Nampally Exhibition Grounds
-
Hyderabad: నుమాయిష్.. కల్చరల్..జోష్..
నగరంలో 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జోరుగా సాగుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఈవెంట్ ఫిబ్రవరి 18 వరకూ కొనసాగనుంది. ఎప్పటి నుంచో షాప్ హాలిక్స్కు ఫేవరెట్ స్పాట్‌గా ఉన్న ఈ వస్తూత్పత్తుల ఉత్సవం.. గత కొంత కాలంగా సాంస్కృతిక కార్యకలాపాల వేదికగానూ వరి్ధల్లుతోంది. కళలను అభిమానించేవారికి చిరునామాగా మారుతోంది. నుమాయిష్కి వెళ్లొచ్చాను అనగానే.. ఏం కొన్నావ్? ఏం తిన్నావ్? అనే ప్రశ్నలే ఎదురవుతాయి తప్ప ఎవరి పాటలు ఎంజాయ్ చేశావ్! ఎవరి నృత్యాభినయాన్ని ఆస్వాదించావ్? అనే ప్రశ్నలు అరుదే. ప్రధానంగా షాపింగ్ ప్రియుల కోసం ఏర్పాటైన ప్రదర్శన కావడం వల్ల నుమాయి‹Ùని ఒక కల్చరల్ ఈవెంట్స్‌కి కేరాఫ్‌గా పరిగణనలోకి తీసుకోరు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. మంచి సంగీతాన్ని, నృత్యాన్ని, హాస్య కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అవకాశం ఉంటుందనే ఆలోచన నగరవాసుల్లో వస్తోంది. రోజుకు 6 గంటలపైనే.. నుమాయిష్ షాపింగ్ ప్రధాన ఆకర్షణ అయితే, దానితో పాటే అంతకు మించిన అనుభవాన్ని, వినోదాత్మక కార్యక్రమాలను కూడా అందిస్తోంది. రోజూ సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వీటిని నిర్వహిస్తున్నారు. దీని కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా పండల్, లాన్స్‌లో 2 వేదికలు ఏర్పాటు చేశారు. నుమాయి‹Ùని సందర్శించాలని ప్లాన్ చేసే కళాభిమానులు తమకు నచ్చిన ఈవెంట్ ఉన్న రోజును ఎంచుకోవడానికి వీలుగా షాపింగ్‌తో పాటే పలు రకాల అద్భుతమైన ఈవెంట్ల జాబితా కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉంచారు. మంత్రముగ్ధులను చేసే నృత్య ప్రదర్శనల నుంచి మనోహరమైన ముషైరా సెషన్స్ వరకు, ప్రతి ఒక్కరికీ నచ్చేలా వైవిధ్యభరిత ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చారు.కూచిపూడితో కూడి.. సంప్రదాయ సౌరభాలను ఆస్వాదించేవారికి నుమాయిష్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు. కూచిపూడి వంటి సంప్రదాయక నృత్యకళలకు ఇక్కడ ఎక్కువగా పట్టం గడుతున్నారు. అలాగే గజల్స్, సూఫీ సంగీతం వంటివి ప్రముఖ కళాకారులు అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు నుమాయిష్ అధికారిక వెబ్సైట్లో ఆయా ఈవెంట్లకు సంబంధించిన తేదీలు, వేదికలు, కళాకారుల వివరాలతో కూడిన ఈవెంట్ల జాబితాను పరిశీలించుకోవచ్చు. ప్రముఖ స్టార్స్ ఈవెంట్స్.. గత సంవత్సరం, బాలీవుడ్ స్టార్ సింగర్ జావేద్ అలీ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం చాలా మంది నగరవాసులకు మధురమైన జ్ఞాపకం. ఈ ఏడాది ఇప్పటి వరకూ అలాంటి సంచలనాత్మక ప్రకటన ఏమీ రానప్పటికీ.. రానున్న రోజుల్లో ఉండొచ్చని నిర్వాహకులు, సందర్శకులు అంటున్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాలు ఓ వైపు సందర్శకులను సేదతీరుస్తూనే, మరోవైపు స్థానిక ఔత్సాహిక కళాకారులకు అనువైన వేదికలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయని చెప్పాలి. నేడు, రేపు..ఇలా.. ఈ వారాంతం వరకూ ఒకసారి పరిశీలిస్తే.. నేడు (మంగళవారం) కూచిపూడి నృత్యం (ఎం.భిక్షపతి) కామెడీ కార్యక్రమం (షాబుద్దీన్), బుధవారం సినిమా పాటలు (జాఫర్ ఉజ్ జమా), కూచిపూడి నృత్యం (రాజ్‌కుమార్), లయన్స్ క్లబ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ అలాగే గురువారం భువనవిజయం ప్రదర్శన, శుక్రవారం విశ్వప్రభ కూచిపూడి నృత్యం, శ్రీకృష్ణ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, గజల్ గీతాలు (అడ్నాన్ సలీమ్)జిందా దిలాన్ఏ హైదరాబాద్ (ముషాయిరీ).. ఇలా పలు వైవిధ్యభరితంగా సందర్శకులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. -
13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు
అబిడ్స్: ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పోటెత్తారు. బుధవారం నుమాయిష్ కు దాదాపు 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి బుధవారం వరకు సుమారు 5 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులందరినీ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేశారు. -
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు..పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్..
అబిడ్స్: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్. సురేందర్‌రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కనీ్వనర్లు సురేష్‌కుమార్, సురేష్రాజ్లు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్‌ను మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో డబుల్ డెక్కర్ బస్సును మిని ట్రైన్‌తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలు, 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు పర్యవేక్షిస్తామన్నారు. గోల్డెన్‌జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంట్టుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ రూ.30, డబుల్ డెక్కర్ టికెట్ రూ.40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్, వైఫై టవర్.. మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ల నెట్వర్క్ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్‌లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డే గా, జనవరి 31వ తేదీని చి్రల్డన్స్ డేగా ప్రకటించినట్లు తెలిపారు. గత సంవత్సరం యశోధ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎగ్జిబిషన్ ప్రతినిధులు డాక్టర్ గంగాధర్, హన్మంతరావు, అశ్వినిమార్గం, జీవీ రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
‘మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి’
తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీల కండకావరం... దాదాపు చావు నుంచి బయటపడ్డాను. గొంతు తొక్కి, తోసి బయట పారేశారు. నా మిత్రుడి కాలు తొక్కి పడేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం మా ప్రాణానికి వచ్చింది. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతివాడినీ చంపేయాలా? అదృష్టవశాత్తూ చావు తప్పి, బయటపడ్డాం. ఈ పరిస్థితి నాకు (మాడభూషి శ్రీధర్), సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికీ ఎదురైంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవడం భావ్యం కాదనుకుని ‘అలయ్ బలయ్’కి వెళ్ళాం. సీఎం వస్తున్నదశ. నేను, పాశం యాదగిరి దూరం నుంచి వేదిక వద్దకు రాకముందే సెక్యూరిటీ వారి అతి వల్ల ప్రమాదం వచ్చిపడింది. సీఎం చుట్టూ ఎవరు చచ్చిపోయినా ఫరవాలేదన్నట్టుగా రక్షకభటులు వ్యవహరించారు. నా గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉంది. యాదగిరి కాలిపైన నెత్తురు గాయమైంది. మందులు వాడుతున్నాం. ఇలాంటి రక్షణలో ఉండే సీఎం సామాన్యులకు రక్షణ ఏమిస్తారు? సీఎం చుట్టూ ఉన్నవారు మమ్మల్ని తొక్కిపారేశారు. ఒక దశలో నేను చనిపోతాననే అనిపించింది. అసలే ఆరోగ్యం పూర్తిగా బాగుకాని దశలో ఉన్నవాణ్ణి. నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? నిజానికి సెక్యూరిటీ వారు మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, ముఖ్యమంత్రిని భద్రంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ మాత్రం కనీసపు ఇంగితం వాళ్ళకు లేకపోయింది. వీరు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? మా ప్రాణాలు పోతే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే ఏం చేస్తారు? సంతాపం చెబుతారు. లేదంటే కుటుంబానికి కొన్ని లక్షలు ఇస్తారు. మనుషుల ప్రాణాల విలువ అంతేగా! సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానె... సామాన్యుల్ని చంపకండి. బండారు దత్తాత్రేయ గారూ! మీ అలయ్ బలయ్ పేరుతో మీ మిత్రులనుకునే వారిని కూడా చావుకు సిద్ధం కమ్మనడం న్యాయం కాదు. ఈ పని బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. ఇదేదో అనుకోకుండా జరిగిన చిన్నతప్పు అని తోసిపారేయకండి. ఇక ముందు ఏ వేదిక దగ్గరా ఏ మనిషినీ తోసి, తొక్కేయకండి. నా వయసు 69. యాదగిరి 73 దాటిన వారు. పదిమంది కండలు పెంచుకున్న వారి దాడులకు మేం తట్టుకోలేం. ఈ రాష్ట్రం తట్టుకోలేదు. గొంతు నొక్కకుండా, కొట్టకుండా వీలు కాకపోతే ఈ అలయ్ బలయ్ లేకపోయినా ఫరవా లేదు. మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి. - మాడభూషి శ్రీధర్, రచయిత, ప్రొఫెసర్ - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ -
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్
-
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్‌ను హైదరాబాద్‌తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు -
చేప ప్రసాదం కోసం భారీ క్యూ
-
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కొనసాగుతున్న చేప మందు పంపిణీ
-
చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
-
రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
-
చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను
కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ (టీఎస్ ఎఫ్సీఓఎఫ్) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్ అందించే సీడ్ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు. తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్ ఫిష్ సీడ్ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్ సీడ్ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు. పోషకాల గని కొర్రమీను కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్ అమినో యాసిడ్లు లభిస్తాయి.చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది. పిల్ల సేకరణ ఓ సవాల్ కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడుపూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.కొల్లేరు ప్రాంతం అనుకూలం చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్ చాన్‌బాషా, ఫిషరీస్ ఏడీ, కైకలూరు -
నేటితో ముగియనున్న నుమాయిష్ ఎక్సిబిషన్
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్ హోల్డర్స్ విజ్ఞప్తి మేరకు నుమాయిష్‌ను మూడు రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీంతో 18వ తేదీన నుమాయిష్ ముగియనుంది. -
Numaish Exhibition Images 2024: నాంపల్లిలో నుమాయిష్ సందడి (ఫొటోలు)
-
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్‌కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
Hyderabad: 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైరదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. ► బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు. -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
చేప ప్రసాదం పంపిణీతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిట (ఫోటోలు)
-
చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం
-
జనంతో కిటకిటలాడుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఫొటోలు)
-
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ దగ్గర అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సమీప ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియాలో శనివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగసి పడడంతో.. ఐదు కార్లు దగ్ధం అయ్యాయి. పార్కింగ్‌లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. అయితే.. మంటలు పూర్తిగా అదుపు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు వీకెండ్ కావడంతో నుమాయిష్‌కు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనపై అబిడ్స్ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
నాంపల్లి ఎగ్జిబిషన్లో హీరో,హీరోయిన్ల సందడి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేశారు. జనవరి26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఓ సాంగ్ షూటింగ్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పెళ్లి తర్వాత ఈమధ్యే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన స్వాతి ఇటీవలె పంచతంత్రం సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి1న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15వరకు జరగనుంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌గా పేరొందిన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ సందడి.. నుమాయిష్ ప్రత్యేకతలివే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఫతే మైదాన్, పరేడ్ గ్రౌండ్‌లాంటి చారిత్రకమైన మైదానాల జాబితాలోనిదే నాపంల్లిలోని 'ఎగ్జిబిషన్ గ్రౌండ్స్'. కొత్త సంవత్సరం వచ్చిందంటే భాగ్యనగరంలో 'హ్యాపీ న్యూ ఇయర్' కన్నా కూడా ఎక్కువగా వినబడే మాట 'నుమాయిష్'. అదే ప్రతి ఏటా జనవరి మొదటి తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు జరిగే ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్). చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల మీదుగా 6 ఏప్రిల్ 1938లో పబ్లిక్ గార్డెన్లో ఇది ప్రారంభమైంది. 'నుమాయిష్’గా పిలవబడే ఈ ఎగ్జిబిషన్ తొలి ఏడాదిలో 100 స్టాల్స్ నెలకొల్పగా.. కేవలం 10 రోజులు మాత్రమే నడిచింది. ►హైదరాబాద్ స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వినియోగదారులను చైతన్యపరచడానికి ఇలాంటి ప్రదర్శన ఒకటి అవసరమన్న ఆలోచన మొదట చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్. ►అందులో ముఖ్యలు మీర్ అక్బర్ అలీ ఖాన్ (మాజీ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ), నవాబ్ అహ్మదలీ ఖాన్ (మాజీ హోమ్ మినిస్టర్ ), మెహెది నవాజ్ జంగ్ (మాజీ గుజరాత్ గవర్నర్)లాంటి వారు. ►హైదరాబాద్ చరిత్రలో చాలా కీలకమైన 1946-47 కాలంలో నిజాం రాజుకు దీవాన్‌గా (ప్రైమ్ మినిస్టర్) వ్యవహరించిన సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ నుమాయిష్‌కు పబ్లిక్ గార్డెన్ సరిపోదని దాన్ని ముఖరంజాహి రోడ్డులోని దాదాపు 23 ఎకరాల విశాలమైన ప్రస్తుతమున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు మార్పించారు. ►అయితే 1947-48లో ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థాన విలీనం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ నిర్వహించలేక పోయారట. తిరిగి దీన్ని 1949లో ఆనాటి రాష్ట్ర గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి మళ్ళీ ప్రారంభించారు. ►కోవిడ్ విపత్తు వల్ల 81వ నుమాయిష్ 2022లో మొదలైనా కూడా కొనసాగించలేకపోవడం మనకు తెలిసిందే. ►ప్రస్తుత ఎగ్జిబిషన్ 2600కు పైగా దేశ విదేశాల స్టాల్స్‌తో చిత్ర విచిత్రమైన వస్తు వ్యాపారాలు, తినుభండారాలు, విజ్ఞాన వినోదాలు అన్ని వర్గాల వారికి అందిస్తూ ప్రతి రోజు దాదాపు 50 వేల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇందులో జరిగే హైదరాబాద్ సంస్కృతిలో ప్రధానమైన 'ముషాయిరా 'ఉర్దూ కవుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణ. ►'హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ' కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన లాభాపేక్ష లేని సంస్థ. దీనికి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి లేదా స్పీకర్ అధ్యక్షుడుగా ఉంటారు. ప్రస్తుతం మంత్రి హరీశ్ రావు ఆ స్థానంలో ఉన్నారు. దీని ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలు నిర్వహించబడటం విశేషం. ►ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న శంకర్ జీ.. ఫౌండర్ మెంబర్ హోదాలో చాలా కాలం ఈ సొసైటీకి సేవలు అందించారని ఇందులోని సమావేశ మందిరానికి 'శంకర్ జీ మెమోరియల్ హాల్ 'అని పేరు పెట్టారు. అయితే నాటి వ్యవస్థాపక సభ్యులను పూర్తిగా మరిచిపోవడం మాత్రం అన్యాయం. -వేముల ప్రభాకర్.. డల్లాస్, అమెరికా -
Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి‹Ù) ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో నుమాయిష్లోలో వ్యాపారాలు సరిగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నుమాయిష్ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాలమైన మైదానంలో స్టాల్స్‌కు మధ్య దూరం కల్పిస్తూ సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ ఏడాది ప్రవేశ రుసుము రూ.40 అని, అదేవిధంగా పిల్లలు, పెద్దల కోసం అద్భుతమైన అమ్యూజ్మెంట్ పార్కును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సాయినాథ్, దయాకర్ శాస్త్రి, జాయింట్ సెక్రెటరీ వనం సురేందర్, పబ్లిసిటీ చైర్మన్ హరినాథ్‌రెడ్డి, కనీ్వనర్ ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
దత్తన్న తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తరువాత అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని అనుకుంటున్నా ఈ ఏడాది అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'దేశంలోనే సంస్కృతి సంప్రదాయాల కోసం చేపట్టిన కార్యక్రమం ఇది ఒక్కటే. పంచడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడా లేదు.. ఒక్క తెలంగాణ సంప్రదాయంలో మాత్రమే ఉంది. ఇండస్ట్రీలో అందరూ కలిసున్నప్పటికీ.. అభిమానుల వరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం కొనసాగుతుంది. హీరోల మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తే అందరిలో మార్పు వస్తుంది. ఇండస్ట్రీలో కూడా అందరిని పిలిచి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేశాను. తరువాత పార్టీ కూడా ఏర్పాటు చేశాను. తెలంగాణ సంస్కృతిలో దసరా పండగ రోజున జమ్మి ఆకులు ఇచ్చి పెద్దవాళ్లకి దండం పెట్టడం, తోటి వారిని కౌగిలించుకోవడం సంప్రదాయం. 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం చేపట్టడం గర్వకారణం. పార్లమెంట్లో ఎంత తిట్టుకున్న బయట మాట్లాడుకునే తీరు అలయ్ బలయ్ లాంటిదిని' మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. చదవండి: (ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి) -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉత్సాహంగా అలయ్ బలయ్ కార్యక్రమం
-
ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో దత్తాత్రేయ, చిరంజీవి డప్పు కొడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. -
కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమం
-
జనంతో కిటకిటలాడుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.. (ఫొటోలు)
-
నాంపల్లి ఎగ్జిబిషన్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పునః ప్రారంభమైంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. ఎస్ఏ బజార్, జామ్‌బాగ్‌ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు పంపిస్తారు. (క్లిక్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!) బేగంబజార్ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు. దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్‌ఖానా, బేగంబజార్ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్ చేరుకోవాలి. (క్లిక్: రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి) -
నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో రద్దయ్యింది. ఈ ప్రదర్శన కోసం జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సుమారు 1500 స్టాళ్లను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను స్టాళ్ల నిర్వాహకుల నుంచి రూ.లక్ష రూపాయల అద్దె, ఇతరత్రా బిల్లులను సైతం తీసుకున్నారు. వీటిని తిరిగి శుక్రవారం నిర్వాహకులకు వాపస్ ఇచ్చేశారు. దీంతో చాలా మంది స్టాళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. తెచ్చిన సరుకును ప్యాక్ చేసుకుని వాహనాల్లో వారి స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. ఎగ్జిబిషన్ అకస్మాత్తుగా మూతపడడంతో సొసైటీకి, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. నష్టం రూ.200 కోట్లు ఎగ్జిబిషన్ ఈ ఏడాదీ శాశ్వతంగా మూతపడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నందున నుమాయిష్‌కు అనుమతి ఇవ్వలేమంటూ సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రెండో ఏడాది నుమాయిష్ వచ్చినట్టే వచ్చి కనుమరుగైంది. దాదాపు 2 వేల దుకాణాలు కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ ఎగ్జిబిషన్ సొంతం. ఇది సుదీర్ఘ కాలం సాగే ప్రదర్శన కావడంతో కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్.. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి దాదాపుగా 400 మంది వ్యాపారులు, సంబంధీకులు వచ్చేశారు. వీరిలో కొందరు చుట్టుపక్కల హోటల్స్‌లో, పేయింగ్ గెస్ట్ అకామడేషన్లలో బస చేశారు. ‘స్టాల్ కోసం రూ.లక్ష అద్దె చెల్లించా. రూ. 20వేలు జీఎస్టీ, రూ.25 వేల వరకు కరెంట్ బిల్లు కట్టాను. ఇవిగాక ప్రయాణ ఖర్చులూ వృథా అయ్యాయి’ అంటూ వాపో యాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారి. (చదవండి: కోవిడ్ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి) నిర్వాహకులు విలవిల.. ఇప్పటికే రూ.60 లక్షల వ్యయంతో స్టాళ్లు నిర్మించి, అనుమతి కోసం టౌన్ ప్లానింగ్ ఫీజ్ కింద రూ.74లక్షలు చెల్లించామని, ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ రూ.50లక్షలు కట్టామని నుమాయిష్ సెక్రటరీ చెప్పారు. తక్కువ ఫీజుతో నిర్వహించే 19 పాఠశాలలు, కాలేజీలకు ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఎగ్జిబిషన్ ఆదాయం నుంచి సబ్సిడీగా వెచ్చిస్తారు. వరుసగా రెండేళ్లు నుమాయిష్ మూత పడడంతో ఈ విద్యాసేవలకు గండిపడినట్టే. (చదవండి: ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది) తీవ్రంగా నష్టపోయాం.. డ్రైఫ్రూట్స్ స్టాల్ తీసుకున్నాను. దీనికోసం అప్పు చేశాను. డ్రైఫ్రూట్స్ పాడైపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోతుంది. తీవ్రమైన నష్టాల పాలవుతాం. – ఆసిఫ్, కశ్మీర్ నిండా మునిగాం.. 10 రోజుల తర్వాతైనా అనుమతిస్తారనే ఆశతో పనివాళ్లతో కలిపి రూమ్స్ అద్దెకు తీసుకున్నాం. ఇప్పటికే రూ.7 లక్షల విలువైన మెటీరియల్ తీసుకొచ్చాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. – ఇమ్రాన్ హుస్సేన్, వస్త్రవ్యాపారి, శ్రీనగర్ -
నుమాయిష్‌పై కోవిడ్ ఎఫెక్ట్.. ఈ ఏడాది పూర్తిగా రద్దు..
సాకక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా నమోదవుతుంటంతో నాంపల్లి నుమాయిష్‌పై ఎగ్జిబిషన్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుమాయిష్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. జనవరి ఒకటినా తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదలైన రెండు రోజులకే కరోనా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు నుమాయిష్ మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. తాజాగా కరోనా, ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఈ ఏడాది నుమాయిష్ పూర్తిగా నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. చదవండి: ఆ వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాగా ప్రతి ఏడాది జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు సాగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను అమ్ముతుంటారు. ఇక నుమాయిష్‌కు ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు. ఈక్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కట్టడి సాధ్యం కాదని భావించిన అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తిగా దీనిని రద్దు చేసింది. అయితే 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ అరెస్ట్ -
దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే..
ఎగ్జిబిషన్..అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఈ పేరు వింటేనే నగరవాసులకో పండగ అని చెప్పొచ్చు. ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌కు ఎంతో క్రేజ్ ఉంది. వేల సంఖ్యలో స్టాళ్లు..ఇతర రాష్ట్రాల వస్తువులు సైతం విక్రయం..వినోదానికి పెద్దపీట..కోట్ల రూపాయల వ్యాపారంతో సిటీ ఎగ్జిబిషన్‌కు దేశవ్యాప్తంగా పేరుంది. ఇంతటి ఎగ్జిబిషన్ గతేడాది కరోనా కారణంగా బంద్కాగా..ఈ ఏడాది శనివారం నుంచి షురూ అయింది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ చరిత్ర..ప్రాముఖ్యత..పరిణామ క్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సాక్షి హైదరాబాద్: నగరానికి తలమానికంగా నిలిచే ఎగ్జిబిషన్(నుమాయిష్)కు సరిగ్గా 85 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పట్లో హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్ గార్డెన్స్‌లో స్థానిక ఉత్పత్తులతో ప్రారంభమైన నుమాయిష్..నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా మారింది. నాడు కొంత మంది విద్యావంతుల ఆలోచన నేడు వేల మందికి ఉపాధిని సమకూరుస్తోంది. 80 స్టాల్స్‌తో దాదాపు రూ. 2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమైన నుమాయిష్..నేడు దాదాపు 3500పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 50 లక్షల మంది సందర్శకులతో ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి ప్రపంచంలోనే అతిపెద్ద మేళాగా గుర్తింపు సాధించింది. నుమాయిష్‌కు అనుమతి... 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు సమకూరుతాయని వారు వివరించారు. అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్‌అలీఖాన్‌కు పంపించారు. దీంతో ఉస్మాన్అలీ ఖాన్ నుమాయిష్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు ►ఆ తర్వాత..నుమాయిష్ ఎక్కడ..ఎలా నిర్వహించాలనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు పట్టభద్రుల సంఘం వివిధ పనులకు కమిటీలు ఏర్పాటు చేసింది. ►తొలుత పరిశ్రమలు, చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసే కర్మాగారాలు, అప్పట్లో ఉన్న పెద్ద దుకాణాల నిర్వాహకులు, యజమానులను సంప్రదించి నూమాయిష్ ఆవశ్యకతను వివరించారు. ► మరోవైపు జంట నగర ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వేతికారు. చివరికి బాగేఆమ్ (పబ్లిక్ గార్డెన్)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► చివరకు తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్ 6వ తేదీ, 1938లో ఏడో నిజాం ఉస్మాన్అలీ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి నాంపల్లికి... 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్‌లో నుమాయిష్ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. స్థాపించిన తొమ్మిది సంవత్సరాల్లో ప్రజాదరణ పెరిగింది. నుమాయిష్‌లో స్టాల్స్ పెరగడంతో పబ్లిక్ గార్డెన్స్‌లో స్థలం సమస్య ఎదురైంది. దీంతో పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఇతర ప్రదేశానికి మార్చాలని సంస్థాన అధికారులు, పట్టభద్రుల సంఘం భావించింది. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు. చివరికి నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. 1946లో హైదరాబాద్ అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ ప్రస్తుత వేదిక మార్చాలని ఆదేశించారు. నేటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఎమిటేంటే..ఇక్కడ రూ.10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువైన వస్తువులు లభిస్తుంటాయి. నగర, రాష్ట్ర, దేశ విదేశీ పరిశ్రమల్లో తయారు చేసిన దాదాపు 10 లక్షలకుపైగా వైరైటీ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక ఫుడ్ ఐటమ్స్‌తో పాటు సంస్కాృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వినోదం కోసం రకరకాల ఐటమ్స్ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. అందుకే దీన్ని దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా గుర్తిస్తున్నారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా.. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ గతేడాది వరకు విరామం లేకుండా ప్రతి ఏటా కొనసాగింది. గతేడాది కరోనాతో నుమాయిష్‌ను మూసివేసారు. ఈ ఏడాది కేవలం 1500 స్టాల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. హైదరాబాద్ ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని ఉస్మానియా పట్టభద్రుల సంఘ సమావేశంలో తీర్మానించింది. అయితే సర్వేకు నిధుల కొరత ఏర్పడగా..ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే నిధులు వస్తాయని సభ్యులు సలహా ఇచ్చారు. మన సంస్థానంలో తయారయ్యే వివిధ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేస్తే..ఇటు పరిశ్రమల ద్వారా అటు వాటిని సందర్శించడానికి వచ్చే ప్రజల నుంచి నిధులు సులువుగా వస్తాయని సభ్యులందరూ అలోచించి నుమాయిష్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
నుమాయిష్‌కు ఏర్పాట్లు చకచకా
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి గ్రౌండ్లో ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను జనవరి 1వ తేదీన ప్రారంభించడానికి ఎగ్జిబిషన్ సొసైటీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఫైర్ అనుమతులు లభించాయి. 1500 స్టాళ్లు ► ఈ ఏడాది ఎగ్జిబిషన్లో స్టాళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ప్రతియేటా 2200 స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. కరోనా కారణంగా 700 స్టాళ్లను తగ్గించారు. కేవలం 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకాశ్మీర్, వెస్ట్‌బెంగాల్ తదితర రాష్ట్రాల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. (చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇంకొంత కాలం ఇంటి నుంచే!) కోవిడ్–19 నిబంధనలతో ఎగ్జిబిషన్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఎగ్జిబిషన్ కార్యదర్శి ఆదిత్య తెలిపారు. ఎగ్జిబిషన్ లోపల స్టాళ్ల నిర్వాహకులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి 1వ తేదీన గవర్నర్ చేతుల మీదుగా నుమాయిష్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. (చదవండి: న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్) -
ముగిసిన ‘నుమాయిష్’
నగర వాసుల ‘మస్ట్ విజిట్’ ఎగ్జిబిషన్‌గా పేరొందిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) మంగళవారం ముగిసింది. 49 రోజులపాటు కొనసాగిన ఎగ్జిబిషన్‌ను దాదాపు 20 లక్షల మంది సందర్శించారు. నగరంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ విక్రయించారు. చివరి రోజు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కొనుగోళ్లు జరిపారు. జ్యువెలరీ, దుస్తులు, పాదరక్షలు, డ్రైఫ్రూట్స్, గృహోపకరణాలు, ఫుడ్ స్టాల్స్ వద్ద జనం కిక్కిరిసి కన్పించారు. అబిడ్స్: నాంపల్లి ఎగ్జిబిష్ మైదానంలో 80వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) ముగిసింది. జనవరి 1వ తేదీన ప్రారంభమై నుమాయిష్ మంగళవారం ముగిసింది. 49 రోజులపాటు కొనసాగిన ఎగ్జిబిషన్‌ను 20 లక్షల 20 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్, కోశాధికారి వినయ్‌కుమార్ ముదిరాజ్‌లు వెల్లడించారు. చివరిరోజు మంగళవారం దాదాపు 60 వేల మంది ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారన్నారు. 17వ తేదీ (సోమవారం) వరకు 19 లక్షల 60 వేల మంది సందర్శకులు సందర్శించగా మంగళవారం 60 వేల మంది సందర్శకులతో కలిసి మొత్తం 20 లక్షల 20 వేల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శించడం రికార్డు అని వారన్నారు. ఎగ్జిబిషన్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, ఫైర్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ప్రభాశంకర్, వినయ్‌కుమార్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. -
నుమాయిష్‌లో 40 శాతం స్టాళ్లు ప్రారంభం
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండో రోజూ భాగ్యనగరంలో వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, లక్డీకాఫూల్, నాంపల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లిలో భారీ వర్షం కారణంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం ఆలస్యం కానుంది. ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లు వర్షానికి తడిసిపోయాయి. వర్షం నీరు భారీగా చేరడంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నుమాయిష్ పారిశ్రామిక ప్రదర్శన రోజునే భారీ వర్షం రావడంతో సందర్శకులు సంఖ్య తగ్గే అవకాశముంది. కాగా, మంగళవారం ఉదయం కూడా హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం పడింది. వర్షానికి తోడు చలిగాలులు వీస్తుండటంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. గురువారం కూడా కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. -
మొత్తం 1500 స్టాళ్లతో నుమాయిష్
-
నుమాయిష్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వదంటూ, ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలంటూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టిన అనంతరం ఎగ్జిబిషన్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ప్రజల భద్రతపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. జనవరి 6 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. ఇక రేపటి నుంచి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘపంగా ప్రారంభం కానుంది. -
నుమాయిష్ నిర్వాహకులపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేడుకగా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1 నుంచి జరిగే నుమాయిష్‌కు అనుమతి ఇవ్వకూడదని న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు నేడు అఫిడవిట్‌ను సమర్పించగా దాన్ని చూసిన హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. అఫిడవిట్లో ఎక్కడా ప్రజల భద్రతపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడింది. మరోసారి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్లో నుమాయిష్ మంటల్లో చిక్కుకోగా భారీ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని హైకోర్టు సూచించింది. కాగా తెలంగాణ సచివాలయం కూల్చివేతపైనా నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. వాదోపవాదాల అనంతరం విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. చదవండి: నుమాయిష్‌కు అంతా సిద్ధం -
నుమాయిష్‌కు అంతా సిద్ధం: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నుమాయిష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లు పాల్గొననున్నారు. గతేడాదిలా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.3 కోట్లతో ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పై భాగాన ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి 2 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్‌లో కేబుల్స్ వేస్తున్నామన్నారు. ఆదివారం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ కొన్ని వేల కుటుంబాలకు బతుకునిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం నుమాయిష్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. నుమాయిష్ నుంచి వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని 18 విద్యా సంస్థల్లో 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో కిరోసిన్, స్టవ్‌వంటివి బ్యాన్ చేశామని, ఫైర్ సేఫ్టీ కోసం 40 మంది సిబ్బందిని నియమించామన్నారు. దుకాణాల సంఖ్య తగ్గించి జనాలు తిరిగేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఎక్కువగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల స్టాళ్లు ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని రకాల అనుమతులు తీసుకుందని స్పష్టం చేశారు. -
సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు వామపక్షాలు, ముస్లిం సంఘాల నేతృత్వంలో పలువురు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వామపక్షాల నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద పెదసంఖ్యలో మోహరించిన పోలీసులు ఎక్కడిక్కడ నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ముందస్తుగా చర్యలో భాగంగా చార్మినార్ వద్ద 50 మందిని దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ ర్యాలీ నేపథ్యంలో నాంపల్లి- మొజంజాహి మార్కెట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బీజేపీ కార్యాలయం ముట్టడి సీఏఏను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి నేతలు, శ్రేణులు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయం వద్ద చేరుకున్న వామపక్ష శ్రేణులు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. మోదీ సర్కార్ సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
గురునానక్ జయంతి వేడుకల్లో కేటీఆర్, తలసాని
-
భద్రత పటిష్టం
గన్‌ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో సొసైటీ పాలకమండలి సభ్యులతో కలిసి వివరాలను వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించినట్లు తెలిపారు. గత 79 ఏళ్లుగా ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎప్పుడూ జరగని దుర్ఘటన గతేడాది చోటుచేసుకుందని, అలాంటి ప్రమాదాలు మరోకసారి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. అగ్నిమాపక శాఖ సూచనల మేరకు ఈ ఏడాది స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. స్టాల్ యజమానులు, సందర్శకులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం మైదానంలోని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి డాక్టర్ బి.ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు ఎన్.సురేందర్, సంయుక్త కార్యదర్శి హన్మంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్ పాల్గొన్నారు. భద్రతలో ప్రధానమైనవి ఇవీ.. ♦ గతేడాది జరిగిన సంఘటన దృశ్యా ఈసారి మైదానంలో పైభాగాన ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి అంతర్గతంగా అమరుస్తున్నారు. ♦ ప్రతి స్టాల్‌కు అండర్‌గ్రౌండ్ నుంచే విద్యుత్‌ను సరఫరా చేయడంతో పాటు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆటోమెటిక్‌గా విద్యుత్ ఆగిపోయేలా బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ♦ మైదానంలోని ఇరువైపులా 1.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంగల రెండు ఫైర్ వాటర్ సంపులనునిర్మిస్తున్నారు. ♦ ఎగ్జిబిషన్ మైదానం చుట్టూ అంతర్గతంగా వాటర్ పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ♦ మైదానంలో కొన్ని ప్రాంతాల్లో ఫైర్ బకెట్లు, వాటర్ బారెల్స్, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ తిరగడానికి వీలుగా తగినంత స్థలం వదిలిపెడుతున్నారు. ♦ ఈ ఏడాది స్టాల్ యజమానులు తమ స్టాళ్లల్లో వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్‌లను అనుమతించడం లేదు. ♦ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు వీలుగా గేట్ల సంఖ్యను పెంచుతున్నారు. -
ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కా లని పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీడీపీ నేతలు ఉప్పెనలా బీజేపీలోకి తరలిరావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బాబు బాగుండాలి: గరికపాటి ఎన్టీఆర్ చూపిన అభిమానంతో టీడీపీలో చేరానని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నానని ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. మనసు రాయి చేసుకొని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలు వీరే... గరికపాటి మోహన్‌రావు–రాజ్యసభ సభ్యుడు, శోభారాణి–తెలుగు మహిళ అధ్యక్షురాలు, దీపక్‌రెడ్డి–టీడీపీ జనరల్ సెక్రటరీ, ఈగ మల్లేశం–వరంగల్ రూరల్ అధ్యక్షుడు, రజనీకుమారి–తుంగతుర్తి ఇన్చార్జి, పోరిక జగన్ నాయక్–మాజీ మంత్రి, ఎర్ర శేఖర్–మాజీ ఎమ్మెల్యే, మొవ్వ సత్యనారాయణ–శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి, ముజఫర్–మలక్‌పేట్ టీడీపీ ఇన్చార్జి, సామ రంగారెడ్డి–రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కోనేరు చిన్ని–కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్–పఠాన్ చెరు ఇన్చార్జి, బోట్ల శ్రీనివాస్–జనగామ జిల్లా అధ్యక్షుడు, రాజ్యవర్ధన్రెడ్డి–కాంగ్రెస్ నేత, శ్రీనివాస్‌గౌడ్–నల్లగొండ ఇన్చార్జ్, అంజయ్య యాదవ్–నాగార్జున సాగర్ అసెంబ్లీ ఇన్చార్జి, సాధినేని శ్రీనివాస్–మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్చార్జి, శ్రీకళారెడ్డి–కోదాడ నేత, ఓం ప్రకాశ్ మాజీ తెలుగు విద్యార్థి నేత, బాబురావునాయక్–టీడీపీ ఎస్టీ సెల్, విజయ్‌పాల్‌రెడ్డి–మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్, ఉపేందర్–కాంగ్రెస్ నేత, సత్యం–మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు, రఘునాథ్‌రెడ్డి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రామ్‌రెడ్డి–సూర్యాపేట ఇన్చార్జి, జయశ్రీ–టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. -
టీఆర్ఎస్కు కడుపు మండుతోంది : నడ్డా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్ఎస్కు కడుపు మండుతోందని నడ్డా ఎద్దేవా చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్లలో పోరాడి గెలిచిన గడ్డపైకి రావడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజాంపై తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటం చేశారని గుర్తుచేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా కేవలం బీజేపీకే ఉందని చెప్పారు. కాంగ్రెస్ స్వప్రయోజనాలే ముఖ్యమని.. దేశ ప్రయోజనాలు అవసరం లేదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలని దేశ ప్రజలు కోరుకున్నారని.. అందుకే తమ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని చెప్పారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆర్టికల్ 370ని ఇంతకాలం కొనసాగించారని ఆరోపించారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడదన్నారు. అందుకే ఒక దేశం-ఒకే రాజ్యాంగం విధానాన్ని మోదీ అమలు చేసి చూపించారని కొనియాడారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకంతో 55 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే ఆయుష్మాన్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది ఒకటి.. చెప్పేది మరోకటని విమర్శించారు. బీజేపీలోకి వలసలు చూసి.. టీఆర్ఎస్ కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల తీరుపై రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో గరికపాటి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, గరికపాటి కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యునిగానే ఉన్నారు. అయితే నేడు నడ్డా సమక్షంలో గరికపాటి బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరే సమయంలో గరికపాటి కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను వివరించారు. పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఆరోపించారు. తాను పదవుల కోసం బీజేపీలో చేరలేదని చెప్పారు. తన వెంట బీజేపీలో వచ్చిన టీడీపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు. గ్రేటర్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు టీడీపీ నాయకులు బీజేపీలో చేరారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చాప మందు పంపిణీ
-
ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన జనాలతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. చేప ప్రసాదం కోసం ఈ రోజు 32 వేల చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ రేపు సాయంత్రం వరకూ మరో 1.28 లక్షల చేప పిల్లలను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. 32 కేంద్రాల ద్వారా చేప ప్రసాద పంపిణీ జరుగుతుందన్నారు. -
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నాంపలి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనుంది. ఇందుకోసం 1.65 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది. ఆదివారం సాయంత్రం వరకు బత్తిని సోదరులు, వారి కుటుంబ సభ్యులు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తరువాత 10, 11 తేదీల్లో వారి ఇళ్ల వద్ద చేప ప్రసాదంపంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలి రానున్నారు. గతేడాది సుమారు 70 వేల మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష వరకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా 40 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మందితో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించనుంది. చేప ప్రసాదం కోసం టోకెన్లు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ంసీ ఆధ్వర్యంలో 100 మొబైల్ టాయిలెట్లను, 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, 6 వైద్య బృందాలు, 3 మొబైల్ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. బత్తిని కుటుంబం ప్రత్యేక పూజలు... మృగశిర కార్తె ప్రవేశం రోజున వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులు ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని శంకర్‌గౌడ్‌లు తెలిపారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో శుక్రవారం ఉదయం సత్యనారాయణస్వామి పూజ నిర్వహించి చేప మందు పంపిణీకి ఏర్పాట్లను చేపట్టారు. చేప మందు పంపిణీ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. 171 ఏళ్లుగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన మూడో తరం పంపిణీ చేస్తోంది. ఇతర వివరాల కోసం 9391040946, 8341824211, 9989989954 నంబర్లలో సంప్రదించవచ్చు. -
8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
గన్‌ఫౌండ్రీ: మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ఆస్తమా రోగులకు ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 173 ఏళ్లుగా బత్తిన కుటుంబం రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేఐస్తుండటంతో అభినందనీయమన్నారు. జూన్ 8న సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రసాదం కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ.5 భోజనం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవి తీవ్ర దృష్ట్యా అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు వీలుగా వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ...చేపప్రసాదం పంపిణీ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 100 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడమే కాకుండా పారిశుద్ధ్య నిర్వాహణకు 3 షిప్ట్లుగా 100 మంది చొప్పున సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మెట్రో వాటర్‌బోర్డు తరపున మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేస్తామన్నారు. నగర అడిషనల్ కమిషనర్ డిఎస్.చౌహాన్ మాట్లాడుతూ... మే ఐ హెల్ప్ కేంద్రాలతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. చేప ప్రసాద పంపిణికి అవసరమైన సుమారు 1.60 లక్షల చేపపిల్లలను సిద్ధం చేసినట్లు మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి, బత్తిన హరినాథ్‌గౌడ్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
8,9 తేదీల్లో చేపప్రసాదం పంపిణీ
పంజగుట్ట: ఆస్తమా, శ్వాస సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ప్రతి ఏటా ఇచ్చే చేప ప్రసాద వితరణ ఈ సంవత్సరం జూన్ 8, 9 తేదీల్లో ఇవ్వనున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ సెక్రటరీ బి.హరినాథ్ గౌడ్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ అధ్యక్షులు విశ్వనాథం గౌడ్, అమర్నా«థ్ గౌడ్, అనిరుధ్‌లతో కలిసి మాట్లాడారు. చేప ప్రసాద వితరణకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 9వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. పోలీసులు, ఎగ్జిబిషన్ సొసైటీ వారు, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్, ఫైర్, ఆర్అండ్బీ అన్ని శాఖలు తమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయన్నారు. మత్స్యశాఖ రెండు లక్షలకు పైగా చేపపిల్లలు సిద్ధం చేస్తుందన్నారు. పలు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వారికి భోజనం, ఫలాహారం, టీ, మజ్జిగ, నీరు, అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. మొత్తం 42 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు, ఎక్కడ చేపపిల్లలు దొరుకుతాయి, ఎక్కడ ప్రసాదం లభ్యమౌతుంది అనే విషయాలు వలంటీర్లు చెపుతారన్నారు. గత ఏడాది సుమారు నాలుగున్నర లక్షల మందికి ప్రసాదం అందించినట్లు, ఈసారి ఆసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మాంసాహారులకు చేపలో వేస్తామని, విజిటేరియన్స్‌కు బెల్లంద్వారా అందిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం అందుకోలేనివారు మరుసటిరోజు దూద్‌బౌలి, కవాడీగూడ, కూకట్పల్లి, వనస్థలిపురంలోని తమ నివాసాల వద్ద అందిస్తామన్నారు. సమావేశంలో వర్థన్ తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బత్తిని హరినాథ్ గౌడ్ -
జూన్ 8, 9 తేదీల్లో చేపమందు
హైదరాబాద్: వంశపారంపర్యంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని వచ్చే నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు చెప్పారు. 8వ తేదీ ఉదయం హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం చేప మందు ప్రసాదాన్ని తయారు చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి తరలిస్తామని పేర్కొన్నారు. చేప మందును 8, 9 తేదీల్లో పంపిణీ చేస్తామని అన్నారు. దాదాపు 5–6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు సైతం ఏర్పాటు చేశారని తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, పోలీస్, మత్స్య శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చేప మందు పంపిణీకి 250 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. చేప మందు పంపిణీ కోసం ఈ నెల 28వ తేదీన కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులతో సమావేశం అవుతామని, అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
మళ్లీ నుమాయిష్..
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: ఎగ్జిబిషన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో రెండు రోజులు మూతపడిన నుమాయిష్ తిరిగి శనివారం తెర్చుకోనుంది. శుక్రవారం సాయంత్రం ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటైన ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ గౌరవ కార్యదర్శి జి.వి.రంగారెడ్డి వెల్లడించారు. స్టాళ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతున్నప్పటికి మిగత స్టాళ్లవారికి ఇబ్బందులు కలుగకుండా ఎగ్జిబిషన్ తెరవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంతో ఎగ్జిబిషన్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా మధ్యలో రెండు రోజులు మూతపడింది. దాదాపు 300 స్టాల్స్ కాలి బూడిదకావడంతో స్టాళ్ల నిర్వాహకులు ఎగ్జిబిషన్ సొసైటీ వారు చెల్లించిన అద్దెలు తిరిగి చెక్కుల రూపంలో అందించారు. కోటి రూపాయలు నష్టపోయిన స్టాళ్లవారికి అందజేశారు. ప్రారంభమైన స్టాళ్ల నిర్మాణం... తిరిగి 300 స్టాళ్లను నిర్మించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ సన్నాహాలు ప్రారంభించింది. శుక్రవారం ఉదయం నుంచే కాలిపోయిన స్టాళ్ల చెత్త చెదారాన్ని తొలగించడం ప్రారంభించింది. సొసైటీ సొంత ఖర్చులతోనే తిరిగి స్టాళ్లను నిర్మిస్తామని సొసైటీ గౌరవ కార్యదర్శి రంగారెడ్డి వివరించారు. రెండు లేదా మూడు రోజుల్లో నూతన స్టాళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. జమ్మూకాశ్మీర్, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాల వారి స్టాళ్లు కాలిపోవడంతో వారందరినీ ఆదుకుంటున్నట్లు వివరించారు. వేగంగా నివేదిక అందిస్తాం:ఆర్డీఓ శ్రీనివాస్... 300 స్టాళ్లు కాలిపోవడంతో రెవెన్యూ బృందాలు వేగంగా ఆస్తి నష్టం అంచనా వేస్తున్నాయని ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే 15 రెవెన్యూ బృందాలు సేకరించిన వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. బాధితులకు భోజన వసతులు.. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బాధితులకు భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సొసైటీ నిర్వాహకులు స్టాళ్ల నిర్వాహకులకు భోజనాలతో పాటు వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ విద్యార్థుల చేయూత... పలు రాష్ట్రాల నుంచి వచ్చి రోడ్డుపాలైన ఎగ్జిబిషన్ స్టాళ్ల బాధితులకు ఖైరతాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేయూత అందించారు. శుక్రవారం పలు తినుబండారాలను విద్యార్థులు స్వయంగా వారికి అందించి శభాష్ అనిపించుకున్నారు. మెప్మా స్టాల్ నిర్వాహకుల ఆందోళన.. బుధవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గుర్తుతెలియని కొందరు దుండగులు స్టాల్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారని మెప్మా బజార్ కో ఆర్డినేటర్ శ్రీదేవి తెలిపారు. సుమారు రూ.6 లక్షల విలువగల ఉత్పత్తులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎగ్జిబిషన్ సొసైటీ, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బీజేపీ ఆధ్వర్యంలో నిరసన.. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బంగారం తాకట్టుపెట్టి..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని నుమాయిష్‌లో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ 24 గంటలు గడిచినావీడలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులుఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బుధ, గురువారాల్లో సహాయక చర్యలు, ఆందోళనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిశోధన సాధ్యం కాలేదని తెలిసింది. శుక్రవారం నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలురంగంలోకి దిగనున్నాయి. గురువారం ప్రమాదస్థలిని వివిధ విభాగాలకు చెందిన పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. ప్రాథమికంగా సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. తొలుత ఓ ఏటీఎం సెంటర్/బ్యాంకులోని ఏసీలో వచ్చిన షార్ట్‌సర్క్యూట్‌తో చెలగేగిన మంటలు వ్యాపించాయనే వాదన వినిపిస్తోంది. ఆపై నుమాయిష్‌లో ఉన్న మహేష్ కో– ఆపరేటివ్ బ్యాంకు ప్రాంగణంలో ఈ మంటలు మొదలైనట్లు భావిస్తున్నారు. అక్కడ పని చేయని విద్యుత్ బల్బును మార్చడానికి ఓ వ్యక్తి ప్రయత్నించారని, ఆ నేపథ్యంలో షార్ట్‌సర్క్యూట్ జరిగి చెలరేగిన నిప్పు రవ్వలు ఎగిరి పడ్డాయని కొందరు పేర్కొంటున్నారు. ఈ స్పార్క్స్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీపై పడటంతో చెలరేగిన మంటలు అతి తక్కువ సమయంలోనే ఈ బ్యాంకునకు అటు ఇటు ఉన్న ఆంధ్రాబ్యాంక్, వస్త్ర దుకాణాలకు వ్యా పించాయని కొందరు పేర్కొన్నారు. ఈ మూడింటిలోనూ ఎక్కడా ఫైర్ ఎగ్ట్సింగ్విషర్స్, ఇసుక బకెట్లు సహా ఇతర అగ్ని నిరోధక పరికరాలు లేకపోవడంతో పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయని కొందరు పోలీసులకు తెలిపారు. ఈ రెండు కారణాలతో పాటు సిగిరెట్ వ్యవహారమూ బయటకు వచ్చింది. మహేష్ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి పడేశాడని, అదే ప్రమాదానికి కారణమైందని మరికొందరు పోలీసులకు చెబుతున్నారు. సాక్షులు, బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న అధికారులు ఈ మూడింటితో పాటు వివిధ కోణాలను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేస్తున్నారు. కాలిపోయిన దుకాణాలకు సంబంధించిన శకలాలు పూర్తిగా తొలగిస్తే ఫోరెన్సిక్ నిపుణులు పరిశోధన జరిపి అసలు మూలాలు గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. ఎగ్జిబిషన్ సొసైటీ ఎదుట ఆందోళన నాంపల్లి: నుమాయిష్ అగ్ని ప్రమాదంలో స్టాల్స్‌ను కోల్పోయిన నిర్వాహకులు భారీగా నష్టపోయారు. ఒక్కోక్కరికి సుమారు రూ.10లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.ఉత్పత్తులన్నీ బుగ్గిపాలు కావడంతో బాధితులు గురువారం ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన బాధితులతో ఎగ్జిభిషన్ సొసైటీ ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఎలాంటి భయాందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. నష్టపోయిన బాధితులకు ఎగ్జిభిషన్ సొసైటీ చెక్కుల రూపంలో నష్టపరిహారాన్ని చెల్లించనుంది. ఇప్పటికే బాధితుల వివరాలను సేకరించారు. అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు. మెట్రో ఆపన్నహస్తం సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్ అగ్నిప్రమాద బాధితులకు మెట్రో ఆపన్నహస్తం అందించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో ఇక్కడి వనితా మహిళా విద్యాలయ, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలల వసతి గృహాల్లోని విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా మెట్రో స్టేషన్‌కు తరలించి తాత్కాలిక వసతి కల్పించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు అదుపులోకి రావడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో విద్యార్థినులు సురక్షితంగా వసతి గృహాలకు వెళ్లినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఉచితంగా మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఎల్అండ్టీమెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తక్షణం అనుమతులు జారీచేయడం పట్ల ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆరని మంటలు.. నాంపల్లి: నుమాయిష్) జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కళాకారుల ఉత్పత్తులు పూర్తిగా కాలిపోయాయి. బుధవారం అర్థరాత్రి దాటాక అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే స్టాళ్లలో మిగిలిన ఉత్పత్తులు గురువారం సాయంత్రం వరకు మండుతూనే ఉన్నాయి. ఉత్పత్తులకు అంటుకున్న మంటలను పూర్తిగా ఆర్పివేయకుండా వదిలిపెట్టారు. ఇలా రగులుతున్న అగ్గిరవ్వలు గాలికి ఎగిరి సమీపంలో ఉండే ఇతర దుకాణాలపై పడితే మళ్లీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. నష్టపోయిన వ్యాపారులకు పరిహారం చెల్లించాలి సాక్షి, సిటీబ్యూరో: భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని టెక్– టీప్ డైరెక్టర్ బందగి రియాజ్ ఖాద్రీ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి వస్తువులను విక్రయించుకునే వ్యాపారులు భారీగా నష్టపోయారని అన్నారు. రూ.70 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ నిర్లక్ష్యం వల్లే నుమాయిష్‌లో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆరోపించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలమయాయరన్నారు. బాధిత కశ్మీరీలను ఆదుకోండికేటీఆర్కు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ సాక్షి, సిటీబ్యూరో:నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కశ్మీర్‌కు చెందిన డ్రైఫ్రూట్స్ స్టాళ్లు ఆహుతి అయ్యాయి. దీంతో కశ్మీర్ మాజీ ముఖ్యమంతి ఒమర్ అబ్దుల్లా గురువారం కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన కశ్మీరీ బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. బంగారం తాకట్టుపెట్టి.. నుమాయిష్‌లో స్టాల్ పెట్టుకుని వ్యాపారం చేసేందుకు బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చా. కాలిపోయిన స్టాల్లో రూ.5 లక్షల మేర సరుకుంది. చీరలు, గాగ్రా వంటి ఉత్పత్తులను తీసుకువచ్చా. ఇప్పుడు సరుకు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. మా కుటుంబం రోడ్డున పడింది.మమ్మల్ని ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. – హారతి, గుజరాత్ -
అగ్నిమాపక శాఖలో.. డొల్లతనం
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ సిటీగా పేరొందిన గ్రేటర్ సిటీలో ప్రమాదవశాత్తు అగ్నికీలలు ఎగిసిపడితే మంటలను ఆర్పే అగ్నిమాపక శాఖకు ఆపదొచ్చింది. నాంపల్లి నుమాయిష్‌లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించిన నేపథ్యంలో.. ఈ శాఖకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు హాట్‌టాపిక్‌గా మారాయి. అగ్నిప్రమాదాలు జరిగినపుడు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకోవడం మొదలు.. అందుబాటులో నీటి వసతి ఉండడం.. అధిక ఒత్తిడితో ఆ నీటిని వెదజల్లేందుకు అవసరమైన సాధనా సంపత్తి పూర్తిస్థాయిలో పనిచేయకపోవడం.. ఉన్న యంత్రాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయకపోవడం తదితర సమస్యలు ఆ శాఖలోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితిని తక్షణం చక్కదిద్దని పక్షంలో భవిష్యత్‌లో మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం పొంచి ఉందని గ్రేటర్‌వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అనుభవాల నుంచిపాఠాలు నేర్చేనా..? బుధవారం రాత్రి నుమాయిష్ వద్ద దుర్ఘటన జరిగిన సమయంలో రెండు ఫైర్ ఇంజిన్లున్నాయి. ఇందులో ఒకదాంట్లో నీళ్లు లేవు. రెండోదాంట్లో సగం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో లోప్రెజర్ (తక్కువ ఒత్తిడి)తో నీటిని వెదజల్లారు. ఈ నీరు సైతం కేవలం 3–4 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విరజిమ్మారు. దీంతో అగ్నికీలలు అదుపులోకి రాలేదు. ఎగ్జిబిషన్‌లోని మహేష్ బ్యాంక్ ముందు విద్యుత్ స్తంభం 12 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడే షార్ట్ సర్క్యూట్ రాత్రి 8.40 గంటలకు సంభవించింది. స్థానిక దుకాణాదారులు ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించారు. నుమాయిష్ సమీపంలోనే ఉన్న ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకునేందుకు 10–15 నిమిషాల సమయం పట్టడంతో ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అక్కడికి చేరుకున్న ఫైరింజిన్లకున్న వాల్వ్‌లు సైతం దీర్ఘకాలంగా వినియోగించకపోవడంతో తుప్పుపట్టాయి. ఇవి సమయానికి తెరచుకోకపోవడం గమనార్హం. ఈ సంఘటనలో ఓ ఫైర్‌అధికారి సైతం గాయపడడం ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికే భద్రత కరువైన అంశాన్ని తేటతెల్లంచేస్తోంది. నీళ్లు విరజిమ్మేందుకు ఏకంగా గంట సమయం పట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత ప్రవేశించిన రెండు ఫైరింజన్లపై పనిచేస్తున్న సిబ్బంది,అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో మంటలను ఏ వైపు నుంచి అదుపుచేయాలో పాలుపొక తికమకపడడం గమనార్హం. ఎక్కువ సమయంపట్టడంతోపెరిగిన తీవ్రత.. రాత్రి 8.40 నుంచి 11.20 గంటల వరకు దాదాపు 19 ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను క్రమంగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలను సైతం ప్రణాళికాబద్ధంగా మోహరించకపోవడంతో మంటలను ఆర్పేందుకు ఎక్కువ సమయం పట్టింది. మరోవైపు ఆయా వాహనాలకున్న నీటిని విరజిమ్మాల్సిన పైపులకు, జాయింట్లకు సైతం చిల్లులు పడడంతో సగం నీరు వృథా అయ్యింది. దీంతో గంటలో ఆర్పాల్సిన మంటలను మూడుగంటల సమయం పట్టడం గమనార్హం. ఈ సమయంలో జలమండలి 30 ట్యాంకర్ల నీటిని ఘటనాస్థలికి పంపించినప్పటికీ.. ఈ నీటిని సకాలంలో ఫైరింజిన్లలో నింపే విషయంలో ఫైర్‌సిబ్బంది విఫలమయ్యారు. పలు ఫైరింజిన్లకు నీటిని నింపే మోటార్లు సకాలంలో పనిచేయకపోవడం స్పష్టంగా కనిపించింది. ఇక మంటలను పూర్తిస్థాయిలో అదుపుచేయకపోవడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రదేశాల్లో తిరిగి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్‌సిబ్బంది తిరిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేవు.. నుమాయిష్‌లో మంటలను ఆర్పేందుకు సుమారు 100 మంది ఫైర్‌సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారులు మా సిబ్బందిని తికమకపెట్టడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. నగరంలో మాకు 15 ఫైర్స్టేషన్లు..30 ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. మా శాఖలో 400 మంది వరకు పనిచేస్తున్నారు. ఫైర్ ఇంజిన్లకు అవసరమైన నీటి వసతి అందుబాటులో ఉంది. వాహనాల్లో ఎలాంటి లోటుపాట్లు లేవు. – శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాఅగ్నిమాపక శాఖ అధికారి -
నుమాయిష్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నుమాయిష్ అగ్ని ప్రమాదంపై ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. బాధితులు సమస్యలు చెప్పుకుందామంటే రాష్ట్రంలో మంత్రులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. వ్యాపారస్తులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సంఘటన స్థలాన్ని సీపీఐ కార్యవర్గ సభ్యులు సుధాకర్, నగర కార్యదర్శి ఈటీ నరసింహ, ఏఐటీయూసీ నాయకులు వెంకట్, గెల్వయ్య, మన్నన్ తదితరులు సందర్శించారు. -
అంగడి ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: ఓవైపు బాధితుల ఆగ్రహ జ్వాలలు.. మరోవైపు మిన్నంటిన ఆక్రందనలు, ఆర్త నాదాలు.. ఇంకోవైపు నేతల ఘెరావ్‌లు, ఆందోళనలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గురువారం అట్టుడికింది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులను ఆదుకునేందుకు ఇటు ప్రభుత్వపరంగా, అటు నిర్వాహకుల నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి కార్యాలయాన్ని ముట్టడించి, అక్కడున్న పూలకుండీలను ధ్వంసం చేశారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సహా ఇతర నేతలను బాధితులు ఘోరావ్ చేశారు. వారి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు సొసైటీ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారికి నచ్చజెప్పారు. నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ స్టాల్లో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు, సగం కాలిన వస్త్రాలు వచ్చే ఏడాది ఉచితంగా స్టాళ్లు... బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని నుమాయిష్‌లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 300 స్టాళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు, అగ్నిమాపకశాఖ, క్లూస్‌టీం బృందాలు గురువారం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించాయి. 15 రెవెన్యూ బృందాలు బాధితుల వివరాలు, ఆస్తి నష్టాల వివరాలను సేకరించాయి. 130 మందికి చెందిన 300 స్టాళ్లు దగ్ధం కావడంతో సుమారు రూ.60 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీంతో బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేల నగదుతోపాటు రూ.25వేల చెక్కును అందజేయనున్నట్లు మాజీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. నుమాయిష్‌కు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు ఎగ్జిబిషన్ పొడగిస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. షెడ్డులు మళ్లీ ఏర్పాటుచేసి, బాధితులకు ఉచితంగా అందజేయడమే కాకుండా ఆ 14 రోజులపాటు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా బాధితులను ఆదుకునేందుకే కేటాయించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కూడా వారి నుంచి ఎలాంటి అద్దె వసూలు చేయబోమని స్పష్టంచేశారు. ఓ స్టాల్లో కాలిపోయిన కరెన్సీ నోట్లు సేవాభావం నుంచి వ్యాపార ధోరణికి... చిరు వ్యాపారులను ఆదుకునేందుకు నిజాం ప్రభువు హైదరాబాద్‌లోని నాంపల్లి మైదానంలో ఏటా ఎగ్జిబిషన్ నిర్వహించేవారు. నుమాయిష్ దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ కావడంతో ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, సూరత్, ఈశాన్య రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. మొదట్లో ఇది పూర్తిగా సేవాభావంతో పనిచేసేది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్‌గా మార్చేశారు. ఒక్కో షాపునకు రూ.70 వేల అద్దె వసూలు చేస్తుండటంతో యజమానులు వాటిని మరో ఇద్దరు ముగ్గురు వ్యాపారులకు సబ్లీజుకు ఇస్తున్నారు. చివరకు మైదానంలోని దేవాలయం చుట్టూ కూడా షాపులు ఏర్పాటు చేశారు. పైగా వాటి మధ్య కనీసం గ్యాప్ కూడా వదిలిపెట్టలేదు. మరోవైపు షాపుల ముందు ఫైర్ సేఫ్టీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంతే కాకుండా ఒకే విద్యుత్ వైరు నుంచి అనేక షాపులకు కనెక్షన్లు ఇచ్చారు. నాసిరకం కేబుళ్లు వాడటం, అనేకచోట్ల జాయింట్లతోపాటు లూజ్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆందోళన చేస్తున్న స్టాళ్ల యజమానులు కళ్ల ముందే బూడిదయ్యాయి నాలుగైదేళ్ల నుంచి నుమాయిష్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నా. పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నా. షాపులో రూ.10 లక్షలకుపైగా విలువైన మెటిరీయల్ ఉంటుంది. వస్త్రాలు అమ్మగా వచ్చిన రూ.48వేల నగదు కూడా కౌంటర్లోనే ఉంది. ఒంటిపై ఉన్న బంగారం కుదువపెట్టి, ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకుని మెటిరీయల్ కొన్నా. సంపాదించిన నగదు సహా అన్నీ కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ఆర్తి, హైదరాబాద్ భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను పదిహేనేళ్ల నుంచే నుమాయిష్‌లో పాల్గొంటున్నా. రూ.70వేలు చెల్లించి స్టాల్ అద్దెకు తీసుకున్నా. రూ.20 లక్షలు ఖర్చుచేసి ఖరీదైన సిల్క్, ఇతర డ్రెస్ మెటిరీయల్ తెప్పించాను. అంతా కళ్లముందే కాలి బూడిదైపోయింది. భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను. కట్టుకునేందుకు బట్టలే కాదు, కనీసం తినేందుకు తిండి కూడా లేదు. – మునాఫ్ ఆలం, బిహార్ తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు సూరత్‌లో ఓ వ్యాపారి వద్ద నా భార్య నగలన్నీ కుదవపెట్టి సరుకు తెచ్చాను. మరికొంత బంధువుల వద్ద అప్పు కూడా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు సరుకు అమ్మగా వచ్చిన నగదు కూడా కౌంటర్లోనే ఉంది. మెటీరీయల్‌తో పాటు నగదు కూడా కాలిపోయింది. తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు. – ఉమేష్, గుజరాత్ అన్నీ కాలిపోయాయి 30 ఏళ్ల నుంచి స్టాల్ ఏర్పాటు చేస్తున్నా. అన్నీ చేనేత వస్తువులే. అప్పు చేసి మెటీరియల్ కొన్నా. ఈ ఏడాది వ్యాపారం కూడా అంతగా లేదు. 95 శాతం సరుకు స్టాల్లోనే ఉండిపోయింది. ఆ రోజు వచ్చిన నగదు సహా అన్నీ కాలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – రత్నమాణిక్యం, నర్సాపూర్ ఫైరింజన్లో నీళ్లు లేవు తాగేందుకు నీరు లేదు. బాత్రూమ్లూ బాగోలేదు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పాలకమండలి ఘోరంగా విఫలమైంది. దీనిపై 2018లోనే ఫిర్యాదు చేశాను. కానీ ఎవ్వరూ పట్టించుకోకపోగా, బ్లాక్ మెయిల్ చేశారు. అద్దె చెల్లించినా.. అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫోన్ చేసిన వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ.. అటు ఇటూ తిరిగిందే కానీ మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదు. అందులో నీళ్లు కూడా లేవు. – సబిత, గుజరాత్ స్టాళ్ల మధ్య గ్యాప్ లేకపోవడం వల్లే ప్రమాదం గతంలో స్టాల్‌కు స్టాల్ మధ్య గ్యాప్ ఉండేది. ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆర్పేందుకు మైదానానికి నాలుగు వైపులా నాలుగు ఫైర్ ఇంజన్లు ఉండేవి. స్టాల్స్ ముందు ఫైర్‌సేప్టీ కూడా ఉండేది. ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేయలేదు. అందువల్లే ఇంత భారీ ప్రమాదం చోటుచేసుకుంది. – మహ్మద్ అశ్రత్, జమ్ముకాశ్మీర్ సమావేశంలో మాట్లాడుతున్న ఈటల బాధితులను ఆదుకుంటాం: ఈటల హైదరాబాద్: నుమాయిష్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మాజీమంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 79 ఏళ్ల నుమాయిష్ చరిత్రలో ఇంతపెద్ద ప్రమాదం జరగలేదన్నారు. ఘటనలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, క్లూస్ టీంలు వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. అలాగే నష్టం వివరాలను అంచనా వేస్తున్నామన్నారు. ప్రమాద వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రైవేటు, వ్యాపార సంస్థ కాదని.. గొప్ప ఆశయం కోసం ఇది ఏర్పాటైందని తెలిపారు. ప్రైవేటు సంస్థలను డిమాండ్ చేసినట్లుగా సొసైటీని డిమాండ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఎగ్జిబిషన్ ఏర్పాటులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రతలు తీసుకుంటామని స్పష్టంచేశారు. స్టాల్‌కు స్టాల్‌కు మధ్య స్థలం ఉండేలా చూస్తామని, స్టాళ్లను కట్టెలతో కాకుండా ఇనుముతో నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రతి షాప్ వద్ద ఫైర్‌సేఫ్టీ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్‌లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. షాపు యజమానులు స్టాల్స్‌కు బీమా తీసుకోవాలని.. ఈ విషయంలో సొసైటీ తరపున రాయితీ కల్పిస్తామని ఈటల తెలిపారు. -
నిర్లక్ష్యమే నిప్పంటించింది
భాగ్యనగరం అనగానే గుర్తుకొచ్చే అపురూపాల్లో ఒకటిగా... ఎన్నో తరాలకు ఒక తీయని జ్ఞాప కంగా ఉంటూ వస్తున్న నుమాయిష్ బుధవారం రాత్రి ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 400 దుకాణాలు దగ్థమయ్యాయంటే, జరిగిన ఆస్తినష్టం రూ. 60 కోట్ల మేర ఉన్నదంటే... గురువారం సాయంత్రానికి కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదంటే దీని తీవ్రతేమిటో అర్ధమవుతుంది. ఆ సమయంలో దాదాపు 50,000మంది సందర్శకులున్నా వారంద రినీ సురక్షితంగా బయటకు పంపడం ఊరటనిస్తుంది. ఇందుకు పోలీసుల్ని, అగ్నిమాపక సిబ్బం దిని, విపత్తు నివారణ బృంద సభ్యుల్ని అభినందించాలి. అయితే ప్రమాదాలను అంచనా వేయడంలో, వాటి నివారణకు అవసరమైన చర్యల్ని అమల్లోకి తీసుకురావడంలో అటు అధికార యంత్రాంగం, ఇటు నుమాయిష్ నిర్వాహకులు కూడా విఫలమైన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేమీ కొత్తగా మొదలైన వేడుక కాదు. చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం నిజాం పాలకుడు 79 ఏళ్లనాడు దీన్ని ప్రారంభించాడు. ఏటా నెలన్నరపాటు లక్షలాదిమంది ఈ నుమాయిష్‌ను సందర్శిస్తారు. నిజానికి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పేరిట దీన్ని నిర్వహిస్తున్నా జనం నానుడిలో ఇది నుమాయిష్‌గానే ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశం మూలమూలలనుంచీ చిరు వ్యాపారులంతా దీనికోసం తరలివస్తారు. వారు కేవలం తమ తమ ప్రాంతాల్లో చేతివృత్తులవారు, గ్రామీణ ప్రాంత హస్త కళాకారులు, చిన్న పరిశ్రమలవారు రూపొందించిన ఉత్పత్తులను తీసుకు రావడం మాత్రమే కాదు...అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కూడా మోసుకొస్తారు. ఆ రకంగా నుమాయిష్ భిన్న ప్రాంతాలమధ్య సజీవమైన, బలమైన అనుబంధం ఏర్పడేందుకు దోహద పడుతోంది. సందర్శకులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా హాజరుకావటానికి ఉత్సాహం చూపడం లోని రహస్యం ఇదే. ఎగ్జిబిషన్ నిర్వాహణకు ప్రత్యేకంగా ఒక సొసైటీ దశాబ్దాలుగా పనిచేస్తోంది. కానీ ఇన్నేళ్ల అనుభవం నుంచి వారు నేర్చుకున్నదేమీ లేదని తాజా ప్రమాదం చాటుతోంది. వారి వైఫల్యం మాట అటుంచి కనీసం పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక విభాగం, విపత్తు నివారణ సంస్థల అధికారులైనా సక్రమంగా వ్యవహరించలేకపోయారు. ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతాన్ని సందర్శించి లోటుపాట్లను ఎత్తిచూపి సరిచేసే బాధ్యత తీసుకోవద్దా? కేవలం అదృష్టవ శాత్తూ ఇన్నేళ్లుగా ప్రమాదాలు జరగలేదు తప్ప, అందుకోసం ముందస్తుగా తీసుకున్న ప్రత్యేక చర్య లేమీ లేవని ఈ దుర్ఘటన అనంతరం బయటపడిన అంశాలు స్పష్టం చేస్తున్నాయి. భారీయెత్తున జనం హాజరయ్యే సందర్భాలున్నప్పుడు వారి భద్రత కోసం అమలయ్యే చర్య లేమిటని ఆరా తీయడం ముఖ్యం. అది లేనప్పుడు అనుభవాలనుంచి మనం గుణపాఠాలు నేర్చు కోవడం లేదని అర్ధం. మన దేశంలో కావొచ్చు... వేరే దేశాల్లో కావొచ్చు, గతంలో ఎన్నో అగ్ని ప్రమా దాలు, తొక్కిసలాటలు చోటుచేసున్నాయి. 1995లో హరియాణాలోని ఒక పట్టణంలో పాఠశాల వార్షికోత్సవంలో వేదిక అంటుకుని 450 మంది పిల్లలు సజీవ దహనమయ్యారు. 2011లో కోల్క తాలో ఒక ఆస్పత్రి మంటల్లో చిక్కుకుని 90 మంది మరణించారు. నాలుగేళ్లక్రితం ఢిల్లీలోని ఎయి మ్స్‌లో ఉన్న ఒక వార్డులో మంటలు చెలరేగాయి. జరిగే అగ్ని ప్రమాదాల్లో దాదాపు సగం వాటికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని దేశవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఎగ్జిబిషన్ వంటివి నిర్వహిస్తున్నప్పుడు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ వినియోగానికి ఉపయోగించే వైర్ల నాణ్యత ఏపాటో తనిఖీ చేయడం అవసరం. అలాగే ఒకే కనెక్షన్ నుంచి వేర్వేరు దుకాణాలకు విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదం తెస్తుంది. దుకాణాల ఏర్పాటుకు కట్టెలు ఉపయోగించడం, త్వరగా మంటలు వ్యాపించడానికి ఆస్కారమిచ్చే సిల్కు, పాలియెస్టర్ వస్త్రాలను వాటి రూపకల్పనలో వాడటం ముప్పు కలిగిస్తుంది. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మంచిదే. కానీ అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల విషయంలో ఇటీవల వ్యాపార దృక్పథమే ఎక్కువ కనిపిస్తున్నదని చాలామంది చెబుతున్నారు. ఒక్కో దుకాణాన్ని రూ. 70,000 చొప్పున అద్దెకివ్వడం వల్ల అంత మొత్తాన్ని భరించలేనివారు ఆ చోటును మరో ఇద్దరు ముగ్గురితో కలిసి పంచుకుంటు న్నారు. దాంతో సహజంగానే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సరఫరా తీగలపై అధిక భారం పడుతుంది. ఇవన్నీ నుమాయిష్ నిర్వాహకుల దృష్టికి రాలేదంటే ఏమనుకోవాలి? ప్రమాదాలు జరిగిన పక్షంలో సురక్షితంగా జనాన్ని తరలించడానికి, మంటలను సాధ్య మైనంత త్వరగా అదుపులోనికి తెచ్చేందుకు అనువుగా దుకాణాల డిజైన్ రూపొందాలి. పొగ బయ ల్దేరిన వెంటనే అలారం మోగి అప్రమత్తం చేసే ఏర్పాటుండాలి. ఏదైనా అనుకోనిది సంభవించి నప్పుడు ఫైరింజన్లు రావడానికి ఉన్న మార్గాలేమిటో, అక్కడుండే అడ్డంకులేమిటో పరిశీలించాలి. నుమాయిష్ వంటి అతి పెద్ద సందర్భంలో ఇవి తప్పనిసరి. అలాగే ప్రతి దుకాణం వద్దా మంటల్ని ఆర్పే పరికరాలు ఉంచాలి. వాటిని ఉపయోగించడం ఎలాగో దుకాణదారులకు నేర్పాలి. అదే అమలు చేసి ఉంటే ఫైరింజన్లు వచ్చేలోగా దుకాణదారులంతా ఒక్కటై మంటల్ని అదుపు చేసేవారు. నష్టం కనిష్టంగా ఉండేది. ఈ తరహా భద్రతా ప్రమాణాల మాట అటుంచి ప్రమాద సమాచారం అందుకుని వచ్చిన ఫైరింజన్లలో నీళ్లే సరిగా లేవు. ఈ దుర్ఘటనలో నష్టపోయిన దుకాణదారులకు ఆదుకుంటామంటున్నారు. అది సాధ్యమేనా? ఎందరో వ్యాపారులు స్థిరచరాస్తులు కుదువ పెట్టు కుని వచ్చారు. అలాంటివారంతా సర్వస్వం కోల్పోయారు. తిరిగి వెళ్లడానికి కూడా వారిదగ్గర డబ్బు లేదంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. నిర్వాహకుల నిర్లక్ష్యం, దురాశ, అధికార యంత్రాంగంలో కొరవడిన ముందుచూపు దుకాణదారుల బంగారు భవిష్యత్తుకు నిప్పంటిం చాయి. ఇందుకు ఎవరికి శిక్ష పడాలి? -
‘79ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు’
-
‘79ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు’
సాక్షి, హైదరాబాద్ : భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లోజరిగిన అగ్ని ప్రమాద నష్టంపై విచారణ జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా స్టాల్స్ నిర్వాహకులను ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 79ఏళ్ల నుమాయిష్ ఎగ్జిబిషన్ చరిత్రతలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదన్నారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులతో పాటు సొసైటీ తీవ్రంగా బాధపడుతుందని తెలిపారు. నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. (నాంపల్లి ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం) ‘షాప్ ఓనర్లు ఎన్నో ఏళ్లుగా మాలో ఒక కుటుంబంలా ఉన్నారు. వాళ్లకు నష్టం వచ్చిందంటే మాకు నష్టం వచ్చినట్లే. గొప్ప ఆశయం కోసం ఈ సోసైటీ ఏర్పాటైంది. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయివేటు సంస్థ కాదు.. వ్యాపార సంస్థ కాదు.. పేద ప్రజల కోసం పని చేస్తోంది. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తుంది. ప్రతి పైసా విద్యకోసం ఖర్చు పెడుతోంది. జరిగిన సంఘటనను రాజకీయం చేయొద్దు. మొత్తం 300 షాపుల వరకు ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక స్టాల్ వద్ద అగ్రిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఇలాంటివి జరగకుండా ఇకపై ఫైర్ ఇంజన్లతో సంబంధం లేకుండా ప్రతి షాప్‌కు ప్రత్యేకంగా మోటర్ లు ఏర్పాటుచేస్తాం. రాబోయే కాలంలో షాపుల కట్టెలతో కాకుండా దృడంగా ఉండేలా నిర్మిస్తాం. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎవరిది తప్పు అనేది చెబుతాం. ప్రమాదం దృష్ట్యా నేడు, రేపు ఎగ్జిబిషన్‌ను నిలిపివేస్తున్నాం’ అని ఈటల పేర్కొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఆందోళనలు
సాక్షి, నాంపల్లి(హైదరాబాద్): హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) బుధవారం రాత్రికి అగ్నికి ఆహుతైంది. క్షణాల్లోనే అక్కడున్న వందల స్టాళ్లు బూడిద అయ్యాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ నష్టపోయిన స్టాల్ నిర్వాహకులు గురువారం సొసైటీ ముందు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపరస్తులు సొసైటీ ముట్టడికి యత్నించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. మేమేంటో చూపిస్తాం: స్టాల్ నిర్వాహకులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చెలరేగిన మంటలతో లక్షల రూపాయలు నష్టపోయామని వ్యాపరస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ సొసైటీ సభ్యులను డిమాండ్ చేస్తున్నారు. 30 నిమిషాల్లో అధికారులు వచ్చి మాట్లాడకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని సోసైటీ సభ్యులు హామీ ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. -
మెట్రోలో సందర్శకులకు ఉచిత ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: వేలాది స్టాళ్లు..లక్షలాది మంది సందర్శకులు, విందు–వినోదాలు, షాపింగ్‌లు, సరదా ఆటపాటలతో ఏటా దాదాపు నెలన్నర రోజులపాటు నగరవాసులను అలరించే ఎగ్జిబిషన్ (నుమాయిష్) కాలి బూడిదైంది.79 సంవత్సరాల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆంధ్రా బ్యాంకు స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడి..క్షణాల్లోనే అంతటా వ్యాపించాయి. దీంతో దాదాపు 400 స్టాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏం జరిగిందో తెలియక.. ఎగసిపడుతున్న మంటలు చూసి సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఈ దశలో తొక్కిసలాట జరిగింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్‌లు, 19 ఫైరింజన్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. సందర్శకులను సురక్షితంగా బయటకుపంపించాయి. దాదాపు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. కళ్ల ముందే తమ షాపులన్నీఅగ్నికి ఆహుతై కట్టుబట్టలే మిగిలాయంటూ స్టాళ్ల యజమానులు బోరున విలపించారు. మంటల్లో బూడిదైన వాటిలో చేనేత, చేతితో రూపొందించిన గృహోపకరణాల స్టాళ్లే అధికంగా ఉండటంతో రూ.కోట్లలో ఆస్తినష్టంసంభవించింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తుండగా,మరికొందరు వ్యాపారులు మాత్రం ఓసందర్శకుడు తాగిన సిగరెట్ కారమణమని పేర్కొన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు ప్రమాదానికి గల కారణాలు తెలియనప్పటికీ భారీ ఆస్తి నష్టంతో వ్యాపారులు ఆందోళనకు దిగారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే నష్టతీవ్రత పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న హోంమంత్రి మహమూద్ అలీ బాధితులకు ఆదుకుంటామని చెప్పారు. మాజీ మంత్రులు తలసాని, పద్మారావు, మేయర్ రామ్మోహన్‌లు బాధితులను ఓదార్చారు. సందర్శకులు హుటాహుటిన బయటకు వెళ్లే క్రమంలో ఎగ్జిబిషన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. దీంతో అసెంబ్లీ నుంచి నాంపల్లి వెళ్లే రూట్లో రాకపోకలు నిలిపివేసి వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. అబిడ్స్: నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ సిస్టం లేకపోవడం వల్లే అగ్నిప్రమాదం తీవ్రత బాగా పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం 45 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్‌ను దాదాపు 30 లక్షల మంది సందర్శిస్తారు. కానీ ఎగ్జిబిషన్ సొసైటీ ఫైర్ సేఫ్టీని గాలికి వదిలేసింది. ఓపెన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఇలాంటి ఎగ్జిబిషన్లకు ముంబాయి, ఢిల్లీలాంటి నగరాల్లో హైడ్రెంట్ వాల్ ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేస్తారు. కానీ మన దగ్గర ఎగ్జిబిషన్లో ఈ సిస్టం లేకపోవడంతోనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగి రూ.కోట్లలో నష్టం సంభవించింది. సందర్శించిన ఉన్నతాధికారులు... ఎగ్జిబిషన్‌ను పలువురు పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. నగర పోలీస్ జాయింట్ కమిషనర్ చౌహాన్, ఉన్నతాధికారి షికాగోయల్లు సంఘటన స్థలంలో ఉండి పరిస్థితులను చక్కదిద్దారు. అదేవిధంగా గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎగ్జిబిషన్లో ఉండి పరిస్థితిని సమీక్షించారు. గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చిన సంగీత ఏర్పాటుచేసిన బట్టల స్టాల్ కాలి బూడిదయింది. ఆమె లబోదిబోమంటూ రోదించింది. లక్షల రూపాయలు నష్టం జరిగిందన్నారు. తమకు తిరిగి ఆస్తినష్టం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సిస్టం ఉంటే... ♦ ఎగ్జిబిషన్లో ఏర్పాటుచేసిన ప్రతి స్టాల్లో ఫైర్ సేఫ్టీ మేజర్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయాలి ♦ స్టాళ్లలో ఫైర్ ఎగ్జిస్టింగ్ మెషిన్స్ ఉంచాలి ♦ హైడ్రెంట్ వాల్ సిస్టం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. మెట్రోలో ఉచిత ప్రయాణం ♦ హుటాహుటిన ఎల్బీనగర్వైపునకు ఐదు రైళ్లు ♦ ప్రయాణికులకు ఉచిత సేవలు ♦ అసెంబ్లీ టు నాంపల్లి రూట్లో భారీ ట్రాఫిక్‌జామ్..వాహనాల దారి మళ్లింపు ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చిన వారిని ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గమనించిన మెట్రో....ఎల్బీనగర్ వైపునకు ఐదు రైళ్లు నడిపింది. ప్రయాణికులను ఉచితంగా చేరవేసింది. అసెంబ్లీ నుంచి నాంపల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని గమనించి వాహనాలను దారి మళ్లించారు. మంటలు ఆర్పడానికి 19 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శభాష్ బస్వరాజ్ మంటలు ప్రారంభం అయినప్పుడు బందోబస్తులో ఉన్న హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బస్వరాజ్ చాకచక్యంగా పెను ప్రమాదాన్ని తప్పించాడు. ఆంధ్రాబ్యాంక్ స్టాల్ సమీపంలోనే హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల స్టాల్ ఉంది. కానీ స్టాల్పైన ఉన్న విద్యుత్ వైర్లను బస్వరాజ్ వెంటనే స్టాల్ ఎక్కి విద్యుత్ కనెక్షన్‌ను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. పలువురికి గాయాలు.. ఫైర్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్, స్టాల్ నిర్వాహకులు దిలావర్ హుస్సేన్‌లు భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇబ్బందులకు గురయ్యారు. స్వల్ప గాయాలతో వీరు పడిపోగా వెంటనే సమీపంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎగ్జిబిషన్లో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ అందుబాటులో ఉంచలేదని, ఎగ్జిబిషన్ సొసైటీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలని స్టాల్ హోల్డర్ ముజాహిద్దీన్ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ ప్రజల సేఫ్టీని గాలికి వదిలేసిందన్నారు. ఫైర్ సేఫ్టీపట్ల చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదం సంభవించేది కాదన్నారు. అంతేకాక ఎగ్జిబిషన్ సొసైటీ కాలిపోయిన స్టాల్స్ నిర్వాహకులకు తిరిగి నష్టపరిహారంచెల్లించాలన్నారు. ఎన్నో రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి హోంమంత్రి, ఇతర నేతలు అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, మేయర్ బొంతు రామ్మెహన్ కూడా అధికారులను పురమాయించారు. జలమండలి, అగ్నిమాపక, పోలీస్ విభాగాలను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారిని తరలించేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం
-
మంటల్లో నుమాయిష్.. బుగ్గిపాలైన 400 స్టాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వినోదాన్ని పంచే.. ఎగ్జిబిషన్లో పరిస్థితి విషాదకరంగా మారింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) అగ్నికి ఆహుతైంది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న స్టాళ్లను బూడిద చేశాయి. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే.. ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉధృతంగా ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ కారణంగా సుమారు ఏడుగురు అస్వస్థతకు గురవడంతో.. వీరికి సమీపంలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. ఆస్తి నష్టం మాత్రం వందల కోట్లలో ఉండొచ్చని ప్రాథమిక అంచనా. దాదాపు 400 స్టాళ్లు బూడిదయ్యాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. రాత్రి 10.30 గంటల వరకు కూడా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగిలిన స్టాళ్లకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 7.30గంటల సమయంలో.. ఎప్పటిలాగే.. మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అయితే.. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో వనితా మహావిద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన జైళ్లు, ఆంధ్రాబ్యాంక్ స్టాళ్ల సమీపం నుంచి మంటలు మొదలయ్యాయి. సందర్శకులు, స్టాళ్ల యజమానులు చూస్తుండగానే.. ఈ మంటలు గాంధీ విగ్రహం సమీపంలోని హెచ్‌పీ గ్యాస్, పిస్టా హౌజ్ స్టాళ్ల మధ్య, వీటికి ఎదురుగా ఉన్న స్టాళ్లకు వ్యాపించాయి. వీటిలో చేనేత, దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల స్టాళ్లే ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు జైళ్లు, ఆర్బీఐ, ఆంధ్రాబ్యాంక్, రియల్ ఎస్టేట్ స్టాళ్లన్నీ దగ్ధమయ్యాయి. కశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి స్టాళ్లలోని చిన్న గ్యాస్ సిలిండర్లు (వారు వంట వండుకునేవి) పేలిపోయి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కలకలం మంటలు క్షణాల్లోనే పెరిగిపోతుడడంతో స్టాళ్ల యజమానులతోపాటు అక్కడికొచ్చిన సందర్శకుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఎటుపోవాలో అర్థంకాక.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెరోపక్కకు పారిపోయే ప్రయత్నం చేయడంతో.. ఒక దశలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది కిందిపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. ఆహ్లాదకరంగా ఉన్న ఎగ్జిబిషన్లో పరిస్థితి క్షణాల్లోనే భయానకంగా మారడంతో.. బయట నుండి రావాల్సిన సందర్శకులను నిలిపేయటంతో పాటు, లోపల ఉన్న సందర్శకులు సైతం పిల్లా పాపలతో గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్ల వైపు పరుగులు తీశారు. సాయంత్రం ఏడు గంటల నుండి పదిన్నర గంటల వరకు చెలరేగిన అగ్నికీలల్లో సుమారు 400 స్టాళ్లు పూర్తిగా దహనం అయ్యాయి. దీంతో ఆస్తినష్టం వందల కోట్లలో ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు అంచనాకు వచ్చారు. అరగంట తర్వాత వచ్చిన ఫైరింజన్ తొలుత నిప్పురవ్వలు వచ్చి మంటలు అంటుకోగానే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమయంలో నుమాయిష్ గేటు బయటే ఉన్న ఫైరింజన్ లోపలకు వచ్చేందుకు 28 నిమిషాల సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తూ.. అందులోనూ మంటలార్పేందుకు సరిపోయేన్ని నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం విషయమై ఉన్నతాధిరులు జోక్యం చేసుకుని సుమారు 18 ఫైరింజన్లు పంపినా.. రాత్రి పదిన్నర గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్‌లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటన తర్వాత.. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి వెళ్లిపోయే సందర్శకుల కోసం అర్థరాత్రి వరకు ఉచితంగా మెట్రో రైళ్లను నడిపారు. నష్టపరిహారం కోసం ఆందోళన మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీకి స్టాళ్ల యజమానుల నుండి నిరసన ఎదురైంది. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని హోంమంత్రిని చుట్టుముట్టి, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఒక దశలో పోలీస్‌లు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కొందరు ప్రతినిధులు మహమూద్ అలీతో సమావేశమై తమ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా హోంమంత్రి వారికి భరోసా ఇచ్చారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జనవరి 1న ప్రారంభమైన 79వ పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్)ను 23 ఎకరాల్లో 2900 స్టాళ్లతో ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు సాగే ఈ ఎగ్జిబిషన్‌ను సుమారు 25–30లక్షల మంది సందర్శిస్తారు. జైళ్లు, అటవీశాఖలతో పాటు జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి చేతివృత్తి కళాకారుల రూపొందించే వస్త్రాలు, కళాఖండాలకు సంబంధించిన స్టాళ్లున్నాయి. కళ్లముందే కాలిపోయాయి: అక్బర్ అలీ మేం ప్రతి ఏటా స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. ఈ యేడు పోచంపల్లితో పాటు ఇతర చేనేత వెరైటీలతో నాలుగు స్టాళ్లు ఏర్పాటు చేశాము. తొలుత ఆంధ్రాబ్యాంక్ స్టాల్ పక్క స్టాల్నుండి చెలరేగిన మంటలు చూస్తుండగానే విస్తరించాయి. నా స్టాళ్లలోని సుమారు 60 లక్షల విలువైన వస్త్రాలు దహనం అయ్యాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. ఫైరింజన్ల ఆలస్యం: చింతాడ గోవర్ధన్, పోచంపల్లి ఫైరింజన్లు సకాలంలో వచ్చుంటే ఇంత నష్టం జరిగేది కాదు. మేం ఫోన్ చేసిన చాలా సేపటికి ఫైరింజన్లు వచ్చాయి. పోచంపల్లి ఖాదీతో మేం ఏర్పాటు చేసిన స్టాళ్లు చూస్తుండగానే కాలిపోయాయి. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెత్తడం మినహా.. మరేం చేయలేకపోయా. నాకు సుమారు 7 లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్య తప్పదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాంపల్లి ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం
-
నుమాయిష్
-
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందజేసే చేప ప్రసాదానికి ఈ సారి అనూహ్యమైన స్పందన కనిపించింది. కిందటే డాది కంటే భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారంతో ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల వరకు 75, 631 మందికి చేపప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యహ్నానికి ఈ సంఖ్య 80 వేలు దాటింది. 75 వేల మందికి పైగా చేప పిల్లల మందు పంపిణీ చేయగా, మరో 5 వేల మందికి బెల్లంలో కలిపి మందు ఇచ్చారు. చేప ప్రసాదం కోసం 1.32 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. 34 కౌంటర్ల ద్వారా కూపన్లు అందజేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. చేప ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సేవలందించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను ఆయన అభినందించారు. ఉత్తరాది నుంచి భారీగా జనం చేప ప్రసాదంకోసం ఉత్తరాది రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. రాజస్తాన్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిలీ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చారు. చేప ప్రసాదంపై హిందీ దిన పత్రికలు, చానళ్లలో వెలువడిన ప్రకటనలతో జనంలో బాగా స్పందన కనిపించింది. ఈ రెండు రోజుల్లో చేప ప్రసాదం తీసుకోలేకపోయినవారు దూద్‌బౌలీలోని బత్తిన హరినాథ్ గౌడ్ నివాసంలో కూడా పొందవచ్చు. -
ముగిసిన చేపమందు ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు. -
ప్రసాదం కోసం జన ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బత్తిన కుటుంబసభ్యులు, బత్తిన హరినాథ్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం 8.50 గంటలకు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేప ప్రసాదం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత నిర్వాహకులు 34 కౌంటర్ల ద్వారా కూపన్ల పంపిణీ చేపట్టారు. డిమాండ్‌కు తగినట్లుగా లక్షకుపైగా చేపపిల్లలను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా బాధితుల సంఖ్య 75 వేలు దాటిపోయింది. శనివారం మధ్యాహ్నం వరకు ఈ సంఖ్య లక్ష దాటే అవకాశమున్నట్లు నిర్వాహకులు అంచనా వేశారు. జనవిజ్ఞాన వేదిక, హేతువాదులు, వైద్యనిపుణులు కొంతకాలంగా చేపట్టిన ప్రచారం వల్ల మందు కోసం వచ్చే బాధితుల సంఖ్య గత రెండు మూడేళ్లుగా 50 వేల నుంచి లక్ష లోపే ఉన్నట్లు అంచనా. కానీ, ఈసారి అనూహ్యం గా ఆదరణ పెరిగింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచే జనం భారీఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి వరకు ప్రసాదం తీసుకున్న 75 వేల మందిలో కనీసం 45 వేల మంది ఉత్తరాది వారేనని అధికారుల అంచనా. గతేడాది వయోధికులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించగా, ఈసారి పిల్లల సంఖ్య ఎక్కువగా కనిపించింది. రాజస్తాన్‌కు చెందిన అస్తమా బాధితులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు. దివ్యాంగులకు, వృద్ధులకు అదనపు కౌంటర్లు లేకపోవడంతోఇబ్బందులకు గురయ్యారు. బాధితులకు జీహెచ్ఎంసీ ఐదు రూపాయల భోజన కౌంటర్లను ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంçస్థలు భోజనాన్ని అందజేశాయి. జలమండలి సుమారు 3 లక్షల నీటి ప్యాకెట్లను అందజేశారు. భారీగా స్తంభించిన ట్రాఫిక్.... చేపమందు కోసం జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో స్తంభించాయి. మొజంజాహీ మార్కెట్ నుంచి గాం«ధీభవన్ వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది, సరైన పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం వల్ల ఎగ్జిబిషన్గ్రౌండ్స్కు వచ్చిన వాహనాలన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. -
చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది!
-
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీ ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపమందు పంపిణీని మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.60 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేస్తున్నారు. కాగా, రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడుపుతుండటం గమనార్హం. చేప మందు కోసం వచ్చే వారి కోసం రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు బత్తిన కుటుంబం 173 ఏండ్ల నుంచి చేప ప్రసాదాన్ని పంచుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. ప్రజలకు చేప ప్రసాదంపై నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షం ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అన్ని శాఖల అనుసంధానాన్ని చేసి పూర్తి జాగ్రత్తలను తీసుకున్నాం. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. చేప ప్రసాదం పంపిణీ విషయంలో సీఎం కేసీఆర్ సైతం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి తలసాని సూచించారు. -
నేడే చేప మందు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా బాధితులకు అందించే మూలిక ఔషధం చేప మందు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు జరగనున్న మందు పంపిణీకి 50వేల మందికి పైగా ఆస్తమా బాధితులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా టోకెన్లు, చేపల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మందు పంపిణీ కోసం 1.32 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఆస్తమా బాధితుల కోసం బత్తిన సోదరులు 175 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు మందు కోసం తరలివస్తారు. 133 అదనపు బస్సులు 40 కేంద్రాల ద్వారా చేప మందు పంపిణీ కూపన్లు అందజేయనున్నారు. రెండు మొబైల్ కౌంటర్లు, మరో రెండు వీఐపీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమా నాశ్రయం సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ అదనంగా 133 బస్సులు నడపనుంది. అన్ని ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. బస్సులపై ‘ఫిష్ మెడిసిన్ స్పెషల్’అని తాత్కాలిక డెస్టినేషన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. భారీగా జనం తరలిరానున్న దృష్ట్యా 3 ప్రత్యేక వైద్య శిబిరాలు, 3 మొబైల్ వైద్య బృందాలను రంగంలోకి దించనున్నారు. 108, 104 వాహ నాలు సిద్ధంగా ఉంచారు. రూ.5 భోజన కేంద్రాలతోపాటు మంచి నీరు, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 1,500 పోలీసులతో బందోబస్తు సుమారు 1,500 మంది పోలీసులు, ఇద్దరు అదనపు డీసీపీ స్థాయి అధికారులు, 8 మంది ఏసీపీలు, 22 మంది సీఐలతో భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన కేంద్రాల్లో 70 సీసీ కెమెరాలతో నిఘా ఉంచా రు. 4 ఫైర్ ఇంజన్లు, మరో 4 మొబైల్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లనూ అందుబాటులో ఉంచారు. 1,230 మంది పారిశుధ్య సిబ్బంది 2 రోజులు విధులు నిర్వహించనున్నారు. 100 టాయిలెట్లు, 100 మొబైల్ టాయిలెట్లు ఏర్పా టు చేశారు. 800 మంది వలంటీర్లు సేవలందించనున్నారు. హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో సూచనలు చేసేందుకు యాంకర్లను నియమించారు. 3 లక్షల మంచినీటి ప్యాకెట్ల పంపిణీకి జలమండలి ఏర్పాట్లు చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు నియమాలు చేప ప్రసాదం తీసుకునే ఉబ్బస వ్యాధి గ్రస్తులు కొన్ని నియమాలు పాటించాలని బత్తిన సోదరులు సూచించారు. ప్రసాదం తీసుకునే ముందు 3 గంటలు, తీసుకున్న తరువాత గంటన్నర వరకు ఆహారం తీసుకోరాదు. ఇచ్చిన మందును 6 మాత్రలుగా చేసి నీడలో 7 రోజులు ఆరబెట్టాలి. వీటిని 3 పర్యాయాలుగా జూన్ 23, జూలై 8, 23 తేదీల్లో ఉదయం పరగడుపున ఒకటి, నిద్రబోయే మందు ఒకటి చొప్పున గోరు వెచ్చటి నీటితో వేసుకోవాలి. అలాగే వ్యాధిగ్రస్తులు 45 రోజులు పత్యము ఉండాలి. పత్యము ఉండే రోగులు పాత బియ్యం, గోధుమలు, చక్కెర, మేక మాంసం, చామ కూర, పాలకూర, పులిచింత కూర, పొట్లకాయ, చామగడ్డ, మామిడి వరుగు, కోయికూర, అల్లము, ఎల్లిగడ్డ, పసుపు, కందిపప్పు, కరడి ఆయిల్, మిరియాలు, మినప్పప్పు, మిరపపొడి, ఉప్పు, నెయ్యి (ఆవు), మోసంబీలు, అంజీర్ పండ్లు, ఆవు పాలతో చేసిన టీ, తెల్ల జొన్నలు, ఇడ్లీ (చట్నీ లేకుండా), బ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. -
చేప ప్రసాదం కోసం...ఆస్తమా బాధితులు
-
టీడీపీతో పెట్టుకుంటే షాకే
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. ‘‘అప్పుడు దేశ రాజకీయాల్లో టీడీపీదే కీలకపాత్ర. దేశంలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరం’’అన్నారు. టీడీపీతో పెట్టుకున్న ఎవరికై నా కరెంట్‌షాక్ కొడుతుందని హెచ్చరించారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు జరిగింది. బాబు ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ, ఏపీలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిందేమీ లేదంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘అవినీతిని కేంద్రం నియంత్రించలేకపోయింది. జీఎస్టీ అమల్లోనూ విఫలమైంది. నోట్ల రద్దుతో ఏటీఎంలలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరిగాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన వర్సిటీ, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏమీ చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు’’అని అన్నారు. తెలుగు ప్రజలంటే బీజేపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. తెలంగాణలోనూ ‘కర్ణాటక’ పునరావృతం ‘‘నేనెక్కడున్నా నా మనసు తెలంగాణ కార్యకర్తలపైనే ఉంటుంది. వారికి సమయం కేటాయిం చలేకపోతున్న బాధ నాకుంది. అయినా కార్యకర్తలు ధైర్యంగా ఉంటున్నారు. కార్యకర్తలు ఎన్నికల దాకా నిద్రపోకుండా పని చేయాలి. కొండవీటి సింహంలా, బొబ్బిలిపులిలా, సైనికుడిలా కష్టపడి చరిత్ర సృష్టించాలి. ఆర్నెల్లలో టీడీపీ బలం పుంజుకుని తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. కర్ణాటకలో జరి గిందే తెలంగాణలో పునరావృతమవుతుంది’’అని బాబు వ్యాఖ్యానించారు. కాగా, మహానాడులో 8 తీర్మానాలను ఆమోదించారు. మహానాడుకు సీనియర్ తెలంగాణ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య హాజరుకాలేదు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన మహానాడులో దేవేం దర్‌గౌడ్, వెంకటవీరయ్య, నామా, గరికపాటి, రావుల, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా నా వల్లే! బాబు స్వోత్కర్షకు మహానాడు వేదికైంది. ‘‘40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. దేశంలోకెల్లా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని నేనే. తెలంగాణలో సేవా రంగం ద్వారా రూ. 3.21 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే నేను దూరదృష్టితో చేసిన అభివృద్ధి వల్లే. సైబరాబాద్ ఏర్పాటు చేసింది నేనే. మెట్రో రైలు తెచ్చిందీ నేనే. హైదరాబాద్‌లో మతకల్లోలాలు నిర్మూలించిందీ నేనే. రోడ్డు వెడల్పు కార్యక్రమం నా సృష్టే. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చా. నన్ను ప్రధాని కావాలని 22 ఏళ్ల క్రితమే అడిగారు. కానీ నాకే కావాలని లేదు. తెలుగు ప్రజలకు సేవచేసే భాగ్యం శాశ్వతంగా ఉంటే చాలు. నేను ఏర్పాటు చేసిన నాలెడ్జ్ అకాడమీ వల్లే జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు 20 శాతం సీట్లు సాధించారు. మెట్పల్లి విద్యార్థి సివిల్స్ టాపర్ కావడం, శ్రీకాకుళం విద్యార్థి జేఈఈ టాపర్ కావడం, అమెరికా సహా విదేశాల్లో తెలుగు వారు ఎక్కువ ఉండటానికి కారణమూ టీడీపీ దూరదృష్టితో చేసిన కృషి, అభివృద్ధి ఫలితమే’’అని చెప్పుకొచ్చారు. నన్ను ఆహ్వానించరా?: మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు. ‘‘నన్నింత చిన్న చూపు చూస్తరా? ఒక సీనియర్ దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా?’’అని ప్రశ్నించారు. ‘‘నేను వాస్తవాలు మాట్లాడా. తర్వాత క్షమాపణలూ చెప్పా. అయినా నన్ను పార్టీపరంగా పట్టించుకోకపోవడం దారుణం’’అని అన్నారు. ‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. ఎన్టీఆర్‌తో కలిసి పని చేశా. అధికారం లేకపోయినా, బాబు దగ్గర పని చేసిన మంత్రులంతా పరారైనా, 15 ఏళ్లు ఆయన కోసం, పార్టీ కోసం పని చేశా. నేను ఏ బ్యాక్‌గ్రౌండూ లేనివాడిని. ‘నర్సింహులూ... నువ్వు నాకు తోడుగా ఉండు’అన్నందుకు ఆయనకు అండగా ఉన్నా. టీడీపీ అధికారంలోకి రాదని, టీఆర్ఎస్ వస్తుందని బాబు, నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. నాకు రాజ్యసభ ఇస్తనన్నరు. అధికారం కోసం, టికెట్ కోసం టీడీపీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసిండ్రు. అతను పార్టీని భ్రష్టు పట్టించి, మొత్తంగా కాంగ్రెస్‌లో కలుపుతానన్నా మందలించలేదు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌తో పొత్తు అసాధ్యమని, టీఆర్ఎస్తోనే అయితదని చెప్పిన. ఇప్పుడూ చెబుతున్నా. తప్పా? నా నేరమేందో, ఏం పాపం చేసిన్నో అర్థం కాలే. మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు? చెప్పుకుంటే సిగ్గుపోతది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడతది. మూడేళ్ల నుంచి అడుగుతున్నా ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు. నన్ను అవమానించడం భావ్యం కాదు. నన్ను పిలవండి. మీ ప్రేమ అందించండి. పార్టీని బతికించుకుందాం’’అన్నారు. -
ఊపిరి సేవ
నేను నా దైవం దేవుడికి ఎన్నో సేవలు ఉంటాయి. సుప్రభాత సేవ... తోమాల సేవ ఆరగింపు సేవ... ఊంజల్ సేవ ఏకాంత సేవ... పవళింపు సేవ. మరి మనిషికి సేవ అవసరం అయితే? ఊపిరి సలపలేనంత కష్టం వస్తే? చెయ్యాల్సింది.. ఊపిరి సేవ. రేపు బత్తినివారి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ప్రసాద వితరణకు ప్రతిసారీ బత్తిని సోదరులలో ఒకరైన హరినాథ్‌గౌడ్ ముందుంటారు. ‘నేను, నా దైవం’ గురించి హరినాథ్ ఏమని చెబుతారు? చేప ప్రసాదమే దైవం అని చెబుతారేమో అనుకుంటూ ఈ విషయమై ఆయన్ని కలుసుకోవడానికి హైదరాబాద్, కవాడిగూడలోని వారి నివాసానికి వెళ్లాం. ఇంటి ముందు గోడకు ‘చేప’ బొమ్మ కనిపించింది. లోపలికి వెళ్లేసరికి హరినాథ్ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా కనిపించారు. చేతిలో చేప ఆకారంలో ఉన్న పెన్ను, మెడలో చేప బొమ్మ ఉన్న గొలుసు, ఇంట్లో షోకేసులో చేప బొమ్మలు... గమనిస్తూ ఉండిపోయాం. ఫోన్ తర్వాత సంభాషణ మొదలైంది. ‘చేప మందు’ పంపిణీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టున్నారు? మందు కాదు, ‘ప్రసాదం’ అనండి. ఎందుకంటే మేం దీనిని దైవ ప్రసాదంగా భావిస్తాం. ఔషధాన్ని ‘ప్రసాదం’ అంటున్నారంటే మీలో దైవభక్తి చాలా ఎక్కువ ఉన్నట్టుంది? చాలా! ఇది ఇప్పటిది కాదు మా తాత ముత్తాతల నుంచి వస్తున్న భక్తి పరంపర. ఎవరిని మీరు భక్తిగా పూజించేది? మా ముత్తాత నుంచి మేమంతా శివుణ్ని ఆరాధిస్తుంటాం. మా తండ్రి అయితే, రోజూ మూడు– నాలుగు గంటల సేపు పూజ చేసేవాడు. మా ఇల్లు శివయ్య పాటలు, భజనలతో మార్మోగేది. ఆయన పూజ ముగించుకొని బయటకు వచ్చినప్పుడు ఆ కైలాసనాథుడు శివయ్యలాగే కనిపించేవాడు. దైవం అంటే నా చిన్నప్పటి సంఘటన ఒకటి ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఒక పార్సీ మహిళ ‘చేప ప్రసాదం’ కోసం మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. కాసేపటికి మా తండ్రి పూజ ముగించి బయటకు వచ్చాడు. ఆమె, మా తండ్రి పాదాలకు నమస్కరించబోయింది. మా తండ్రిగారు అడ్డుకుని ‘మహిళ ఎవరి పాదాలకూ నమస్కరించకూడదమ్మా!’ అన్నారు. ఆమె కళ్లనీళ్లతో ‘మీలో దైవశక్తికి నమస్కరిస్తున్నాను’ అంది. బత్తిని సోదరులందరికీ ఈ దైవభక్తి ఉందా? అందరూ శివారాధకులే! మేం ఐదుగురు అన్నదమ్ములం, నలుగురు అక్కచెల్లెళ్లు. మరో మూడేళ్లకు నాకు 80 ఏళ్లు నిండుతాయి. ఐదుగురు అన్నదమ్ముల్లో ఇప్పుడు నేను, మా అన్న ఇద్దరం మిగిలాం. అంతా హైదరాబాద్‌లోనే ఉన్నాం! మా పెద్దన్న కుటుంబం దూద్‌బౌలిలో, రెండో అన్న వనస్థలిపురంలో, మరో ఇద్దరు కూకట్‌పల్లిలో, నేను కవాడీగూడలో ఉంటున్నాం. అన్ని కుటుంబాల వాళ్లం యేటా మృగశిరకార్తె ముందురోజున జరిగే పూజలో కలుసుకుంటాం. మృగశిరకార్తె ముందురోజునే ఎందుకు, ఏమిటా పూజ? మా ఐదు కుటుంబాలలోని కొడుకులు, కోడళ్లలో ఎవరికి వీలైతే వాళ్లు రెండు– మూడు నెలల ముందుగానే హిమాలయాలు, రిషీకేష్... వంటి కొన్ని ప్రాంతాల నుంచి వనమూలికలను సేకరించి తెస్తారు. మా పూర్వికులు ఉన్న దూద్‌బౌలీలోని ఇంట్లో సత్యనారాయణవత్రం జరుపుకుంటాం. మా అమ్మ, నాన్నల సమాధుల వద్ద పూజలు చేస్తాం. మరుసటి రోజు ఉదయం మృగశిరకార్తె ప్రవేశించే సమయంలో ప్రసాదాన్ని సిద్ధం చేస్తాం. దేవుడి దగ్గర పెట్టి, కుటుంబ సభ్యులంతా ఆ ‘ప్రసాదం’ తీసుకొని అందరికీ పంచడానికి సిద్ధమైపోతాం. దేవుని ప్రసాదం అంటున్నారు. చేపతో ఇవ్వడం ఏంటి? ఈ ‘ప్రసాదం’ తయారీ ఎవరు నేర్పారు? హిమాలయాల నుంచి వచ్చిన ఒక ముని మా ముత్తాత వీరన్న గౌడ్‌కు పరిచయం అయ్యాడు. ఆరోగ్యం కోసం మందు ఇవ్వమన్నప్పుడు ఆ ముని వనమూలికలతో తయారుచేసిన ప్రసాదాన్ని ఇచ్చాడు. ఆ రోజు మృగశిర కార్తె. ఆ రోజే ఆ ప్రసాదాన్ని ఎలా తయారుచేసుకోవాలి, చేపతో ఎలా వేసుకోవాలో కూడా చెప్పాడు. ఆ ముని చెప్పినవిధంగా ఔషధాన్ని తయారుచేసి కుటుంబంలో అందరికీ, చుట్టుపక్కల వారికీ ఇచ్చాడు. అలా 172 సంవత్సరాల క్రితం మొదలైన ఈ సేవ ఇప్పటికీ కొనసాగుతుండటం ఆ దైవ నిర్ణయంగా భావిస్తాం. శైవులు అంటున్నారు. మత్స్యం విష్ణు అవతారం కదా! శివకేశవులకు భేదం లేదు. దేవుడు ఒక్కడే అని నమ్ముతాను. నా పేరులోనే ‘హరి’ ఉన్నాడుగా! మత్సా్యవతారంగా వచ్చినవాడు దేవుడే. ఊపిరిని పోస్తూ మత్స్య రూపంలో ఆ దేవుడే ఉబ్బసం సమస్యను తగ్గిస్తున్నాడు. చేపతోనే ప్రసాదం. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి? వారికి బెల్లంతో ‘ప్రసాదం’ వేస్తాం. ఇది కూడా ఆ ముని చెప్పినదే! ప్రసాదం ఇచ్చిన ముని మీ కుటుంబంలో ఎవరికైనా కలలోకి వస్తుంటారా? నా కలలోకే వచ్చారు. ప్రజలకు ఊపిరి సమస్య రాకుండా ఈ ‘సేవ’ను ఇలాగే కొనసాగించమని, తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. మీ దైవప్రసాదం మీద చాలా మందికి ‘అపనమ్మకం’ ఉంది? చాలా మందుల కంపెనీలు ఈ ఫార్ములా చెప్పమని అడిగాయి. మేం కాదన్నాం. ‘ఆ దేవుడి దయ వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. మాకు డబ్బులొద్దు’ అని చెప్పాం. దీంతో వాళ్లు ఈ ‘ప్రసాదం’ మీద చెడు ప్రచారం చేశారు. అయినా, మేం గట్టిగానే పోరాటం చేశాం. ఈ పోరాటం కష్టం అనిపించలేదా? ఏమని దైవానికి మొరపెట్టకున్నారు? దైవాన్ని తప్పు పడుతుంటే బాధతో కన్నీళ్లు వచ్చేవి. మేం చేస్తున్న దానికి ఎవరి నుంచి ఒక్క పైసా ఆశించలేదు. మా కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగలేదు. ప్రజలకు ఈ రూపంలో మేం చేసుకునే ‘సేవ’ఇది. దైవమిచ్చింది, దైవమే చూసుకుంటుంది అనుకున్నా. మీరు చెప్పకపోతే మీ కుటుంబంలో ఎవరి ద్వారా అయినా ఈ ‘ఫార్ములా’ ఎవరైనా తీసుకోవచ్చు కదా? ఇది దైవం మాకు ఇచ్చిన వరం. దీనిని వేరే ఇంటికి వెళ్లనివ్వం. కేవలం కొడుకులు, కోడళ్లకు మాత్రమే తెలుసు. ఆడపిల్లకు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపిస్తాం. అందుకని వాళ్లకీ చెప్పం. అందరం అంత దీక్షగా ఉంటాం. దైవ వరంగా వచ్చిన ఈ ‘ప్రసాదం’ ఉబ్బసం వ్యాధికేనా! మిగతా జబ్బులకు కూడానా? ఎన్నో చిన్నపెద్దా జబ్బులు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఆస్తమా సమస్యసు నివారిస్తుంది. అయితే, వరుసగా నాలుగైదేళ్లు ఈ ప్రసాదం తీసుకుంటూ పథ్యం పాటిస్తేనే! అసలు పథ్యమేమీ పాటించకపోయినా 20 శాతం సమస్య తగ్గిపోతుంది. మీ భక్తి, ప్రసాదం గురించి చాలా చెప్పారు. అసలు దేవుడు ఉన్నాడంటారా? దూద్‌బౌలిలో మా పూర్వికుల ఇల్లు బాగా పాతది, కూలిపోయింది. కానీ, ఆ ఇంట్లో పూజగది అలాగే ఉండిపోయింది. ఆ ఇంట్లో సన్నటి బావి ఉంది. ఆ బావిలో ఎంత కరువొచ్చినా ఇప్పటికీ నీళ్లు ఉంటాయి. ఈ రెండూ నాకు ఎప్పుడూ అద్భుతం అనిపిస్తాయి. దైవశక్తి అక్కడే ఉందని మా కుటుంబం అంతా నమ్ముతాం. ఇలాంటి అద్భుతాలు నా జీవితంలో ఎన్నో చూశాను. దైవశక్తి ఈ లోకాన్ని పాలిస్తుంది. మా కుటుంబాన్ని మెచ్చి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించింది ఆ శక్తే. ఎవరో ముని ఇచ్చిన ఫార్ములాతో మీరు పాప్యులర్ అయ్యారు కదా! మరి ఈ ప్రసాదం పంపిణీ జరిగే చోట ఆ ముని ఊహాచిత్రమైనా పెట్టరు ఎందుకు? మా తల్లిదండ్రులను గురువులుగా భావించి వాళ్లు చెప్పిందే పాటిస్తున్నాం. అందుకే ఊహా చిత్రాలేవీ పెట్టడం లేదు. శివభక్తులు కదా! శైవక్షేత్రాలకు వెళుతుంటారా? కాలు బాగున్నప్పడు కేదార్నాథ్, బదరీనాథ్ వంటి తీర్థయాత్రలన్నీ చేశాను. మీలో శక్తి తగ్గినప్పుడు రీఛార్జ్ కావడానికి ఏం చేస్తారు? ఆ శివయ్యను తలుచుకుంటాను. కళ్లు మూసుకొని ఆయన రూపం దర్శించుకుంటాను. ఏదో శక్తి ఒంట్లో ప్రవహించినట్టుగా ఉంటుంది. మీ ప్రసాదం దేవుణ్ణి నమ్మేవాళ్లకే పనిచేస్తుందా? నమ్మనివారికి పనిచేయదా? ఎవరికైనా పనిచేస్తుంది. ఈ ప్రసాదం కేవలం హిందువులకేనా? కులం, మతం లేదు. ఈ ప్రసాదాన్ని అందరూ వేయించుకుంటారు. మనదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి వచ్చేవారూ ఉన్నారు. వైద్యులెవరైనా మీ ‘ప్రసాదం’ కోసం వచ్చారా? ఢిల్లీలో డాక్టర్ ఆనంద్గారింటికి వెళ్ళినప్పుడు ఆయాసపడుతూ పడుకున్న వారి అమ్మగారిని చూశాను. ఊపిరి అందక చాలా బాధపడుతున్నారు. ప్రసాదం విషయం చెప్పి తీసుకురమ్మన్నాను. వాళ్లు వరుసగా మూడేళ్లపాటు వచ్చి ప్రసాదం తీసుకున్నారు. ఆరోగ్యం బాగైంది. ఇప్పటికీ వాళ్లు ఫోన్ చేస్తుంటారు. మీరు కాలు ఎలా కోల్పోయారు? ఏదైనా ప్రమాదం జరిగిందా? మాకు వంశపారంపర్యంగా మధుమేహం ఉంది. నాకు 43 ఏళ్ల వయసులో వచ్చింది. మొన్న పుష్కరాలకు వెళ్లినప్పుడు కాలి పగుళ్లలో ఇసుక చేరి, ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను అది గమనించలేదు. ఇన్ఫెక్షన్ పెరగడంతో ముందు రెండుసార్లు ఆపరేషన్ చేసి కొంత తీసారు. అయినా ఇన్ఫెక్షన్ దగ్గలేదు. దీంతో కాలు తీసేయకతప్పలేదు. మీరు మీ చిన్నప్పటి నుంచి ఈ ‘ప్రసాదాన్ని’ తీసుకుంటున్నారు. అయినా, చక్కెరవ్యాధి రాకుండా ఆగలేదు. పెద్దాసుపత్రులకే వెళ్లాల్సి వచ్చింది? కొన్నింటిని అడ్డుకోవచ్చు. షుగర్ వ్యాధి వంటివాటిని అడ్డుకోలేం. పెద్ద ఆపరేషన్ కదా! కాలు తీసేసే పరిస్థితిలో భయం వేయలేదా? ఏంటీ జీవితం భగవంతుడా అని దేవుణ్ణి ప్రార్థించారా? ముందు భయపడ్డాను. ఒక్కకాలితో ఎలా? అనుకున్నాను. కానీ, తప్పదు. లేదంటే ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. పిల్లలు ధైర్యం చెప్పారు. కృత్రిమ కాలు వాడచ్చు అన్నారు. దేవుడి మీదే భారం వేశాను. ఆపరేషన్ అయింది. కృత్రిమ కాలితో ఇప్పుడు బాగా నడుస్తున్నాను. రాపిడితో చిన్న పుండు అయ్యింది. అందుకే ‘ఈ కాలు’(కృత్రిమ)ను పక్కన పెట్టాను. తగ్గిపోతుంది. ఏం జరిగినా ప్రసాదం వితరణ మాత్రం ఆగదు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద అగ్నిప్రమాదం
-
ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: మృగశిరకార్తెను పురస్కరించుకొని బత్తిని సోదరులు చేపట్టిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7.39 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది చేప ప్రసాదం కోసం తరలివచ్చారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సైడ్ లైట్స్.. మధ్యాహ్నం నుంచి ప్రసాదం కోసం వచ్చేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో వీఐపీలకు ప్రత్యేక కౌంటర్ చేప ప్రసాదం స్వీకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీసీ కెమెరాల ద్వారా నిఘా....మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు డీసీపీ కమలాసన్ రెడ్డి స్వీయ పర్యవేక్షణ.... పంపిణీకి 32 కేంద్రాల ఏర్పాటు. దాదాపు 50 వేల చేపపిల్లలను విక్రయించినట్లు అధికారుల వెల్లడి. వైద్య శాఖ ఆధ్వర్యంలో నాలుగు ఆరోగ్య శిబిరాలు 108 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర చికిత్స మోజంజాహి మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ మీదుగా నాంపల్లికి వెళ్లే వాహనాలను అబిడ్స్ మీదుగా, గోషామహల్ నుంచి వచ్చే వాహనాలను దారుస్సలాం మీదుగా మళ్లించారు. బద్రి విశాల్ పిత్తి, అగర్వాల్ సేవా దళ్, అగర్వాల్ సేవా సమాజ్, పంజాబ్ సేవా సమితి, జైశ్వాల్ సమాజ్‌లతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఆస్తమా రోగులకు అన్ని రకాల అల్పాహారాలు అందించాయి. హైదరాబాద్ మెట్రో వాటర్బోర్డ్ ఆధ్వర్యంలో 3 లక్షల వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఎగ్జిబిషన్ మైదానం ప్రవేశం ద్వారం చేపప్రసాదం అశాస్త్రీయమని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. -
నిర్విఘ్నంగా చేప మందు పంపిణీ
* 60 వేల చేపపిల్లల విక్రయాలు * నేడు, రేపు పాతబస్తీ దూద్‌బౌలిలో చేప ప్రసాదం పంపిణీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ రెండురోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. సోమవారం రాత్రి 11.45 గంటలకు మృగశిర కార్తె ప్రారంభమవగా... అదేసమయంలో బత్తిని సోదరులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభించిన చేప మందును మంగళవారం రాత్రి వరకు కొనసాగించారు. వివిధ రాష్ట్రాలతో పాటు దుబాయ్, లండన్, రష్యా, జపాన్ దేశాల నుంచీ పెద్ద ఎత్తున ఆస్తమా రోగులు చేప మందు కోసం తరలివచ్చారు. మంగళవారం ఉదయం రైళ్లు వచ్చిన సమయంలో జనంసంఖ్య పెరగడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయడంతోపాటు, బత్తిని సోదరుల వద్దనున్న చేప మందును లాక్కొని ఆస్తమా రోగులకు వేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బత్తిని సోదరులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రంగా వేయాల్సిన చేప ప్రసాదాన్ని పోలీసులు తీసుకొని వేయడం సరికాదని బత్తిని గౌరీ శంకర్‌గౌడ్ ఆవేదనతో పేర్కొన్నారు. గత రెండు రోజులుగా 40 కౌంటర్లలో చేపపిల్లలను, 32 కౌంటర్లలో చేప మందును పంపిణీ చేశారు. మంగళవారం రాత్రి వరకు 60 వేల చేపపిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా బుధ, గురు వారాల్లో పాతబస్తీ దూద్‌బౌలిలోని సొంత గృహం వద్ద చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. -
‘చిత్ర’ సోయగం
-
కిక్కుకు నేడే లక్కు
మద్యం దుకాణాలకు లాటరీ సిద్ధం భారీగా విచ్చేయనున్న వ్యాపారులు సాక్షి,సిటీబ్యూరో: మద్యం దుకాణం పెట్టి రెండుచేతులా సంపాదించాలనుకునే వ్యాపారులు లక్కు కోసం సిద్ధమయ్యారు. నగరపరిధిలోని 212 మద్యందుకాణాలకు సోమవార ం లాటరీ నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్ ఆవరణలో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా ఆధ్వర్యంలో డ్రా తీయనున్నట్లు నగర ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ఫారూఖీ తెలిపారు. మొత్తం ఇప్పటివరకు 161 దుకాణాలకుగాను 312 మంది దరఖాస్తు చే శారని చెప్పారు. మరో 51 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. దరఖాస్తు చేసుకోని దుకాణాలకు గడువు పెంచే అంశాన్ని ఎక్సైజ్ కమిషనర్ పరీశీలిస్తున్నారని చెప్పారు. కాగా గ్రేటర్ పరిధిలో ఒక్కో దుకాణానికి రూ.90 లక్షల లెసైన్సు ఫీజు నిర్ణయించిన విషయం విదితమే. లాటరీ ప్రక్రియ కోసం ఎగ్జిబిషన్మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో: రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 390 మద్యం దుకాణాలుండగా..340 దుకాణాలకు ఏకంగా 3368 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఉదయం వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఈ దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. మరో 50 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ దుకాణాలకు లెసైన్సు ఫీజు రూ.90 లక్షలుండడంతో వ్యాపారులెవరూ ముందుకురానట్లు తెలిసింది. ఈ దుకాణాలకు గడువు పెంచే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామని ఆవర్గాలు పేర్కొన్నాయి. -
ఘుమఘుమ