నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు బత్తిన సోదరులు తెలిపారు.
హైదరాబాద్: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు బత్తిన సోదరులు తెలిపారు. ఈ నెల 8న సాయంత్రం 5 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.
కాగా, చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ, కార్డ్‌బోర్డు, ఆర్టీసీ, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతేడాది నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోనే 1.50 లక్షల మంది ఉబ్బసం బాధితులకు చేపప్రసాదం పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో ఉబ్బసం బాధితులు వస్తారని అంచనా వేస్తున్నారు.