ఎంత మంది వచ్చినా చేప మందు: రాజీవ్ శర్మ | we will provide fish medicine to every one, says cs rajeev sharma | Sakshi
Sakshi News home page

ఎంత మంది వచ్చినా చేప మందు: రాజీవ్ శర్మ

Published Wed, Jun 3 2015 6:15 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

ఎంత మంది వచ్చినా చేప మందు: రాజీవ్ శర్మ - Sakshi

ఎంత మంది వచ్చినా చేప మందు: రాజీవ్ శర్మ

హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 8, 9వ తేదీలలో కొనసాగనుంది. చేప మందు పంపిణీపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం సమీక్ష జరిపారు. భద్రత, మంచినీటి సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

ఎంత మంది ఆస్తమా రోగులు వచ్చినా అందరికి చేపమందు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు కల్పిస్తామని సీఎస్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement