చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సోమవారం (జూన్ 8) రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం (జూన్ 9) రాత్రి వరకు ప్రసాదం పంపిణీ చేస్తామని నిర్వాహకుల్లో ఒకరైన బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. కాగా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
గతేడాది సుమారు 4.5 లక్షల మంది చేప మందు ప్రసాదం తీసుకున్నారు. న్నట్లు వెల్లడించారు.
చేప మందు తీసుకునేవారు 3 గంటల ముందు, వేసుకున్న తర్వాత గంటన్నర వరకు ఏలాంటి ఆహారం తీసుకోరాదని, గతేడాది సుమారు 4.5 లక్షల మంది ఈ ప్రసాదాన్ని తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రసాదం తీసుకోలేక పోయినవారు దూద్‌బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చని సూచించారు.