీరిన తెలుగు తమ్ముళ్ల ఆగడాలు
-
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
రోబో 2.0 రిపోర్టింగ్ మొదలైంది
చెన్నై: సంచలన దర్శకుడు శంకర్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ మూవీ రోబోకి సీక్వెల్ రోబో 2 షూటింగ్ కార్యక్రమాలు చెన్నైలో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ పార్టులో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టి.. ఈసారి ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫీమేల్ చిట్టి ఎవరితో పరిచయం పెంచుకుంది.. ఏం చేసిందనేదే రెండోభాగం కథాంశం. ఐ సినిమాతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అమీ జాక్సన్ ఈ ఆడచిట్టి ప్రాతను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రూపానికి తగ్గట్టు, ప్రత్యేక దుస్తులు, ఒక స్పెషల్ రోబో రెడీ అవుతున్నాయి. మరోవైపు ఇన్నాళ్లు ఆసక్తి రేపిన సినిమాలోని విలన్ ప్రాత చివరికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను వరించింది. ముందు హాలీవుడ్ మెగా హీరో అర్నాల్డ్ ష్వాజ్‌నెగర్‌ను అనుకున్నారు. తర్వాత ఆమిర్‌ను కూడా సంప్రదించారు. చివరికి బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ ను ఫిక్స్ చేసేశారు. ఆ విషయాన్ని స్వయంగా అక్షయ్ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ గారితో సినిమా ప్రారంభంతో ఈ సంవత్సరం ముగియడం చాలా సంతోషంగా ఉందంటూ ఒక ఫొటోను షేర్ చేశారు. లికా ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈ రోబో 2 కి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. హాలీవుడ్ సంస్థ మేరీ ఈ వోగ్ట్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయనుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రజనీ, శంకర్ అమీ జాక్సన్‌ల క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ టాక్ వినిపిస్తోంది. Ending the year on a high note! Super excited to be a part of Robot 2 with the one & only @superstarrajini sir! pic.twitter.com/mC7AINo3JR — Akshay Kumar (@akshaykumar) December 16, 2015 -
రోబో 2.0 రిపోర్టింగ్ మొదలైంది
చెన్నై: అసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ రోబో 2 ' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు బుధవారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. సంచలన దర్శకుడు శంకర్ సారధ్యంలో రూపుదిద్దుకున్న ఈ సీక్వెల్ కి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోందని, అది కాదని..2.0 అని దర్శకుడు శంకర్ మంగళవారం ట్వీట్ చేశాడు. అటు 3డి ఫార్మాట్లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయటానికి ప్లాన్చేశారు. సౌత్ నుంచి ఇంటర్నేషనల్ వరకూ ఒకే టైటిల్‌తో ప్రమోట్ చేయటానికి శంకర్ ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం రోబోలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో చిట్టీని.. ఈ ఆడ చిట్టీగా రాబోతోంది. ఈ పాత్రను వెరైటీగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఫీమేల్ ఆసారి చిట్టీతో ఎవరితో పరిచయం పెంచుకుంది.. ఎవరితో ప్రేమలో పడింది... ఏం చేసింది అనేది రెండవ భాగం కథాంశం. ఐ సినిమాతో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ యామీ జాక్సన్ ఈ ఆడచిట్టి ప్రాతను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోఆమె రూపానికి తగ్గట్టు , ప్రత్యేక దుస్తులు, ఒక స్పెషల్ రోబోను రడీ చేస్తున్నారని తెలుస్తోంది. లికా ప్రొడక్షన్స్ పై వస్తున్న ఈ రోబో 2 కి ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా బాహుబలి ఫేం శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్. అటు రజినీకాంత్, ఐశ్వర్య రాయ్‌ల కాంబినేషన్లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రజినీ , శంకర్ –యామీ జాక్సన్ ల క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ క్రేజ్ నెలకొంది. -
కరాటే పోటీలు ప్రారంభించిన సుమన్
విజయవాడ: విజయవాడలోని దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
'ఐడియాతో రండి...ప్రాజెక్టుతో వెళ్లండి'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన టీ-హబ్ ను గవర్నర్ నరసింహన్, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో టీ హబ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాయదుర్గం సమీపంలో 15 ఎకరాల్లో టీ- హబ్ ను విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ఐడియాతో రండి .... ప్రాజెక్టుతో వెళ్లండి' అని కేటీఆర్ పిలుపు నిచ్చారు. టీ-హబ్‌లో 200 స్టార్టప్ కంపెనీలకు అవకాశం కల్పించనున్నారు. స్టార్టప్‌ల రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. -
ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: శుక్రవారంనాటి మార్కెట్లు ఫ్లాట్ గా మొదలయ్యాయి. అనంతరం మెల్లిగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల నస్టంతో 26,959 దగ్గర, నిఫ్టీ15 పాయింట్ల నష్టంతో 8,164 దగ్గర ట్రేడవుతున్నాయి. మిగిలిన ఆసియా మార్కెట్లన్నీ పాజిటివ్ వుంటే సెన్సెక్స్ 27 వేల మార్కుకు దిగువన ట్రేడవుతూ నెగిటివ్ సంకేతాలను సూచిస్తోంది. ముఖ్యంగా టెలికాం షేర్లు నష్టాల్లో చవిచూసు చూస్తున్నాయి. ఎయిర్ టెల్ మూడు శాతం నష్టాల్లో కొనసాగుతోంది. ఐటీసి, యాక్సింగ్ బ్యాంక్ , కోల్ ఇండియా, హెచ్ యుల్ షేర్లలోని నష్టాలు మార్కెట్ ను భాగా ప్రభావితం చేస్తున్నాయి. అటు రూపాయి కూడా న ష్టాల్లో ట్రేడవుతోంది. 13 పైసల నష్టంతొ 64.95 దగ్గర ఉంది. మరోవైపు బీహార్ లో రెండో దశ పోలింగ్ నేపథ్యంలో ఈ ప్రభావం కూడా మార్కెట్ పై చూపనుంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో కొంత ప్రతికూల వాతావరణమే ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 26వేల 561.15 పాయింట్ల వద్ద ట్రెండ్ అవుతుండగా, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 8,044.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ స్పందనలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 223 పాయింట్లలాభంతో 28వేల 291 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 8581 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెక్టార్ సూచీల్లో కన్స్యూయర్ డ్యూరబుల్స్ 1.41శాతం, హెల్త్ కేర్ సూచీలు 0.92శాతం, ఐటి సూచీలు 1.18శాతం, మెటల్ సూచీలు 1.55శాతం లాభపడుతుండగా, నిప్టీ టాప్ గేయినర్స్ లిస్ట్‌లో టాటాస్టీల్ 4.04శాతం, భారతీ ఎయిర్టెల్ 2.57శాతం,విఇడిఎల్ 2.28శాతంలాభపడుతున్నాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్ట్‌లో ఎసియన్ పేయింట్స్ 1.49శాతం, గేయిల్ 0.65శాతం , ఎమ్అండ్ ఎమ్ 0.59శాతం నష్టపోతున్నాయి. అటు డాలర్‌తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి 9 పైసలు నష్టపోయి 63.93 దగ్గర ఉంది. -
రేపటినుంచే ఘనంగా బోనాల జాతర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఈనెల 19 ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలనుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కార్యక్రమాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 2,3 తేదీల్లో సికింద్రాబాద్ ప్రాంతంలో, 9,10 తేదీల్లో పాతబస్తీ ఉమ్మడి దేవాయలంలోపాటు ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించ నున్నట్టు తెలిపారు. లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. అనంతరం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపించనుంది. అయితే ఈ సారి జంట నగరాల్లో నిర్వహించే ఉత్సవాల్లో జోగిని పలారం రాధిక సందడి చేయనుంది. హైదరాబాద్ , సికింద్రాబాద్ పరిధిలో అన్ని దేవాలయాల్లో బోనాల జాతరలో జోగిని రాధిక పాల్గొననుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర నిర్వహించేందుకు ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి. . తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తుల ఈ జాతరలో పాలుపంచుకోనున్నారు. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటనగరాల్లోని అమ్మవారి ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరోవైపు తెలంగాణా రాష్ట్రంలో అధికార పండుగగా నిర్వహించే బోనాల జాతరలో జోగిని వ్యవస్థను రద్దుచేయాలని, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. -
చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం (జూన్ 8) రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం (జూన్ 9) రాత్రి వరకు ప్రసాదం పంపిణీ చేస్తామని నిర్వాహకుల్లో ఒకరైన బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. కాగా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గతేడాది సుమారు 4.5 లక్షల మంది చేప మందు ప్రసాదం తీసుకున్నారు. న్నట్లు వెల్లడించారు. చేప మందు తీసుకునేవారు 3 గంటల ముందు, వేసుకున్న తర్వాత గంటన్నర వరకు ఏలాంటి ఆహారం తీసుకోరాదని, గతేడాది సుమారు 4.5 లక్షల మంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం తీసుకోలేక పోయినవారు దూద్‌బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చని సూచించారు. -
జూన్ 15 నుంచి బడులు
వారం రోజుల పాటు బడిబాట హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఏటా జూన్ 12వ తేదీనే పాఠశాలలు పునఃప్రారంభ మవుతుంటాయి. కానీ ఈసారి జూన్ 12వ తేదీ శుక్రవారమైంది. తరువాత 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం రెండూ సెలవు దినాలు ఉన్నాయి. 12వ తేదీన స్కూళ్లు ప్రారంభిస్తే వెంటనే వరుసగా రెండు సెలవు దినాలు ఉండడంతో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు అధికారులు బడుల ప్రారంభ తేదీని 15వ తేదీకి మార్చారు. ఆరోజునుంచి బడిబాట కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. బడిబయట ఉన్న పిల్లలందర్నీ పాఠశాల ల్లో చేర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయనగరంలో ప్రారంభించనున్నారు. -
స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా వెంటనే కొలుకొని లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 39పాయింట్ల లాభంతో 27,245 దగ్గర, నిఫ్టీ 18పాయింట్ల 8,242 లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు చైనా మార్కెట్లు నష్టాలలో ట్రేడవుతున్నాయి. -
15నుండి రైతురుణవిముక్తి యాత్ర
-
తొలి పోస్టల్ ఏటీఎంకు శ్రీకారం
విజయవాడ : విజయవాడలో తొలి పోస్టల్ ఏటీఎం ప్రారంభమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొట్టమొదటిది. విజయవాడ హెడ్ పోస్టాఫీస్‌లో ఏర్పాటుచేసిన ఈ ఏటీఎంను ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంవత్సరాంతానికల్లా మొత్తం 95 పోస్టల్ ఏటీఎంలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పొదుపు ఖాతాలన్నింటినీ తమ శాఖ కంప్యూటరీకరించిందన్నారు. తద్వారా కోర్ బ్యాంకింగ్ విధానంలోకి తెచ్చి ఖాతాదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల ద్వారా నగదు తీసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.ఈ నెలాఖరుకల్లా హైదరాబాద్‌లో రెండు, సికింద్రాబాద్, కర్నూల్లో ఒక్కొక్కటి చొప్పున ఏటీఎంలను ఏర్పాటు చేస్తామన్నారు. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవ్వగా, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 148.99 పాయింట్ల నష్టంతో 27,586దగ్గర, నిఫ్టీ 50.55 పాయింట్ల నష్టంతో పాయింట్ల 8,347 దగ్గర ప్రారంభమయ్యాయి. -
లోక్‌సభ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు 13 రోజులపాటు జరగనున్నాయి. భూసేకరణ చట్టం - 2013కు సవరణలు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన రూపొందించిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ యెమెన్‌లో నెలకొన్న సంక్షోభం, అక్కడి భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు, విజయాలను వివరిస్తారు. నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సమావేశాల్లో ముందుగా సంతాప తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన సింగపూర్ ప్రధాని లీ కువాన్ యూ , మాజీ లోక్‌సభ సభ్యులు ఇరువురు మృతిపై సభ సంతాపం తెలిపింది. ఈ సమావేశాల్లో రైల్వే పద్దులతో పాటు సాధారణ బడ్జెట్లో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగనుంది. కాగా రాజ్యసభ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. ఈపార్లమెంటు సమావేశాలు వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మరోవైపు వెంకయ్యనాయుడు వివిధ బిల్లుల ఆమోదం, రాజ్యసభలో ప్రతిపక్షాల ఆధిపత్యం నేపధ్యంలో సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ ఎంపీలను కోరారు. లోక్‌సభ సమావేశాలు మే 8న, రాజ్యసభ సమావేశాలు మే 13న ముగియనున్నాయి. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
-
నేటి నుంచి మెట్రో పొలిస్ సదస్సు
-
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
నేటినుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. బుధవారం ప్రథమ, గురువారం ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 159 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ నగరంలో 84 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2013-14 సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 1,30,100 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం 65,091 మంది, రెండో సంవత్సరం 65,009 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ఒకేషనల్ విద్యార్థులు మొదటి సంవత్సరం 966 మంది, రెండో సంవత్సరం 1,666 మంది రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 159 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 159 మంది డిపార్టుమెంటల్ అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత వ్యవధిలోగా చేరుకోవాలి నిర్ణీత వ్యవధిలోగా వచ్చినవారిని మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి వెంకట్రామయ్య స్పష్టం చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 8.25 గంటలకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని, 8.30 గంటలకు హాల్‌టిక్కెట్లు పరిశీలించి, 8.45 గంటలకు ప్రొఫార్మా షీట్లు ఇస్తామని ఆయన తెలిపారు. 9 గంటల తరువాత పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. -
ఎఫ్ఎం రేడియో ప్రారంభం నాలుగు రోజులుగా ట్రయల్స్
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ జిల్లా వాసులకు శుభవార్త. దాదాపు మూడేళ్లుగా ఇదిగో, అదిగో అంటూ ఊరించిన ఎఫ్ఎం రేడియో ఎట్టకేలకు ప్రారంభమైంది. శనివారం నుంచి ట్రయల్స్ కూడా సాగుతున్నాయి. అధికారుల ప్రయత్నాలు విజయవంతం అయినట్లే కనిపించడంతో వారు ఉత్సాహంగా మిగతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ సదుపాయం కల్పించేందుకు ఆకాశవాణి కడప కేంద్రం ప్రధాన కార్యాలయంలోగల టవర్‌కు ఎఫ్ఎం ప్రసారాలకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్నాళ్లపాటు ట్రయల్స్ చూడాలని నిర్ణయించి శనివారం కార్యక్రమాల ప్రసారాలు మొదలు పెట్టారు. కడప నగరంతోపాటు పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో కూడా ఈ మూడు రోజులు కార్యక్రమాలు విజయవంతంగా ప్రసారమయ్యాయి. ట్రాన్స్మిషన్ టవర్ పనితీరు, దూరం, నాణ్యత, కార్యక్రమాలు వినిపిస్తున్న ప్రాంతాల గురించి ట్రయల్స్‌లో అధ్యయనం సాగుతోంది. ఆకాశవాణి కడపకేంద్రంలో ప్రసారమవుతున్న కార్యక్రమాలనే ప్రస్తుతం ఎఫ్ఎంలో కూడా ప్రసారం చేస్తున్నారు. ట్రయల్స్ విజయవంతమయ్యాయని అధికారులు పూర్తి స్థాయిలో ధ్రువీకరించుకున్నాక ఎఫ్ఎం ప్రసారాలకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం కడప నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో స్పష్టంగా ప్రసారమవుతున్నాయి. ఇక రేడియోగా సెల్‌ఫోన్! ఎఫ్ఎం సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్‌ను రేడియోగా వాడుకోవచ్చు. 900 కిలో హెడ్స్‌పై కడప ఆకాశవాణి ప్రసారాలు వస్తుండగా, ఎఫ్ఎం నుంచి రేడియోలోగానీ, సెల్‌ఫోన్‌లోగానీ 103.6 మెగా హెడ్స్‌పై ప్రసారమవుతున్నాయి. కొన్ని సెల్ఫోన్లలో నేరుగా కార్యక్రమాలు వినే సౌకర్యం ఉంది. మరికొన్నింటిలో హెడ్ ఫోన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో... ప్రయోగాత్మక ప్రసారాలు కనీసం మూడు నుంచి ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది. ఈలోపు ఎఫ్ఎం ప్రసారాలకు అవసరమైన సిబ్బంది, కార్యక్రమాల రూపకల్పన, నెట్వర్క్ తదితరాలను ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు రేడియో వ్యాఖ్యాతల్లాగా ఎఫ్ఎం కార్యక్రమాల్లో జాకీలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రసారాలివి! ప్రస్తుతం ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారాతెలుగులో ఉదయం 6.45, మధ్యాహ్నం 1.10, సాయంత్రం 6.15 గంటలకు ప్రాంతీయ వార్తలు, ఉదయం 7.10, మధ్యాహ్నం 12.40, రాత్రి 7.05 గంటలకు తెలుగులో జాతీయ వార్తలను వినవచ్చు. ఆంగ్లంలో ఉదయం 8.15, మధ్యాహ్నం 2.00, రాత్రి 9.00 గంటలకు, హిందీలో ఉదయం 8.00, రాత్రి 8.45 గంటలకు, ఉర్దూలో సాయంత్రం 5.50 గంటలకు వార్తలను వినవచ్చు. ఇవిగాక ఉదయం 7.15 గంటల నుంచి 7.55 గంటల వరకు కాంతిరేఖలు కింద ఆరోగ్యం, సాహిత్యం తదితర అంశాలపై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఉదయం 8.30 నుంచి 9.00 గంటల వరకు సినిమా పాటలు, 10 నుంచి 11గంటల వరకు శ్రోతలు కోరిన ి పాటలను వినిపిస్తారు. సాయంత్రం 5 గంటలకు యువవాణిలో యువతకు అవసరమైన సమాచారం, వినోద కార్యక్రమాలు ప్రసారవుతాయి. -
ఇ-ఫ్రెష్ మార్కెట్ అనుసంధాన సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ సంబంధ వెబ్ పోర్టల్ ఇ-ఫ్రెష్ఇండియా.కామ్ తాజాగా మార్కెట్ అనుసంధాన సేవలను ప్రారంభించింది. భారత్‌తోపాటు అమెరికాలోని ఫుడ్ సేఫ్టీ ధృవీకరణ కలిగిన వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల సరఫరాదారుల కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఉత్పత్తుల వారీగా, ఫుడ్ సేఫ్టీ ధృవీకరణల ఆధారంగానూ సరఫరాదారుల వివరాలను ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ధృవీకరణలు పొందని ఉత్పత్తిదారుల వివరాలూ ఉంటాయి. ఉత్పత్తిదారులు అంతర్జాతీయ స్థాయిలో ఉనికి పెంచుకోవడానికి, వ్యాపార అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఇది వేదికగా నిలుస్తుందని ఇ-ఫ్రెష్ పోర్టల్ ఎండీ శ్రీహరి కోటెల తెలిపారు. మధ్యవర్తుల జోక్యం ఉండకపోవడంతో ఇరువురికి కలిసి వస్తుందని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, రైతు సంఘాల సమాఖ్య చైర్మన్ ఎం.గోపాలక ృష్ణ, నాబార్డు మాజీ ఎండీ పీవీఏ రామారావుతో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సమాచారం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వివరాలను తెలియజేసేందుకు రైతు అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తొలుత కరీంనగర్, జగిత్యాల, గుంటూరులో ఇవి రానున్నాయి.