fish medicine
-
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ, మిస్ అయిన వాళ్ల కోసం..
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిన్న ఉదయం 10 గంటకు ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. మొత్తం 1,60,000 చేప పిల్లలు సిద్ధం చేయగా, నిన్న 60 వేలకు పైగా భక్తులు చేప ప్రసాదం స్వీకరించారు. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం తీసుకోని వారికి మరో అవకాశం కల్పించారు బత్తిని సోదరులు. కవాడి గూడ, దూద్ బౌలి లోని తమ నివాసల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక 24 గంటలపాటు సాగిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం.. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య కొనసాగింది. అయితే.. 30 కౌంటర్లకు పైగా ఏర్పాటు చేసినా క్యూ లైన్లల్లో మహిళలకు, వృద్దులకు, దివ్యంగులకు ప్రత్యేక లైన్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.టోకెన్ తీసుకున్న వారికే చేప మందు ప్రసాదం పంపిణీ చేయడం.. ఉదయం నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్దకు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు క్యూ కట్టడంతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. -
చేప ప్రసాదం పంపిణీతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిట (ఫోటోలు)
-
చేప ప్రసాదం: 80 వేల మందికి పైనే..
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: ఆస్తమా రోగులు ఎంతగానో ఎదురుచూసే చేప ప్రసాదం పంపిణీ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు 80 వేల మందికి చేప ప్రసాదం ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటల వరకు పంపిణీ ఉంటుందన్నారు. కాగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మొదట బత్తిని కుటుంబ సభ్యుల చేపప్రసాదం పంపిణీని శుక్రవారం ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చేప ప్రసాదం వేసి ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు, సామాన్య ప్రజలు కూడా వేలాదిమంది తరలివచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పోలీస్, మత్స్యశాఖ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఆర్‌ఆండ్‌బీ, వాటర్‌బోర్డు, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు పలు శాఖల ఉన్నతాధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకు ముందు దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలోనూ మొదట చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. మంత్రి స్వయం పర్యవేక్షణ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపప్రసాదం పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా శుక్రవారం రోజంతా పర్యవేక్షించారు. ఉదయం ప్రారంభించిన మంత్రి రాత్రి వరకు పలుమార్లు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. వాటర్‌బోర్డు, బద్రి విశాల్ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మజ్జిగ పంపిణీ చేశారు. ఇక నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, నగర కలెక్టర్ అమయ్‌కుమార్ తదితరులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం రాత్రి వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు 90 వేల చేప పిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాథోడ్ తెలిపారు. శనివారం ఉదయం వరకు ప్రజలకు అవసరమైనన్ని చేపపిల్లలను అందుబాటులో ఉంచామన్నారు. రాత్రంతా చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని, చేపపిల్లల విక్రయం కూడా కొనసాగుతుందన్నారు. 32 కేంద్రాల ద్వారా పంపిణీ చేప ప్రసాదాన్ని 32 కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు. బత్తిని కుటుంబానికి చెందిన 250 మంది కుటుంబ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు వాలంటీర్లుగా సేవలందించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్వినిమార్గం, మాజీ కార్యదర్శి వినయ్‌కుమార్ ముదిరాజ్తో పాటు పలువురు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చేపప్రసాదం పంపిణీకి చేయూతనందించారు. దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు. 75 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిఘా నిర్వహించారు. -
మూడేళ్ళ తర్వాత చేప మందు పంపిణీ
-
ముగిసిన చేప ప్రసాద పంపిణీ
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రెండో రోజు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆస్తమా రోగులతో ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది. రెండవ రోజు కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషంగా తిరిగి వెళ్తున్నారన్నారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున కల్పించిన మౌలిక సదుపాయాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం పలు స్వచ్చంద సంస్థలు చేసిన సేవలు అభినందనీయమని, ఇటువంటి సామాజిక సేవలను భవిష్యత్తులో కొనసాగించాలని సూచించారు. రెండు రోజుల పాటు 87 వేల చేప పిల్లలను పంపిణీ చేసినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆ ఏర్పాట్లకు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయొద్దు?
సాక్షి, హైదరాబాద్: బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాట్లు చేయరాదని ఎక్కడుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ బిజినెస్ రూల్ కింద ఖర్చులెలా చేయాలని ఉందో తెలియజేయాలని బాలల హక్కుల సంఘాన్ని నిలదీసింది. అన్ని ప్రభుత్వ శాఖలు చేప ప్రసాదం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయని, ప్రభుత్వ శాఖలు చేసే ఖర్చుల గురించి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుత్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం హైకోర్టు మరోసారి విచారించింది. ప్రజాధనాన్ని ఖర్చు చేసేప్పుడు వాటి గురించి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని, ఖర్చు చేసే అంశంపై జవాబుదారీతనం ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదించారు. ప్రభుత్వం ఏ బిజినెస్ రూల్ ప్రకారం ఖర్చు చేయాలో తెలియజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ప్రశ్నించింది. పెద్ద సంఖ్యలో జనం వస్తున్నప్పుడు వారికి మంచినీరు, అత్యవసర వైద్యం, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తే తప్పేంటని అడిగింది. ఆ విధమైన ఏర్పాట్లు చేయడానికి అభ్యంతరం లేదని, అయితే అందుకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల గురించే తమకున్న అభ్యంతరమని, ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండానే ఖర్చు చేస్తోందని న్యాయవాది బదులిచ్చారు. ఈ విషయంపై గతంలో లోకాయుక్త ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పగానే ధర్మాసనం కల్పించుకుని.. లోకాయుక్త సిఫార్సు మాత్రమే చేస్తుందని, ఆ సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదని చెప్పింది. ప్రజావసరాల కోసం పోలీస్, మత్స్య, విద్యుత్, రెవెన్యూ వంటి శాఖల సేవల్ని ఉపయోగించుకోకపోతే, రేపు ఏదైనా జరగరానిది జరిగితే కోర్టులకు వచ్చి ప్రభుత్వ వైఫల్యం చెందిందని వ్యాజ్యాలు వేసే అవకాశాలు ఉంటాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇక íసిటీ పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్లో చేప మందుపై గతంలో దాఖలైన కోర్టు కేసుల తర్వాతే చేప ప్రసాదం పేరుతో బత్తిన సోదరులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనిని 1845 నుంచి ఇస్తున్నారని, దాని ఫార్ములా గోప్యంగానే ఉంచుతున్నారని, ఆస్తమా తగ్గుతుందనే నమ్మకంతో భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ అచ్యుత్‌రావుపై 2017లో హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచాబుత్రా పోలీస్‌స్టేషన్‌లో బాలల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు ఉందన్నారు. -
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నాంపలి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనుంది. ఇందుకోసం 1.65 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది. ఆదివారం సాయంత్రం వరకు బత్తిని సోదరులు, వారి కుటుంబ సభ్యులు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తరువాత 10, 11 తేదీల్లో వారి ఇళ్ల వద్ద చేప ప్రసాదంపంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలి రానున్నారు. గతేడాది సుమారు 70 వేల మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష వరకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా 40 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మందితో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించనుంది. చేప ప్రసాదం కోసం టోకెన్లు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ంసీ ఆధ్వర్యంలో 100 మొబైల్ టాయిలెట్లను, 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, 6 వైద్య బృందాలు, 3 మొబైల్ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. బత్తిని కుటుంబం ప్రత్యేక పూజలు... మృగశిర కార్తె ప్రవేశం రోజున వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులు ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని శంకర్‌గౌడ్‌లు తెలిపారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో శుక్రవారం ఉదయం సత్యనారాయణస్వామి పూజ నిర్వహించి చేప మందు పంపిణీకి ఏర్పాట్లను చేపట్టారు. చేప మందు పంపిణీ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. 171 ఏళ్లుగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన మూడో తరం పంపిణీ చేస్తోంది. ఇతర వివరాల కోసం 9391040946, 8341824211, 9989989954 నంబర్లలో సంప్రదించవచ్చు. -
సదుపాయాలు కల్పిస్తే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదంకోసం పెద్ద సంఖ్య లో జనం వస్తున్నప్పుడు ప్రభుత్వం వారికి కనీస సదుపాయాల్ని కల్పిస్తే తప్పేమిటని హైకోర్టు ప్రశ్నిం చింది. ‘ఏదైనా ప్రదేశానికి వేల మంది ప్రజలు వస్తున్నప్పుడు ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదని, నిర్వాహకులే చూసుకుంటారని వదిలేయాలా? తొక్కిసలాట లాంటి జరగకూడనిది జరిగితే అందుకు ఎవరు బాధ్యత వహించాలి. అప్పుడు మళ్లీ కోర్టుకు వచ్చి ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, మృతుల కుటుంబసభ్యులకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలంటూ వ్యాజ్యాలు వేస్తారు’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో ఏటా మృగశిరకార్తెకు బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాద పంపి ణీకి ప్రభుత్వం ఉచిత ఏర్పాట్లు చేయడాన్ని తప్పుపడుతూ బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పైవిధంగా పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రైవేటు వ్యక్తులు నిర్వ హించే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయకుండానే, మౌఖిక ఆదేశాలతో ప్రజాధనాన్ని వెచ్చిస్తోందని బాలల హక్కుల సంఘం పిల్ దాఖ లు చేసింది. దీనిపై ధర్మాస నం స్పందిస్తూ వేసవి ఎండ లు తీవ్రంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో నీడకోసం టెంట్లు వేయడం, మంచినీటి వసతి, అత్యవసర వైద్య సేవలు, రక్షణకోసం పోలీసులను విని యోగిస్తే తప్పేమిటో, ఇది చట్ట వ్యతిరేకం ఎలా అవుతుందో చెప్పాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులకు మంచినీరు, మరుగుదొడ్లు, పోలీస్ రక్షణ, వసతుల్ని ప్రభుత్వమే కల్పిస్తుందని, ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతోందో తెలపాలని ధర్మాసనం కోరింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఫీజు కూడా నిర్వాహకులు కాకుండా ప్రభుత్వం చెల్లిస్తోందని పిటిషనర్ న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ వాదనలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ చెప్పడంతో విచారణ 7వ తేదీకి వాయిదా పడింది. కాగా, 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ : బత్తిని హరినాథ్‌గౌడ్ హైదరాబాద్: ప్రతి ఏట మాదిరిగానే ఈసారి కూడా మృగశిరకార్తె సందర్భంగా ఈనెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని బత్తిని హరినాథ్‌గౌడ్ వెల్లడించారు. దాదాపు ఐదు లక్షల మంది ఆస్తమా రోగులు వచ్చే అవకాశం ఉండటంతో 32 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జనసేవాసంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో హరినాథ్‌గౌడ్ మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 8న శనివారం సాయం త్రం ఆరు నుంచి 9వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలనుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు చేప ప్రసాదంకోసం రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో జనసేవాసంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాండే, పరమానందశర్మ, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేపమందుపై హైకోర్టులో పిటిషన్.. నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: చేపమందు పంపిణిని ఆపాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనావ్యాజ్యం దాఖలైంది. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం చేయనున్న విషయం తెలిసిందే. అయితే దానిని ఆపాలని కోరుతూ బాలల హక్కుల సంఘం లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. చేప మందుకు ఎలాంటి సైంటిఫిక్ అథారిటి లేదని.. దానిని పంపిణీ చేయడం చట్ట విరుద్దమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. చేప మందు కోసం అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని పటిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఈరోజు మధ్యాహ్నాం విచారిస్తామని తెలిపింది. జూన్8, 9వ తేదీల్లో అస్తమా బాధితులకు చేప మందు పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరినాథ్‌గౌడ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సహకారంతో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. తొలుత నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందును పంపిణీ చేస్తామని, అక్కడ పూర్తయిన తర్వాత దూద్‌బౌలి, కవాడిగూడ, వనస్థలిపురం, కూకట్‌పల్లిలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి అందిస్తామని తెలిపారు. -
వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా రోగులకు వచ్చే నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ చేపడతామన్నారు. మంగళవారం సచివాలయంలో చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె. జోషి, వివిధ శాఖల అధికారులతో తలసాని సమన్వయ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు 173 ఏళ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు వస్తారని, వారికి అవసరమైన చేప పిల్లలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అదనంగా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు ట్రాఫిక్, బ్యారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్నిమాపక నిరోధక వ్యవస్ధకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్స్, అదనపు సిబ్బంది, రోడ్లకు రిపేర్లు, రూ. 5 భోజనం వసతి కల్పించాలని వివరించారు. మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మంచినీటి ప్యాకెట్లు, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఆర్టీసీ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి 150 బస్సులను నడుపుతున్నట్లు తలసాని తెలిపారు. పనుల పరిశీలనకు జూన్ 4న ఉదయం 11 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశం అవుతామన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ గోపీకృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, ఫిషరీస్ కమిషనర్ సువర్ణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డిలతోపాటు బత్తిని హరినాధ్‌గౌడ్ కుటుంబీకులు పాల్గొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
జూన్ 8, 9 తేదీల్లో చేపమందు
హైదరాబాద్: వంశపారంపర్యంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని వచ్చే నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు చెప్పారు. 8వ తేదీ ఉదయం హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం చేప మందు ప్రసాదాన్ని తయారు చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి తరలిస్తామని పేర్కొన్నారు. చేప మందును 8, 9 తేదీల్లో పంపిణీ చేస్తామని అన్నారు. దాదాపు 5–6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు సైతం ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, పోలీస్, మత్స్య శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చేప మందు పంపిణీకి 250 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. చేప మందు పంపిణీ కోసం ఈ నెల 28వ తేదీన కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులతో సమావేశం అవుతామని, అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
ముగిసిన చేపమందు ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు. -
చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది!
-
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపమందు పంపిణీని మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.60 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేస్తున్నారు. కాగా, రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడుపుతుండటం గమనార్హం. చేప మందు కోసం వచ్చే వారి కోసం రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు బత్తిన కుటుంబం 173 ఏండ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంచుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ప్రజలకు చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అనుసంధానాన్ని చేసి పూర్తి జాగ్రత్తలను తీసుకున్నాం. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. చేప ప్రసాదం పంపిణీ విషయంలో సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి తలసాని సూచించారు. -
నేడే చేపమందు ప్రసాద పంపిణీ
-
నేడే చేప మందు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు జరగనున్న మందు పంపిణీకి 50వేల మందికి పైగా ఆస్తమా బాధితులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.32 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తారు. 133 అదనపు బస్సులు 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేయనున్నారు. రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడపనుంది. అన్ని ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. బస్సులపై ‘ఫిష్ మెడిసిన్ స్పెషల్’అని తాత్కాలిక డెస్టినేషన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. భారీగా జనం తరలిరానున్న దృష్ట్యా 3 ప్రత్యేక వైద్య శిబిరాలు, 3 మొబైల్ వైద్య బృందాలను రంగంలోకి దించనున్నారు. 108, 104 వాహ నాలు సిద్ధంగా ఉంచారు. రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 1,500 పోలీసులతో బందోబస్తు సుమారు 1,500 మంది పోలీసులు, ఇద్దరు అదనపు డీసీపీ స్థాయి అధికారులు, 8 మంది ఏసీపీలు, 22 మంది సీఐలతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో 70 సీసీ కెమెరాలతో నిఘా ఉంచా రు. 4 ఫైర్ ఇంజన్లు, మరో 4 మొబైల్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లనూ అందుబాటులో ఉంచారు. 1,230 మంది పారిశుధ్య సిబ్బంది 2 రోజులు విధులు నిర్వహించనున్నారు. 100 టాయిలెట్లు, 100 మొబైల్ టాయిలెట్లు ఏర్పా టు చేశారు. 800 మంది వలంటీర్లు సేవలందించనున్నారు. హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో సూచనలు చేసేందుకు యాంకర్లను నియమించారు. 3 లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీకి జలమండలి ఏర్పాట్లు చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు నియమాలు చేప ప్రసాదం తీసుకునే ఉబ్బస వ్యాధి గ్రస్తులు కొన్ని నియమాలు పాటించాలని బత్తిన సోదరులు సూచించారు. ప్రసాదం తీసుకునే ముందు 3 గంటలు, తీసుకున్న తరువాత గంటన్నర వరకు ఆహారం తీసుకోరాదు. ఇచ్చిన మందును 6 మాత్రలుగా చేసి నీడలో 7 రోజులు ఆరబెట్టాలి. వీటిని 3 పర్యాయాలుగా జూన్ 23, జూలై 8, 23 తేదీల్లో ఉదయం పరగడుపున ఒకటి, నిద్రబోయే మందు ఒకటి చొప్పున గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి. అలాగే వ్యాధిగ్రస్తులు 45 రోజులు పత్యము ఉండాలి. పత్యము ఉండే రోగులు పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామ కూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వరుగు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, నెయ్యి (ఆవు), మోసంబీలు, అంజీర్ పండ్లు, ఆవు పాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. -
జూన్ 8,9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు పంపిణీ
-
8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సంబంధిత వ్యాధి రోగులకు బత్తిని మృగశిర ట్రస్టు ప్రతియేటా పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8, 9 తేదీల్లో ఇవ్వనున్నట్లు ఆ ట్రస్టు కార్యదర్శి బి.హరినాథ్ గౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసాదం దొరకని వారికి మరుసటి రోజు దూద్‌బౌలి, కవాడిగూడ, కూకట్‌పల్లిలోని తమ కుటుంబీకుల నివాసాల వద్ద అందిస్తామన్నారు. శాకాహారులకు బెల్లంతోనూ, మాంసాహారులకు చేపతో ప్రసాదం ఇస్తామన్నారు. పంపిణీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్,ఫైర్, పోలీస్, విద్యుత్ శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. రోగులందరికీ బద్రి విశాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్టు, అగర్వాల్ సేవాదళ్ వారు భోజనం, మజ్జిగ, నీరు అందజేయనున్నారని తెలిపారు. ఏమీ తినకూడదు.. చేప ప్రసాదం తీసుకునే వారు మూడు గంటల ముందు, తీసుకున్న గంటన్నర వరకూ ఏమీ తినకూడదని హరినాథ్ గౌడ్ సూచించారు. ప్రసాదం తీసుకున్న తర్వాత తాము ఇచ్చే మందును ఆరు మాత్రలుగా చేసి నీడలో ఎండబెట్టి ప్రతీ 15 రోజులకు ఒకసారి.. ఉదయం, రాత్రి వేళల్లో ఒక మాత్ర చొప్పున ఏమీ తినకముందు గోరువెచ్చని నీటితో వేసుకోవాలన్నారు. ఈ 45 రోజులు పథ్యం పాటించాలని అప్పుడే వ్యాధి పూర్తిగా తగ్గుతుందని చెప్పారు. -
జూన్ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8, 9వ తేదీల్లో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని.. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని హరినాథ్ గౌడ్ వివరించారు. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న పన్నిలాల్ పిట్టి ట్రస్ట్, అగర్వాల్ సేవా దళ్, గౌడ వసతి గృహం వలంటీర్లకు హరినాథ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
చేపమందు పంపిణీకి చర్యలు: తలసాని
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న చేపమందు పంపిణీ చేసేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు చేపమందు పంపిణీ చేసే బత్తిన హరినాథ్ గౌడ్, కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వపరంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ గురువారం సచివాలయంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు.మంత్రి మాట్లాడుతూ.. గతేడాదిలాగే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. వారంలో అన్ని శాఖల అధికారులతో భేటీ ఏర్పాటు చేసి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, ఆదేశాలు జారీ చేస్తామన్నారు. -
చేప ప్రసాదానికి పోటెత్తిన జనం
-
బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్ : మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ప్రతి ఏటా బత్తిన సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీని బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. 32 కేంద్రాలు ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తొలుత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. 1500 మందితో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన వారికి ఉచిత భోజన, మంచి నీటి సదుపాయం కల్పించారు. గురువారం ఉదయం 8.30 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని చేప ప్రసాదం పంపిణీ నిర్వాహకులు తెలిపారు. -
రేపు, ఎల్లుండి చేప మందు పంపిణీ
హైదరాబాద్: శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి రేపటి నుంచి రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు డీసీపీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. రేపు (బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి( గురువారం) ఉదయం వరకు చేప మందు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో జనం తరలివస్తుండటంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. చేప మందు కోసం వచ్చే స్థానిక ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసులు సూచిస్తున్నారు. రద్దీ దృష్ట్యా 1500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసారి చేప మందు కోసం 50 నుంచి 60 వేల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు డీసీపీ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. -
చేప మందు సందడి