జూన్ 8 నుంచి చేపమందు పంపిణీ | fish medicine will distributr from june 8 | Sakshi
Sakshi News home page

జూన్ 8 నుంచి చేపమందు పంపిణీ

Published Fri, May 22 2015 8:32 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

fish medicine will distributr from june 8

 హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 8వ తేదీన రాత్రి 11:45 గంటలకు ప్రారంభించి 9వ తేదీ రాత్రి వరకు కొనసాగించనున్నట్లు బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు తరాలుగా ఈ ప్రసాదాన్ని తాము ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

గతేడాది సుమారు 4.5 లక్షల మంది ప్రసాదం తీసుకున్నట్లు వెల్లడించారు. చేప మందు తీసుకునేవారు 3 గంటల ముందు, వేసుకున్న తర్వాత గంటన్నర వరకు ఏలాంటి ఆహారం తీసుకోరాదన్నారు.ప్రసాదం తీసుకున్నవారు 45 రోజుల వరకు పత్యం పాటించాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రసాదం తీసుకోలేక పోయినవారు దూద్‌బౌలిలోని తమ నివాసంలో తీసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో బత్తిని శివానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement