
ఆస్తమా రోగులు ఎంతగానో ఎదురుచూసే చేప ప్రసాదం పంపిణీ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది

కిటకిటలాడిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్

పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జనం

తొలిరోజు రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు 80 వేల మందికి చేప ప్రసాదం ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మొదట బత్తిని కుటుంబ సభ్యుల చేపప్రసాదం పంపిణీని శుక్రవారం ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా చేప ప్రసాదం వేసి ప్రారంభించారు

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు, సామాన్య ప్రజలు కూడా వేలాదిమంది తరలివచ్చారు

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పోలీస్, మత్స్యశాఖ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌ఆండ్‌బీ, వాటర్‌బోర్డు, విద్యుత్, ౖవైద్య ఆరోగ్యశాఖలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా శుక్రవారం రోజంతా పర్యవేక్షించారు

వాటర్‌బోర్డు, బద్రి విశాల్ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మజ్జిగ పంపిణీ చేశారు

నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, నగర కలెక్టర్ అమయ్‌కుమార్ తదితరులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు

చేప ప్రసాదాన్ని 32 కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు

బత్తిని కుటుంబానికి చెందిన 250 మంది కుటుంబ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు వాలంటీర్లుగా సేవలందించారు

దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు




















